temperature down
-
ఢిల్లీలో స్తంభించిన జనజీవనం
-
విశాఖ ఏజేన్సీలో చలి బీభత్సం
-
ఏపీ, తెలంగాణలో పెరిగిన చలి
-
పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. శ్వాసకోశ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి
సాక్షి, హైదరాబాద్: నగరంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గుముఖం పడుతుండడంతో చలిపులి పంజా విసురుతోంది. మరోవైపు వాహన కాలుష్యం అనూహ్యంగా పెరుగుతుండడంతో సిటీజన్లు శ్వాసకోశ సమస్యలతో సతమతమవుతున్నారు. గత వారంలో పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు చేరుకోవడంతో నగరవాసులు గజగజలాడారు. నగరంలో కాలుష్యం,చలి కారణంగా రోగులు, వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సమస్యలున్నవారు, ప్రయాణికులు, వాహనదారులు, చిరు వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. చలి, కాలుష్య తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాహన కాలుష్య ఉద్గారాలు.. గ్రేటర్లో వాహనాలు వదులుతున్న కాలుష్యంతో భూస్థాయి ఓజోన్ మోతాదు క్రమంగా పెరుగుతోంది. దీంతో సిటీజన్లు ఆస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలతో పాటు ఓజోన్ వాయువులు సిటీజన్లకు పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ అధికంగా ఉండే ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రధాన రహదారులపై ఓజోన్ వాయువు గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలవడంతో పాటు మంచు, సూర్యరశ్మి ప్రభావంతో భూఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడక సతమతమవుతున్నారు. సాధారణంగా ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు.. కానీ నగరంలోని ట్రాఫిక్ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 150 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతున్నాయి. వాయు కాలుష్యంతో.. ► పీఎం10, పీఎం 2.5, ఆర్ఎస్పీఎం సూక్ష్మ, స్థూల ధూళి రేణువులు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్కు కారణమవుతున్నాయి. ►దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటుంది. ►చిరాకు, అసహనం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు తలనొప్పి, పార్శ్వపు నొప్పి వస్తుంటాయి. ►ధూళి కాలుష్య మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల కేన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. పంజా విసురుతున్న చలిపులి.. నగరంలో ఇటీవలికాలంలో కనిష్ట,గరిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతుండడంతో చలిపంజా విసురుతోంది. కిందిస్థాయి గాలుల ప్రభావంతో తరచూ కారుమబ్బులు కమ్ముకుంటుండడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతోంది. ఇటీవల పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల మేర నమోదవడంతో సిటీజన్లు గజగజలాడారు. రాబోయే రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. -
నీ పర్సు ఎవడిక్కావాలి! చలికి చస్తున్నా.. నీ స్వెటర్ ఇచ్చేయ్!
నీ పర్సు ఎవడిక్కావాలి! చలికి చస్తున్నా.. నీ స్వెటర్ ఇచ్చేయ్! -
ప్రపంచంలో అత్యంత చల్లగా ఉండే ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎంతో తెలుసా?
మనం కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు తగ్గితేనే గజగజ వణికిపోతాం. మరి ప్రపంచంలో అత్యంత చల్లగా ఉండే ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? అది ఎక్కడుంది? అనే విషయాలేంటో చూద్దాం! – సాక్షి, సెంట్రల్ డెస్క్ మైనస్ 60 డిగ్రీలు.. అంటార్కిటికా అత్యంత చల్లగా ఉండే ఖండం అని అందరికీ తెలిసిందే. అక్కడ జనాభా ఉండదు. అక్కడికి కేవలం కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనల నిమిత్తం వచ్చి వెళ్తుంటారు. ఇదికాకుండా ప్రపంచంలో అత్యంత చల్లగా ఉండే ప్రదేశం ఏంటంటే.. రష్యాలో సైబీరియాలోని యాకుత్స్క్ నగరం. తక్కువ జనాభా ఉండే ప్రాంతాల్లో ఇదొకటి. ఇక్కడి జనాభా 3,36,200. వీరిలో ఎక్కువ మంది అల్రోసా అనే కంపెనీ నిర్వహించే వజ్రాల గనిలో పనిచేస్తుంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 60 డిగ్రీలు. అయితే అంతకంటే ఎక్కువ చలిని కూడా తాము అనుభవించినట్లు స్థానికులు చెబుతారు. అయితే ఉష్ణోగ్రతను కొలిచేందుకు వినియోగించే థర్మామీటర్లో మైనస్ 63 డిగ్రీలే గరిష్టంగా చూపుతుంది. అంతకంటే ఎక్కువ ఉన్నా ఇది చూపలేదు. ఇంకోటి కూడా ఉంది.. యాకుత్స్క్ నగరం అత్యంత శీతల ప్రాంతమైనప్పటికీ దీనికంటే ఎక్కువ చలి ఉన్న ప్రాంతం ఇంకోటి ఉంది. అదేంటంటే ఒమికోన్. అది కూడా రష్యాలోనే ఉంది. అక్కడ జనాభా 500లోపే. ఇక్కడ 1924లో ఉష్ణోగ్రత మైనస్ 71.2 డిగ్రీలు నమోదైంది. అయితే, ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. యాకుత్స్స్, ఒమికోన్ ప్రాంతాలు దగ్గర దగ్గరగా ఉండవు. రెండింటి మధ్య దూరం 928 కిలోమీటర్లు. ఒకచోటి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాలంటే 21 గంటలకు పైనే పడుతుంది. ఎక్కువగా చల్లగా ఎందుకంటే..? సైబీరియాలో అత్యంత చలి ఎందుకు ఉంటుంది.. అంటే ఇది అత్యంత ఎత్తులో ఉండటంతోపాటు ల్యాండ్మాస్ పెద్దఎత్తున ఉంటుందని పెన్సిల్వేనియాలోని మిల్లెర్స్విల్లే యూనివర్సిటీ ప్రొఫెసర్ అలెక్స్ డికారియా చెప్పారు. సాధారణంగా మహాసముద్రాల్లో కంటే కూడా భూమి త్వరగా వేడెక్కుతుంది..అంతే వేగంగా చల్లగా మారిపోతుంది. అందుకే భూ ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువగా, తక్కువగా నమోదవుతుంటాయి. అదే సైబీరియా విషయానికొస్తే.. మంచు కీలక పాత్ర పోషిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే వేడిని ఈ మంచు అంతరిక్షంలోకి వెనక్కి పంపుతుంది. అందువల్ల సైబీరియాలో అత్యంత చల్లగా ఉంటుందని చెబుతారు. సాధారణంగా ఎక్కువ ఎత్తులో ఉండే ప్రాంతంలో పీడనం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడ గాలి స్థిరంగా ఉంటుంది. దీనికితోడు తక్కువ తేమ శాతం ఉండటంతోపాటు ఆకాశం కూడా నిర్మలంగా ఉంటుంది. దీంతో భూఉపరితలం చాలా చల్లగా ఉంటుందని అంటారు అలెక్స్ డికారియా. తక్కువ తేమశాతం, నిర్మలమైన ఆకాశం వల్ల భూమి నుంచి వచ్చే రేడియేషన్ వాతావరణంలో పైభాగానికి చేరి తద్వారా అంతరిక్షంలోకి వెళ్తుంది. దీని ఫలితంగా భూఉపరితలం చల్లగా ఉంటుంది. సైబీరియా చాలా సురక్షితమైన ప్రాంతమని చెబుతారు స్థానికులు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఉగ్రవాద దాడులు ఉండవు. విపత్తులు కూడా ఉండవు. దీనికితోడు వాతావరణ కాలుష్యం బెడద అసలే ఉండదు. -
మళ్లీ చలి..చలి.. రానున్న మూడు రోజులు తగ్గనున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశముందని వాతావరణశాఖ సూచించింది. రెండ్రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మారిన వాతావరణ పరిస్థితులతో రానున్న మూడ్రోజుల పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదు కానుంది. రాష్ట్రంపై ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగు తోంది. ఇది నైరుతి బిహార్ నుంచి ఛత్తీస్గఢ్, విదర్భల మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో శని, ఆది, సోమవారాల్లో నారాయణపేట్, మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మిగతా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మొత్తంగా సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్లో 33.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 11.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కాగా, రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని వెల్లడించింది. -
చలితో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు
సాక్షి, విశాఖపట్నం: మధ్య భారతదేశం నుంచి వస్తున్న చలిగాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. విశాఖ మన్యంలో చలిపులి పంజా విసురుతుంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో గిరిజనులు గజగజ వణుకుతున్నారు. మంగళవారం చింతపల్లిలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం ఉదయం పదిగంటలకు కూడా పొగమంచు వీడలేదు. ఉపరితలంపై ఏర్పడిన అధికపీడనంతో పాటు ఈశాన్యగాలులు తక్కువ ఎత్తులో వీస్తున్న కారణంగా చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. మరోవైపు సముద్రతీరం నుంచి వీస్తున్న వెచ్చటి గాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతున్నా రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం పడిపోతున్నాయి. నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 4.3 డిగ్రీలు నమోదు అయ్యాయి. కుమ్రంబీమ్ జిల్లా గిన్నేదరిలో 4.4,డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో చలికి ప్రజలు వణికిపోతున్నారు. చదవండి: బైబై.. డీలక్స్ బస్సుకు సెలవు! ముఖ్యంగా రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణాజిల్లాల్లో 10 నుంచి 11 డిగ్రీల వరకు, విశాఖ ఏజెన్సీలో 1 నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏజెన్సీలో వీస్తున్న గాలుల ప్రభావంతో విశాఖలో చలి పెరుగుతోంది. మంగళవారం రికార్డు స్థాయిలో సాధారణం కంటే 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది. క్రమంగా కోస్తాతీర ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో ప్రస్తుతం తుపాను కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇది క్రమంగా బలహీనపడుతూ బంగాళాఖాతం వైపు చేరుకుంటుందని, క్రమంగా శ్రీలంక తీరం వైపు కదలనుందని తెలిపారు. దీని కారణంగా ఈ నెలాఖరులో దక్షిణకోస్తా జిల్లాలో ఒకటి రెండు చోట్ల వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో మినుములూరులో 7, అరకులోయలో 10.4, నందిగామలో 12.2, విశాఖలో 13.8, కళింగపట్నం, అమరావతిలో 15.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చదవండి: తెలంగాణ గజగజ -
తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్ : చాలా మండలాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అక్కడక్కడ వర్షాలు పడుతుండటంతో వాతావరణంలో మార్పు కనిపిస్తోంది.భారీ వర్షాలు పడకపోవడంతో ఉక్కపోత ఇంకా కొనసాగుతోంది.గాలివేగం పెరగడంతో వడగాల్పులతో జనం ఇబ్బంది పడుతున్నారు. శనివారం విడపనకల్లో 41.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చెన్నేకొత్తపల్లి 40.8 డిగ్రీలు, గుమ్మగట్ట 39.9 డిగ్రీలు, తనకల్లు 39.7 డిగ్రీలు, కళ్యాణదుర్గం 39.5 డిగ్రీలు, కూడేరు 39.3 డిగ్రీలు, బెళుగుప్ప 39.2 డిగ్రీలు, అనంతపురం 38.4 డిగ్రీలు ఉండగా మిగతా మండలాల్లో 36 నుంచి 38 డిగ్రీలు కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 24 నుంచి 27 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 75 నుంచి 90, మధ్యాహ్నం 25 నుంచి 40 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 10 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో వీచాయి.