![కొత్త పార్టీ పెట్టనున్న సినీ దర్శకుడు](/styles/webp/s3/article_images/2017/09/5/41490159216_625x300.jpg.webp?itok=yDYPcGoM)
కొత్త పార్టీ పెట్టనున్న సినీ దర్శకుడు
చెన్నై :
సినీ దర్శకుడు తంగర్‌బచ్చన్ కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పనున్నారు. కథా రచయిత, చాయాగ్రాహకుడు, నటుడు, దర్శకుడు ఇలా చిత్ర పరిశ్రమకు చెందిన పలు శాఖల్లో తంగర్‌బచ్చన్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అళగి, సొల్ల మరంద కథై, ఒంబదు రూపాయ్ నోటు చిత్రాలను తంగర్‌బచ్చన్ తెరకెక్కించారు. ప్రభుదేవా హీరోగా దర్శకత్వం వహించిన కలవాడియ పొళుదుగళ్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తై చాలా కాలం అయినా విడుదలకు నోచుకోలేదు. పలు సామాజిక స్పృహ ఉన్న చిత్రాలను రూపొందించిన తంగర్‌బచ్చన్ తాజాగా రాజకీయ పార్టీని ప్రారంభిచడానికి సిద్ధమయ్యారు. ప్రజల శ్రేయస్సు కోసం ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అవసరం అని భావించి తాను కొత్తగా పార్టీని నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు.