చాలా మండలాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
అనంతపురం అగ్రికల్చర్ : చాలా మండలాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అక్కడక్కడ వర్షాలు పడుతుండటంతో వాతావరణంలో మార్పు కనిపిస్తోంది.భారీ వర్షాలు పడకపోవడంతో ఉక్కపోత ఇంకా కొనసాగుతోంది.గాలివేగం పెరగడంతో వడగాల్పులతో జనం ఇబ్బంది పడుతున్నారు. శనివారం విడపనకల్‌లో 41.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
చెన్నేకొత్తపల్లి 40.8 డిగ్రీలు, గుమ్మగట్ట 39.9 డిగ్రీలు, తనకల్లు 39.7 డిగ్రీలు, కళ్యాణదుర్గం 39.5 డిగ్రీలు, కూడేరు 39.3 డిగ్రీలు, బెళుగుప్ప 39.2 డిగ్రీలు, అనంతపురం 38.4 డిగ్రీలు ఉండగా మిగతా మండలాల్లో 36 నుంచి 38 డిగ్రీలు కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 24 నుంచి 27 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 75 నుంచి 90, మధ్యాహ్నం 25 నుంచి 40 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 10 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో వీచాయి.