tharmal projects
-
'చైతన్య'పథం! థర్మకోల్‌తో గ్రీన్ ఇన్నోవేషన్..
'వేడుకలు, స్కూల్ ప్రాజెక్ట్‌లు, ప్యాకింగ్ అవసరాలు.. మొదలైన వాటి కోసం థర్మోకోల్‌ను ఉపయోగిస్తుంటాం. స్టోర్‌రూమ్‌లలో వాడేసిన థర్మోకోల్లు కుప్పలుగా పడి ఉంటాయి. మన అవసరం మేరకు తప్ప వాటి గురించి అంతగా ఆలోచించం. కొత్త విషయాలు తెలుసుకుంటే ఏమొస్తుంది? కొత్తగా ఆలోచిస్తాం. కొత్తగా ఆలోచిస్తే ఏమొస్తుంది? కొత్తదారులు కనిపిస్తాయి. కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. చైతన్య దూబే కొత్తదారులలో ప్రయాణిస్తున్నాడు. సంప్రదాయ థర్మోకోల్కు భిన్నంగా బయోడిగ్రేడబుల్ థర్మోకోల్ తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.' థర్మోకోల్ నాన్–బయోడిగ్రేడబుల్.. పర్యావరణంపై వాటి ప్రభావం ఎంతగానో ఉంది. థర్మోకోల్కు సూర్యరశ్మి తగిలి హానికరమైన వాయు కాలుష్య కారకాలు ఉత్పత్తి అవుతాయి, థర్మోకోల్ కాల్చడం వల్ల విషపూరిత రసాయన సమ్మేళనాలు విడుదల అవుతాయి. దీని ప్రభావంతో కంటి, ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి విషయాలు తెలుసుకున్న చైతన్య ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించి విజయం సాధించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పుట్టి పెరిగిన చైతన్య బెంగళూరులో ఇంజనీరింగ్ చేశాడు. ఎంబీఏ చేసిన తరువాత బెంగళూరులోని ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేయాలనుకున్నాడు. అయితే చిన్న బిజినెస్ కోర్స్ ఒకటి చేయడంతో అతడి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఉద్యోగం కాదు బిజినెస్ చేయాలి అనుకున్నాడు. ఆ కోర్స్ తన గమనాన్నే మార్చింది. కెరీర్‌కు సంబంధించి ఎన్నో అవకాశాలను పరిచయం చేసింది. పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి పెరిగింది. ఔషధ పుట్టగొడుగుల పెంపకం మొదలుపెట్టాడు.. రకరకాల పుట్టగొడుగుల గురించి తెలుసుకునే క్రమంలో పుట్టగొడుగుల నుంచి లెదర్ తయారుచేసే కాన్సెప్ట్ చైతన్యను ఆకట్టుకుంది. ‘ఇలాంటిదే కొత్తగా ఏదైనా చేయవచ్చా’ అని ఆలోచించి పరిశోధనలు మొదలుపెట్టాడు. పరిశోధనలో భాగంగా ఐఐటీ–కాన్పూర్ వెళ్లి ప్రొఫెసర్లతో మాట్లాడాడు. పుట్టగొడుగులను ఉపయోగించి పర్యావరణానికి హాని కలిగించని వస్తువులను తయారుచేయాలనే ఆలోచనలో భాగంగా రూపొదించిందే సరికొత్త థర్మోకోల్. పుట్టగొడుగులతో పాటు సహజమైన పదార్థాలతో బయోడిగ్రేడబుల్ థర్మోకోల్‌ను తయారుచేశాడు. ఇది 60 నుంచి 90 రోజుల్లో కుళ్లిపోవడం మొదలవుతుంది. దీన్ని మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగించవచ్చు. ఈ థర్మోకోల్ తయారీకి అయిదు నుంచి ఏడు రోజులు పడుతుంది. ‘మీ అవసరాలకు ఉపయోగించుకున్న తరువాత క్రష్ చేయండి. ఇది మొక్కలకు సహజ ఎరువుగా పనిచేస్తుంది’ అంటున్నాడు చైతన్య. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం గురించి తెలుసుకోవడం, దాని గురించి లోతుగా ఆలోచించడం అంటే చైతన్యకు ఇష్టం. 29 సంవత్సరాల చైతన్య దూబే బయోటెక్ కంపెనీ ‘కినోకో బయోటెక్’ ప్రారంభించి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాడు. బయోడిగ్రేడబుల్ థర్మోకోల్ దగ్గరే ఆగిపోలేదు చైతన్య దూబే. పుట్టగొడుగుల ద్వారా విగ్రహాల తయారీకి ఉపయోగపడే పదార్థం గురించి పరిశోధనలు చేస్తున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపి)కి ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఇవి కూడా చదవండి: భగవద్గీత: విజయవంతమైన జీవనానికి దివ్యౌషధం -
విద్యుత్ ఉత్పత్తికి .. బయోమాస్!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గుతోపాటు 5 శాతం బయోమాస్‌ను ఇంధనంగా వినియోగించాలని కేంద్రం ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత, ధరలు విపరీ తంగా పెరిగిన నేపథ్యంలో బయోమాస్ వినియోగం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘బయోమాస్ వినియోగ పాలసీ’లో తాజాగా మార్పులను ప్రకటించింది. 2017 నవంబర్‌లో ప్రకటించిన బయోమాస్ వినియోగ పాలసీ ప్రకారం.. బాల్ మిల్, ట్యూబ్ మిల్ తరహావి మినహా మిగతా అన్ని థర్మల్ ప్లాంట్లు బొగ్గులో 5–10 శాతం బయో మాస్‌ను కలిపి వినియోగించాలి. బౌల్మిల్ తరహా థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా రెండేళ్లపాటు 5శాతం, తర్వాతి నుంచి 7 శాతం బయోమాస్‌ను వాడాల్సి ఉంటుంది. బాల్ అండ్ రేస్మిల్ తరహావి 5 శాతం బ్లెండ్ చేసిన బయోమాస్ పెల్లెట్లను.. బాల్ అంట్ ట్యూబ్ మిల్ తరహా ప్లాంట్లు 5శాతం టొర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్లను తప్పనిసరిగా వినియో గించాలి. ఇప్పటినుంచి 25 ఏళ్లు, లేదా సదరు థర్మల్ విద్యుత్ కేంద్రాల జీవితకాలం పాటు ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. బయోమాస్ కొరత ఏర్పడకుండా.. సరఫరాదారులతో ఏడేళ్ల కాలవ్యవధితో ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించింది. ఏవైనా థర్మల్ కేంద్రాలు బయోమాస్ వినియోగం నుంచి మినహాయింపు కోరితే.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. బయోమాస్ అంటే.. వృక్ష, జంతు వ్యర్థాలనే బయోమాస్‌గా పరిగణిస్తారు. జంతువుల అవశేషాలు, విసర్జితాలు, చెట్లు, మొక్కల భాగాలు, పంట వ్యర్థాలు వంటివాటిని ఒక్కచోట చేర్చి ఎండబెడతారు. వాటన్నింటిని పొడిచేసి.. యంత్రాల సాయంతో స్థూపాకార (చిన్న గొట్టం వంటి) గుళికలుగా రూపొందిస్తారు. వాటినే సాధారణ బయోమాస్ పెల్లెట్స్ అంటారు. రకరకాల వ్యర్థాలతో రూపొందిన బయోమాస్ పెల్లెట్లను వివిధ ఇంధనాలుగా వినియోగించవచ్చు. ► సాధారణ బయోమాస్‌లో తేమను పూర్తిగా తొలగించి, తీవ్ర ఉష్ణోగ్రతలో ఒత్తిడికి గురిచేసి గట్టిగా ఉండే పెల్లెట్లను తయారు చేస్తారు. బాగా మండేందుకు వీలుగా కొన్నిరకాల రసాయనాలు కలుపుతారు. వాటిని టోర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్లు అంటారు. ఈ తరహా పెల్లెట్ల నుంచి ఎక్కువ మంట, ఉష్ణోగ్రత వెలువడతాయి. వీటిని థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వినియోగిస్తారు. సాధారణ పెల్లెట్లు ► మన దేశంలో వార్షికంగా 750 మెట్రిక్ టన్నుల బయోమాస్ లభ్యత ఉందని, పంట వ్యర్థాలను కూడా కలిపితే మరో 230 మెట్రిక్ టన్నుల లభ్యత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. -
కోతల్లేని కరెంట్
-
కోతల్లేని కరెంట్
* పారిశ్రామిక వేత్తలకు సీఎం కేసీఆర్ హామీ.. పరిశ్రమలు పెట్టాలని పిలుపు * రాబోయే నాలుగేళ్లలో 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన * రూ. 91.5 వేల కోట్లతో థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం * మెదక్ జిల్లా కొడకంచిలో దక్కన్’ పరిశ్రమను ప్రారంభించిన సీఎం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో పరిశ్రమలకు 24 గంటలూ విద్యుత్ ఇస్తామని, ఇకముందు కరెంటు కోతలు ఉండవని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ప్రపంచంలోనే నంబర్ వన్ పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చామని, తెలంగాణలో భారీ ఎత్తున పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. శనివారం మెదక్ జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో దక్కన్ ఆటో లిమిటెడ్ సంస్థ తయారుచేసిన బస్సులను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘‘ఈ వేదిక ద్వారా పారిశ్రామికవేత్తలకు పిలుపు ఇస్తున్నాను. గతంలో ఇక్కడ కరెంటు సమస్య విపరీతంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత మొదట్లో కరెంటు సమస్య ఉన్నా... మేం చేపట్టిన చర్యల వల్ల ఆ సమస్యను అధిగమించాం. ఇక రాష్ట్రంలో పరిశ్రమలకు కరెంటు కోతలు ఉండవు. ఈ రోజు 4,320 మెగావాట్లు ఉన్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని రాబోయే నాలుగేళ్లలో 25 వేల మెగావాట్లకు పెంచబోతున్నాం. ఇప్పటికే రూ.91.5 వేల కోట్లు అంచనాతో పనులు ప్రారంభించాం. నూతన పారిశ్రామిక విధానంలో ప్రకటించిన విధంగా పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్న పదకొండో రోజునే 17 కంపెనీలకు అన్ని అనుమతులతో స్వయంగా అనుమతి పత్రాలు ఇచ్చాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. 1997లో తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లే వారి కోసం ఆర్టీసీ తరఫున స్లీపర్‌కోచ్ బస్సులను డిజైన్ చేశామని చెప్పారు. అప్పటి బస్సులతో పోల్చి చూస్తే ఇప్పటి బస్సులు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని, త్వరలోనే దక్కన్ ఆటో సంస్థకు చెందిన బస్సులను తెలంగాణ ఆర్టీసీ కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ బీ బీ పాటిల్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.