temples close
-
నేడు చంద్రగ్రహణం.. తిరుమల సహా ఆలయాలు మూసివేత
సాక్షి, హైదరాబాద్: నేడు శారద పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంపై ఉండనుంది. ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. దీంతో, నేటి రాత్రి నుంచే అన్ని దేవాలయాల తలుపులను మూసివేస్తారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులను 8 గంటల పాటు మూసి ఉంచనున్నారు. ఇక, ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన చివరి సూర్యగ్రహణం ఏర్పడగా ఇప్పుడు అక్టోబర్ నెలలో 28వ తేదీన చివరి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. చంద్రగ్రహణం కారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందే ఆలయం తలుపులు మూసివేయనున్నారు. రేపు తెల్లవారుజామున 3:15కు తిరిగి శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు. చంద్రగ్రహణం కారణంగా 13 గంటలపాటు భక్తులకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ క్రమంలోనే నేడు సహస్ర దీపాలంకారణ సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. కాగా, సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,404. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,659. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం 3.42 కోట్లుగా ఉంది. తిరుమలలో ఇలా.. ఎనిమిది గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత గ్రహణం కారణంగా నేడు రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత తిరిగి రేపు తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. అన్న ప్రసాద కేంద్రం కూడా మూసివేత. విజయవాడలో ఇలా... పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా దుర్గగుడి మూసివేత నేటి సాయంత్రం 6:30 గంటలకు దుర్గగుడితో పాటు ఉపాలయాల కవాట బంధనం(తలుపులు మూసివేయబడును) గ్రహణ మోక్షకాలం అనంతరం రేపు తెల్లవారు జామున 3 గంటలకు తలుపులు తెరుస్తారు స్నపనాభిషేకాల అనంతరం రేపు ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభం తెలంగాణలో ఇలా.. చంద్రగ్రహణం నేపథ్యంలో ప్రధాన ఆలయాలతో పాటు, అనుబంధ ఆలయాల మూసివేత ఈరోజు సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుంచి రేపు ఉదయం 3 గంటల 45 నిమిషాల వరకూ ఆలయాల మూసివేత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన ఆలయాలైన వేములవాడ రాజన్న, ధర్మపురి నర్సన్న, కొండగట్టు అంజన్న ఆలయాలను మూసివేస్తున్నట్టు అధికారుల ప్రకటన రేపు ఉదయం 3 గంటల 45 నిమిషాలకు సంప్రోక్షణతో ప్రాత:కాల పూజ చేసి తిరిగి తెరుచుకోనున్న ఆలయాలు. పూరీ క్షేత్రంలో భిన్నంగా.. గ్రహణ కాలం ముందుగా దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో దేవతారాధన, పూజలు జరగవు. ఆలయాలు తలుపులు మూసేస్తారు. దీనికి భిన్నం పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథ సన్నిధి రాత్రంతా తెరిచే ఉంటుంది. స్వామివారికి ప్రత్యేక సేవలు జరుగుతాయి. భక్తులు ఆలయంలో పురుషోత్తమునికి మౌన ప్రార్థనలు చేస్తారు. గ్రహణం వీడిన తర్వాత ముగ్గురు మూర్తులకు మహా స్నానం, ఆలయ సంప్రోక్షణ చేస్తారు. అనంతరం మంగళహారతి, అబకాశ, మైలం, తిలకధారణ తదితర సేవలు జరుగుతాయి. ►అలంపూర్‌లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను అధికారులు మూసివేయనున్నారు. ►చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆలయాలు మూసివేత ►తిరిగి రేపు ఉదయం 5:30 గంటలకు ఆలయ శుద్ధి, మహా సంప్రోక్షణ అనంతరం ఉదయం 9 గంటలకు మహా మంగళ హారతితో భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామి, అమ్మవార్లు. ►నేడు చంద్రగ్రహణం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సత్యదేవుని ఆలయం మూసివేత. ►తిరిగి రేపు ఉదయం 7.30 గంటలకు ఆలయాన్ని తెరువనున్నారు. ►అనంతరం స్వామివారి సర్వదర్శనాలు ప్రారంభం -
28న పాక్షిక చంద్రగ్రహణం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం టెంపుల్: ఈ నెల 28న పాక్షిక చంద్రగ్రహాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6:30 గంటలకు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ తెలిపింది. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం కవాట బంధనం (తలుపులు మూసివేయడం) చేయనున్నట్లు పేర్కొంది. 29న తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజలు చేపట్టి 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. 29న సుప్రభాత సేవ, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చనను రద్దు చేశారు. శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణాలు యథావిధిగా జరగనున్నాయి. 28న శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలాలయ ద్వారాలు 28న సాయంత్రం 5 గంటల నుంచి 29న ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. 29న ఉదయం 7 గంటలకు దర్శనాలు ప్రారంభిస్తారు. 28న మధ్యాహ్నం 3.30 గంటల వరకే సర్వదర్శనం, మధ్యాహ్నం 12.30 గంటల వరకే గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహిస్తారు. సర్వదర్శనానికి ఉదయం మాత్రమే అవకాశం ఉంటుంది. 28న అన్నప్రసాద వితరణ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకే నిర్వహిస్తామని..ఆ రోజు సాయంత్రం అల్పాహార వితరణ నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. -
Solar Eclipse: 22 ఏళ్ల తర్వాత అరుదైన సూర్య గ్రహణం
సాక్షి, తిరుపతి/విజయవాడ: దాదాపు రెండు దశాబ్దాలు తర్వాత అరుదైన సూర్య గ్రహణం ఈ రోజు ఏర్పడుతోంది. ఇది కేతు గ్రస్త సూర్య గ్రహణం కావడం విశేషం. సహజంగా రాహు, కేతు ప్రభావంతో ఏర్పడే గ్రహణాల్లో రాహు ప్రభావంతో ఏర్పడే దానిని రాహు గ్రస్తమని, కేతు ప్రభావంతో ఏర్పడే దానిని కేతు గ్రస్తమని అంటారు. సూర్య గ్రహణం సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత కూడా ఉంటుంది. ఈ గ్రహణ కాలం దాదాపు గంట 15 నిముషాలు పాటు ఉంటుందని పంచాగకర్తలు చెబుతున్నారు. సూర్య గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసివేయనున్నారు. చదవండి: AP: మహిళలకు బ్యాంకుల రెట్టింపు రుణాలు ఉదయం 11 గంటలకు విజయవాడ దుర్గగుడి పాటు ఉపాలయాలు మూసివేయనున్నారు. నేడు ప్రదోషకాలంలో నిర్వహించే సేవలు కూడా రద్దు చేశారు. రేపు(బుధవారం) స్నపనాభిషేకాలు, అర్చన, హారతి, మహానివేదన అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శనాలకు అనుమతించనున్నారు. రేపు ఉదయం నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. రేపు సాయంత్రం పంచహారతులు,పల్లకీ సేవ మాత్రమే ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం ఆలయ తలుపులు మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాన్ని ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పుణ్యా వచనం, స్వామివారికి అభిషేకం తరువాత దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. సూర్య గ్రహణం కారణంగా శ్రీశైల మల్లన్న ఆలయ ద్వారాలు, స్వామి, అమ్మవారి ఉభయ దేవాలయాల ద్వారాలను అధికారులు మూసివేశారు. తిరిగి సాయంత్రం 6:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి,సంప్రోక్షణ చేయనున్నారు. రాత్రి 8 గంటల నుంచి భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. యాదాద్రి ఆలయం మూసివేత యాదాద్రి భువనగిరి జిల్లా: సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేయనున్నారు. ఉదయం 8:50 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేశారు. రేపు(బుధవారం) స్వాతి నక్షత్రం సందర్బంగా నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చనను రద్దు చేశారు. రేపు ఉదయం సంప్రోక్షణ నిర్వహించి 10:30 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. అనంతరం యాథావిధిగా నిత్య కైంకర్యాలు మొదలు కానున్నాయి కానున్నాయి -
కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలు మూసివేత
డెహ్రాడూన్: హిమాలయాల్లో ఉన్న ప్రఖ్యాత కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలను శనివారం మూసివేశారు. ఈ ఆలయాలను భారీగా మంచుపడే శీతాకాలంలో ఏటా మూసివేస్తుంటారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం కేదార్నాథ్ ఆలయ ద్వారాలను శనివారం ఉదయం 8 గంటలకు, యమునోత్రి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసినట్లు చార్‌థామ్ దేవస్థానం బోర్డ్ తెలిపింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని పేర్కొంది. శీతాకాల బసకోసం ఆయా ఆలయాల్లోని బాబా కేదార్, మాత యమున విగ్రహాలను అందంగా అలంకరించిన పల్లకిలో ఉఖిమఠ్, ఖర్సాలీ ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు తెలిపింది. గంగోత్రి ఆలయం శుక్రవారం మూతపడగా, బద్రీనాథ్ ఆలయ ద్వారాలను ఈ నెల 20వ తేదీన మూసివేస్తారు. -
భక్తులు లేకపోవడంలో ఆదాయానికి గండి
-
నేటి ఉదయం దైవదర్శనాలుండవు
సాక్షి, హైదరాబాద్: సూర్యగ్రహణం కారణంగా గురువారం ఉదయం తెలుగు రాష్రాల్లోని ఆలయాలను మూసివేయనున్నారు. ఉదయం 8.07 గంటలకు గ్రహణ స్పర్శ కాలం ప్రారంభం అవుతుండగా, మోక్ష కాలం ఉదయం 11.20 నిమిషాలకు ఉంది. మొత్తం మూడు గంటలకుపైగా గ్రహణ కాలం ఉంటుంది. ఆలయాల శుద్ధి అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత దైవ దర్శనాలకు వీలుగా ఆలయాల తలుపులు తెరుచుకోనున్నాయి. కొన్ని దేవాలయాలను మధ్యాహ్నం 3 గంటలకు తెరవనున్నారు. అన్ని దేవాలయాల్లో సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల్లోని ఆయా ఆలయాల్లో సంప్రోక్షణ, పుణ్య హవాచనం, మహా నివేదన తదితర సేవల అనంతరం భక్తులను సర్వ దర్శనాలకు అనుమతిస్తారు. -
సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాల మూత
సాక్షి, తిరుమల/ విజయవాడ/ సింహాచలం: సూర్యగ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రముఖ ఆలయాలను మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు మూసివేయనున్నారు. ఈ నెల 9న ఉదయం 5.47 నుంచి ఉదయం 9.08 గంటల మధ్య సూర్యగ్రహణం సంభవించనుంది. దీంతో తిరుమల శ్రీవారి ఆలయం, బెజవాడ కనకదుర్గమ్మ, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి తదితర ఆలయాల తలుపులు మూసివేయనున్నారు. శుద్ధి, సంప్రోక్షణ అనంతరం తిరిగి తెరిచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కాగా, తిరుమలలో బుధవారం నిర్వహించాల్సిన సహస్రకళశాభిషేకం సేవను రద్దు చేశారు. ఇతర సేవల్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. అలాగే సింహాచలం అప్పన్న ఆలయంలో బుధవారం నిత్యకల్యాణం రద్దు చేసినట్లు ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు.