textbooks syllabus
-
NCERT: బాబ్రీ కాదు.. 3 గోపురాల నిర్మాణం
న్యూఢిల్లీ : హేతుబద్దీకరణ పేరుతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) పాఠ్య పుస్తకాల్లో పలు మార్పులు, చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలోనూ అనేక మార్పులు చేసింది. ‘బాబ్రీ మసీదు’ సహా అనేక కీలక అంశాలను, చాలా సమాచారాన్ని తొలగించింది. తొలగింపులు అంశాలవారీగా.. ⇒ ‘బాబ్రీ మసీదు’ పదం తొలగింపు: పాఠ్య పుస్తకంలోంచి బాబ్రీ మసీదు అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. దాని స్థానంలో ‘మూడు గోపురాల నిర్మాణం’ను చేర్చింది. ⇒ అయోధ్య అధ్యాయం తగ్గింపు: నాలుగు పేజీలున్న అయోధ్య అధ్యాయాన్ని రెండు పేజీలకు తగ్గించింది. రథయాత్ర, కరసేవకుల పాత్ర, బాబ్రీ మసీదు కూలి్చవేత, అనంతరం జరిగిన హింస, ఆ తరువాత బీజేపీ పాలిత ప్రాంతాల్లో విధించిన రాష్ట్రప తి పాలన అంశాలను తొలగించింది. ⇒ చారిత్రక వివరాల సవరణ: బాబ్రీ మసీదుకు సంబంధించిన వివరాల్లో కూడా అనేక మార్పులు చేసింది. బాబ్రీ మసీదును 16వ శతాబ్దంలో మీర్ బాకీ నిర్మించినట్లుగా గత పుస్తకంలో ఉండగా.. 1528లో రాముడి జన్మస్థలంలో నిర్మించబడిన మూడు గోపురాల నిర్మాణంగా ఇప్పుడు పేర్కొన్నది. అంతేకాదు ఈ నిర్మాణంలో అనేక హిందూ చిహ్నాలు ఉన్నాయని, లోపలి, వెలుపలి గోడలపై శిల్పాలు ఉన్నాయని కొత్త పుస్తకం పేర్కొంది. హిందూ చిత్రాలు, విగ్రహాలను కూడా కొత్తగా ప్రస్తావించింది. ⇒ చట్టపరమైన, మతపరమైన కథనాల్లోనూ మార్పులు: ఆలయంలో పూజలు చేసుకునేందుకు బాబ్రీ మసీదు నిర్మాణాన్ని తెరచి ఉంచాలని 1986 ఫిబ్రవరిలో ఫైజాబాద్ జిల్లా కోర్టు ఇచి్చన తీర్పును పాత పుస్తకం వివరించగా, వాటన్నింటిని తొలగించి మూడు గోపురాల నిర్మాణం, తరువాత వచి్చన మతపరమైన వైరుధ్యాలను కొత్త పుస్తకం క్లుప్తంగా ప్రస్తావించింది. వివాదాస్పద భూమి ఆలయానికే చెందుతుందంటూ 2019లో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును మాత్రం కొత్త ఎడిషన్‌లో చేర్చింది. ⇒ వార్తాపత్రికల కటింగ్స్ తీసివేత: పాత పుస్తకంలో వార్తాపత్రిక కథనాలకు సంబంధించిన అనేక ఛాయాచిత్రాలు ఉన్నాయి. వీటిలో డిసెంబర్ 7, 1992న ’బాబ్రీ మసీదు కూలి్చవేత, కేంద్రం కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం కూడా ఉంది. వీటన్నింటినీ తొలగించారు. ⇒ గుజరాత్ అల్లర్ల అధ్యాయం తొలగింపు: ప్రజాస్వామ్య హక్కుల అధ్యాయం నుంచి గుజరాత్ అల్లర్ల ప్రస్తావనను పూర్తిగా తొలగించింది. అల్లర్ల గురించి బోధించాల్సిన అవసరం లేదుఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ద్వేషం, హింస బోధనాంశాలు కావని, పాఠశాల పాఠ్యపుస్తకాలు వాటిపై దృష్టి పెట్టకూడదని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) చీఫ్ దినేష్ ప్రసాద్ సక్లానీ అన్నారు. గుజరాత్ అల్లర్లు, బాబ్రీ మసీదు కూలి్చవేత గురించి బోధిస్తే పాఠశాల విద్యార్థులు హింసాత్మకంగా తయారవుతారని, అందుకే వాటిని పాఠ్యాంశాల్లోంచి తొలగించామని వెల్లడించారు. పాఠ్య పుస్తకాల్లో మార్పులు, బాబ్రీ మసీదు కూల్చివేత, తరువాత మతపరమైన హింసకు సంబంధించిన అంశాల తొలగింపులపై శనివారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. సమాజంలో విద్వేషాలను సృష్టించే విధంగా బోధనలు అవసరం లేదని, చిన్నపిల్లలకు అల్లర్ల గురించిన నేరి్పంచాల్సిన అవసరం లేదని, అది ఎందుకు జరిగిందో పెద్దయ్యాక వారే తెలుసుకుంటారని చెప్పారు. పాఠ్య పుస్తకాల్లోని అంశాలను కాషాయీకరణ చేశారనే ఆరోపణలను కొట్టి పారేశారు. రామజన్మభూమికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని పాఠ్యపుస్తకాల్లో ఎందుకు చేర్చకూడదని, పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మించడం విద్యార్థులకు ఎందుకు తెలియకూడదని ఆయన ప్రశ్నించారు. చరిత్రను యుద్ధభూమిగా మార్చడానికి కాకుండా విద్యార్థులకు వాస్తవాలు తెలిసేలా బోధిస్తామన్నారు. పాఠ్యపుస్తకాల పునరి్వమర్శ ప్రపంచవ్యాప్తంగా జరిగే అభ్యాసమని, ఏది మార్చాలన్నది సబ్జెక్ట్, బోధనా శాస్త్ర నిపుణులే నిర్ణయిస్తారని, తాను ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో 2014 నుంచి ఇప్పటివరకూ నాలుగు పర్యాయాలు మార్పులు చేశారు. -
ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో భారత్
న్యూఢిల్లీ: అన్ని పాఠ్య పుస్తకాల్లోనూ ఇండియా స్థానంలో భారత్ పదాన్ని ప్రవేశపెట్టాలని జాతీయ విద్యా పరిశోధనా, శిక్షణా మండలి(ఎన్సీఈఆర్టీ) భావిస్తోంది. పాఠశాల పాఠ్య ప్రణాళికలో మార్పుచేర్పుల కోసం ఎన్సీఈఆర్టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. పాఠ్యపుస్తకాల్లో ‘ప్రాచీన చరిత్ర’కు బదులుగా ‘క్లాసికల్ హిస్టరీ’ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసినట్టు కమిటీ చైర్పర్సన్ సి.ఇసాక్ తెలిపారు. ‘ముఖ్యంగా ఇండియా పేరును అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లోనూ భారత్‌గా మార్చాలని కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. ఎందుకంటే భారత్ అనే పేరు చాలా పురాతనమైన పేరు. విష్ణుపురాణం వంటి 7 వేల ఏళ్ల నాటి పురాతన గ్రంథాల్లోనే భారత్ పేరును ప్రస్తావించా’ అని ఆయన వివరించారు. అయితే ప్యానల్ సిఫార్సుల అమలుపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ చైర్మన్ దినేశ్ సక్లానీ స్పష్టం చేశారు. అనంతరం ఈ మేరకు సంస్థ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కొత్త ప్రతిపాదనలను డొమైన్ నిపుణులు తదితరులకు ఎప్పటికప్పుడు తెలియపరిచి వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తాం. అందుకే ఈ అంశంపై ఇప్పుడే ఏ విధమైన వ్యాఖ్యలు చేసినా అది తొందరపాటు చర్య అవుతుంది’ అని అందులో పేర్కొంది. ‘ఇండియా’ కూటమికి భయపడే: విపక్షాలు కమిటీ సిఫార్సులను విపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. ‘చివరికి పాఠ్య పుస్తకాల్లో, సిలబస్‌లో కూడా దేశ చరిత్రను బీజేపీ ఎలా వక్రీకరించాలని చూస్తోందో దీనిని బట్టి మరోసారి రుజువైంది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. తమ దృష్టిలో ఇండియా, భారత్ పేర్లు రెండూ ఒక్కటేనని స్పష్టం చేశారు. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టడం ప్రధాని మోదీని విపరీతంగా భయపెడుతోందనేందుకు ఇది ప్రబల నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ ఎద్దేవా చేసింది. ఎన్డీఏ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ సర్కార్ ఇలా పేర్ల మారి్పడి పరంపర కొనసాగిస్తోందని డీఎంకే ఆరోపించింది. ఆర్జేడీ తదితర పార్టీలు కమిటీ సిఫార్సులను తప్పుబట్టాయి. ‘‘విపక్షాలు తమ కూటమి పేరున ‘ఇండియా’ బదులు భారత్‌గా ఇప్పడు మార్చేస్తే మోదీ సర్కార్ వెంటనే దేశం పేరును ‘భారత్’కు బదులు జంబూదీ్వపం అనో మరేదైనా పేరో పెట్టే స్తారా ?’’ అని ఎంపీ మనోజ్ ఝా ఎద్దేవా చేశారు. జీ20 శిఖరాగ్రంతో మొదలు భారత్ పేరు తొలుత ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ఆహ్వాన పత్రికల్లో ప్రత్యక్షమవడం విదితమే. రాష్ట్రపతిని అప్పటిదాకా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’గా సంబోధిస్తుండగా కొత్తగా దానికి బదు లు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఆ ఆహ్వాన పత్రికల్లో మోదీ ప్రభుత్వం పేర్కొంది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ సీటు ముందు ఉంచిన నేమ్‌ప్లేట్‌పై ఇండియా బదులు భారత్ అనే రాసి ఉండటం తెల్సిందే. కమిటీ ఏం చెప్పిందంటే... ఎన్సీఈఆర్టీ ఉన్నత స్థాయి కమిటీ చైర్పర్సన్ ఇసాక్ సంఘ్ పరివార్‌కు సన్నిహితుడు. దాని తాలూకు అతివాద సంస్థ అయిన భారతీయ విచార కేంద్రం ఉపాధ్యక్షునిగా ఆయన పని చేశారు. ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) సభ్యుడు కూడా. ఎన్సీఈఆర్టీకి కమిటీ చేసిన సిఫార్సులను ఆయన సవివరంగా పేర్కొన్నారు. అవేమిటంటే... ► బ్రిటిషర్లు భారత చరిత్రను ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక అంటూ మూడు దశలుగా విభజించారు. వీలైనంత వరకూ భారత్ ఘనతలను, సాధించిన ప్రగతిని, శాస్త్రీయ విజయాలను మరుగునపడేశారు. వాటిని తక్కువ చేసి చూపించారు. అందుకే పాఠశాలల్లో మధ్య యుగ, ఆధునిక భారత చరిత్రతో పాటు క్లాసికల్ పీరియడ్ గురించి ఇకమీదట బోధించాలి. ► ప్రస్తుత పాఠ్య పుస్తకాల్లో హిందూ వైఫల్యాలను మాత్రమే ప్రముఖంగా పేర్కొన్నారు. కానీ మొగలులు తదితర సుల్తాన్లపై హిందూ రాజులు సాధించిన విజయాలను మాత్రం ప్రస్తావించలేదు. ► అందుకే మన చరిత్రలో పలు యుద్ధాల్లో హిందూ రాజులు సాధించిన విజయాలకు పాఠ్య పుస్తకాల్లో మరింతగా చోటు కలి్పంచాలి. ► అన్ని పాఠ్యపుస్తకాల్లోనూ ఇండియన్ నాలెడ్జ్ సిస్టం (ఎన్‌కేఎస్)ను కొత్తగా ప్రవేశపెట్టాలి. ► కమిటీలో ఐసీహెచ్ఆర్ చైర్పర్సన్ రఘువేంద్ర తన్వర్, జేఎన్‌యూ ప్రొఫెసర్ వందనా మిశ్రా, వసంత్ షిందే, మమతా యాదవ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. -
'భారత చరిత్రకు సెన్సార్'..పాఠ్యపుస్తకాల సవరణలపై బీజేపీ కాంగ్రెస్ మాటల యుద్ధం
కర్ణాటకా: కర్ణాటకాలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం నూతన విధానాలను అమలుపరుస్తోంది. ఈ క్రమంలో పిల్లల పాఠ్యపుస్తకాలను కూడా సంస్కరిస్తామని ఇప్పటికే తెలిపింది. అయితే..పుస్తకాల్లో ఆర్ఎస్ఎస్ స్థాపకుడు హెడ్గేవర్ అంశాన్ని తొలగిస్తారనే అంశంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఈ చర్య భారత చరిత్రను సెన్సార్ చేయడంలాంటిదని ఆరోపించారు. 'యువతపై నేరం' చేస్తున్నారని దుయ్యబట్టారు. హెడ్గేవర్ అంశాన్ని పుస్తకాల నుంచి తొలగిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరి ప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా 'హెడ్గేవర్ ఓ ఫేక్ ఫ్రీడమ్ ఫైటర్' అని ఆరోపించారు. ఈ ఆరోపణలపై బీజేపీ మండిపడింది. విద్యార్థుల భవిష్యత్ కోసమే.. ఈ ఏడాది నుంచే పాఠ్యపుస్తకాలను సవరిస్తామని విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. తగు సవరణలు చేసి కొత్త పుస్తకాలను పాఠశాలలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ అంశాన్ని పేర్కొన్నట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సవరణలు చేస్తామని అన్నారు. పూర్తిగా టెక్నికల్ బృందం చేత సవరణలు జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థుల మెదళ్లలోకి విషాన్ని ఎక్కించే ప్రయత్నాన్ని గత ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. ఇదీ చదవండి:కర్ణాటక: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అక్కడ తప్ప! ఆ హక్కు కాంగ్రెస్‌కు లేదు.. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలని బీజేపీ నాయకుడు సీఎన్ అశ్వత్ నారాయణ్ అన్నారు. ప్రభుత్వం అంటే అందరిదని చెప్పారు. దేశభక్తిపై కాంగ్రెస్‌కు అసహనం ఉందని బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ సీటీ రవి అన్నారు. సిద్ధాంత పరంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకించే హక్కు ఉండొచ్చు గానీ హెడ్గేవర్‌కు దేశం పట్ల ఉన్న నిబద్ధతను ప్రశ్నించే హక్కు లేదని అన్నారు. 'మావో, మార్క్స్ భావాజాలం ఈ దేశానిది కాదు. వారి సిద్ధాంతం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అయినప్పటికీ పుస్తకాల్లో చేర్చారు.కానీ దేశభక్తుడైన హెడ్గేవర్ అంశం మాత్రం లేదు. ఇది నిజంగా అసహనం.' అని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రసంగాన్ని అధ్యాయంగా చేర్చి పుస్తకాలను కాశాయంగా మార్చారని బీజేపీ హయాంలోనే కాంగ్రెస్ ఆరోపించింది. అప్పటి పాఠ్యపుస్తకాల సమీక్ష కమిటీ చీఫ్ రోహిత్ చక్రతీర్థను తొలగించాలని డిమాండ్ చేసింది. అప్పటి నుంచి కర్ణాటకాలో పాఠ్యపుస్తకాల వివాదం కొనసాగుతోంది. ఇదీ చదవండి:శరద్ పవార్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపులు! -
8వ తరగతికి కొత్త సిలబస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో 8వ తరగతి సిలబస్‌ను మార్పు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఇందుకు ఈ నెల 21న విద్యావేత్తలు, నిపుణులతో సదస్సు నిర్వహించనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విధానాన్ని అమలు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఆ దిశగా 8వ తరగతి సిలబస్‌ను రూపొందించనున్నారు. ఇప్పటికే 7వ తరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాల సిలబస్‌ను మార్పు చేసి.. దాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేసినందున విద్యార్థులకు బైలింగ్యువల్ (ద్విభాష) పాఠ్యపుస్తకాలను రూపొందించి పంపిణీ చేశారు. ఇప్పుడు 8వ తరగతి సిలబస్‌ను కూడా సీబీఎస్ఈ విధానానికి అనుగుణంగా మార్పులు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. ఈ నెల 21న జరిగే సదస్సులో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేసేందుకు విద్యా శాఖ సీబీఎస్ఈకి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి.. వాటిలో ముందుగా ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. ఇప్పటికే 1,092 స్కూళ్లను అధికారులు గుర్తించారు. వీటిలో మోడల్ స్కూళ్లు 164, ఏపీఆర్ఐఈ సొసైటీ స్కూళ్లు 50, బీసీ వెల్ఫేర్ స్కూళ్లు 78, కేజీబీవీలు 352, ఎంపీపీ, జడ్పీ స్కూళ్లు 126, మున్సిపల్ స్కూళ్లు 5, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు 180, ప్రభుత్వ స్కూళ్లు 4, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లు 126, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూళ్లు 7 ఉన్నాయి. -
ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ పుస్తకాలు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యను ప్రాంతీయ భాషల్లో విద్యార్థులకు అందించేందుకు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. పాఠ్యపుస్తకాల ముద్రణను వేగవంతం చేయిస్తోంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మొదటి సంవత్సరం పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో రూపొందించే పనిలో నిమగ్నమైంది. వీటితో పాటు డిప్లొమా పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదింపజేస్తోంది. ఇప్పటికే వివిధ ప్రాంతీయ భాషలకు చెందిన 226 మంది రచయితలతో 218 పాఠ్యపుస్తకాలను తర్జుమా చేయించి సిద్ధం చేసింది. ఇకపై ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే వారికి భాష అడ్డంకిగా ఉండదని ఏఐసీటీఈ ట్విట్టర్లో పేర్కొంది. నూతన విద్యావిధానంలో భాగంగా దేశంలోని 11 ప్రాంతీయ భాషల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంజనీరింగ్ విద్యను అందించేలా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. హిందీ, కన్నడ, గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా భాషల్లో ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు నిర్ణయించింది. అయితే, ఇంజనీరింగ్ సిలబస్‌కు సంబంధించిన పాఠ్యపుస్తకాలు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో లేకపోవడం, వాటిని బోధించే సిబ్బంది కూడా లేకపోవడంతో ఆయా రాష్ట్రాల్లోని కాలేజీలు ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో ఇంజనీరింగ్ విద్యకు సుముఖత చూపడం లేదు. దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 5 ప్రాంతీయ భాషల్లో 14 ఇంజనీరింగ్ కాలేజీలు బీటెక్‌లోని కొన్ని కోర్సులను ప్రాంతీయ భాషల్లో అందించేందుకు ముందుకొచ్చాయి. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను తమిళ భాషలో అందించేందుకు నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గుంటూరు జిల్లాలోని ఒక కాలేజీ తెలుగు మాధ్యమంలో కొన్ని కోర్సులను అందించేందుకు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకుంది. ఈ ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే విద్యార్ధులు ఆ భాషలో కానీ, ఆంగ్లంలో కానీ పరీక్షలు రాసేందుకు ఏఐసీటీఈ అనుమతిస్తోంది. -
బేఖాతర్..!
నల్లగొండ : ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న సిల బస్నే ప్రైవేటు పాఠశాలల్లో తప్పనిసరిగాబోధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా ప్రమాణాలు పెంచేందుకు విద్యార్థుల్లో సృజనాత్మకతను దెబ్బతీసే గైడ్లు, వర్క్‌బుక్స్‌ను ఉపయోగించకుండా నియంత్రించేం దుకు, మోత బరువును తగ్గించే ందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం బేఖాతరు చేస్తున్నాయి. ఈ మేరకు కలెక్టర్ నేతృత్వంలో ప్రైవేటు యాజమాన్యాలు, జిల్లా విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవడంలేదు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కూడా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లోని సిలబస్‌నే ప్రైవేటు పాఠశాలల్లో బోధించాలని ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోవడంలేదు. నిన్నమొన్నటి వరకు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రైవేటు పబ్లికేషన్స్, 8 నుంచి 10 తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల సిలబస్‌నే బోధిస్తున్నారు. సిలబస్ అమలుతో పాటు గతంలో జారీ చేసిన నిరంతర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని వీటిని అతిక్రమించిన పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల అమలు, పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలకు అప్పగించారు. వ్యతిరేకిస్తున్న యాజమాన్యాలు... ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రభుత్వ సిలబస్‌ను అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్ధి సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు. కానీ ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు జిల్లాలో కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నేరేడుచర్ల, దేవరకొండ, నల్లగొండ, సూర్యాపేట, నకిరేకల్ పట్టణాల్లో 47 ప్రైవేటు బుక్‌స్టాల్స్‌కు అనుమతిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 5,52,200 పుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని చోట్ల పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. సాంఘిక శాస్త్రం, తెలుగు సజ్జెక్టుల్లో మార్పులు చేర్పులు చేసినందున ఆ పుస్తకాలు రావడం కొంత ఆలస్యమైంది. కానీ ప్రస్తుతం అనుమతి పొందిన బుక్‌స్టాల్స్‌లో అన్ని పుస్తకాలు రెడీగానే ఉన్నాయి. కానీ ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు కాకుండా పాత పద్ధతిలోనే సొంతంగా తయారు చేసిన పుస్తకాలను విద్యార్థులకు అంటగడుతున్నారు. రహస్య అమ్మకాలు.. విద్యాశాఖ నుంచి అనుమతి పొందిన హోల్‌సేల్ దుకాణాల నుంచి రిటైల్ వర్తకులు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను కొనుగోలు చేసి ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా విక్రయాలు చేస్తున్నారు. ఈ దందా ఓ వైపు సాగుతుండగానే... మరో వైపు ప్రైవేటు యాజమాన్యాలు తయారు చేసిన వర్క్‌బుక్స్, గైడ్లు, స్టడీ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ పుస్తకాలను పాఠశాలల క్యాంటిన్లు, ఆరుబయట ప్రాంతాల్లో రహస్యంగా అద్దెకు దుకాణాలు తీసుకుని విక్రయాలు జరుపుతున్నారు. నల్లగొండ పట్టణంలో పేరొందిన యాజమాన్యాలు బాహాటంగానే ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నా విద్యాశాఖ ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.2500 లు వసూలు చేసి పుస్తకాలు అంటగడుతున్నారు. ఇదిలావుంటే పాఠ్యపుస్తకాల విషయంలో ఎవరి ఆదేశాల మేరకు నడుచుకోవాలో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన పుస్తకాలు .. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమయ్యే పాఠ్యపుస్తకాలు 17 లక్షలు కాగా ఇప్పటి వరకు 14 లక్షల పుస్తకాలు వచ్చాయి. ఇంకా మూడు లక్షల పుస్తకాలు రావాల్సి ఉంది. వీటిల్లో సాంఘిక శాస్త్రం, తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయి. 59 మండలాల్లో వంద శాతం పుస్తకాలు చేరిన మండలాలు 11 మాత్రమే ఉన్నాయి. మిగిలిన మండలాలకు 90 నుంచి 95 శాతం వరకు పుస్తకాలు చేరాయి. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయం మిర్యాలగూడ టౌన్ : విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్లో అక్రమంగా విక్రయిస్తున్న పుస్తకాలను బుధవారం బీసీ విద్యార్థి, ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగయ్యగౌడ్, ఎంఎస్ఎఫ్ జిల్లా కో ఆర్డినేటర్ పందిరి చందులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, టైయిలు, బెల్ట్‌లను విక్రయించవద్దని ఆదేశాలను జారీ చేసినప్పటికీ శ్రీచైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం పుస్తకాలను విక్రయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యను బోధిస్తూ పేద, మద్య తరగతి విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో డ బ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలను విక్రయిస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు తిరుమలేష్, దైద సుధాకర్, రమేష్, వెంకట్, మనోహర్, శ్రీను, వంశీ తదితరులున్నారు.