timings change
-
విశాఖ టూ సికింద్రాబాద్: వందేభారత్ టైమింగ్స్ మార్పు..
సాక్షి, విశాఖపట్నం: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. రేపటి వందే భారత్ రైలు టైమింగ్స్‌ను రీషెడ్యూల్ చేసినట్టు రైల్వేశాఖ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. - కాగా, రేపు(శనివారం) విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లై వందే భారత్ రైలు ఉదయం 5.45 గంటలకు కాకుండా ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. - అలాగే, రేపు(శనివారం) సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే రైలు మధ్యాహ్నం 3 గంటలకు కాకుండా రాత్రి 8 గంటలకు బయలుదేరనుందని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: విశాఖ పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు కాబట్టే కిడ్నాపర్లను పట్టుకోగలిగాం: డీజీపీ రాజేంద్రనాథ్ -
ముంబై లోకల్ రైళ్ల సమయాల్లో మార్పు!
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో సామాన్యులను అనుమతించే సమయాల్లో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమ లులో ఉన్న సమయం సామాన్యులు, వ్యాపారులు, కార్మికులతోపాటు ముఖ్యంగా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అనుకూలంగా లేదు. దీంతో మొదటి రోజు నుంచి సమయంలో మార్పులు చేయాలని అనేక ఫిర్యాదులు రావడం మొదలయ్యాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న రాజేశ్ టోపే త్వరలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో చర్చిస్తామని, ఆ తరువాత రైల్వే అధికారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఎక్కువ నష్టం.. లోకల్ రైళ్లలో సామాన్యులను అనుమతించడంతోపాటు వారు పడుతున్న ఇబ్బందులతోపాటు, వారికి ఎదురవుతున్న సమస్యలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత సోమవారం నుంచి నిర్ణీత సమయంలో సామాన్యులు లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించిన విషయం తెలిసిందే. తెల్లవారు జామున (మొదటి రైలు బయలుదేరిన) నుంచి ఉదయం 7 గంటల లోపు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు, ఆ తరువాత రాత్రి 9 తొమ్మిది గంటల నుంచి చివరి రైలు బయలుదేరే వరకు సామాన్యులకు అనుమతి కల్పిస్తున్నారు. కానీ, ఈ సమయం వివిధ పనుల నిమిత్తం బయటపడిన వారికి లేదా బంధువుల ఇళ్లకు కుటుంబ సభ్యులతో బయలుదేరిన వారికి మాత్రమే అనుకూలంగా ఉంది. కానీ, ప్రైవేటు, వివిధ వాణిజ్య, వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఏమాత్రం అనుకూలంగా లేదు. దీంతో రైల్వే తీసుకున్న నిర్ణయంతో మొదటి నుంచి ఉద్యోగులు పెదవి విరిస్తున్నారు. లోకల్ రైళ్లకు బదులుగా బెస్ట్ లేదా ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరడమే ఉత్తమమని కొందరు భావిస్తున్నారు. దీంతో ముంబైకర్లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నేతృత్వంలో ఓ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు. మార్పులు చేయడానికి కుదురుతుందా..? ఆదరబాదరగా నిర్ణయం తీసుకుంటే కరోనా వైరస్ నియంత్రణపై గత పది నెలలుగా చేసిన ప్రయత్నాలన్ని వృథా కానున్నాయి. దీంతో సమయంలో మార్పులు చేసే ముందు భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: ‘మహా’లో కీలక మార్పు.. స్పీకర్ రాజీనామా త్వరలో ముంబై కరోనా రహితం! -
అటెన్షన్ ప్లీజ్.. వన్డే సమయాల్లో మార్పు!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-శ్రీలంకల మధ్య డిసెంబర్10 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు సంబంధించి తొలి రెండు వన్డేల సమయాన్ని బీసీసీఐ సవరించింది. చలి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ధర్మశాల, మొహాలీలో జరిగే వన్డేల సమయాన్ని మార్చినట్లు ప్రకటించింది. తొలి రెండు వన్డేలూ మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఉదయం 11.30 గం.కు ప్రారంభమవుతాయని తెలిపింది. ‘హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(హెచ్పీసీఏ), పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)లతో బీసీసీఐ సంప్రదింపులు జరిపింది. ఈ మేరకు సవరించిన సమయం ప్రకారం డిసెంబర్ 10న ధర్మశాలలో తొలి వన్డే, డిసెంబర్ 13న మొహాలీలో రెండో వన్డే జరుగుతాయి’ అని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. ఇక విశాఖ వేదికగా జరిగే మూడో వన్డే.. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరగనుంది. -
ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలు మార్పు
గుంతకల్లు : గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని వాడి–గుంతకల్లు సెక్షన్లో మట్మర్రి–మంత్రాలయం స్టేషన్ల మధ్య డబుల్‌లైన్ పనుల దృష్ట్యా ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలు మార్పు చేయడంతో పాటు కొన్ని ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (డీసీఎం) సీహెచ్ రాకేష్ వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఈ పనులు చేస్తున్నామన్నారు. ఈ పనుల దృష్ట్యా కోయంబత్తూరు–లోకమాన్యతిలక్ (నంబర్ 11014) ఎక్స్‌ప్రెస్ రైలు కోయంబత్తూరులో ఉదయం 8.50 గంటలకు బదులు మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. అలాగే మైసూర్–బాగల్‌కోట (17307) ఎక్స్‌ప్రెస్ రైలు మైసూర్లో మధ్యాహ్నం 1.30 గంటలకు బదులు సాయంత్రం 4.15 గంటలకు, యశ్వంతపూర్–బీదర్ (16571) రైలు యశ్వంతపూర్‌లో సాయంత్రం ఏడు గంటలకు బదులు రాత్రి 9.25 గంటలకు, బెంగళూరుసిటీ–న్యూఢిల్లీ (12627) మధ్య తిరిగే కర్ణాటక ఎక్స్‌ప్రెస్ బెంగళూరు సిటీ స్టేషన్లో రాత్రి 7.20 బదులు రాత్రి 9.45 గంటలకు, యశ్వంతపూర్–షోలాపూర్ (22134) ఎక్స్‌ప్రెస్ యశ్వంత్‌పూర్‌లో రాత్రి 8.50 బదులు అర్ధరాత్రి 12.10 గంటలకు, బెంగళూరు–నాందేడ్ (16594) రైలు బెంగళూరులో రాత్రి 10.45 గంటలకు బదులు అర్ధరాత్రి 1.20 గంటలకు బయలుదేరతాయని వెల్లడించారు. అలాగే గుల్బర్గా–గుంతకల్లు (నం–57631/32) మధ్య నడిచే ప్యాసింజర్ రైలు గుల్బర్గా నుంచి రాయచూర్ వరకు మాత్రమే నడుస్తుందన్నారు. గుంతకల్లు–రాయచూర్ (నం–57427/28) ప్యాసింజర్ గుంతకల్లు నుంచి ఆదోని వరకు మాత్రమే ప్రయాణిస్తుందన్నారు. ఈ మార్పులు మూడు రోజులపాటు ఉంటాయని, ప్రయాణికులు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.