Telephone Users
-
టెలిఫోన్ యూజర్లు @105.92 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం టెలిఫోన్ యూజర్ల సంఖ్య ఏప్రిల్‌లో 105.92 కోట్లకు చేరింది. మార్చి చివరి నాటికి వీరి సంఖ్య 105.88 కోట్లుగా ఉందని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తెలిపింది. వైర్లెస్ సబ్స్క్రైబర్లు 103.36 కోట్ల నుంచి 103.42 కోట్లకు పెరిగారు. వీరిలో ప్రైవేట్ టెల్కోల వాటా 91.20 శాతంగా.. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వాటా 8.80 శాతంగా ఉంది. వైర్‌లైన్ యూజర్ల సంఖ్య 2.52 కోట్ల నుంచి 2.50 కోట్లకు తగ్గింది. ఇక ఎయిర్టెల్ వినియోగదారుల సంఖ్య 9.78 లక్షల పెరుగుదలతో 25.22 కోట్లకు పెరిగింది. రిలయన్స్ యూజర్ల సంఖ్య 1.1 లక్షల వృద్ధితో 10.25 కోట్లకు, వోడాఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య 46,660 పెరుగుదలతో 19.79 కోట్లకు ఎగసింది. -
టెలిఫోన్ వినియోగదారులు @ 100.93 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య జూలై నెలలో 100.93 కోట్లకు చేరినట్లు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. ఈ సంఖ్య జూన్ నెలలో 100.69 కోట్లుగా ఉంది. వినియోగదారుల నెలవారీ వృద్ధి 0.23 శాతంగా నమోదైంది. జూన్ నెల చివరి నాటికి 58.42 కోట్లుగా ఉన్న పట్టణ ప్రాంత వినియోగదారుల సంఖ్య జూలై నెల చివరకు 58.85 కోట్లకు పెరిగింది. అదే సమయంలో గ్రామీణ ప్రాంత వినియోగదారుల సంఖ్య 42.27 కోట్ల నుంచి 42.07 కోట్లకు త గ్గింది. వైర్లెస్ వినియోగదారుల సంఖ్య 98.32 కోట్లకు పెరిగింది. వైర్‌లైన్ వినియోగదారుల సంఖ్య 2.61 కోట్లకు తగ్గింది. వైర్లెస్ వినియోగదారుల సంఖ్య పరంగా చూస్తే.. జూలై నెలలో ఎయిర్‌టెల్‌కు కొత్తగా 10 లక్షల మంది, ఐడియాకు 7 లక్షల మంది, రిలయన్స్‌కు 5 లక్షల మంది వినియోగదారులు జతయ్యారు. అలాగే బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య 5 లక్షలు, ఎయిర్‌సెల్ వినియోగదారుల సంఖ్య 3 లక్షలు, టాటా వినియోగదారుల సంఖ్య లక్ష మేర, వోడాఫోన్ వినియోగదారుల సంఖ్య 65,104 పెరిగింది. -
వంద కోట్లకు చేరువలో టెలిఫోన్ వినియోగదారులు
న్యూఢిల్లీ : దేశంలో టెలిఫోన్ వినియోగదారులు ఏప్రిల్‌లో 99.9 కోట్లకు చేరారని టెలికం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం.. మార్చిలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 99.6 కోట్లుగా ఉంది. మార్చిలో 57.7 కోట్లుగా ఉన్న పట్టణ ప్రాంత టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఏప్రిల్‌లో 58 కోట్లకు పెరిగింది. అదే సమయంలో గ్రామీణ ప్రాంత వినియోగదారుల సంఖ్య 41.93 కోట్ల నుంచి 41.95 కోట్లకు చేరింది. వైర్లెస్ వినియోగదారుల సంఖ్య 96 కోట్ల నుంచి 97 కోట్లకు పెరిగింది. అదే సమయంలో వైర్‌లైన్ వినియోగదారుల సంఖ్య 2.65 కోట్ల నుంచి 2.63 కోట్లకు తగ్గింది. వైర్లెస్ సేవల కల్పనలో ప్రైవేట్ ఆపరేటర్ల మార్కెట్ వాటా 92 శాతంగా ఉంటే బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి ప్రభుత్వం ఆపరేటర్ల వాటా 8%గా ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లో వైర్లెస్ వినియోగదారుల వృద్ధి అత్యధికంగా ఉంటే కర్నాటకలో మాత్రం వీరి సంఖ్య తగ్గిం ది. వైర్‌లైన్ విభాగంలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ మార్కెట్ వాటా 75% ఉంది. ఏప్రిల్‌లో మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి దరఖాస్తు చేసుకున్నవారు 31 లక్షల మంది ఉన్నారు. బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 9.9 కోట్ల నుంచి 10 కోట్లకు పెరిగింది. ఆపరేటర్ ఏప్రిల్‌లో వైర్లెస్ వినియోగదారులు ఎయిర్టెల్ 22 కోట్లు వోడాఫోన్ 18 కోట్లు ఐడియా 15 కోట్లు రిలయన్స్ 10 కోట్లు ఎయిర్‌సెల్ 8 కోట్లు టాటా 6 కోట్లు యూనినార్ 5 కోట్లు సిస్టమా శ్యామ్ 90 ల క్షలు వీడియోకాన్ 70 లక్షలు -
టెలికం యూజర్లు @ 90.6 కోట్లు
న్యూఢిల్లీ: భారత టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది ఆగస్టు నాటికి 90.61 కోట్లకు చేరిందని టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) శుక్రవారం తెలిపింది. ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం..., జూలై చివరినాటికి 90.44 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఆగస్టు చివరినాటికి 0.19 శాతం వృద్ధితో 90.61 కోట్లకు పెరిగింది. వైర్లెస్ వినియోగదారుల సంఖ్య 87.48 కోట్ల నుంచి 0.21 శాతం వృద్ధితో 87.67 కోట్లకు చేరింది. మొత్తం మీద వైర్లెస్ టెలి డెన్సిటీ 71.13 నుంచి 71.21కి వృద్ధి చెందింది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఆగస్టులో 23.7 లక్షలకు చేరింది. దీంతో ఇప్పటివరకూ ఎంఎన్‌పీకి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 10 కోట్లకు పెరిగింది. మొత్తం బ్రాడ్‌బాండ్ వినియోగదారుల సంఖ్య 1.524 కోట్ల నుంచి 1.528 కోట్లకు పెరిగింది. ఇక ఆగస్టులో ఎయిర్‌సెల్ సంస్థకు అధికంగా(8.76 లక్షల మంది) కొత్త వినియోగదారులు లభించారు. ఆ తర్వాతి స్థానాల్లో భారతీ ఎయిర్టెల్(8.33 లక్షలు), ఐడియా(7.52 లక్షలు), ఆర్‌కామ్(5.10 లక్షలు), వీడియోకాన్(1.58 లక్షలు), లూప్(65 వేలు)లు నిలిచాయి. యూజర్ల సంఖ్య పరంగా రెండో స్థానంలో ఉన్న వొడాఫోన్ ఆగస్టులో 85 వేల మందిని కోల్పోయింది. బీఎస్ఎన్ఎల్(1.31 లక్షలు), ఎంటీఎన్ఎల్(2.92 లక్షలు), టాటా టెలి సర్వీసెస్(3.73 లక్షలు), సిస్టమ శ్యామ టెలి సర్వీసెస్(15,515 మంది) కూడా వినియోగదారులను కోల్పోయాయి.