tdr bonds
-
టీడీఆర్ బాండ్ల స్కామ్‌లో కారుమూరిని ‘ఫిక్స్’ చేద్దాం
సాక్షి, అమరావతి: ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్ల జారీ వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఇరికించాలన్న లక్ష్యంతో గురువారం శాసన సభలో పెద్ద చర్చే జరిగింది. టీడీఆర్ బాండ్ల జారీలో భారీ అవకతవకలు జరిగాయని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పడం, ఇందులో కారుమూరిని ‘ఫిక్స్’ చేయాలని కొందరు సభ్యులు కోరడం, నివేదిక రాగానే అలాగే చేద్దామని మంత్రి చెప్పడం చూస్తే అంతా ఓ ప్రణాళిక ప్రకారం చర్చ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. గురువారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ గడిచిన ఐదేళ్లలో 3,301 టీడీఆర్ బాండ్లు జారీ చేశారని చెప్పారు. తణుకు, విశాఖ, గుంటూరు, తిరుపతిలో బాండ్ల జారీలో ఆరోపణలు రావడంతో శాఖాపరంగా, ఏసీబీతో కూడా విచారణ చేయిస్తున్నామన్నారు. తణుకులో 27.96 ఎకరాలకు రూ.63.24 కోట్లకు బాండ్లు జారీ చేయాల్సి ఉండగా, ఏకంగా రూ.754.67 కోట్లకు జారీ చేశారన్నారు. అంటే రూ.691.43 కోట్ల స్కామ్ జరిగిందని, ఇందుకు బాధ్యులైన ముగ్గురు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేసామని మంత్రి వివరించారు. రాబోయే 15 రోజులు బాండ్ల జారీని పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యేలు అరిమిల్లి రాధాకృష్ణ, గోరంట్ల బుచ్చెయ్యచౌదరి మాట్లాడుతూ.. సూత్రధారులపై చర్యలు తీసుకోవాలే తప్ప చిన్న చిన్న ఉద్యోగులపై కాదని అన్నారు. తణుకు స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హస్తముందని, ఆయన్ని ఖచి్చతంగా ఈ కేసులో ఇరికించాల్సిందే (ఫిక్స్)నని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి బదులిస్తూ విచారణ నివేదిక రాగానే తప్పకుండా కారుమూరిని ఫిక్స్ చేద్దామని చెప్పారు. తిరుపతి, విశాఖ, గుంటూరులో కూడా అప్పటి ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేద్దామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 3.13 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
తణుకు టీడీఆర్ బాండ్ల విషయంలో టీడీపీ హస్తం: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: తణుకు టీడీఆర్ బాండ్ల విషయంలో టీడీపీ హస్తం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ.. టీడీపీ సానుభూతిపరులు అధికారులతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై టీడీపీ ఆరోపణలు అర్ధరహితమని అన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. తణుకు టీడీఆర్ బాండ్ల జారీ విషయంలో టీడీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తణుకులో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు అధికారులతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. ఈ అక్రమాలపై తణుకు ఎమ్మెల్యే కారుమూరి పది రోజుల క్రితమే తనకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. కారుమూరిపై టీడీపీ ఆరోపణలు అర్ధరహితమని, అక్రమాలకి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకున్నామని, పూర్తిస్ధాయి విచారణకి కూడా ఆదేశించామని పేర్కొన్నారు. మాట్లాడటానికి విషయం లేక అసెంబ్లీలో టీడీపీ నేతలు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మద్యపాన నిషేధం అమలు చేసింది ఎన్టీఆర్ అయితే దానికి తూట్లు పొడిచింది చంద్రబాబు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. మద్య నిషేధం అమలు చేస్తామని తాము చెబుతున్న విధంగానే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సోమవారం సాయంత్రం ఉద్యోగ సంఘాలతో పెండింగ్ అంశాలపై మరోసారి చర్చించనున్నామని మంత్రి బొత్స తెలిపారు. గవర్నర్ ప్రసంగం రోజే..: అంబటి టీడీపీ సభ్యులు అసాధారణంగా ప్రవర్తించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. టీడీపీ తీరు శాసనసభను కించపరిచే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం రోజే టీడీపీ వైఖరి బయటపడిందని తెలిపారు. స్పీకర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిని సస్పెండ్ చేయకుండా ఏం చేస్తామని ప్రశ్నించారు. -
టీడీఆర్ అక్రమాలు చెల్లవిక
సాక్షి, విశాఖపట్నం: నగరపాలక, పురపాలక సంఘాల్లో అభివృద్ధికి వీలున్న భూ బదలాయింపు హక్కు(టీడీఆర్) పత్రాల వినియోగంలో అక్రమాలకు చెక్ పడనుంది. ఇన్నాళ్లూ మాన్యువల్ రికార్డుల్లో ఉన్న టీడీఆర్‌లను ఇకపై ఆన్లైన్లోనే జారీ, వినియోగం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు జారీ చేసిన పత్రాల వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆ ప్రక్రియ పూర్తి చేశారు. ఇక టీడీఆర్ వినియోగంలో అవకతవకలకు చెల్లుచీటీ తప్పదని పట్టణ ప్రణాళికా విభాగం స్పష్టం చేస్తోంది. పట్టణాలు, నగరాల్లో రహదారుల విస్తరణ సందర్భంగా ఇళ్లు, దుకాణాలు, ఖాళీ స్థలాల్ని కోల్పోయిన వారికి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టీడీఆర్ పత్రాలు జారీ చేస్తున్నాయి. జీవీఎంసీ పరిధిలో 2007 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పత్రాల ద్వారా అపార్ట్మెంట్ల నిర్మాణాల్లో అదనపు అంతస్తులు వేసుకునేందుకు వెసులుబాటు కల్పించడంతో గతంలో టీడీఆర్‌ల వినియోగం విషయంలో అక్రమాలు జరిగాయి. ఒకచోట ఇచ్చిన టీడీఆర్ పత్రాన్ని ఎక్కడైనా వినియోగించుకునే అవకాశం ఉండటంతో ఒకే టీడీఆర్‌ని పలు చోట్ల విక్రయించేవారు. ఇటీవల పలుచోట్ల ఈ తరహా అక్రమాలు గుర్తించిన ప్రభుత్వం.. ఇకపై టీడీఆర్‌ల విక్రయం పారదర్శకంగా జరిగేందుకు చర్యలకు ఉపక్రమించింది. టీడీఆర్ పత్రాలన్నీ ఆన్లైన్ చేసి ప్రత్యేక పోర్టల్ నిర్వహిస్తే ఇలాంటి అక్రమాలకు పూర్తిగా తెరపడుతుందని భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ దిశగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. టీడీఆర్ అంటే..? ప్రజా ప్రయోజనం కోసం భూ సేకరణ జరిపితే పరిహారం చెల్లిస్తారు. స్థానిక సంస్థలు తాము చేపట్టే అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ సొంతంగా చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి పరిహారం చెల్లించే స్థోమత స్థానిక సంస్థలకు ఉండదు. దీంతో వీటికి భూ బదలాయింపు అభివృద్ధి హక్కు (టీడీఆర్) బాండ్లు జారీ చేస్తారు. దీని ప్రకారం ఉదాహరణకు రహదారి విస్తరణలో వందగజాలు కోల్పోయిన బాధితుడికి టీడీఆర్ కింద 400 గజాలు విలువైన పత్రాలు జారీ చేస్తారు. బాండ్లని బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ స్థలం విలువ పెరిగితే బాండ్ల విలువ పెరుగుతుంది. ఇలాంటి బాండ్లని అదే సంస్థలో రుసుములకు ఉపయోగించవచ్చు. సాధారణంగా రహదారుల విస్తరణకు భూసేకరణ జరుపుతుంటారు. జీవీఎంసీ పరిధిలో జరిగిన రోడ్ల విస్తరణలో స్థలాలు, భవనాలు కోల్పోయిన వారికి కార్పొరేషన్ బాండ్లు మంజూరు చేసింది. అన్నీ.. ఆన్లైన్లోనే.. జీవీఎంసీ పరిధిలో ఇప్పటివరకూ ఎవరెవరి పేరుతో ఎన్ని టీడీఆర్ పత్రాలు జారీ చేశారు.. వీటిలో ఎంత మేర ఉపయోగించుకున్నారు.. ఇంకా ఎన్ని బాండ్లు మిగిలి ఉన్నాయి.. పూర్తిగా వినియోగించుకున్న వారి వివరాలు.. ఇలా.. అన్నీ ఆన్లైన్ పోర్టల్‌లో టౌన్‌ప్లానింగ్ అధికారులు పూర్తి చేశారు. గ్రేటర్ పరిధిలో జారీచేసిన టీడీఆర్ రికార్డులన్నీ పరిశీలించి.. రోజుకు 200 చొప్పున అప్లోడ్ చేసి ప్రక్రియ పూర్తి చేసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో నంబర్ వన్‌గా నిలిచింది. ఇకపై టీడీఆర్‌లకు సంబంధించిన అన్ని వివరాలూ ఆన్లైన్లో పక్కాగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ పోర్టల్‌ని ఏపీడీపీఎంఎస్ వెబ్‌సైట్‌తో అనుసంధానించారు. ఇకపై ప్రతి టీడీఆర్ కూడా ఆన్లైన్లో కమిషనర్ డిజిటల్ సిగ్నేచర్ చేస్తారు. కొనుగోలు చేస్తున్న వారు కూడా.. వాటి విలువ, అవి నిజమైనవా.. కాదా... అనేవి నిర్థారించుకోవచ్చు. అక్రమాలు చోటు చేసుకోకుండా... టీడీఆర్‌లు కొనుగోలు చేసే సమయంలో గతంలో సరైన ప్రక్రియ లేకపోవడం వల్ల కొనుగోలుదారులు మోసపోయేవారు. ఇకపై అలాంటి పరిస్థితులు లేకుండా.. పక్కాగా ఆన్లైన్లో రికార్డుల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేశాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నిర్దేశించిన గడువులోగా వాలిడేషన్ని పూర్తయింది. టీడీఆర్ ఒరిజినల్ కాదా అవునా ? అనేది స్పష్టంగా తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. – ఆర్జే విద్యుల్లత, జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ -
అవినీతిపరులకు.. 'బ్యాండ్'
సాక్షి, గుంటూరు: పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతి అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అక్రమంగా మింగిన సొమ్మును వెనక్కి ఇచ్చినా శిక్ష తప్పదనే భయం మొదలయ్యింది. మరో నెల రోజుల్లో కేసు దర్యాప్తును పూర్తి చేసి ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదికను సమర్పించనున్నారు. ఈ తరుణంలో కేసు చర్చనీయాంశంగా మారింది. పట్టణ ప్రణాళికా విభాగంలో భారీ స్థాయి అవినీతి జరుగుతుందనేది బహిరంగ రహస్యమే. అయితే ఈ అవినీతిని అరికట్టడంలో గత ప్రభుత్వం, నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు విఫలమయ్యారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 2012–2016లో 14 ఫైల్స్‌కు టీడీఆర్ బాండ్ (ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్ బాండ్స్)లో భారీ స్థాయి అవినీతి జరిగిందంటూ అప్పట్లో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు అవకతవకల విషయాన్ని నిర్ధారించారు. ఏసీబీ దర్యాప్తు.. ఈ వ్యవహారంపై గత ఏడాది ఏసీబీ అధికారులకు సైతం ఫిర్యాదులు అందడంతో పూర్తి విచారణ జరిపిన అధికారులు టీడీఆర్ బాండ్లలో సుమారు రూ.1.60 కోట్లు అవినీతి జరిగిందని తేల్చారు. దీనిపై కమిషనర్, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి జిల్లా కలెక్టర్, డీఎంఈలు సైతం దర్యాప్తు జరిపి ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పట్లో నివేదికలు పంపారు. టీడీఆర్ బాండ్లలో అక్రమాలకు పాల్పడిన 12 మంది అధికారులు(మినిస్టీరియల్ స్టాఫ్), తొమ్మిది మంది బిల్డర్లు సహా 32 మందిపై 13/1ఏ, 13/2, 420, 409, 467, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీఆర్ బాండ్ అంటే..! ప్రజా ప్రయోజనం కోసం భూసేకరణ జరిపితే పరిహారం చెల్లిస్తారు. స్థానిక సంస్థలు తాము చేపట్టే అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ సొంతంగా చేసుకోవాల్సి ఉంది. దీనికి పరిహారం చెల్లించే స్తోమత స్థానిక సంస్థలకు ఉండదు. దీంతో వీటికి టీడీఆర్ బాండ్లు జారీ చేస్తారు. బాండ్లను బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ స్థలం విలువ పెరిగితే బాండ్ల విలువ పెరుగుతుంది. ఇలాంటి బాండ్లను అదే సంస్థలో రుసుముల చెల్లింపులకు ఉపయోగించవచ్చు. సాధారణంగా రహదారుల విస్తరణకు భూసేకరణ జరుపుతారు. 2012–2016 మధ్య గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో జరిగిన రోడ్ల విస్తరణలో స్థలాలు, భవనాలు కోల్పోయిన వారికి కార్పొరేషన్ టీడీఆర్ బాండ్లు మంజూరు చేసింది. ఈ ప్రక్రియలో అప్పట్లో టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు బిల్డర్లతో కుమ్మక్కై చేతివాటం ప్రదర్శించారు. మొత్తం ముట్టజెప్పారు.. ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించి కేసు నమోదు చేసేలోపే కొంతరు అధికారులు, బిల్డర్లు తాము నొక్కేసిన సొమ్ములో రూ.28 లక్షలు వెనక్కి ఇచ్చేవారు. అయితే ఇదంతా గత డిసెంబర్లో కేసు నమోదుకాక ముందు జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులందరికి నోటీసులు జారీ చేసిన వెంటనే మిగిలిన 1.32కోట్లు కూడా వచ్చేశాయి. అయితే అవినీతికి పాల్పడిన సొమ్మును వెనక్కు ఇచ్చినప్పటికీ తప్పు చేసినవారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యేల బినామీలు.. నగరపాలక సంస్థలో జరిగిన భారీ కుంభకోణంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ముఖ్య నాయకులబినామీలు, ముఖ్య అనుచరులైన బిల్డర్లు ఉన్నారు. అందువల్లే గత ప్రభుత్వ హయాంలో కేసు ముందుకుసాగకుండా అడ్డకున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దర్యాప్తు వేగవంతమైనట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. -
టీడీపీలో బ్యాండ్ బాజా
ఫన్టైమ్స్ను టార్గెట్ చేసిన కార్పొరేటర్లు రూ.10 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలు టీడీఆర్ బాండ్ల సమగ్ర దర్యాప్తు అవశ్యం విజయవాడ : కార్పొరేషన్లో టీడీఆర్ బాండ్ల మంజూరు అంశం చినికిచినికి గాలివానలా మారింది. ఫన్‌టైమ్స్ క్లబ్ రోడ్డు విస్తరణకు సంబంధించి బాండ్ల మంజూరులో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ కార్పొరేటర్లు ముప్పా వెంకటేశ్వరరావు, గండూరి మహేష్ కౌన్సిల్లో రచ్చచేశారు. ప్రశ్నను ఉపసంహరించుకోవాలంటూ తనకు 16 బెదిరింపు కాల్స్ వచ్చాయని మహేష్ సభ సాక్షిగా చెప్పారు. సీన్‌కట్ చేస్తే మహేష్ తనను బ్లాక్మెయిల్ చేశారని, ఇందుకు సంబంధించి తనవద్ద ఆధారాలు ఉన్నాయని ఒలిపింక్ అసోసియేషన్ జిల్లా గౌరవ కార్యదర్శి కె.పి.రావు ప్రత్యారోపణలకు దిగారు. ఇదీ సంగతి... పటమట ఫన్‌టైమ్స్ క్లబ్ రోడ్డును మాస్టర్‌ప్లాన్ ప్రకారం 80 అడుగుల రోడ్డుగా విస్తరించాలని 1998లో కౌన్సిల్ నిర్ణయించింది. 2,080 చ దరపు గజాల స్థలం అవసరమని అంచనా వేశారు. కార్పొరేషన్‌కు స్థలాన్ని ఇచ్చేందుకు 11మంది ప్రైవేటు వ్యక్తులు నిరాకరించారు. 2002లో నాటి కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ బలవంతంగా స్థల సేకరణకు ప్రయత్నించగా ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్థలసేకరణకు బ్రేక్‌పడింది. స్థల యజమానులతో చర్చల అనంతరం 2011లో డీల్ కుదిరింది. 2,080 చదరపుగజాల్లో 520 చదరపు స్థలాన్ని ఉచితంగా, మిగిలిన స్థలానికి అదే ఖరీదు గల స్థలాలు ఇవ్వాల్సిందిగా మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్(ఎంవోయూ) కుదిరింది. ఈ ప్రకారం 310, 356,626 చదరపు గజాల స్థలాలను మూడు ముక్కలుగా కార్పొరేషన్ స్థల యజమానులకు మంజూరు చేసింది. ఇంకా 268 చదరపుగజాల స్థలాన్ని కార్పొరేషన్ బాకీ పడింది. ల్యాండ్వ్యాల్యూ మార్కెట్ ప్రకారం యజమానులు ఇచ్చిన స్థలం అప్పట్లో గజం రూ.33 వేలు ఉండగా, బదులుగా కార్పొరేషన్ ఇచ్చిన స్థలం గజం కేవలం రూ.17 వేలు మాత్రమే ఉంది. ఈ రెంటికి మధ్య ధర వ్యత్యాసం రూ.1.57 కోట్లు వచ్చింది. ఇందుకు రెట్టింపు మొత్తంలో బాండ్లు పంపిణీ చేయాలన్నది ఒప్పందం. 268 చదరపు గజాల స్థలం, మార్కెట్ వ్యాల్యూ ప్రకారం వచ్చిన తేడా ప్రకారం 1,321.60 చదరపు గజాలకు సంబంధించిన బాండ్లను కార్పొరేషన్ పంపిణీ చేసింది. దీంతో డీల్ ముగిసింది. మళ్లీ తెరపైకి.... ఐదారేళ్ల క్రితం సమసిపోయిన ఈ వివాదాన్ని టీడీపీ కార్పొరేటర్లు వ్యూహాత్మకంగా కౌన్సిల్లో చర్చకు తెలచ్చారు. బాండ్ల పంపిణీలో కిరికిరి జరిగిందని ఆరోపించారు. నగరంలో వందల సంఖ్యలో బాండ్ల పంపిణీ జరిగితే ఫన్‌టైం క్లబ్‌రోడ్డు బాండ్లను మాత్రమే టార్గెట్ చేయడం ఇక్కడ కొసమెరుపు. రికార్డు అంతా పక్కగానే ఉందని సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్ స్పష్టం చేసినప్పటికీ కార్పొరేటర్లు తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయని చెప్పిన మహేష్ సభలో గందరగోళం సృష్టించారు. కుంభకోణాన్ని ఛేదించాలన్నదే టీడీపీ కార్పొరేటర్ల అభిమతం అయితే కేపీరావుతో హోటల్లో చర్చలు ఎందుకు జరిపారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బెదిరింపు కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో దర్గా భూముల తీర్మానం, శ్రీ కనకదుర్గ లేఅవుట్ సొసైటీ వ్యవహారంలో అవినీతి మకిలి అంటించుకున్న టీడీపీ పాలకులపై తాజాగా బ్లాక్మెయిలర్స్ ముద్ర పడింది. సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముప్పా కబ్జాకోరు ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా గౌరవ కార్యదర్శి కేపీరావు టీడీపీ కార్పొరేటర్లు బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు. ఫన్‌టైమ్స్ క్లబ్ రోడ్డుకు బాండ్ల మంజూరుపై కుంభకోణం జరిగిందని అనవసరపు రాద్ధాంతం చేశారు. 47వ డివిజన్ కార్పొరేటర్ గండూరి మహేష్ కౌన్సిల్లో పెట్టిన ప్రశ్నను ఉపసంహరించుకునేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. 43వ డివిజన్ కార్పొరేటర్ కొండపల్లి అనసూయ భర్త సత్యనారాయణ మధ్యవర్తిత్వం చేశారు. ఓ స్టార్ హోటల్లో నాతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు నా వద్ద ఉన్నాయి. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తా’’ అంటూ ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.పి.రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాండ్ల మంజూరుపై సీబీసీఐడీ విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. 42వ డివిజన్ కార్పొరేటర్ ముప్పావెంకటేశ్వరరావు డెరైక్షన్లోనే మహేష్ యాక్షన్ చేశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సెంట్రల్ నియోజక వర్గ ఎమ్మెల్యే బొండా ఉమా దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు. మహేష్ తరుపున కొండపల్లి సత్యనారాయణ తనకు చేసిన ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తే బండారం బయటపడుతోందన్నారు. కౌన్సిల్‌కు ఐదు రోజుల ముందు హోటల్ మురళీ ఫార్చ్యున్లో తనను కల్సి బ్లాక్మెయిల్ చేశారన్నారు. హోటల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే కార్పొరేటర్ వచ్చాడో లేదో తెలుస్తుందన్నారు. కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు కబ్జాకోరు అని కేపీరావు విమర్శించారు. హోటల్ నారాయణస్వామి పక్కనే ఉన్న 200 గజాలు కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. మేయర్ కోనేరు శ్రీధర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కేవీ.రావు దుయ్యబట్టారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుంచి క్రీడాసంఘాలను బయటకు పంపాలని ప్రయత్నిస్తే తాను అడ్డుకున్నానన్నారు. మూడు రోజుల క్రితం మేయర్‌ను కలిసి తనకే ఇంకా కోటి రూపాయల విలువైన బాండ్లు రావాల్సి ఉందని చెప్పానని, బాండ్ల మంజూరు ప్రశ్నపై కౌన్సిల్లో చర్చించవద్దని తానేమీ ప్రాథేయపడలేన్నారు.