'పరిటాల వర్గీయుల దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి'
అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల వర్గీయులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్యయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేయటమే కాకుండా అక్రమ కేసులను బనాయిస్తున్నారని ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడిపై పోలీసులు నిజాయితీగా వ్యవహరించాలని ప్రకాశ్ రెడ్డి సూచించారు.
పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తే..న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తామని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. పరిటాల వర్గీయుల దాడితో పరిస్థితి అదుపుతప్పుతోందని.. బద్దలాపురంలో శాంతిభద్రతలను కాపాడాలని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పోలీసులను కోరారు.