న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం టెలిఫోన్ యూజర్ల సంఖ్య ఏప్రిల్‌లో 105.92 కోట్లకు చేరింది. మార్చి చివరి నాటికి వీరి సంఖ్య 105.88 కోట్లుగా ఉందని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తెలిపింది. వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు 103.36 కోట్ల నుంచి 103.42 కోట్లకు పెరిగారు. వీరిలో ప్రైవేట్ టెల్కోల వాటా 91.20 శాతంగా.. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ వాటా 8.80 శాతంగా ఉంది. వైర్‌లైన్ యూజర్ల సంఖ్య 2.52 కోట్ల నుంచి 2.50 కోట్లకు తగ్గింది. ఇక ఎయిర్‌టెల్ వినియోగదారుల సంఖ్య 9.78 లక్షల పెరుగుదలతో 25.22 కోట్లకు పెరిగింది.
రిలయన్స్ యూజర్ల సంఖ్య 1.1 లక్షల వృద్ధితో 10.25 కోట్లకు, వోడాఫోన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 46,660 పెరుగుదలతో 19.79 కోట్లకు ఎగసింది.
టెలిఫోన్ యూజర్లు @105.92 కోట్లు
Published Tue, Jun 21 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement