Taps
-
అక్రమ నల్లాలపై దృష్టేది?
హడావిడి చేసి అటకెక్కించిన అధికారులు విచ్చిలవిడిగా అక్రమ కనెక్షన్లు ఆదాయమార్గాల పెంపుపై అశ్రద్ధ తూతూమంత్రంగా తనిఖీలు కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ కార్పొరేషన్లో అక్రమ నల్లాలను అరికట్టేందుకు చేపట్టాల్సిన ప్రత్యేక డ్రై వ్ అటకెక్కింది. ఏడాది క్రితం ఒక్క రూపాయి నల్లా కనెక్షన్ అమల్లోకి వచ్చినప్పుడు అక్రమ నల్లాలను క్రమబద్ధీకరించుకోవాలని పాలకవర్గం, అధికారులు కోరారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా ఇంటింటికీ సర్వే చేపట్టారు. రిజిస్టర్ ప్రకారం ఎన్ని నల్లాలు ఉన్నాయి..క్షేత్రస్థాయిలో ఎన్ని ఉన్నాయనే వివరాలు సేకరించాల్సిందిగా ప్రై వేట్ సిబ్బందికి పురమాయించారు. డీఈ స్థాయిలో కమిటీ వేసి నల్లా కనెక్షన్లపై విచారణ చేపట్టేందుకు సిద్ధపడ్డారు. కొద్ది రోజులు హడావిడి చేసి అటకెక్కించారు. ఆదాయమార్గాలపై అశ్రద్ధ నీటిసరఫరా విభాగంలో ఆదాయం పెంపుపై అశ్రద్ధ కనిపిస్తుంది. డిమాండ్‌కు మించిన నీటి సరఫరా జరుగుతున్న ఆదాయం రావడం లేదు. మిషన్‌భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా పనిచేయాలని ప్రభుత్వం ఓ వైపు ప్రకటిస్తుంటే నగరపాలక అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ నల్లాలను క్రమబద్ధీకరిస్తే కనీసం నల్లా ద్వారా ప్రతి నెల రూ.100 ఆదాయం సమకూరుతుంది. నీటి వృథాను అరికట్టేందుకు అక్రమ నల్లాలకు చెక్ పెట్టే చర్యలు కనిపించడం లేదు. అక్రమాలను అడ్డుకోవాల్సిన సిబ్బందే చేతివాటంతో మున్సిపల్ ఆదాయానికి గండిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమమే అధికం నగరంలోని 50 డివిజన్లలో 40 వేల నల్లా కనెక్షన్లు అధికారికంగా ఉంటే మరో 10 వేల వరకు అనధికార కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. రోజురోజుకు నీటి సరఫరా జఠిలమవడం, డిమాండ్‌కు మించి నీటి సరఫరా చేసిన కొన్ని డివిజన్లకు ఇబ్బందికరంగా మారుతోంది. ప్రతి రోజు 27 ఎంఎల్డీల నీటి సరఫరా చేసినప్పటికీ చాలా ప్రాంతాల్లో తాగునీరు రావడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. గంటపాటు నీటి సరఫరా జరిగినా నాలుగు బిందెల నీళ్లు రాకపోవడంతో ప్రజలు కార్పొరేషన్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. దొంగ నల్లాలు పెట్టుకున్న వారు, డైరెక్ట్‌గా ప్రధాన లైన్లకే కనెక్షన్ తీసుకున్న వారు నీటిని డ్రెయినేజీల్లోకి వృథాగా వదులుతుండడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి నల్లాలను తొలగించకపోతే భవిష్యత్‌లో ఎంత నీటి సరఫరా చేసినా పైపులైన్ చివరన ఉన్న వారికి చుక్క నీరు వచ్చే అవకాశం లేదు. ఇంటింటికి నల్లా నగరంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. బీపీఎల్ కింద అడిగిన వెంటనే ఒక్క రూపాయి నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పినా, దొంగ నల్లాలు వాడుకుంటున్న వారు స్పందించడం లేదు. క్రమబద్ధీకరించుకుంటే నెలకు రూ.100 బిల్లు చెల్లించాల్సి వస్తుందని వెనుకాడుతున్నారు. వీరికి సిబ్బంది సైతం సహకరిస్తున్నట్లు తెలిసింది. పబ్లిక్ నల్లాలు సైతం నగరంలో 600 పైచిలుకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నల్లాల ద్వారా ఉపయోగం కంటే, నీటి వృథానే ఎక్కువవుతోంది. అయితే పబ్లిక్ నల్లాలు ప్రాంతంలో ఇళ్లలోకి నల్లాలు తీసుకునేందుకు ప్రజలెవరూ ముందుకు రాకపోవడంతో పబ్లిక్ నల్లాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. అక్రమాలు అరికడితే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అధికారులు ఇప్పటికైనా అక్రమ నల్లాలపై దృÙ్టపెట్టాల్సిన అవసరం ఉంది. -
అతడి విమానం ఎంతో గొప్పదట!
అమెరికాః రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్షపదవికి పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ తన విమానం గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నాడట. తాను ప్రచారానికి వినియోగించే స్వంత ఫ్లైట్ ముందు ఎయిర్ ఫోర్స్ విమానం కూడ ఎందుకూ పనికిరాదన్నాడట. తన విమానంలో ఉన్న ప్రత్యేక సౌకర్యాలు అధ్యక్షుడు ఒబామా ప్రయాణించే విమానానికి సైతం లేకపోవచ్చంటూ చెప్పడం చూస్తే... నిజంగా ఆయనగారి విమానం ఏ రేంజ్ లో ఉందోనని అంతా ఎగ్జైటింగ్ గా ఫీలయ్యారట. తన ప్రచారంలో భాగంగా ఓ వేదికపై స్పీచ్ ఇస్తున్న డోనాల్డ్ ట్రంప్ తన విమానంగురించి చెప్పి మురిసిపోయాడట. విమానంలోని సీటు బెల్టులకు, బాత్ రూం లోని ట్యాప్ లకు సైతం బంగారు పూత పూసి ఉంటుందని చెప్పుకొచ్చాడట. సాధారణంగా బోయింగ్ విమానం అంటే 200 మంది ప్రయాణీకులతో, ఎయిర్ హోస్టెస్ లతో సందడి చేస్తుంది. అలాంటిది ట్రంప్ వినియోగించే బోయింగ్ 757 విమానం మాత్రం ఆయన చెప్పినట్లుగానే ప్రత్యేక సౌకర్యాలు కలిగి ఉందట. కేవలం 43 మంది ప్రయాణీకులు మాత్రమే ఎక్కగలిగేట్లు విమానంలో ఏర్పాట్లు చేశారట. స్టాబాంగ్ ఏవియేషన్ నిర్వహణలో ఆ ప్రత్యేక విమానం నడుస్తుంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అల్టెన్ నుంచి ట్రంప్ ఆ విమానాన్ని 2005 సంవత్సరంలోనే కొనుగోలు చేసి, అనంతరం అందులో తనకు కావలసినట్లుగా మార్పులు చేర్పులు చేసుకున్నాడు. నిజంగా ట్రంప్ సొంత విమానం చూస్తే అన్ని హంగులూ కలిగిన స్వంత గృహంలా కనిపిస్తుంది. విమానంలో లగ్జరీ సీట్లు, వాటికున్న బెల్టులకు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పూత ఉంటాయి. తన అభిరుచికి తగ్గట్లుగా చేసుకున్న ఏర్పాట్లలో ముఖ్యంగా విమానంలో మీటింగ్ హాళ్ళు, సిల్క్ లైన్ మాస్టర్ బెడ్ రూం, సుమారు వెయ్యి చిత్రాలను ప్రదర్శించగలిగే శక్తి ఉన్న 57 అంగుళాల టెలివిజన్, సకల సౌకర్యాలు కలిగిన బాత్ రూం లు, వీలైనంత వరకూ బంగారు పూతతోనే కనిపిస్తాయట. ఈ ప్రత్యేక విమానంలోనే ఆయన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నాడు. ఇన్ని హంగులతో కూడిన ఆ విమానం ప్రస్తుతం 100 మిలియన్ డాలర్లు అంటే.. సుమారు 675 కోట్ల రూపాయలు విలువ చేస్తుందట. -
అట్టర్ ఫ్లాప్
మచిలీపట్నం : ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన 100 రోజుల ప్రణాళిక నిధుల లేమితో కొట్టుమిట్టాడింది. పంచాయతీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వం పనులు చేయడానికి అవసరమైన నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో కాగితాలపై తప్ప క్షేత్రస్థాయిలో ఒక్క పని కూడా జరగకపోవటం గమనార్హం. మొక్కలు నాటమన్నారు.. ఒక్కటీ ఇవ్వలేదు! మొక్కలు నాటాలని ప్రభుత్వం సూచించినా ఒక్క పంచాయతీకి కూడా మొక్కలు ఇవ్వలేదని ఆయా పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు చెబుతున్నారు. మొక్కలు కావాలని ఇండెంట్ పెట్టినా ఇంతవరకు రాలేదని వారు తెలిపారు. మేజర్ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేసేందుకు కార్మికులతో పాటు ట్రాక్టర్లు కూడా ఉన్నాయి. మైనర్ పంచాయతీల్లో ఈ వెసులుబాటు లేకపోవటంతో పారిశుద్ధ్యానికి సంబంధించిన పనులు జరగలేదు. మైనర్ పంచాయతీల్లో డ్రెయిన్లలో పూడికతీత నామమాత్రంగానే జరిగింది. నిధులు లేకుండా పనులు ఎలా... పంచాయతీల్లో వంద రోజుల ప్రణాళిక అమలుకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులుృవిడుదల చేయకపోవటంతో ఒక్క పనీ జరగలేదు. చేతిపంపులు, కుళాయిలు, పైప్లైన్లు నూరుశాతం మరమ్మతులు చేయాలని చెప్పినా నిధుల లేమి కారణంగా ఈ పనులు చేయలేదు. కంప్యూటర్లకు సంబంధించి పరికరాలు కొనుగోలు చేయాలని సూచించినా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవటంతో ఆ ప్రయత్నమే జరగలేదు. పంచాయతీల్లోని రోడ్లకు మరమ్మతులు చేయాల్సి వస్తే ఆయా నివేదికలను పంపాలని ప్రభుత్వం కోరింది. పంచాయతీల నుంచి నివేదికలు వెళ్లినా నిధులు విడుదల కాకపోవటంతో మరమ్మతులు జరగలేదు. అన్ని పంచాయతీల్లో వీధి లైట్లను నూరుశాతం వెలిగించాలనే నిబంధన విధించినప్పటికీ నిధుల కొరత కారణంగా అరకొరగా ఈ పనులు చేసి చేతులు దులుపుకున్నారు. డంపింగ్ యార్డులు లేని మైనర్ పంచాయతీల్లో 10 సెంట్ల భూమి, మేజర్ పంచాయతీల్లో అర ఎకరం భూమి రెవెన్యూ అధికారుల ద్వారా కేటాయిస్తామని ప్రకటించారు. దీంతో పంచాయతీల నుంచి డంపింగ్ యార్డుల కోసం వినతులు ప్రభుత్వానికి వెళ్లాయి. రెవెన్యూ అధికారులు ఈ అంశంపై దృష్టిసారించకపోవటంతో డంపింగ్ యార్డులకు భూమి కేటాయింపు అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దోమల నివారణకు బెటైక్స్, ఎబేట్, టెక్నికల్ మలాథియాన్ వంటివి పిచికారీ చేయాల్సి ఉంది. పంచాయతీల్లో ఉన్న కొద్దిపాటి నిల్వలను పిచికారీ చేసినట్లు చూపి ఈ కార్యక్రమాన్ని నామమాత్రంగానే చేశారు. మరుగుదొడ్లకు ఇసుక కొరత... ఇసుక కొరత కారణంగా ఏ పంచాయతీలోనూ మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ఒక్కొక్క మరుగుదొడ్డికి రూ.9,900 మంజూరు చేస్తామని ప్రకటించింది. ఆచరణలో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకు ఖర్చవుతోంది. అదనపు ఖర్చు చేసి మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. వంద రోజుల ప్రణాళికను సక్రమంగా అమలు చేయాలని సర్పంచులు, అధికారులు చొరవ చూపినా నిధుల కొరతతో పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. 15 రోజులకే ముగిసిన ఆన్లైన్ నివేదికల ప్రక్రియ వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఆయా అంశాలపై దృష్టి సారించాలని సూచించిన ప్రభుత్వం ఆయా పంచాయతీల్లో ప్రతిరోజూ చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఆన్లైన్లో నివేదిక పంపాలని నిబంధన విధించింది. మూడు, నాలుగు పంచాయతీలకు కంప్యూటర్ ఆపరేటర్‌ను కేటాయించటంతో 12 నుంచి 15 రోజుల పాటు ఈవోపీఆర్డీల పర్యవేక్షణలో నివేదికలు పంపి అనంతరం ఈ ప్రక్రియను నిలిపివేశారు. జన్మభూమి కార్యక్రమం ప్రారంభమైన అనంతరం ఈ నివేదికలను పంపే అంశంపై పట్టించుకునేవారే కరువయ్యారు. వంద రోజుల ప్రణాళిక ముఖ్యాంశాలివీ... - పారిశుద్ధ్యం - డ్రెయిన్లలో పూడికతీత - మొక్కలు నాటడం - వీధి లైట్లు వంద శాతం వెలిగించటం - చేతిపంపులు, పబ్లిక్ కుళాయి మరమ్మతులు - తాగునీటి పైప్లైన్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో నూతన పైపులు వేయటం - పంచాయతీ కార్యాలయాల్లోని కంప్యూటర్లకు అవసరమైన సామగ్రి కొనుగోలు - రోడ్ల మరమ్మతులు - డంపింగ్ యార్డుల కోసం స్థలసేకరణ - దోమల నివారణకు మందుల పిచికారీ - మరుగుదొడ్ల నిర్మాణం