ఇద్దరు సీఎంలపై ఒత్తిడి తేవాలి : మందకృష్ణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అధికార పార్టీకి చెందిన మాదిగ ఎమ్మెల్యేలు వర్గీకరణ కోసం సీఎంలపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
ఈనెల 10వ తేదీ లోపు 2 రాష్ట్రాల సీఎంలు అఖిలపక్షాలతో కలసి ఢిల్లీ వచ్చేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తున్న దీక్షలో మంగళవారం మాదిగ ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ..మాదిగ హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో మాదిగ ఎమ్మెల్యేలంతా కలసి రా వా లని, ఈనెల 10న జరగనున్న మహాధర్నాకు హాజరు కావాలని కోరారు. ఆందోళనలో కమ్మరి రాజయ్యతో పాటు ఈదురు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.