thungathurthy
-
తుంగతుర్తి నియోజక వర్గం బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ టుడేస్ లీడర్
-
గంజాయికి బానిసై వేధిస్తున్నాడని..
తిరుమలగిరి(తుంగతుర్తి): గంజాయికి బానిసై నిత్యం వేధిస్తున్న కుమారుడిని కన్న తల్లిదండ్రులే కడతేర్చారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుమలగిరి ఆదర్శనగర్‌కు చెందిన ఆమనగంటి యాదగిరి, వెంకటమ్మల కుమారుడు కిరణ్ (23) డీజే సౌండ్ బాక్సులు అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య సౌమ్య, కుమా రుడున్నారు. గంజాయికి బానిసైన కిరణ్ రోజూ ఇంట్లో గొడ వపడుతుండటంతో సౌమ్య కుమారుడితో ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మరింతగా గంజాయి సేవించి వస్తూ రోజూ తల్లిదండ్రులను కొడుతున్నాడు. తనకు డబ్బులివ్వా లని 2 నెలల క్రితం ఇంట్లోని వస్తువులు, దుస్తులను తగులబెట్టాడు. కుమారుడి వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లిపోయారు. 15 రోజుల క్రితం దగ్గరి బంధువు చనిపోతే పరామర్శకు తిరుమలగిరికి వచ్చారు. దీంతో కిరణ్ తల్లిదండ్రులను కొట్టి అప్పటి నుంచి ఇంట్లోనే ఉంచుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం గంజాయి సేవించి ఇంటికి వచ్చి మత్తులో మళ్లీ తల్లిదండ్రులను కొట్టాడు. అలా కొడుతూనే కిందపడిపోయాడు. అప్పటికే కొడుకు తీరుతో విసిగిపోయి ఉన్న తల్లిదండ్రులు ఇదే అదనుగా కిరణ్ మెడకు తాడును కట్టి బిగించి చంపేశారు. అయితే కుమారుడి మరణం తట్టుకోలేక వారు ఏడుస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు. అనంతరం కిరణ్ తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఆత్మరక్షణ కోసమే చంపేశాం రెండేళ్లుగా రోజూ గంజాయి సేవించి వచ్చి వేధిస్తున్నాడు. రోజూ కొడుతుండటంతో భయం భయంగా బతుకుతున్నాం. కుమారుడు ఏం చేస్తున్నాడని అడిగితే ఏమీ చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. సోమవారం మధ్యాహ్నం గంజాయి సేవించి వచ్చి మమ్మల్ని కొట్టాడు. విధిలేని పరిస్థితిలో ఆత్మరక్షణ కోసం చంపేశాం. – కిరణ్ తల్లిదండ్రులు యాదగిరి, వెంకటమ్మ -
చదువు పేరుతో హైదరాబాద్‌లో సహజీవనం.. మాట మార్చిన మహేష్
తుంగతుర్తి (సూర్యాపేట): ప్రేమ పేరుతో ప్రియుడు వంచించాడని యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన వెలిశాల ఉమారాణి, అదే గ్రామానికి చెందిన ఉప్పుల మహేష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. చదువు పేరుతో ఇద్దరు హైదరాబాద్‌లో ఉండి సహజీవనం చేశారు. ఇటీవల ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని స్వగ్రామానికి వచ్చారు. కులాలు వేరు కావడంతో మహేష్ కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ విషయాన్ని మహేష్ ప్రియురాలైన ఉమారాణికి చెప్పడంతో పంచాయితీ పెద్ద మనుషుల వద్దకు చేరింది. దీంతో ఉమారాణిని పెళ్లిచేసుకుంటానని మహేష్ ఒప్పకున్నాడు. అనంతరం తాను పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఉమారాణి తుంగతుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు మహేష్‌ను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించగా పెళ్లి చేసుకుంటానిని ఒప్పుకొని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. చదవండి👉ఉత్తరాఖండ్‌లో దారుణం.. కదులుతున్న కారులో తల్లీ, కూతురిపై సామూహిక అత్యాచారం మరొకరితో పెళ్లికి యత్నిస్తున్నారని.. మహేష్ తల్లిదండ్రులు అతడికి వేరే అమ్మాయితో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం తెలియడంతో ఉమారాణి శనివారం సాయంత్రం తిరిగి పెద్ద మనుషులను ఆశ్రయించింది. దీంతో కొంత మంది పెద్ద మనుషులు ఉమారాణిని నువ్వు ఒంటరిగా పోరాటం చేయలేవు.. మహేష్ తల్లీదండ్రుల నుంచి రూ.10లక్షలు ఇప్పిస్తాము ఊరుకోమని సలహా ఇచ్చారు. కానీ ఉమారాణి వినడకుండా మరికొంత మంది పెద్ద మనుషులతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు మహేష్‌ను స్టేషన్‌కు పిలిపించి ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో మహేష్, ఉమారాణిలు పెళ్లికి ఒప్పకున్నారు. అనంతరం పెద్ద మనుషుల సమక్షంలో లగ్నపత్రికను రాసుకున్నారు. తిరిగి ఇంటికి వెళ్లాకా మహేష్ మళ్లీ మాట మార్చి ఉమారాణికి ఫోన్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పాడు. దీంతో ఉమారాణి మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఊరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఉమారాణి తల్లి కేకలు వేయడంతో చుట్టూ పక్కలవారు వచ్చి ఆమెను కాపాడారు. అప్పటికే ఉమారాణి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమి త్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉమారాణి తండ్రి వెలిశాల సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు మహేష్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డానియేల్‌కుమార్ తెలిపారు. చదవండి👉ఇష్టం లేని పెళ్లి.. పిల్లలు పుట్టడానికి మందు అని చెప్పి, ప్రియుడితో కలిసి -
మానవత్వం చాటుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
అర్వపల్లి (నల్గొండ): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని అటుగా వెళ్తున్న తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ గమనించి అప్పటికప్పుడు కారు, ఆటో ఏర్పాటు చేసి ఆస్పత్రికి పంపించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. సూర్యాపేట–జనగామ 365బీ జాతీయ రహదారిపై జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం వద్ద బుధవారం సూర్యాపేట నుంచి అర్వపల్లి వైపు వస్తున్న ఆటో, అర్వపల్లి నుంచి కుంచమర్తికి వెళ్తున్న బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై, ఆటోలో ప్రయాణిస్తున్న మేడి వినయ్, ఆకారపు మహేష్, మనుబోతుల నాగరాజు, కల్లెం సంతోష్, పత్తెపురం ముత్తమ్మ గాయపడ్డారు. కాగా మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అదే సమయంలో ఆ రోడ్డు గుండా వెళ్తూ క్షతగాత్రులకు చూసి వెంటనే ఆగారు. తన వాహన శ్రేణిలోని కారుతో పాటు మరో ఆటోలో క్షతగాత్రులను సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అర్వపల్లి ఎస్సై మహేష్ తెలిపారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ -
Mallu Swarajyam: అరుణ కిరణం అస్తమించింది
సాక్షి, హైదరాబాద్, నల్లగొండ, సూర్యాపేట, తుంగతుర్తి: ఎర్ర మందారం నేల రాలింది. అస్థిత్వం కోసం.. వెట్టి, బానిసత్వం విముక్తి కోసం బరిసెలు ఎత్తి, బాకుల్ అందుకొని, బందూకుల్ పట్టిన ధీర నింగికెగిశారు. జీవితాంతం సుత్తికొడవలి, చుక్క గుర్తుతోనే సాగిన పోరు చుక్క.. తారల్లో కలిశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యోధు రాలు మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధ పడుతున్న ఆమెకు ఈనెల 1వ తేదీన ఊపిరితిత్తుల్లోనూ ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. 2వ తేదీ మధ్యాహ్నానికి నిమోనియాతో పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. ఆరోగ్యం కాస్త మెరుగు కావడంతో ప్రత్యేక గదికి తరలించి వైద్య సేవలందించారు. అంతా బాగుందనుకున్నా శుక్రవారం మళ్లీ ఆరోగ్యం దెబ్బతింది. దీంతో మళ్లీ ఐసీయూకు తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అంది స్తుండగానే శరీరంలోని అన్ని అవయవాలూ ఫెయిల్ కావడంతో పరిస్థితి విషమించి శనివారం రాత్రి కన్నుమూశారు. మెడికల్ కళాశాలకు పార్థివదేహం.. ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 6 నుం చి 10 గంటల వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో భౌతికకాయం ఉంచుతారు. తర్వాత పార్థివదేహాన్ని నల్లగొండకు తరలిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 3.30 గంటలవరకు నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజలు పార్టీ శ్రేణుల సందర్శణార్థం ఉంచుతారు. తర్వాత ర్యాలీగా ప్రభుత్వ జన రల్ ఆస్పత్రి వరకు తీసుకెళ్తారు. అక్కడ మెడికల్ కళాశాలకు మల్లు స్వరాజ్యం పార్థివదేహాన్ని అప్పగించనున్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా.. స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భీంరెడ్డి రాం రెడ్డి–చొక్కమ్మ దంపతులకు 1931లో జన్మించారు. రాంరెడ్డికి ఐదుగురు సంతానం. నర్సింహారెడ్డి, శశిరేఖ, సరస్వతి, స్వరాజ్యం, కుశలవరెడ్డి. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా అణగారిన వర్గాల కోసం పాటుబడిన ధీశాలి. దున్నే వాడికే భూమి కావాలని, దొరల పాలన పోవాలని 11 ఏళ్లప్పుడే పోరుబాట పట్టారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన ధాన్యాన్ని పేదలకు పంచారు. ఉద్యమ సహచరుడితో వివాహం.. సాయుధ పోరాటం తర్వాత ఉద్యమ సహచరుడు మల్లు వెంకటనర్సింహారెడ్డితో 1954 మే నెలలో స్వరాజ్యం వివాహం జరిగింది. హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే కార్వర్ట్స్‌లోని దేవులపల్లి వెంకటేశ్వరరావు నివాసంలో నాయకులు బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావుల సమక్షంలో ఆర్భాటాలు లేకుండా పెళ్లిచేసుకున్నారు. వెంకటనర్సింహారెడ్డి స్వస్థలం ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని మావిళ్లమడువ. వీరు సూర్యాపేట మండలం రాయినిగూడెంలో స్థిరపడ్డారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఎం కార్యదర్శిగా పనిచేసిన నర్సింహారెడ్డి 2004 డిసెంబర్ 4న మరణించారు. వీరికి ముగ్గురు సంతానం. కుమార్తె కరుణ, కుమారులు గౌతంరెడ్డి, నాగార్జునరెడ్డి. పెద్దకుమారుడు గౌతం రెడ్డి ప్రభుత్వ హోమియో వైద్యుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. మిర్యాలగూడ డివిజన్లో సీపీఎం నాయకుడిగా కొనసాగుతున్నారు. కుమార్తె కరుణ బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి మిర్యాలగూడ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకురాలిగా ఉన్నారు. చిన్న కుమారుడు నాగార్జునరెడ్డి న్యాయవాది. ప్రస్తుతం ఆయన సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. చిన్న కోడలు లక్ష్మి మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలిగా ఉన్నారు. పోరాటమే ఊపిరిగా.. నైజాం సర్కార్‌కు వ్యతిరేకంగా నాడు తన అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి, బావ రాజిరెడ్డిలతో కలిసి స్వరాజ్యం సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. తన మాటలు, పాటలు, ప్రసంగాలతో మహిళలను ఆకర్షించి వారూ ఉద్యమంలో పాల్గొనేలా చేశారు. దొరల దురహంకారాన్ని ప్రశ్నిస్తూ పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. 1945–48 సంవత్సరాల మధ్య తెలంగాణ సాయుధ పోరాటంలో స్వరాజ్యం క్రియాశీలక పాత్ర పోషించారు. సాయుధ పోరాటంలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. గెరిల్లా దళాలతో దాడులు చేస్తూ నైజాం సర్కారును గడగడలాడించారు. అజ్ఞాతంలో ఉండి రాజక్క పేరుతో దళాలను నిర్మించి, నడిపించారు. స్వరాజ్యాన్ని పట్టుకోవడానికి వీలుకాకపోవడంతో నైజాం పోలీసులు ఆమె ఇంటిని తగులబెట్టినా వెరవకుండా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆమెను పట్టుకున్నవారికి రూ.10 వేలు బహుమతి ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. రాజకీయ ప్రస్థానం ఇలా.. సాయుధ పోరాటం ముగిసిన తర్వాత స్వరాజ్యం రాజకీయాలలోకి వచ్చారు. రెండు సార్లు శాసనసభకు ఎన్నికై ప్రజాసేవ చేశారు. హైదరాబాదు సంస్థానం విమోచన అనంతరం నల్లగొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1978, 1983లలో రెండు పర్యాయాలు సీపీఐ(ఎం) తరఫున ఎన్నికయ్యారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయించారు. అప్పట్లో కార్పస్ ఫండ్ చెల్లిస్తేనే కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేది. కానీ, మల్లు స్వరాజ్యం తుంగతుర్తి ప్రాంతం వెనుకబడిన ప్రాంతమని ప్రభుత్వంతో కొట్లాడి కార్పస్ ఫండ్ చెల్లించకుండానే జూనియర్ కళాశాలను మంజూరు చేయించారు. అనేక భూసమస్యలను పరిష్కరించారు. 1985లో ప్రభుత్వం కూలిపోవడంతో.. 1985, 1989 రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అభ్యర్థిగా, 1996లో మిర్యాలగూడెం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ నాయకురాలిగా నిరంతరం సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1994లో నెల్లూరు జిల్లా దూబగుంట నుంచి ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమంలో స్వరాజ్యం పాల్గొన్నారు. స్వరాజ్యం జీవితకథ ‘నా మాటే తుపాకీ తూటా’పుస్తక రూపంలో ప్రచురించారు. వామపక్షభావాలతో స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక ’చైతన్య మానవి’సంపాదకవర్గంలో ఒకరుగా స్వరాజ్యం సేవలు అందించారు. 91 ఏళ్ల వయోభారంలోనూ ఆమె పీడిత ప్రజలకు అండగా పనిచేశారు. 8 దశాబ్దాల కిందట ఎర్రజెండాతో పెనవేసుకున్న మల్లు స్వరాజ్యం జీవితం కడవరకు పోరాట స్ఫూర్తితోనే కొనసాగింది. -
తుంగతుర్తి: నిత్యం..ప్రజల వెన్నంటి ఉన్నా..!
సాక్షి, తిరుమలగిరి (తుంగతుర్తి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఆత్మ గౌరవంతో ఉద్యమించాను. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తించి చట్ట సభల్లో నిలబడటానికి అవకాశం కల్పించారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, దీవెనలతో శాసన సభ్యుడిగా గెలుపొందాను. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో రూ.1600 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగున్నరేళ్లలో పూర్తి చేశాననే సంతృప్తి కలిగింది. రెండోసారి ప్రజలకు సేవ చేయడానికి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నా. నిత్యం ప్రజలమధ్య ఉండి సేవ చేసే తనకు మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్ అంటున్నారు. ఎన్ని కల సందర్భంగా ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్న పలు అంశాలు ఆయన మాటల్లోనే... వారిని ప్రజలు ఆదరించరు.. ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మారుస్తాం. నాగారంలో132/11కేవీ సబ్‌స్టేషన్,అర్వపల్లిలో ఐటీఐ కళాశాల, మోత్కూరులో సీహెచ్‌సీ , తిరుమలగిరిలో బస్ డిపో ఏర్పాటు చేస్తాం. ఎస్ఆర్ఎస్పీ కాల్వల ఆధునికీకరణ చేస్తాం. ఎన్నికల ముందు వచ్చిన మహా కూటమి అభ్యర్థి అద్దంకి దయాకర్, బీజేపీ అభ్యర్థి కడియం రామచంద్రయ్యలను ఈ ప్రాంత ప్రజలు ఆదరించరు. కాంగ్రెస్, టీడీపీ పొత్తులను ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో జరిగిన అభివద్ధి పనులతో నా విజయం సునాయాసం. ఇక మేజార్టీయే తేలాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే.. నియోజకవర్గంలోఎస్ఆర్ఎస్పీ కాల్వలు ఉన్నా గోదావరి జలాలు రాక దుర్భర పరిస్థితులు న్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గతంలో 41 రోజులు, రెండు నెలల క్రితం 32 రోజులు నీటిని తీసుకొచ్చి చెరువులు, కుంటలు నింపాం. ఆరు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రెండు పంటలకు నీళ్లు వస్తాయి. వెంపటి, రుద్రమదేవి చెరువులను రిజర్వాయర్‌గా మార్చడానికి ప్రతిపాదనలు చేశాం. ఈ రెండు రిజర్వాయర్లు పూర్తయితే సాగు నీటి సమస్య తీరుతుంది. పదమూడు రోజుల్లోనే ఆశీర్వదించారు .. 2014లో ఎన్నికలు 13 రోజులు ఉండగానాకు తుంగతుర్తి టిక్కెట్ కేటాయించారు. తెలం గాణ ఉద్యమంలో పాల్గొని వందలాది కేసులు ఉన్న తనను నియోజకవర్గ ప్రజలు తక్కువ సమయంలోనే ఆదరించి గెలిపించారు. నియోజకవర్గంలో గతంలో నెలకో, ఆరు నెలలకో ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే వస్తే శాసన సభ్యుడిని కలిసే అవకాశం ప్రజలకు ఉండేది. సమస్యలు శాసన సభ్యుడికి తెలపాలంటే మొదటగా స్థానిక నాయకులను కలిసి ఆ తరువాత ఎమ్మెల్యేను కలిసే అవకాశం ఉండేది. కొన్ని సమయాలల్లో శాసన సభ్యుడిని కలిసే అవకాశం లేక సమస్య అలాగే పెండింగ్‌లో ఉండి పోయేది. నేను గెలిచిన తర్వాత నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నియోజకవర్గంలోనే ఇంటిని తీసుకొని వారంలో ఐదు రోజులు ఇక్కడే ఉంటున్నాను. దీర్ఘకాలిక సమస్యలకు ప్రణాళికలు రూపొందించాను. మరిన్ని వార్తాలు... -
ముడిపడని ఆ..మూడు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి ఇంకా పరిష్కారం కాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకుగాను పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ నాయకత్వం ఇంకా దేవరకొండ, మిర్యాలగూడ, తుంగతుర్తి స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. మొదటి విడతలో కూటమి భాగస్వామ్య పక్షాలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీంతో మిగిలిన ఈ మూడు స్థానాల్లో ఏ కూటమి పక్షానికి ఏ స్థానం కేటాయిస్తారు..? అసలు ఒక్క సీటన్నా వారికి విడిచిపెడతారా..? లేదంటే మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులనే ప్రకటిస్తారా అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. నామినేషన్ల దాఖలుకు మరో మూడు రోజులే మిగిలి ఉండడంతో శనివారం ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆఖరి విడత జాబితాను విడుదల చేయనుందని చెబుతున్నారు. దీంతో ఈ మూడు స్థానాల అభ్యర్థులు ఎవరవుతారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కూటమి కట్టిన టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీలకు జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కేటాయించలేదు. రాష్ట్ర స్థాయిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఇక్కడ కేటాయింపులు జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే కూటమి పక్షాలు తిరుగుబాటు చేస్తాయా? పోటీగా బరిలోకి దిగుతాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆసక్తి రేపుతున్న మిర్యాలగూడ టీజేఎస్ ముందునుంచీ మిర్యాలగూడ ఆశిస్తోంది. కానీ, ఇక్కడినుంచి సీఎల్పీ మాజీ నేత కుం దూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి టికెట్ కోసం పట్టుబడుతున్నారు. రఘువీర్‌రెడ్డికి ఇవ్వలేని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీజేఎస్‌కు ఇప్పటికే 8 స్థానాలను కేటాయించారు. అదనంగా తమకు మరో స్థానం కావాలని, అది మిర్యాలగూడమేనని కోరుతోంది. కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని టీజేఎస్ నాయకత్వం జాబితా కూడా ప్రకటించింది. ఆ పన్నెండు స్థానాల్లో మిర్యాలగూడ కూడా ఉండడం గమనార్హం. మరో వైపు రఘువీర్‌రెడ్డికి టికెట్ ఇవ్వలేమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తేల్చి చెప్పారని అంటున్నా రు. దీంతో ఢిల్లీ ప్రయత్నాలను పక్కన పెట్టేశారని సమాచారం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది..? లేదంటే టీజేఎస్‌కే ఇచ్చేస్తారా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. రెబల్‌గా .. బరిలోకి అలుగుబెల్లి ? టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పనిచేసిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. జానా తనయుడు రఘువీర్‌రెడ్డికి టికెట్ దక్కని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతూ వచ్చారు. ఆ హామీపైననే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు అసలు మిర్యాలగూడ స్థానం ఎవరికి ఇస్తారో తెలియని సందిగ్ధంలో ఉన్న ఈ సమయంలో...‘ఒకవేళ మిర్యాలగూడ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించినట్లయితే... ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాల్సిందే..’ అని అలుగుబెల్లిపై ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. ఈ ప్రాంతంలో టీజేఎస్ ఏమాత్రం బలంగా లేకపోవడం, కాంగ్రెస్ ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునే అవకాశం ఉందన్న విశ్వాసంతో కాంగ్రెస్‌లోని ఒక వర్గం రెబల్ ఆలోచనలు చేస్తోందని చెబుతున్నారు. టీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, ప్రచారం కూడా చేసిన అలుగుబెల్లిని కాంగ్రెస్ సీనియర్లు హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా టికెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికే అమరేందర్‌రెడ్డి మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. కొనసాగుతున్న సస్పెన్స్ దేవరకొండ, తుంగతుర్తి నియోజకవర్గాల్లోనూ శనివారం దాకా సస్పెన్స్ తప్పేలా లేదు. ఇక్కడ కూటమి పక్షాల గొడవ లేకున్నా, కాంగ్రెస్‌లోనే పోటీదారులు ఎక్కువగా ఉన్నారు. దేవరకొండ స్థానాన్ని జగన్‌లాల్ నాయక్, బిల్యానాయక్, జెడ్పీ చైర్మన్ బాలునాయక్ ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి వెంట పార్టీలో చేరిన బిల్యా నాయక్ ఆయన కోటాలోనే ప్రయత్నం సాగిస్తుండగా, కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలునాయక్, అదే పార్టీనుంచి జెడ్పీ చైర్మన్ కూడా అయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్కు వెళ్లినా, తిరిగి సొంత గూటికి చేరుకుని టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు నాయకుల మధ్య టికెట్ దోబూచులాడుతోంది. ఇక, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ , డాక్టర్ రవి పోటీ పడుతున్నారు. ఈ స్థానం లెక్క తేలాల్సి ఉంది. -
ముడిపడని ఆ..మూడు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి ఇంకా పరిష్కారం కాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకుగాను పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ నాయకత్వం ఇంకా దేవరకొండ, మిర్యాలగూడ, తుంగతుర్తి స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. మొదటి విడతలో కూటమి భాగస్వామ్య పక్షాలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీంతో మిగిలిన ఈ మూడు స్థానాల్లో ఏ కూటమి పక్షానికి ఏ స్థానం కేటాయిస్తారు..? అసలు ఒక్క సీటన్నా వారికి విడిచిపెడతారా..? లేదంటే మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులనే ప్రకటిస్తారా అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. నామినేషన్ల దాఖలుకు మరో మూడు రోజులే మిగిలి ఉండడంతో శనివారం ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆఖరి విడత జాబితాను విడుదల చేయనుందని చెబుతున్నారు. దీంతో ఈ మూడు స్థానాల అభ్యర్థులు ఎవరవుతారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కూటమి కట్టిన టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీలకు జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కేటాయించలేదు. రాష్ట్ర స్థాయిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఇక్కడ కేటాయింపులు జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే కూటమి పక్షాలు తిరుగుబాటు చేస్తాయా? పోటీగా బరిలోకి దిగుతాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆసక్తి రేపుతున్న మిర్యాలగూడ టీజేఎస్ ముందునుంచీ మిర్యాలగూడ ఆశిస్తోం ది. కానీ, ఇక్కడినుంచి సీఎల్పీ మాజీ నేత కుం దూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి టికెట్ కోసం పట్టుబడుతున్నారు. రఘువీర్‌రెడ్డికి ఇవ్వలేని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీజేఎస్‌కు ఇప్పటికే 8 స్థానాలను కేటాయించారు. అదనంగా తమకు మరో స్థానం కావాలని, అది మిర్యాలగూడమేనని కోరుతోంది. కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని టీజేఎస్ నాయకత్వం జాబితా కూడా ప్రకటించింది. ఆ పన్నెండు స్థానాల్లో మిర్యాలగూడ కూడా ఉండడం గమనార్హం. మరో వైపు రఘువీర్‌రెడ్డికి టికెట్ ఇవ్వలేమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తేల్చి చెప్పారని అంటున్నా రు. దీంతో ఢిల్లీ ప్రయత్నాలను పక్కన పెట్టేశారని సమాచారం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది..? లేదంటే టీజేఎస్‌కే ఇచ్చేస్తారా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. రెబల్‌గా .. బరిలోకి అలుగుబెల్లి ? టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పనిచేసిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. జానా తనయుడు రఘువీర్‌రెడ్డికి టికెట్ దక్కని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతూ వచ్చారు. ఆ హామీపైననే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు అసలు మిర్యాలగూడ స్థానం ఎవరికి ఇస్తారో తెలియని సందిగ్ధంలో ఉన్న ఈ సమయంలో... ‘ ఒకవేళ మిర్యాలగూడ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించినట్లయితే... ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాల్సిందే..’ అని అలుగుబెల్లిపై ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. ఈ ప్రాంతంలో టీజేఎస్ ఏమాత్రం బలంగా లేకపోవడం, కాంగ్రెస్ ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునే అవకాశం ఉందన్న విశ్వాసంతో కాంగ్రెస్‌లోని ఒక వర్గం రెబల్ ఆలోచనలు చేస్తోందని చెబుతున్నారు. టీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, ప్రచారం కూడా చేసిన అలుగుబెల్లిని కాంగ్రెస్ సీనియర్లు హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా టికెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికే అమరేందర్‌రెడ్డి మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. కొనసాగుతున్న సస్పెన్స్ దేవరకొండ, తుంగతుర్తి నియోజకవర్గాల్లోనూ శనివారం దాకా సస్పెన్స్ తప్పేలా లేదు. ఇక్కడ కూటమి పక్షాల గొడవ లేకున్నా, కాంగ్రెస్‌లోనే పోటీదారులు ఎక్కువగా ఉన్నారు. దేవరకొండ స్థానాన్ని జగన్‌లాల్ నాయక్, బిల్యానాయక్, జెడ్పీ చైర్మన్ బాలునాయక్ ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి వెంట పార్టీలో చేరిన బిల్యా నాయక్ ఆయన కోటాలోనే ప్రయత్నం సాగిస్తుండగా, కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలునాయక్, అదే పార్టీనుంచి జెడ్పీ చైర్మన్ కూడా అయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్కు వెళ్లినా, తిరిగి సొంత గూటికి చేరుకుని టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు నాయకుల మధ్య టికెట్ దోబూచులాడుతోంది. ఇక, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ , డాక్టర్ రవి పోటీ పడుతున్నారు. ఈ స్థానం లెక్క తేలాల్సి ఉంది. -
స్థానికులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి
తుంగతుర్తి : స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న స్థానిక నాయకులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఎంఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్చార్జ్ తడకమల్ల రవికుమార్ కోరారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులో మాట్లాడారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే వారు నియోజకవర్గంపై అవగాహనలేక అభివృద్ధికి కృషి చేయడంలేదని అన్నారు. ఈ సమావేశంలో ఎంఎస్ఎఫ్ నాయకులు కొండగడ్పుల శ్రీకాంత్, రాంబాబు, నరేష్, వెంకటేష్, సురేష్, పరశురాములు, శ్రీను, మహేష్ పాల్గొన్నారు. -
పద్నాలుగేళ్ల బాలికకు వివాహం
తిరుమలగిరి (తుంగతుర్తి) : పద్నాలుగేళ్ల బాలికకు వివాహం చేసిన తల్లిదండ్రిపై తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐసీడీఎస్ సూపర్వైజర్ షమీమ్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన ఇట్యబోయిన లింగయ్య, పద్మ కూతురు ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆ బాలికకు జనగామ జిల్లా పాకాలకు చెందిన యువకుడితో నాలుగురోజుల క్రితం వివాహం జరిపించారు. అయితే గతంలో బాలికకు వివాహం నిశ్చయం కాగా, తల్లిదండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చి హామీ పత్రం కూడా తీసుకున్నామని తెలిపారు. అయినా వారు వివాహం చేయడంతో సమాచారం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. బాలికలకు వివాహం జరిపితే బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రగులుతున్న తమ్ముళ్లు
తొలిజాబితాలో ఐదుగురు అభ్యర్థులు ఖరారు ఇంకా పెండింగులోనే ‘కోదాడ’ జిల్లా నుంచి మోత్కుపల్లి పోటీ చేయనట్టేనా! రాజీనామాలకు సిద్ధపడుతున్న నేతలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ టీడీపీకి జిల్లాలో భువనగిరి, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో సిట్టింగు ఎమ్మెల్యేలున్నా, కేవలం భువనగిరి స్థానానికి మాత్రమే తొలి జాబితాలో చోటు దక్కింది. తుంగతుర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులు ఈ సారి జిల్లా నుంచి పోటీ చేయడం ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. ఈ కార ణంగానే ఆయన పేరును ప్రకటించలేదని చెబుతున్నారు. కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు టికెట్‌పై ఇంకా సస్పెన్సే కొనసాగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన బొల్లం మల్లయ్యయాదవ్ ఇక్కడి నుంచి టికెట్ రేసులో ఉన్నారు. టికెట్ కోసం పోటీ త్రీవంగానే ఉంది. ఈ కారణంగానే చివరి నిమిషంలో టికెట్ ఖరారు చేసే ఉద్దేశంతో పెండింగులో పెట్టినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల పొత్తుల్లో భాగంగా బీజేపీకి వదిలేయాలని దాదాపు నిర్ణయించిన ఆలేరు, మునుగోడు, నల్లగొండ స్థానాల విషయంలోనూ వివాదం జరుగుతోంది. ఆలేరును మినహాయిస్తే, మునుగోడు టీడీపీ శ్రేణులు అధినాయకుని నిర్ణయంపై కస్సుమంటున్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ కర్నాటి వెంకటేశం రాజీనామా చేయాలన్న ఆలోచనకు వచ్చారని సమాచారం. అయితే, ఈ నెల 11వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జర గనున్నందున అప్పటి దాకా వేచి ఉండి 12వ తేదీన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆలోగా ఆయన తన సహచరులు, అనుచరులతో మాట్లాడుకుని ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరో వైపు నల్లగొండలోనూ టీడీపీ శ్రేణులు నిరుత్సాహంగా ఉన్నాయి. మునుగోడు, నల్లగొండలో తన వర్గీయులకు టికెట్ ఇవ్వకుండా బీజేపీకి కేటాయించినందునే భువనగిరి ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి రాజీనామాకు సిద్ధపడినట్లు పార్టీల వర్గాల సమాచారం. ఈ విషయాలన్నింటినీ విశ్లేషిస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విడుదల చేసిన తొలి జాబితా పార్టీలో చిచ్చు రేపుతోంది.భువనగిరి సిట్టింగ్ సీటును ప్రస్తుత ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డికి కేటాయించారు. ఇప్పటికే ఆమె ఈ నియోజకవర్గం మూడు పర్యాయాలు గెలిచి, నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి గడిచిన అయిదేళ్లుగా కనీసం ఇన్‌చార్జ్‌ను కూడా నియమించ లేదు. పార్టీ నాయకుడు బంటు వెంకటేశ్వర్లుకు ఈ సారి అనూహ్యంగా టికెట్ దక్కింది. జిల్లాలో బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే కారణంగానే ఆయనకు టికెట్ దక్కిందంటున్నారు. మునుగోడులో కర్నాటి వెంకటేశానికి అవకాశం ఇవ్వలేక పోయినందున ఆ లోటును మిర్యాలగూడలో పూడ్చారు.హుజూర్నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా వంగాల స్వామిగౌడ్‌ను ఖరారు చేశారు. కొద్ది నెలల కిందటే ఆయనను ఇక్కడ ఇన్చార్జ్గా నియమించారు.గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేసిన స్వామిగౌడ్ టీడీపీలో చేరి గత ఎన్నికల్లో అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. అప్పటి నుంచి మొన్న మొన్నటిదాకా జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశారు. దేవరకొండ నియోజకవర్గానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్‌కు టికెట్ ఇచ్చారు. స్వామిగౌడ్ నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించిన బిల్యానాయక్ పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. నియోజకవర్గానికే పరిమితమయ్యారు. టికెట్ కోసం పోటీ పడే వారూ లేకపోవడంతోఆయన పేరు తొలి జాబితాల్లోనే చోటు చేసుకుంది.సూర్యాపేట టికెట్ పార్టీలో ఉత్కంఠ రేపింది. నియోజకవర్గ ఇన్చార్జ్ పటేల్ రమేష్‌రెడ్డికి టికెట్ ఖరారైంది. ఈ స్థానాన్ని బీజేపీకి వదిలేస్తున్నారని ప్రచారం జరిగింది. దీంతో టీడీపీ శ్రేణులు నాయకత్వంపై ఒత్తిడి పెంచాయి. దీంతో చివరకు రమేష్‌రెడ్డికే టికెట్ దక్కింది.