Thangar Bachan
-
చివరిగా మమతా మోహన్ దాస్‌ను ఎంపిక చేశాం: డైరెక్టర్
Mamta Mohandas Plays As Kanmani In Thangar Bachan Film: భారతీరాజా, యోగిబాబు, గౌతం మీనన్ ప్రముఖ పాత్రలతో తంగర బచ్చాన్ దర్శకత్వం ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ నెల 25 నుంచి కుంభకోణంలో షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'కరుమేగంగల్ కలైకిండ్రన్' అనే టైటిల్‌ను నిర్ణయించారు. చెన్నై, రామేశ్వరం ప్రాంతాల్లో షూటింగ్‌ను నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇంతకు ముందు ఎప్పుడూ తెరపై చూడనటువంటి వైవిధ్యభరిత అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడా రాజీ పడకుండా సహజత్వానికి దగ్గరగా ఈ చిత్రం ఉంటుందన్నారు. కణ్మణి అనే పాత్ర కోసం ఇండియాలోని పలు నటీమణులతో ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించిన చివరికి నటి మమతా మోహన్‌దాస్‌ను ఎంపిక చేసినట్టు తెలిపారు. అలాగే ఈ చిత్రంలో నటించడం గర్వంగా ఉందని మమతా మోహన్‌దాస్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందులో దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్, ఆర్వీ ఉదయ్‌కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని శుక్రవారం (జులై 29) మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు వెల్లడించారు. -
కొత్త పార్టీ పెట్టనున్న సినీ దర్శకుడు
చెన్నై : సినీ దర్శకుడు తంగర్‌బచ్చన్ కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పనున్నారు. కథా రచయిత, చాయాగ్రాహకుడు, నటుడు, దర్శకుడు ఇలా చిత్ర పరిశ్రమకు చెందిన పలు శాఖల్లో తంగర్‌బచ్చన్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అళగి, సొల్ల మరంద కథై, ఒంబదు రూపాయ్ నోటు చిత్రాలను తంగర్‌బచ్చన్ తెరకెక్కించారు. ప్రభుదేవా హీరోగా దర్శకత్వం వహించిన కలవాడియ పొళుదుగళ్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తై చాలా కాలం అయినా విడుదలకు నోచుకోలేదు. పలు సామాజిక స్పృహ ఉన్న చిత్రాలను రూపొందించిన తంగర్‌బచ్చన్ తాజాగా రాజకీయ పార్టీని ప్రారంభిచడానికి సిద్ధమయ్యారు. ప్రజల శ్రేయస్సు కోసం ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అవసరం అని భావించి తాను కొత్తగా పార్టీని నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు.