telangana kala bharathi
-
పుస్తకాల పండుగొచ్చే
సాక్షి హైదరాబాద్: నగరానికి పుస్తకాల పండగొచ్చింది. ప్రతి ఏటా డిసెంబరులో 9 రోజులపాటు జరిగే పుస్తకాల ప్రదర్శన పుస్తక ప్రియులకు ఓ ప్రత్యేకమైన సంబురం. నేటి నుంచి తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్ స్టేడియంలో) 33వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ ప్రారంభం కానుంది. పుస్తక ప్రదర్శన ఏర్పాట్లు, దాని ప్రత్యేకతలను బుక్ ఫెయిర్ ప్రతినిధులు ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, జాయింట్ సెక్రటరీ శోభన్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. మొత్తం 330 స్టాళ్లు ఈసారి ప్రదర్శనలో 330 స్టాళ్లు ఏర్పాటు చేశారు, వీటిలో ప్రముఖ ప్రచురణ సంస్థల, పత్రికల స్టాల్స్, తెలుగు, ఇంగ్లిషు సహా అన్ని భాషల పుస్తకాల స్టాళ్లు ఉన్నాయి. ఇక పిల్లలను పుస్తకాలు చదివించేలా బాల మేళాను ప్రముఖంగా నిర్వహిస్తున్నారు. పిల్లలకు, ఐడీ కార్డుతో వచ్చిన విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. గతేడాది 10 లక్షల మంది పాల్గొన్నారని, నగరానికి 50–100 కి.మీ పరిధిలోని పాఠశాలలు తమ విద్యార్థులతో రావాలని గౌరీశంకర్ ఆహ్వానించారు. ఇప్పటివరకు 2 లక్షల పాస్‌లను పంపిణీ చేశామన్నారు. ఎప్పుడు: పుస్తక ప్రదర్శన ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ తమిళిసై ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా గంటా చక్రపాణి, బి.వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ జనార్ధన్ రెడ్డి పాల్గొననున్నారు. -
రారండోయ్
‘హైదరాబాద్ ఫెస్ట్ 2018(పుస్తక ప్రదర్శన) తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్ స్టేడియం) లో ఏప్రిల్ 13 నుంచి 22 వరకు జరగనుంది. తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా ‘కావ్య పరిమళం’ శీర్షిక క్రమంలో ఏప్రిల్ 13న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో పాల్కురికి సోమనాథుని బసవ పురాణంపై డాక్టర్ అనుమాండ్ల భూమయ్య ప్రసంగిస్తారు. అధ్యక్షుడు నందిని సిధారెడ్డి. తంగెళ్లపల్లి కనకాచారి కవితా సంకలనం ‘కుదుపు’ ఆవిష్కరణ ఏప్రిల్ 15న ఉదయం 10 గంటలకు వట్టికోట ఆళ్వారుస్వామి నగర కేంద్ర గ్రంథాలయం, చిక్కడపల్లిలో జరగనుంది. పాలమూరు సాహితీ అవార్డు కోసం 2017లో వచ్చిన వచన కవితా సంపుటాల మూడేసి ప్రతులను ఏప్రిల్ 30 లోగా పంపాలని నిర్వాహకులు కోరుతున్నారు. చిరునామా: డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, 8–5–38, టీచర్స్ కాలనీ, మహబూబ్‌నగర్–509001. వివరాలకు: 9032844017 ‘సోమనాథ కళా పీఠం’ 2018 ద్వైవార్షిక పురస్కారాలకుగానూ ఏప్రిల్ 30లోగా ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నారు. పాలకురికి సోమనాథుని జీవిత సాహిత్యాలపై పరిశోధన చేసినవారు ‘సోమనాథ సాహిత్య పురస్కారం’, సోమనాథుని భావజాలంపై కృషి చేసినవారు ‘సోమనాథ సామాజిక శోధన పురస్కారం’, నాటక రంగమున సాధన చేసినవారు ‘సోమనాథ రంగస్థల పురస్కారం’, తెలుగు భాషా సాహిత్యములకు సేవ చేసినవారు ‘పందిళ్ల శేఖర్ బాబు రాజయ్య శాస్త్రి స్మారక పురస్కారం’, సాహిత్య రసాస్వాదనకు కృషి చేస్తున్న కోవిదులు ‘వి.చలపతి రావు స్మారక పురస్కారం’ కోసం ‘డాక్టర్ రాపోలు సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు, సోమనాథ కళాపీఠం, పాలకుర్తి – 506146, జనగామ, ఫోన్: 9440163211’ చిరునామాకు పంపవచ్చు. -
కళాభారతికి ఎన్టీఆర్ స్టేడియం స్థలం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ‘తెలంగాణ కళా భారతి’ కోసం ఎన్టీఆర్ స్టేడియానికి సంబంధించిన 14 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖకు అప్పగించాలని జీహెచ్ఎంసీ ప్రత్యేకాధికారిని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక అవరాల కోసం రూ.100 కోట్లు వెచ్చించి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో తెలంగాణ కళా భారతిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే.