భారత్లో ఆడి టెక్నికల్ సెంటర్
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి, భారత్లో టెక్నికల్ సర్వీస్ సెంటర్ను ముంబైలో ప్రారంభించింది. భారత్లో కంపెనీకి ఇదే తొలి టెక్నికల్ సర్వీస్ సెంటర్. ఆసియా-పసిఫిక్లో ఏడవది. భారత వినియోగదారుల ప్రాధాన్యతలపై ఈ టెక్నికల్ సర్వీస్ సెంటర్ ఎప్పటికప్పుడు దృష్టి పెడుతుంది.