Technological
-
ఇన్స్టాగ్రామ్ ‘పీక్’ ఫీచర్‌ని ఎప్పుడైనా ట్రై చేశారా!
‘పీక్’ అనే కొత్త ఫీచర్‌ని పరీక్షిస్తోంది ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్. ఈ ఫీచర్ ద్వారా ఒక వ్యూ తరువాత మాయం అయ్యే ఎడిట్ చేయని, అన్‌ఫిల్టర్, ఇన్–ది–మూమెంట్ ఫొటోలను యూజర్లు స్పీడ్‌గా క్యాప్చర్, షేర్ చేయవచ్చు. స్నాప్‌చాట్, బీరియల్ను స్ఫూర్తిగా తీసుకొని ‘పీక్’పై దృష్టి పెట్టింది ఇన్‌స్టా. ఫొటోలు, వీడియోలను 24 గంటల ΄ాటు చూడడానికి అనుమతించే ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రస్తుత ‘స్టోరీస్’ ఫీచర్లా కాకుండా ‘పీక్’ ఫొటోలు సింగిల్ వ్యూలో అదృశ్యం అవుతాయి, ‘లిటిల్ మూమెంట్స్ విత్ ది పీపుల్ యూ లవ్’ అని ‘పీక్’ గురించి చెప్పింది ఇన్స్టాగ్రామ్.గూగుల్ కొత్త ఏఐ వీడియో అండ్ ఇమేజ్ జనరేటర్స్..కొత్త ఏఐ వీడియో అండ్ ఇమేజ్ జనరేటర్స్ వియో, ఇమాజెన్ 3లను గూగుల్ లాంచ్ చేసింది. టెక్స్ట్ ప్రాంప్ట్‌ల నుంచి వీడియోలను జనరేట్ చేయడానికి వియో ఉపయోగపడుతుంది. ఇమాజెన్ 3 అనేది గూగుల్‌కు సంబంధించి అత్యంత అధునాతన ‘టెక్ట్స్–టు–ఇమేజ్’ మోడల్. ‘ఇమాజెన్ 3 అనేది టెక్స్›్ట–టు–ఇమేజ్ హైక్వాలిటీ మోడల్.ఫొటోరియలిస్టిక్, లైఫ్‌లైక్ ఇమేజ్‌లను సృష్టించే సామర్థ్యం దీని సొంతం’ అంటుంది గూగుల్. మోస్ట్ అడ్వాన్స్డ్ వీడియో మోడల్‌గా గూగుల్ చెబుతున్న ‘వియో’ వెరైటీ స్టైల్స్‌లో హై–క్వాలిటీ 1080పి వీడియోలను ్ర΄÷డ్యూస్ చేస్తుంది. ఈ ఏఐ మోడల్ ‘టైమ్‌ల్యాప్స్’ ‘ఏరియల్ ష్టార్స్’లాంటి సినిమాటిక్ కాన్సెప్ట్‌లను కూడా అర్థం చేసుకుంటుంది. వీడియో క్రియేటర్లకు ఇది గేమ్–చేంజర్ అవుతుందని ప్రకటించింది గూగుల్.హువావే మేట్ బుక్ 14..సైజ్: 14.2 అంగుళాలు రిజల్యూషన్: 2880్ఠ1920 పిక్సెల్స్బరువు: 1.31 కేజీ మెమోరీ: 16జీబి స్టోరేజ్: 512 జీబి/1టీబిబ్యాటరీ లైఫ్: 19 గంటలు, ఏఐ ఫీచర్స్, ఇన్టెల్ కోర్ ఆల్ట్రా చిప్ఆల్ట్రా హ్యూమన్ రింగ్ ఏయిర్..థిక్: 2.5 ఎంఎంవైడ్: 8.1 ఎంఎం బరువు: 3 గ్రా. కలర్ ఆప్షన్: టైటానియం పీపీజీ ఆప్టికల్ సెన్సర్: హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్, వాటర్ రెసిస్టెంట్,సపోర్ట్స్: 22 వర్కవుట్ మోడ్స్హెచ్ఎండీ టీ21 ట్యాబ్..సైజ్: 10.36 అంగుళాలు వోఎస్: ఆండ్రాయిడ్ 13రిజల్యూషన్: 1200్ఠ2000 పిక్సెల్స్ కలర్: బ్లాక్ స్టీల్ఇంటర్నల్: 64జీబి 4జీబి ర్యామ్/ 128జీబి 4జీబి ర్యామ్ బ్యాటరీ: 8200 ఎంఏహెచ్, స్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్ఇవి చదవండి: గేమింగ్.. 'రక్షకుడు' వచ్చాడు! -
Sia Godika: 'సామాజిక సేవ నుంచి సైన్స్ వరకు'..
'బెంగళూరుకు చెందిన సియా గోడికా పేరు వినిపించగానే ‘సోల్ వారియర్స్’ గుర్తుకు వస్తుంది. ‘సోల్ వారియర్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదలకు పాదరక్షలను అందిస్తుంది సియా. ‘చేంజ్‌మేకర్’గా గుర్తింపు పొందిన సియా గోడికా చదువులోనూ ప్రతిభ చూపుతోంది. ‘ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్’ గురించి ఆమె చేసిన సైన్స్ వీడియో ‘బ్రేక్‌త్రూ జూనియర్ చాలెంజ్’లో బహుమతి గెలుచుకుంది'. సైన్స్, మ్యాథమెటిక్స్‌కు సంబంధించి క్రియేటివ్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ఇచ్చే ప్రైజ్ ఇది. సేవామార్గంలో ప్రయాణించడంతో పాటు క్రియేటివ్ థింకింగ్ కోసం పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటుంది సియా. సైన్స్‌కు సంబంధించిన సరికొత్త విషయాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటుంది. ‘ఇంట్లో పిల్లలకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటే గొప్ప విజయాలు సాధించవచ్చు’ అని చెప్పడానికి సియా ఒక ఉదాహరణ. సేవాకార్యక్రమాలకు తమ వంతుగా సహాయపడడం నుంచి సైన్స్ సంగతులు చెప్పడం వరకు సియా గోడికాకు ఎన్నో రకాలుగా ఆమె తల్లిదండ్రులు సహకారం అందించారు. ఇవి చదవండి: Rest Mom Face: పేరెంటింగ్ ప్రపంచంలో కొత్త మంత్రం -
World Human Trafficking Day: ట్రాఫికింగ్ నెట్‌తో జాగ్రత్త!
ఇటీవల మానవ అక్రమ రవాణాలో ఆధునికత చోటు చేసుకుంది. సాంకేతిక యుగంలో మనం ఉపయోగించే రకరకాల మాధ్యమాలు ఇందుకు ప్రధాన కారణం అవుతున్నాయి. ఈ నవీన కాలంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఏ విధంగా జరుగుతుందో అవగాహన పెంచుకుంటే, జాగ్రత్త పడటం సులువు అవుతుంది. ఎనిమిదవ తరగతి చదువుతున్న శ్రీజ (పేరుమార్చడమైంది) తన తల్లి ఫోన్‌ని ఉపయోగిస్తుండేది. శ్రీజకు తోడబుట్టిన అక్కచెల్లెళ్లు ముగ్గురు ఉన్నారు. తండ్రి మరణించడంతో తల్లి నాలుగిళ్లలో పాచి పని చేస్తూ పిల్లలను పోషిస్తుంది. ఒక రోజు మొత్తం శ్రీజ కనిపించకపోవడంతో కంగారుపడి పోలీసులను సంప్రదించారు. రెండు రోజులు వెతకగా శ్రీజ కలకత్తాలో ఉన్నట్టు తెలిసింది. అపరిచిత వ్యక్తి ప్రేమ పేరుతో ఫోన్ ద్వారా నమ్మబలికి, శ్రీజ ను రప్పించినట్టుగా, అటు నుంచి ఆమెను మరో చోటుకి తరలించే ప్రయత్నం చేసినట్టు గుర్తించి, తిరిగి తీసుకొచ్చి, తల్లికి అప్పజెప్పారు. ఆడపిల్లలు/మహిళలను తప్పుదోవ పట్టించే నేర ప్రక్రియలో ఇంటర్నెట్ ఒక మాధ్యమంగా మారింది. సామాజిక మాధ్యమాలలో కనిపించిన ‘కిడ్నీ కావలెను’ అనే ప్రకటన చూసిన రమేష్ (పేరు మార్చడమైనది) అందులో ఇచ్చిన ఫోన్ నెంబర్‌ను సంప్రదించాడు. అవతలి వ్యక్తులు చెప్పిన విషయాలు విని, ఒక కిడ్నీ ఇస్తే తనకు ఆర్థిక బాధలు తొలగిపోతాయని భావించాడు. చెప్పిన చోటికి వెళ్లిన అతను తిరిగి ఇంటికి చేరుకోలేదు. లైంగిక అత్యాచారం, శ్రమ దోపిడి, శిశువుల అమ్మకాలు, అవయవాలు, వధువుల అక్రమ రవాణాలో ఇప్పటి వరకు ఒక దశలో ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ట్రాఫికర్లు సైబర్ స్పేస్‌ను కూడా ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఈ సమస్య ప్రభుత్వం, పోలీసులు, న్యాయవ్యవస్థకు పెద్ద సవాల్‌గా నిలిచింది. ► సైబర్ ట్రాఫికింగ్‌లో లైంగిక దోపిడీ ప్రాబల్యం రకరకాల రూపాలను చూపుతుంది. యుఎన్ డాట్ జిఎఫ్టి గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం సైబర్ ట్రాఫికింగ్‌లో లైంగిక దోపిడీకి, మానవ అక్రమ రవాణా 79 శాతం ఉన్నట్టు గుర్తించింది. బాలికలు 13 శాతం, పురుషులు 12 శాతం, బాలురు 9 శాతం అక్రమ రవాణాకు గురైనట్టు పేర్కొంది. సైబర్ ఫేక్... ► ట్రాఫికర్లు మహిళలపై హింసకు సోషల్ మీడియా ద్వారా కొత్త మార్గాలను తెరిచారు. నేరస్తులు సోషల్ మీడియా ద్వారా బాధితులను ఆకర్షించడం, మోసగించడం, ట్రాప్ చేయడం ఈ విధానంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యంగా అమ్మాయిలను /మహిళలను ట్రాప్ చేయడానికి నేరస్తులు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఫేక్ ఐడీలను సృష్టించి స్కూల్, కాలేజీ యువతుల భావోద్వేగాలపైన తమ ప్రభావం చూపుతుంటారు. ప్రేమ పేరుతో చాటింగ్ చేస్తూ, కానుకల ద్వారా ఆకర్షిస్తూ, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల ద్వారా బెదిరిస్తూ ఇల్లు దాటేలా చేస్తుంటారు. ► సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో బాధితులను తమకు అనుకూలంగా మార్చడం, నియంత్రించడం వంటివి జరుగుతున్నాయి. ► ఉద్యోగాల పేరుతో యువకులను ఆకర్షించి, వారు సైబర్ నేరాలకు పాల్పడేలా వేధింపులకు లోను చేయడం. ► అద్దె గర్భం (సరోగసీ విధానం) కూడా ఇప్పుడు ఆన్లైన్ వేదికగా కొత్త పుంతలు తొక్కుతోంది. నమ్మి వెళ్లిన వాళ్లు కొత్త సమస్యలలో చిక్కుకునే పరిస్థితి ఎదురైంది. ► పోర్నోగ్రఫీ అక్రమ రవాణాకు ప్రతి క్షణం ఆజ్యం పోస్తూనే ఉంది. ఈ విష చట్రంలోకి ప్రపంచ వ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలు చేరుతున్నట్టు, ఈ అక్రమ రవాణాకు గురవుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. డిజిటల్ వేగం వాడుకలో సౌలభ్యంతో పాటు వేగం ఉండటం వల్ల కూడా నేరస్థులు తమ సామర్థ్యాలను మెరుగుపరచుకుని ఇంటర్నెట్ మాధ్యమాల్లో వాటిని చూపుతున్నారు. దీని వల్ల డిజిటల్ జాడలు కనిపెట్టి, మనవారిని రక్షించడం అనేది పెద్ద ప్రయాసగా మారింది. అప్రమత్తతే అడ్డుకట్ట ఇంటర్నెట్ వాడకం వల్ల అపారమైన ప్రయోజనాలు ఉన్నట్టే, సరిహద్దులు దాటి సుదూర దేశాల నుండి మనల్ని మరో మార్గంలో ప్రయాణించేలా చేయడానికి సైబర్ ట్రాఫికర్స్ పొంచి ఉన్నారు. అందుకే, సోషల్ మీడియా వాడకంలో తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్కూళ్లు, కాలేజీలు ఇంటర్నెట్ వాడకం ద్వారా జరిగే నష్టాలు, మానవ అక్రమ రవాణాకు జరుగుతున్న ప్రయత్నాల గురించి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. డార్క్ టీమ్స్ ఉంటాయి జాగ్రత్త సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఈ మధ్య కొత్త పదం వచ్చింది. మన దేశం నుంచి విదేశాలకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకెళ్లి, సైబర్ క్రైమ్ చేయిస్తుంటారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక అధికంగా ఉన్నవారిని గుర్తించి ఈ విధానానికి ఎంచుకుంటారు. తాము చెప్పినట్టుగా ఒప్పుకోనివారిని వేధిస్తారు. లేదంటే, వారి ఆర్థిక స్థితిని బట్టి డబ్బు వసూలు చేసి, వదిలేస్తారు. ఆ తర్వాత సైబర్ ట్రాఫికింగ్‌లో ఆర్గాన్ ట్రేడింగ్, సరోగసి కూడా ప్రధానంగా ఉన్నాయి. నేరస్థులు సైబర్ డార్క్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తారు. వీరి ద్వారా అమాయకులను ట్రాప్ చేసి, అక్రమ రవాణాకు పాల్పడుతుంటారు. అందుకని అపరిచితులతో పరిచయాలను పెంచుకోవద్దు. ఒంటరి మహిళలను ట్రాప్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ శోధిస్తూనే ఉంటారు. మన వివరాలను ఆన్లైన్లో బహిరంగ పరచకూడదు. ఆన్లైన్ అగ్రిమెంట్లాంటివి చేయకూడదు. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వచ్చే ప్రకటనలు చూసి మోసపోకూడదు. – అనీల్ రాచమల్ల, సైబర్ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
గురుపూజోత్సవం: గురువంటే... వెలిగే దీపం
భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది. సమున్నతమైనది, గౌరవప్రదమైనది. తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుది. ఒక వ్యక్తి, సమాజ, జాతి నడకకు, నడతకు, పురోగతికి, శ్రేయస్సుకు గురువు మార్గదర్శనం తప్పనిసరి. వ్యక్తి వికాసానికైనా, దేశ వికాసానికైనా ఉత్తమ గురువు ప్రోత్సాహం, అనుగ్రహం, ఆశీర్వాదం అనివార్యం. ఉత్తమ గ్రంథాలన్నీ ఆచార్యుని ప్రాధాన్యతను ప్రస్తుతించాయి. ఒక జాతి ఉత్తమజాతిగా రూపొందటంలో ప్రజల గుణగణాలు ఎంతో కీలకపాత్ర వహిస్తాయి. ప్రజలు శీలవంతులుగా ఉండాలంటే ప్రప్రథమంగా వారు చక్కని సంస్కార వంతులు కావాలి. ఈ గొప్ప సంస్కారం మన మనస్సుల్లో ఉద్దీపింప చేసే మహోన్నతుడే గురువు. మనకు విద్యను బోధిస్తూనే మన హృదయ సంస్కారాన్ని పెంచే యత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఒకసారి మృదువుగా, మరొకసారి కఠినంగా వ్యహరిస్తుంటాడు. ఆపై తల్లిగా లాలిస్తాడు. ప్రేమను కురిపిస్తాడు. అక్కున చేర్చుకుంటాడు. అందుకే తల్లి ప్రేమ, ఆత్మీయత; అవసరమైన వేళలో తండ్రిలా దండన, సంరక్షణల మేళవింపే గురువు. ఉత్తమగురువు తన విద్యార్థులతో ఒక స్నేహితుడిగా, వేదాంతిగా, మార్గదర్శకుడిగా ఉంటూ వారి వ్యక్తిత్వ వికాసానికి, ఎదుగుదలకు ఎంతో సహాయం చేస్తాడు. చదువు ద్వారా జ్ఞానాన్ని పెంచుతూనే హృదయ సంస్కారాన్ని పెంచుతాడు. విద్యను చెప్పేవాడికే బుద్ధులు చెప్పే విశేష అధికారం, అవకాశం ఉంటాయి. ఉత్తమ గురువెన్నడూ తన ఈ గురుతర బాధ్యతను విస్మరించడు. తన ఆధిక్యతను ఎక్కడా ప్రదర్శించడు. చక్కని విద్యతోపాటు హృదయ సంస్కారం అలవడి వృద్ధి చెందే గొప్ప వాతావరణం, జ్ఞానం గురువు నుండి శిష్యుడికి, శిష్యుడి నుంచి గురువుకు ప్రసరిస్తుంది. గ్రీకు తత్త్వవేత్త, వేదాంతి, విద్యావేత్త ప్లేటో ఏథెన్స్ నగరంలో బోధనా పద్ధతిలో ఒక గొప్ప పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆయన కూడ తన విధానంలో విద్యార్థులకు పెద్ద పీట వేసాడు. అక్కడ ప్రతి లౌకిక, అలౌకిక విషయాలను, జ్ఞానం, దాని లోతుపాతులు, అది లభ్యమయ్యే మార్గాలు.. ఇలా ఎన్నో విషయాలను గురుశిష్యులు చర్చించేవారు. ఎవరి భావాలు ఉన్నతంగా ఉంటే వాటినే తీసుకునే వారు. ఇక్కడ విద్యంటే ఆలోచనల మార్పిడి. అలాగే ఈ గురుకులంలో ఎవరు ఎవరికీ బోధిస్తున్నారో చెప్పటం కష్టం. ఎవరిది గొప్ప ఆలోచనైతే దాన్నే మిగిలినవారు స్వీకరించే వారు. ఈ దేశాలలో కూడ ఒకరు ఎక్కువ, రెండవవారు తక్కువన్న ప్రసక్తే లేదు. ఎంత ఉన్నతమైన భావనో గమనించండి. ప్రాచ్య దేశాలైనా, పాశ్చాత్య దేశాలైనా గురువు విలువను, ఆయన ఆవశ్యకతను గుర్తెరిగి వర్తిస్తాయని ఆయనకు ఉన్నత స్థానాన్నిస్తాయని చెప్పటానికే ఈ ఉదాహరణ. గురువులో రవ్వంత గర్వమైనా ఉండకూడదు. అసలు పొడచూపకూడదు. మనస్సు నిర్మలమైన తటాకం కావాలి. ఇలా కావటానికి అతడు పక్షపాత రహితుడు కావాలి. అపుడే తన జ్ఞానాన్ని శిష్యులకు అందచేస్తాడు. ఆ జ్ఞానాన్ని పొందిన శిష్యుడు దాన్ని జీర్ణించుకుని తన మేధతో మరింతగా ప్రకాశింపచేసి తరువాత తరాలవారికి అందచేస్తాడు. అలా తన శిష్యులు తన జ్ఞానవాహికలు కావటం ఏ గురువుకైనా ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎంతో ఉప్పొంగిపోతాడు. జ్ఞానపరంపరకు వారధి కనుక అతనంటే అవ్యాజమైన ప్రేమ. ఎంతో గౌరవం. జ్ఞానమనే అనంత ప్రవాహంలో గురుశిష్యులు జ్ఞానపాయలు. ఉత్తమ గురువు కోసం శిష్యుడు ఎలా తపిస్తూ, అన్వేషిస్తాడో, గురువు కూడ అంతే. గురువు క్షేత్రమైతే శిష్యుడు విత్తు లాంటివాడు. రెండిటి మేలు కలయిక వల్లే జ్ఞానమనే బంగరు పంట పండుతుంది. గురువు ఎవరినైనా శిష్యుడి తీసుకునే ముందు అతడి జ్ఞానంతో పాటు, అతడి జ్ఞానతృష్ణనూ పరీక్షిస్తాడు. అవి తృప్తికరంగా ఉన్నప్పుడే అతనికి విద్య గరిపేవాడు. గురువు జ్ఞానధారను ఒడిసిపట్టుకున్న శిష్యుడు తన ప్రతిభతో, అనుభవంతో దానిని మరింతగా విస్తరించి భావితరాలకు అందిస్తాడు. నేటి విద్యావ్యవస్థలో ఆనాటి ప్రమాణాలు, అంతటి ఉత్తమ గురుశిష్యులు, విలువలు లేవని కొందరి గట్టి నమ్మకం. ఆరోపణ. కొంత వాస్తవం లేకపోలేదు. నేటి కాలంలోనూ బోధనావృత్తిని ఎంతో పవిత్రంగా భావించి దానిని చేపట్టి ఎంతో సమర్థంగా నిర్వహించేవారు ఉన్నారు. దానికి మరిన్ని సొబగులద్ది, మరింత గౌరవాన్ని, హుందాతనాన్ని పెంచిన వారు, పెంచుతున్న వారు ఉన్నారు. పొందవలసిన గౌరవాన్ని పొందుతూనే ఉన్నారు. సాంకేతికాభివృద్ధి విశేషంగా పెరిగి మనకు ఎంతగానో చేరువైంది. నేటి గురువులు ఈ సాంకేతికతని అందిపుచ్చుకుని మరీ పాఠాలు చెప్పేటందుకు సంసిద్ధులవుతున్నారు. వీరి లాగానే, ఉత్తమ శిష్యులు కూడ గురువుల మాదిరిగానే తయారవుతున్నారు. కనుక నేటి అధ్యాపకులకు చాలా అప్రమత్తత ఉండాలి. తమ జ్ఞానాన్ని, బోధనానైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి. అప్రమత్తులుగా ఉంటేనే కదా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని, నాలుగు కాలాలపాటు నిలువగలిగేది. ఉత్తమ గురువు మన ఆలోచనలకు నడకలు నేర్పుతాడు. మన ఊహలకు రెక్కలనిచ్చి మనం అద్భుత ప్రపంచాలలో విహరించే శక్తినిస్తాడు. ఉత్తమ గురువు మనలోని సృజనాత్మకతను మనం గుర్తించేటట్టు చేస్తాడు. ఉత్తమ గురువు చేసే, చేయగలిగే మహాత్తర కార్యమిదే. దీనివల్ల మనకు ప్రశ్నించే అలవాటు, శోధించే తత్వం అలవడుతుంది. అందుకే ఈ గురుశిష్యుల పాత్రను జాతిని సముద్ధరింపచేసే అత్యంత కీలకమైన అంశాలలో ఒకటిగా భావిస్తారు. వారి పాత్ర ఎంతో అమూల్యమైనది. అపురూపమైనది. ► మనకు తెలుసు అని అనుకున్నప్పుడు మనం నేర్చుకోవటం మానేస్తాం. ► విద్య అంతిమ లక్ష్యం ఒక స్వేచ్ఛా సృజనశీలిగా రూపొందటం. అపుడే చారిత్రక పరిస్థితులు, ప్రకృతి విపత్తులతో పోరాడగలడు. ► దేశంలో అందరికన్నా ఉపాధ్యాయుల మనస్సులు ఉత్తమమైనవిగా ఉండాలి. మన స్వీయ ఆలోచనాశక్తిని పెంపొందించటానికి సహాయపడే వాడే ఉపాధ్యాయుడు. ► విద్యావ్యవస్థకు ఉపాధ్యాయుడు వెన్నెముక. – డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ► ఏది చూడాలో చెప్పక ఎక్కడా చూడాలో మాత్రమే చెప్పేవాడు అధ్యాపకుడు. – అలెగ్జాండర్ ట్రెన్ఫర్ ► అగ్ర సింహాసనం మీదఎవరినైనా కూర్చోపెట్టదలచుకుంటే అతడు అధ్యాపకుడే. – గై కవాసాకి ► వెయ్యి రోజులు పరిశ్రమించి నేర్చుకున్న విద్యకన్నా ఒక గొప్ప అధ్యాపకుడితో ఒకరోజు గడపటం విలువైనది.– జపాన్ సామెత బోధించటమంటే మరోసారి నేర్చుకోవటం. – జోసెఫ్ జాబర్ట్ ► నేను అధ్యాపకుణ్ణి కాదు. కాని వైతాళికుణ్ణి – రాబర్ట్ ఫ్రాస్ట్ – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
రైతుల కష్టాలు.. కన్నీళ్లు చూశా..
సాక్షి, పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ) : రైతులు పడుతున్న కష్టాలను దగ్గర్నించి చూశా..అందుకే వారికి చేయూతగా నిలవాలని నిర్ణయించుకున్నా. తమిళనాడులో రైతులు వ్యవసాయం చేసేందుకు అవసరమైన నీటిని ఎలా నిల్వ ఉంచుకోవాలో అవగాహన కల్పిస్తున్నాను.. అని సినీ నటుడు విశాల్ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన అభిమన్యుడు చిత్ర విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి మెలోడీ థియేటర్‌కు దర్శకుడు మిత్రన్‌తో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో తను అనుభూతులు పంచుకున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చా. మా తాత వ్యవసాయదారుడు. చిన్నతనం నుంచి పొలం గట్లు..రైతుల కష్టాలూ చూశా. సకాలంలో రుణాలు మంజూరు కాక..పంటలు సరిగా పండక..తీసుకున్న రుణాన్ని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే అన్నంపెట్టే రైతన్నను ఆదుకోవాలని ప్రయత్నిస్తున్నాను. రాజకీయం అంటగట్టవద్దు రైతుల పట్ల చూపిస్తున్న ఆదరణకు, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. రైతు అనేవాడు ప్రతి ఏటా కష్టాలు పడుతూనే ఉన్నాడు. వారి కష్టాలను తీర్చడం సమాజంలో వ్యక్తిగా బాధ్యతగా ప్రవర్తిస్తున్నానంతే. తమిళనాడులోని బోరు వేయించుకొనే స్తోమత ఏ రైతుకూ లేదు. సకాలంలో వర్షాలు పడక పంటలు నాశనం అవుతున్నాయి. ప్రతి టిక్కెట్ నుంచి ఓ రూపాయి రైతుకు.. అభిమన్యుడు చిత్రానికి సంబంధించి ప్రేక్షకులు కొనుగోలు చేసే ప్రతి టిక్కెట్ నుంచి ఒక రూపాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నా. దీనికి డిస్ట్రిబ్యూటర్లూ అంగీకరించారు. పేదలకు ఏం చేస్తే బాగుంటుంది.. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను మరింత అభివృద్ధి చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. విద్య, వైద్యం అందక చాలా మంది పేదవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. నిపుణులైన వైద్యులను ప్రభుత్వ ఆస్పత్రులలో నియమించి పేదలకు మంచి వైద్యాన్ని అందించాలి. అప్పుడే మనం కోరుకున్న మంచి సమాజాన్ని చూడగలం. మీ తరువాత చిత్రం.. నా 25వ చిత్రంగా ‘పందెంకోడి–2’ ఈ ఏడాది దసరా రోజు (అక్టోబర్ 18)న విడుదల అవుతుంది. నేను కూడా టిక్కెట్ కొనుక్కుని ప్రేక్షకుల మధ్య కూర్చుని చూడాలని ఉంది. ‘అభిమన్యుడు’ పార్ట్ 2ను వచ్చే ఏడాది చేసేందుకు ప్లాన్ చేశాం. నేనూ మోసపోయా స్మార్ట్ ఫోన్, ఫేస్బుక్, ఆధార్ సీడింగ్, క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ వంటి ఆధునిక సదుపాయాలు వచ్చిన తరువాత అనేక మంది మోసపోయి, ఆర్థికంగా నష్టపోయారు. అందులో నేనూ ఒకడ్ని. నాకు తెలియకుండా నా క్రెడిట్ కార్డు వినియోగించి రూ.30వేల దొంగలించారు. ఇది నా ఒక్కడి అనుభవమే కాదు, సినిమాకు వచ్చే ప్రేక్షకుల్లో అనేక మంది అనుభవం. దీని నుంచి ఎలా బయటపడాలన్నదే సందేశం. వైట్ డెవిల్‌గా అర్జున్ సూపర్ నా చిన్నతనంలో వంద రూపాయలు పెట్టి బ్యాట్ కొనిచ్చిన అర్జున్‌తో ఫైటింగ్ సీన్లో నటించాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అభిమన్యుడు చిత్రం క్రైమాక్స్‌లో ఆయనతో చేసిన ఫైట్ మంచి అనుభవం. చిత్రంలో వైట్ డెవిల్‌గా ఆయన నటన చిత్రానికి పేరు తెచ్చింది. సత్తా ఉన్న దర్శకుడు మిత్రన్ అభిమన్యుడు చిత్ర దర్శకుడు మిత్రన్‌కు ఇది తొలి చిత్రం. అయినా ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మంచి మెసేజ్‌తో చిత్రాన్ని రూపొందించారు. ఇటువంటి మంచి చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల ఆభిమానం సంపాదించుకుంటారని ఆశిస్తున్నాను. మీ ఇష్ట దైవం.. థియేటర్లు నా దేవాలయాలు అయితే..ప్రేక్షకులే నా దేవుళ్లు..ఎందుకంటే వారు నామీద చూపిస్తున్న అభిమానం ప్రేమ ఎన్నటికి మరువలేనిది. నా చిత్రాలను ఆదరించి నన్నింతటివాడిని చేసింది ప్రేక్షకులే. -
ఆలోచించింది... ఆవిష్కరించింది!
ఆమె వయసుకు చిన్నదే కాని, విజ్ఞతలో... విజ్ఞానంలో చాలా పరిణతి సాధించింది. పండ్లు, కూరగాయలతో పరిశోధనలు చేసి ఫలితాలు సాధిస్తోంది. తన మేటి ఆలోచనలతో హృదయ సంబంధిత వ్యాధిగ్రస్తులకు భరోసాను నింపింది. కూరగాయలు, పండ్లు నెలరోజులపాటు తాజాగా ఉండే కవచాన్ని తయారు చేసింది. శస్త్రచికిత్సల అనంతరం ఇన్ఫెక్షన్లను నివారించేందుకు, నొప్పిని తగ్గించేందుకు ప్యాచ్‌లను తయారు చేసింది. ఆ అత్యుత్తమ పరిశోధనాత్మక ఆలోచనకు ప్రతిష్టాత్మక గాంధీయన్ యంగ్ టెక్నోలాజికల్ ఇన్నోవేషన్ అవార్డును అందుకుంది. అమెరికాలో జరిగిన సెమినార్లో నొప్పిని తగ్గించే ప్యాచ్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రశంసలు అందుకుంది. వరంగల్‌లోని కొత్తవాడకు చెందిన ఆడెపు సదానందం, స్వప్న దంపతుల పెద్ద కుతురు శివకళ్యాణి. వీరిది చేనేత కుటుంబం. ఆ వృత్తిమీద వచ్చే అరకొర సంపాదనే వారికి జీవనాధారం. తమ పరిస్థితి బాగుపడాలంటే చదువుతోనే ఎదగాలనుకుంది శివకల్యాణి. మొదటి నుంచి చదువులో ప్రతిభను చూపించేది. డాక్టర్ కావాలన్న తన లక్ష్యాన్ని అందుకోవడానికి కొద్దిలో అవకాశం చేజారడంతో బీఫార్మసీలో చేరింది. పద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ, తర్వాత అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ రీసెర్చ్‌లో ఎమ్‌ఫార్మసీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇండియన్ ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదారాబాద్‌లో పీహెచ్డీ చేస్తోంది. హృదయ సంబంధిత వ్యాధిగ్రస్తులకు భరోసా గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే రక్త ప్రసరణ అగిపోయి గుండె జబ్బులకు కారణమవుతుంటుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి శస్త్రచికిత్స ద్వారా స్టెంట్లు వేస్తారు. వీటి ఖరీదు సుమారు రూ 30 వేల నుంచి రూ లక్ష వరకు ఉంటుంది. ఇంత ఖరీదైన వైద్యం చేయించినా రోగి బతుకుతాడనే నమ్మకం ఉండదు. కొన్నిసార్లు శస్త్రచికిత్స ఫెయిల్ అయితే, మరికొన్ని సార్లు స్టెంట్లు వేసిన చోట రక్తం గడ్డకట్టి కొత్త ప్రమాదాలు ముంచుకొచ్చి ఊహించని మరణాలు సంభవిస్తుంటాయి. దీనికి విరుగుడుగా కూరగాయల మొక్కల నుంచి తయారు చేసిన ఒక ఔషధాన్ని వాడొచ్చని నిరూపించింది శివకళ్యాణి. పెయిన్‌కు ప్యాచ్ మందు యాంటి బయోటిక్స్ వాడటం వలన శరిరంలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే నొప్పుల నివారణ మందులను అధికంగా వాడితే జీర్ణశాయం, మూత్రపిండాలు, ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఔషధంలో వెయ్యవ వంతుతోనే వ్యాధి నయం అయ్యే పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. శరీరంపై అతికించుకునే విధంగా ట్రాన్స్ నిర్మల్ ప్యాచ్‌ను తయారు చేసింది. ఈ ప్యాచ్‌కు సూక్ష్మమైన రంధ్రాలుండటం వల్ల చర్మం ద్వారా తక్కువ మోతాదులో ఎక్కువ గంటల సమయం ఔషధం శరీరంలో కలుస్తుంది. ఈ పరిశోధన ఫలితాలు ఇప్పటికే అప్లయిడ్ సర్ఫేస్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఫ్రిజ్ లేకుండానే పండ్లు, కూరగాయల నిల్వ పండ్లు, కూరగాయలను ఫ్రిజ్‌లో లేకుండానే నెల రోజుల పాటు నిల్వ ఉండే విధంగా ఒక విధమైన పొరను తయారు చేసింది శివకల్యాణి. నిమ్మజాతులతో పాటు, ద్రాక్ష పండ్ల రసాలను 14 రోజుల పాటు ప్రత్యేక యంత్రాల్లో నిల్వ ఉంచితే బ్యాక్టీరియల్ నానో సెల్యులోస్ ఫైబర్ ఏర్పడుతుంది. శుద్ది చేసిన అనంతరం దానికి వెండి ద్రావణం కలుపుతారు. ఈ ఫైబర్‌లో మూడు నుంచి ఐదు నానో మీటర్ల అతిసూక్ష్మ రంధాలలో ద్రావణ రూపంలో ఉన్న వెండిరేణువులు అతుక్కుపోతాయి. సూక్ష్మ వెండి రేణువులకు బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంటుంది. ఇలా రూపొందించిన పొరను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పండ్లు, కూరగాయలపై అతికిస్తే దాదాపు 30 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇదే పొరను శస్త్రచికిత్సల అనంతరం వచ్చే ఇన్ఫెక్షన్నూ నివారించేందుకు ఉపయోగించవచ్చు. బ్యాండేజీలో ఈ ఉత్పత్తిని ఉంచి కట్టుకడితే గాయంపై ఉన్న బ్యాక్టీరియా నశించడంతో పాటు గాయం నిరంతరం పొడిగా ఉంటుంది. యంగ్ టెక్నోలాజికల్ అవార్డు యువతలో సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించి వాటికి ప్రాధాన్యం కల్పించి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కేంద్రప్రభుత్వం గాంధీయన్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. దీనికి దేశ వ్యాప్తంగా దరఖాస్తులొస్తాయి. వచ్చిన ప్రతి ఆలోచనలను దేశంలోని అన్ని ఐఐటీలు, పరిశోధన కేంద్రాలు, ప్రముఖ శాస్త్రవేత్తలకు పంపిస్తారు. వాటిపై ఆధ్యయనం చేసి ఆచరణ సాధ్యమైన ఉత్తమాలోచనలను అవార్డులకు సిఫార్సు చేస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి శివకళ్యాణి ఈ అవార్డును అందుకుంది. అమెరికాలోని బోస్టన్ సిటీలో హైన్స్ కన్వెన్షన్ సెంటర్లో మెటీరియల్ రిసెర్చ్ సొసైటీ అర్గనైజేషన్(ఎంఆర్ఎస్) ఆధ్వర్యంలో ఇటీవల టూడీ నానో మెటీరియల్స్ ఇన్ హెల్త్ కేర్ సదస్సులు జరిగాయి. ఈ సదస్సుకు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి పరిశోధకులు విచ్చేశారు. వారిలో భారతదేశం నుంచి హాజరైన ఆరుగురిలో శివకల్యాణి ఒకరు. నొప్పిని తగ్గించే ప్యాచ్‌పై ఆమె ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది అందరినీ ఆకట్టుకుంది. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, వరంగల్‌రూరల్ ఫోటోలు: పెద్దపల్లి వరప్రసాద్, వరంగల్ రూరల్ అమ్మానాన్నల ప్రోత్సాహంతో.... నేను ఇవ్వాళ ఈ స్థాయికి వచ్చానంటే అమ్మానాన్నల ప్రోత్సాహమే కారణం. మా అమ్మానాన్నలు రోజుకు 12 గంటల పాటు కష్టపడి చేనేత పని చేస్తున్నారు. మరిన్ని పరిశోధనలు చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధమైనవి కనుక్కొంటాను. నా పరిశోధనలకు మా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎంతగానో సహకరిస్తున్నారు. – శివకళ్యాణి సాయం చేస్తే... సార్థకం చేస్తుంది నేను కష్టపడి సంపాదించిన ప్రతి పైసాకూ మా పిల్లలు తగిన గుర్తింపును ఇచ్చారు. పేదకుటుంబమైనా, మా పిల్లల చదువు కోసం వెనుకడుగు వేయలేదు. నేను ఎంత కష్టమైనా పడి పిల్లలను చదివిస్తున్నాను. చేనేత వర్గానికి చెందిన వాళ్ళం మేము. నా కూతురు చేసే పరిశోధనలపైన రాష్ట్రప్రభుత్వం, ఇతర పెద్దలు దృష్టి పెట్టి సహాయం చేస్తే ప్రజలకు ఉపయోగపడే వాటిని నా కూతురు కనుక్కొని చవకగా అందజేస్తది.