third degree treatment
-
చేయని నేరానికి మహిళపై థర్డ్ డిగ్రీ!
సాక్షి, హైదరబాద్: చేయని నేరాన్ని ఒప్పుకోవాలని ఓ మహిళను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. ఆమె చేతులు, కాళ్ల మీద లాఠీలతో చితకబాదారు. ఈ ఘటనలో ఆమె బాబాయిని విచారణ నిమిత్తం రావాలని పోలీ సులు పిలవడంతో భయపడి ఆత్మహత్యకు యత్నంచాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిత్తారపు లక్ష్మీ, తాతారావు భార్యభర్తలు. తాతారావు బాచుపల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లోని జయదీప్ ఎస్టేట్‌లోని ఎన్డీ–5 అపార్ట్మెంట్లో వాచ్‌మేన్‌గా, లక్ష్మీ ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే గత నెల 16న ఎన్డీ–4 అపార్ట్మెంట్లో జీ–1 ఇంటి యజ మాని కోరడంతో వారి ఇంట్లో లక్ష్మీ పనికి వెళ్లింది. 18న ఆ యజమాని తన ఇంటిలో బంగారుగొలుసు చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మీపై యజమాని అనుమానం వ్యక్తం చేయడంతో 19న పోలీసులు ఆమెను రోజూ స్టేషన్‌కు తీసుకొచ్చి చిత్రహింసలకు గురిచేశారు. కాళ్లు, చేతుల మీద చితకబాదారు. ఏదో ఒకటి తెచ్చి ఇస్తే వదిలేస్తామని పోలీసులు చెప్పడంతో దెబ్బలకు తట్టుకోలేక పోయిన లక్ష్మీ తన బాబాయ్ రాజేష్ మెడలోని గొలుసును తీసుకొచ్చి పోలీసులకు అప్పగించింది. అయితే అది తన చెయిన్ కాదని యజమాని చెప్పడంతో తిరిగి దానిని లక్ష్మీకి అప్పగించారు. భయపడి.. పురుగులమందు తాగి..లక్ష్మీ, ఆమె బాబాయ్ రాజేష్ ను పోలీసు స్టేషన్‌కు రావాలని మంగళవారం పోలీసులు పిలి చారు. కొడతారేమోనని భయపడిపోయిన రాజేష్ ఠాణా గేటు బయట పురుగులమందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన రాజేశ్‌ను ఆయన భార్య సుధా, బంధువులు వెంటనే బాచుపల్లిలోని ఎస్ఎల్జీ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి రోజుకు రూ.45 వేలు ఖర్చు అవుతుందని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిపోతామని బాధితులు బదులిచ్చారు. బయటికి వెళితే అసలు విషయం బట్టబయలవుతుందని భావించిన పోలీసులు.. వైద్య ఖర్చులు తామే భరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఐసీయూలో రాజేష్ చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉండగా.. పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళితే ఎవరూ స్వీకరించకపోవడం గమనార్హం. చేయని నేరానికి మమ్మల్ని మానసికంగా, శారీరకంగా హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీ, రాజేష్ కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.రెండు వారాల తర్వాత..బాచుపల్లికి చెందిన పఠాన్ మహబూబ్ జానీ గత నెల 19న తన ఇంట్లో 5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశారని తెలిపారు. లక్ష్మిపై అనుమానం ఉందని తెలపగా ఈ నెల 1న ఆమెను స్టేషన్‌కు తీసుకొచ్చి మహిళా పోలీసుల సమక్షంలో విచారించామని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడి ఇంట్లో పనిచేసేందుకు వెళ్లి బంగారు చెయిన్‌ను దొంగిలించి, దాన్ని తన ఆడపడుచు భర్త రాజే‹Ùకు ఇచ్చినట్లు తెలిపిందని, అయితే ఇప్పటివరకు రాజేష్‌ను ఒక్కసారి కూడా స్టేషన్‌కు పిలవలేదని పోలీసులు తెలిపారు.ఆమె చెయిన్‌ను తిరిగి ఇచ్చేశాంవిచారణ నిమిత్తం లక్ష్మీని స్టేషన్‌కు తీసుకొచ్చాం. ఎవరూ కొట్టలేదు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే పోలీసులు తమ జోలికి రారని ఓ న్యాయవాది సలహా మేరకు రాజేష్ అలా చేసినట్టు తెలిసింది. ఇంటి యజమాని తన గొలుసు కాదని చెప్పడంతో దానిని ఆమెకే తిరిగి ఇచ్చేశాం. అసలు నిందితుల పట్టుకునేందుకు కేసు దర్యాప్తు చేస్తున్నాం. – ఉపేందర్, ఇన్స్పెక్టర్, బాచుపల్లి -
TS Election 2023: కాంగ్రెస్, బీఆర్ఎస్.. మజ్లిస్ ఆత్మలే..! : మంత్రి కిషన్‌రెడ్డి
వరంగల్: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే.. తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం 13 నెలల భీకర పోరాటం.. వేలాది మంది బలిదానాలతో వచ్చిందని, ఈ వాస్తవాలను నిజాం వారసుడు ఖాసీం రజ్వీకి చెందిన మజ్లిస్ పార్టీ కోసం నాడు కాంగ్రెస్.. నేడు బీఆర్ఎస్ సర్కార్ వక్రీకరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఈరెండు పార్టీలు.. మజ్ల్లిస్ ఆత్మలేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ సమైక్యతా దినోత్సం పేరిట కేసీఆర్ సర్కారు తెలంగాణకు ఉన్న చరిత్ర కనుమరుగు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి బైక్ ర్యాలీగా పరకాల అమరధామం చేరుకున్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. పరకాల పశువుల సంతలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భుక్తి కోసం.. స్వేచ్ఛా వాయువుల కోసం తుపాకులకు గుండెలను ఎదురుపెట్టి వేలాది మంది బలిదానాలతో 75 సంవత్సరాల తెలంగాణ విమోచన చరిత్రను దాచిపెట్టిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ అన్నారు. అలాంటి పార్టీకి తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదన్నారు. కేసీఆర్ చదివిన 80 వేల పుస్తకాల్లో నాటి తెలంగాణ చరిత్ర గురించి లేదా అని ప్రశ్నించారు. చరిత్రకారులు విమోచన దినోత్సవం అంటారని.. తెలంగాణ సమైక్యత అనే వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే సోనియాగాంధీ కుటుంబం కోసమన్న ఆయన బీఆర్ఎస్కు ఓటు వేస్తే కేసీఆర్ కుటుంబం కోసమేనన్నారు. అదే బీజేపీకి ఓటు వేస్తే ప్రజల కోసం పార్టీ పని చేస్తుందన్నారు. ఆత్మగౌరవం ఉన్నోళ్లు.. బీఆర్ఎస్కు ఓటు వేయరు : ఈటల బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మగౌరవం ఉన్నవాళ్లు ఎవరూ బీఆర్ఎస్కు ఓటు వేయరని అన్నారు. కులమతాలకతీతంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని మహా భారతంలో ధర్మరాజు సిద్ధాంతంతో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎవరికి భయపడి అధికారికంగా నిర్వహించడం లేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. కేసీఆర్ సర్కార్ ఉద్దెర బేరం చేస్తుండగా.. బీజేపీ నగదు చెల్లించే పని చేస్తోందన్నారు. తనను ఓడించేందుకు ఉప ఎన్నికల్లో ఊరురా తిరిగిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఈసారి ఓడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమరధామం వద్ద స్వాతంత్య్ర సమరయోధులను, సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారి వారసులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే గుండె విజయరామారావు, మార్తినేని ధర్మారావు, మొలుగూరి భిక్షపతి, జయపాల్, కొండేటి శ్రీధర్, చింతల రామచంద్రారెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ పార్లమెంట్ ప్రబారీ మురళీధర్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోశ్‌కుమార్, రాష్ట్ర నాయకులు డాక్టర్ కాళీప్రసాద్‌రావు, దేవు సాంబయ్య, కాచం గురుప్రసాద్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, గుజ్జుల సత్యనారాయణరావు, కాచం గురుప్రసాద్, మార్త భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి నాయకులపై థర్డ్ డిగ్రీ అమానుషం.. పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ప్రశ్నించి ఆందోళన చేసిన విద్యార్థులపై యూనివర్సిటీ అధికారులు కేసులు పెట్టి పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అమానుషం అని కిషన్‌రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో వీసీ, రిజిస్ట్రార్లను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల జేఏసీ చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని శుక్రవారం రాత్రి కిషన్‌రెడ్డి.. నాయకులతో కలిసి సందర్శించారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. టాస్క్‌ఫోర్స్ పోలీ సులతో కొట్టించిన ఘటనపై డీజీపీ దృష్టికి తీసుకెళ్తానని కిషన్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎంఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ తిరుపతి మాదిగ, బాధ్యులు కలిసి మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. -
మేం చెప్పినట్లే వాంగ్మూలం ఇవ్వాలి.. లేకపోతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తా
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి అసలు దోషులను గుర్తించడం మీద కంటే మీడియాలో తప్పుడు ప్రచారానికే సీబీఐ ప్రాధాన్యమిస్తోంది. తాము చెప్పినట్టుగా స్టేట్మెంట్ ఇవ్వాలంటూ పోలీసు అధికారినే బెదిరించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ‘నిన్ను ఉరి తీయాలి.. నీపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తా’ అంటూ గతంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్యను సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ బెదిరించడం చర్చనీయాంశమైంది. తాను చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు సీఐ నిరాకరించడంతోనే రామ్‌సింగ్ ఆ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. సీఐ శంకరయ్య చెప్పకున్నా సరే.. ఆయన చెప్పినట్టుగా తమకు నచ్చిన విషయాలను స్టేట్మెంట్గా రాసేసుకున్నారు. అదే విషయాన్ని న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారు. ఇదంతా గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో జరిగింది. రామ్‌సింగ్ వేధింపులతో విసిగిపోయిన సీఐ శంకరయ్య ఆయనపై కడప జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే తాము సీఐని బెదిరించిన విషయాన్ని, ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని దాచివేసి.. సీఐ పేరిట తాము రాసుకున్న స్టేట్మెంట్ను సీబీఐ మంగళవారం మీడియాకు లీకు ఇచ్చి హడావుడి చేసింది. ఎప్పుడో జరిగిన విషయాన్ని.. ఇప్పుడే జరిగినట్టుగా టీడీపీ అనుకూల మీడియా రాద్ధాంతం చేసింది. తప్పుడు స్టేట్‌మెంట్‌కోసం సీఐపై ఒత్తిడి.. ఫక్తు రాజకీయ నేతగా వ్యవహరిస్తున్న రామ్‌సింగ్ తీరు.. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరుగాంచిన సీబీఐకి మచ్చతీసుకువస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ సింగ్‌పై 2021, అక్టోబర్ 7న కడప ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నఅంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ ఫిర్యాదులో ఏముందంటే.. సీబీఐ అధికారులు సీఐ శంకరయ్య నుంచి 2020, జూన్ 27, 28 తేదీల్లోనే పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా 2021, ఆగస్టు 10న సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ సీఐ శంకరయ్యను పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌కు పిలిపించారు. అక్కడ శంకరయ్యను చూస్తూనే ‘నిన్ను ఉరి తీయాలి’ అని తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారు. తానేం చేశానని శంకరయ్య అనగా.. తాము చెప్పినట్టుగా కోర్టులో వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారు. ఆ వాంగ్మూలం ఎలాగంటే.. వివేకా హత్య జరిగిన రోజున సీఐ శంకరయ్య వెళ్లేసరికి ఆయన మృతదేహం బాత్రూమ్లో ఉందని, ఆయన సమక్షంలోనే రక్తపు మరకలు తుడిచివేశారని, మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి తీసుకువచ్చారని చెప్పమని రామ్‌సింగ్ సీఐ శంకరయ్యకు చెప్పారు. అందుకు సీఐ శంకరయ్య సమ్మతించక జరిగింది వివరించారు. తాను వెళ్లేసరికే వివేకానందరెడ్డి మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి తీసుకువచ్చేశారని, అక్కడ రక్తపు మరకలు తుడిచివేశారని శంకరయ్య చెప్పారు. కానీ రామ్‌సింగ్ అవేవీ వినిపించుకోకుండా తాము చెప్పినట్టుగా సేŠట్‌ట్‌మెంట్ ఇవ్వాలని గట్టిగా అరుస్తూ బెదిరించారు. అంతేకాదు.. అక్కడ ఉన్న కానిస్టేబుల్‌ను ఉద్దేశించి ‘లాఠీ తీసుకురా.. వీడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తా’ అన్నారు. సీఐ శంకరయ్య చెప్పిన దానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ రాసి ఆ విధంగా చెప్పాలని ఒత్తిడి చేశారు. శంకర్‌రెడ్డి బెదిరించారని చెప్పు... ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తనను పక్కకు తీసుకువెళ్లి బెదిరించినట్టుగా కూడా చెప్పాలని సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ తనపై ఒత్తిడి చేశారని సీఐ శంకరయ్య ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘నేను పోలీస్ అధికారిని. ఆ సమయంలో నా వద్ద 9ఎంఎం పిస్టల్ కూడా ఉంది.. నన్ను ఎవరూ బెదిరించ లేదు. బెదిరించలేరు కూడా’ అని సీఐ స్పష్టం చేశారు. దాంతో సీఐ స్టేట్మెంట్ను అంతకుముందే 2020, జూన్ 27న సీబీఐ తీసుకుందని చెబుతూ ఇక అవసరం లేదని సీఐ శంకరయ్యను రామ్‌సింగ్ పంపించివేశారు. మీడియాకు లీకులతో రాజకీయ డ్రామా వాస్తవాలు కాకుండా తాము రాసుకున్న స్క్రిప్ట్‌ను చెప్పించాలని సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ సీఐ శంకరయ్యను తీవ్రంగా బెదిరించారు. కానీ అందుకు ఆయన సమ్మతించకపోయేసరికి మిన్నకుండిపోయారు. ఈ విధంగా పలువురిని రామ్‌సింగ్ బెదిరిస్తున్న విషయం వివాదాస్పదమైంది. ఆయన బెదిరింపులకు భయపడిన ఉదయ్‌కుమార్‌రెడ్డి అనే ఉద్యోగి పోలీసులకు, న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. దాంతో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు సీబీఐ కొత్త ఎత్తుగడ వేసింది. గతంలో సీఐ శంకరయ్య పేరుతో తాము రాసుకున్న వాంగ్మూలం అంటూ మీడియాకు మంగళవారం లీకులు ఇచ్చింది. అందులో నిజానిజాలు నిర్ధారించుకోకుండానే టీడీపీ అనుకూల మీడియా రాద్ధాంతం చేసింది. అయితే సీబీఐ ముందుగా రాసుకున్న అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు సీఐ శంకరయ్య సమ్మతించ లేదు. సీబీఐ అధికారి రామ్‌సింగ్ తనను ఉరి తీస్తామన్నా, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామన్నా, తిరిగి కేసు పెడతామన్నా సరే ఆయన బెదరిపోలేదు. పైగా తనను రామ్‌సింగ్ వేధిస్తున్న తీరుపై కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జరిగింది ఇదైతే.. సీఐ శంకరయ్య సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారంటూ టీడీపీ అనుకూల మీడియా ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారానికి తెగబడటంపట్ల విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సక్రమంగా కేసు దర్యాప్తు చేయాల్సిన సీబీఐ అధికారి రామ్‌సింగ్, రాజకీయ పార్టీల మాదిరిగా మీడియాకు లీకుల పేరుతో తప్పుడు సమాచారమిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇవ్వాలి.. రామ్‌సింగ్ 2021, సెప్టెంబర్ 28న తనకు వాట్సాప్ కాల్చేసి కడపలోని గెస్ట్‌హౌస్‌కు పిలిపించి కోర్టులో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇవ్వాలని చెప్పారని సీఐ శంకరయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు తెలిసిన విషయాలు చెప్పేందుకు సమ్మతమేనని సీఐ ఆయనతో చెప్పారు. కానీ రామ్‌సింగ్ అప్పటికే తయారు చేసిన వాంగ్మూలాన్ని ఇచ్చి చదువుకోవాలని సీఐకు చెప్పారు. అందులో ఉన్నట్టుగా కోర్టులో వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. లేకపోతే ఐపీసీ 201 కింద కేసు పెడతానని కూడా సీఐ శంకరయ్యను హెచ్చరించారు. దాంతో ఆయన ముందుగానే రాసినట్టుగా వాంగ్మూలం ఇచ్చేందుకు సీఐ శంకరయ్య సమ్మతించలేదు. అందుకే తాను సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధంగా లేనని తేల్చిచెప్పేశారు. -
సారీ.. అసలు దొంగలు దొరికారు!
నెల్లూరు(క్రైమ్): నగల దొం గతనం కేసులో అనుమానంతో కారు డ్రైవర్‌ను ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు నిర్భందించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. చివరకు అసలు నిందితులు దొరకడంతో సారీ చెప్పి వదిలి పెట్టారు. దీంతో బాధితుడు నడవలేని స్థితిలో జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి వివరాల మేరకు.. నగరంలోని కాపువీధికి చెందిన రాహుల్‌జైన్ బంగారు వ్యాపారి. ఆయన లైన్బిజినెస్ చేస్తున్నాడు. ప్రకాశం జిల్లాలోని పలు జ్యుయలరీ దుకాణాలకు ఆర్డర్లపై బంగారు నగలు తయారీ చేసి సరఫరా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 26న రాహుల్‌జైన్ నెల్లూరు నుంచి కారులో కందుకూరు, సింగరాయకొండ, టంగుటూరుల్లోని బంగారు వ్యాపారస్తులకు ఆభరణాలు ఇచ్చి వారు గతంలో బాకీ ఉన్న నగదును వసూలు చేసుకుని ఒంగోలుకు వెళ్లాడు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఓ హోటల్ వద్ద కారును పార్క్ చేశారు. రాహుల్‌జైన్ అతని డ్రైవర్ వెంకటస్వామి భోజనం చేసేందుకు హోటల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో గుర్తుతెలి యని దుండగులు కారును మారు తాళాలతో తెరచి అందులో ఉన్న రెండు కిలోల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదును అపహరించుకుని వెళ్లారు. ఘటనపై ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్‌కు చిత్రహింసలు? కోవూరు రాళ్లదిబ్బకు చెందిన పి.వెంకటస్వామి కారుడ్రైవర్. ఆదివారం అతని స్నేహితుడు అశోక్ ఫోన్‌చేసి రాహుల్జైన్ను తీసుకుని ఒంగోలు వెళ్లి రావాలని చెప్పాడు. దీంతో వెంకటస్వామి బంగారు వ్యాపారితో కలిసి ఒంగోలు వెళ్లాడు. ఈ క్రమంలో నగలు, నగదు చోరీకి గురవడంతో పోలీసులు తొలుత వెంకటస్వామిని అదుపులోకి తీసుకున్నారు. తనకు ఎలాంటి సంబంధం లేదని వెంకటస్వామి చెబుతున్నప్పటికీ థర్డ్‌డిగ్రీ ప్రయోగించారు. మూడు రోజుల పాటు తమ కస్టడీలోనే ఉంచుకున్నారు. అసలు దొంగ పాతడ్రైవరేనని తేలడంతో పోలీసులు సదరు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నడవలేని స్థితిలో ఉన్న డ్రైవర్ వెంకటస్వామికి సారీ చెప్పి మంగళవారం రాత్రి వదిలివేశారు. దీంతో బాధితుడు నెల్లూరు చేరుకుని బుధవారం చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చేరారు. ఈ విషయాలన్నింటిని బాధితుడు మీడియాకు వెల్లడించి కన్నీటి పర్యంతమయ్యారు. తాను నిర్దోషినని చెప్పినప్పటికీ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుందని వెంకటస్వామి భార్య వాపోయారు. 20 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం జొన్నవాడ (బుచ్చిరెడ్డిపాళెం) : ఒంగోలులో పట్టపగలు ఓ హోటల్ వద్ద జరిగిన బంగారు దొంగతనం కేసులో జొన్నవాడలో మరో 20 సవర్ల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు బంగారు నగల వ్యాపారి రాహుల్‌జైన్ కారులో చోరీ జరిగిన బంగారు నగల రికవరీలో భాగంగా ఒంగోలు వన్ టౌన్ ఎండీ షబ్బీర్ జొన్నవాడ సర్పంచ్ పిల్లెల్ల మురళీమోహన్ కృష్ణకు బుధవారం ఫోన్ చేశారు. వీడియో కాల్ ఆధారంగా నిందితులు ముసునూరు ఓంకార్, కందికట్టు రాజశేఖర్ బంగారు నగలు దాచి ఉంచిన ఇంటికి పంపారు. అక్కడ మట్టిలో దాచిన ఏడు ఆభరణాలు (దాదాపు 20 సవర్లు) వెలికి తీశారు. వాటిని నగల వ్యాపారి రాహుల్‌జైన్ స్వాధీనం చేసుకుని ఒంగోలుకు తీసుకెళ్లారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. -
ఎస్సై కోటేశ్వరరావుకు బెయిల్
హైదరాబాద్: పేట్‌బషీరాబాద్ ఎస్సై కోటేశ్వరరావుకు బెయిల్ మంజూరు అయింది. సివిల్ కేసులో తలదూర్చి శివప్రసాద్ అనే వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి అతని ఆర్తనాదాలను రికార్డు చేసిన కేసులో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అదృశ్యంలో ఉన్న ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.