This
-
ఫైనల్ బెర్త్ ఎవరిది..
-
కాంటినెంటల్ కాఫీ కొత్త రుచులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ దిస్ పేరుతో నాలుగు రకాల త్రీ ఇన్ వన్ ప్రీమిక్స్ కాఫీ రుచులను ప్రవేశపెట్టింది. 22 గ్రాముల ప్యాక్ ధర రూ.20గా కంపెనీ నిర్ణయించింది. అయిదు ప్యాక్‌లు కొంటే ఒకటి ఉచితం. త్వరగా కాఫీ తయారు చేసుకునేలా ప్రీమిక్స్ రకాలకు రూపకల్పన చేశామని కంపెనీ కంజ్యూమర్ మార్కెటింగ్ హెడ్ ప్రీతమ్ పట్నాయక్ తెలిపారు. సీసీఎల్ ప్రొడక్ట్స్ కాంటినెంటల్ బ్రాండ్‌లో భారత్‌తోపాటు 90కిపైగా దేశాలకు కాఫీని సరఫరా చేస్తోంది. -
గిదేందో..!
సింగరేణి చిక్కులు.. రెవెన్యూ పరుగులు పీఅండ్‌పీ భవనాన్ని ఇవ్వలేమన్న అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి వెళ్లిన ప్రతిపాదనలు కొత్తగూడెం : కార్యాలయాల కోసం నెల రోజుల కసరత్తు.. ప్రభుత్వానికి వెళ్లిన ప్రతిపాదనలు.. అప్పుడే మొదలైన చిక్కులు.. ప్రభుత్వ కార్యాలయాలకు ఆ భవనాలు ఇవ్వలేమన్న సింగరేణి అధికారులు.. మళ్లీ భవనాల కోసం రెవెన్యూ అధికారుల పరుగులు.. జిల్లా ఏర్పాటుకు నెల రోజులు మాత్రమే సమయం.. ప్రతిపాదనలు మార్చి మళ్లీ పంపించడం రెవెన్యూ అధికారులకు తలనొప్పిలా మారింది. తొలుత భవనాలు ఇస్తామని.. ఇప్పుడు ఇవ్వమని చెప్పడం ఇబ్బంది కలిగిస్తోంది. కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సింగరేణి తిరకాసు పెడుతోంది. కలెక్టరేట్‌గా సింగరేణి పీఅండ్‌పీ భవనం అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉంటుందని భావించిన రెవెన్యూ అధికారులు సింగరేణి అధికారులతో చర్చలు జరిపారు. వారి అంగీకారం మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రెండు రోజుల క్రితం సింగరేణి అధికారులు పీఅండ్‌పీ భవనాన్ని ఇవ్వలేమని.. దానికి బదులు పోస్టాఫీస్ సెంటర్లోని సింగరేణి గర్ల్స్ హైస్కూల్ లేదా రామవరంలోని సింగరేణి ఉమెన్స్ హాస్టల్(పాత బాయ్స్ హైస్కూల్)ను అప్పగిస్తామని పేర్కొన్నారు. దీంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు భవనాల కోసం మళ్లీ పరుగులు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సింగరేణి గర్ల్స్ హైస్కూల్ ప్రధాన సెంటర్లో ఉండటంతోపాటు కార్యాలయానికి అనువుగా ఉన్నా.. భవనంలో చాలా వరకు మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం పార్కింగ్ స్థలం అంత అనువుగా లేదు. ఈ నేపథ్యంలో అన్నీ అనుకూలంగా ఉన్న పీఅండ్‌పీ భవనాన్నే కేటాయించాలని సింగరేణి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు ఆర్డీఓ రవీంద్రనాథ్, తహసీల్దార్ అశోక చక్రవర్తి శుక్రవారం సాయంత్రం వరకు సింగరేణి అధికారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే సింగరేణి అధికారులు మాత్రం గర్ల్స్ హైస్కూల్‌ను కలెక్టరేట్ కోసం తీసుకోవాల్సిందిగా చెబుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం సింగరేణి గర్ల్స్ హైస్కూల్లో ప్రస్తుతం 900 మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. అయితే పాఠశాల భవనాన్ని కలెక్టరేట్ కోసం అప్పగిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడ చేస్తారని అటు విద్యార్థులు, ఇటు స్కూల్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ముందు అనుకున్న ప్రకారమే పీఅండ్‌పీ భవనాన్ని కలెక్టరేట్ కోసం అప్పగించడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో పాఠశాలను తరలించడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని, దీనిపై యాజమాన్యం మరోమారు ఆలోచించాల్సి ఉంటుందంటున్నారు. ఏదేమైనా సింగరేణి యాజమాన్యం తీసుకున్న ప్రస్తుత నిర్ణయం సింగరేణి స్కూల్ విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తుండగా.. రెవెన్యూ అధికారులను మాత్రం పరుగులు పెట్టిస్తోంది. -
మరోసారి భారత్ కు సత్య నాదెళ్ళ!
న్యూఢిల్లీః అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ళ మే 30న మరోసారి భారత్ లో పర్యటించనున్నారు. ఈసారి పర్యటనలో భాగంగా ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన యువ వ్యాపారవేత్తలు, విద్యార్థులు, విద్యావేత్తలను కలుసుకొంటారు. అలాగే సీఐఐ నిర్వహించనున్నమరోకార్యక్రమంలో పాల్గొని భారత్ లోని 150 మంది అత్యుత్తమ కార్పొరేట్ దిగ్గజాలతో కూడ సమావేశమౌతారు. భారత్ ను సందర్శించనున్న నాదెళ్ళ ఈసారి పర్యటనలో భాగంగా సాంకేతిక సంస్కృతి అభివృద్ధి, భారత్ లో పరివర్తన, ప్రపంచంలో వాస్త సమస్యల పరిష్కారం వంటి అనేక సాంకేతిక విషయాలపై నిపుణులతో చర్చిస్తారు. ఏడు నెలల వ్యవధిలో నాదెళ్ళ భారత్ కు రావడం ఇది మూడోసారి కాగా గత డిసెంబర్ లో ఇండియా సందర్శించిన సందర్భంలో ఆయన...ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని కలసి, అనంతరం హైదరాబాద్ లోని స్టార్ట్ అప్ ఇంక్యుబేటర్ టీ-హబ్ ను, మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ను సందర్శించారు. నవంబర్ పర్యటనలో భాగంగా ముంబైలోని మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ అన్లీషెడ్ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన నాదెళ్ళ.. అనంతరం మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ మనేజింగ్ డైరెక్టర్ శిఖా శర్మ వంటి వ్యాపారవేత్తలను, పరిశ్రమల అధినేతలను కలుసుకున్నారు. భారత్ లో ఇటీవల పెరుగుతున్న ప్రపంచ నేతల సందర్శనలు, ఒప్పందాలను చూస్తే దేశం ఒక్క ఔట్ సోర్సింగ్ కేంద్రగానే కాక, సాంకేతికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్న విషయం అర్థమౌతుంది.