t.jac
-
సంపూర్ణ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ఎటువంటి ఆంక్షల్లేని సంపూర్ణ తెలంగాణ కోసం బిల్లులో అవసరమైన సవరణలు చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తోనే జనవరి 7న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ‘సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష’ను చేపడుతున్నట్టు వెల్లడించారు. దీక్షకు సంబంధించిన విషయాలపై చర్చించేందుకు జేఏసీ కార్యవర్గం మంగళవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశమైంది. సమావేశం తరువాత కోదండరాం విలేకరులతో మాట్లాడారు. ‘‘విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగాలి... సంపూర్ణ తెలంగాణ కోసం బిల్లులో అవసరమైన సవరణ చేయాల’’ని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి విభజన ప్రకటన వచ్చి నాలుగేళ్లవుతున్నా ఇంకా సాగదీయడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కుట్రపూరితంగా బిల్లును అడ్డుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీక్ష విజయవంతం కావడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు జనవరి 3 నుంచి పునఃప్రారంభం కానున్నందున ప్రతిరోజూ జేఏసీ కూడా హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహిస్తామని టీఎన్జీవో సంఘ అధ్యక్షుడు దేవీప్రసాద్ వెల్లడించారు. కాగా, జనవరి 5న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రాంత న్యాయవాదుల సదస్సు ఉంటుందని టీ న్యాయవాదుల నేత రాజేందర్‌రెడ్డి తెలిపారు. జేఏసీ నేతలు శ్రీనివాస్‌గౌడ్ ,అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, రఘు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
బిల్లుపై గడువే గండం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయం కోసం విధించిన 40 రోజుల గడువే ఇప్పుడున్న ప్రధాన అవరోధమని, దాన్ని ఐక్యంగా అధిగమించాల్సిన అవసరముందని తెలంగాణ ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. పార్టీలకు అతీతంగా అంతా ‘తెలంగాణ పార్టీ’గా భావించుకుని కలసికట్టుగా సాగాలని నిర్ణయించారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం శుక్రవారం ఏర్పాటు చేసిన తేనీటీ విందుకు తెలంగాణ మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు హాజరయ్యారు. 371డి అధికరణం, బిల్లులోని క్లాజుల వంటి రాజ్యాంగపరమైన అంశాలపై సమస్యలు లేవనెత్తి అసెంబ్లీలో బిల్లును వివాదాస్పదం చేయజూసే అవకాశముందని విశ్లేషించారు. సోమవారమే బిల్లు అసెంబ్లీకి రావచ్చని మంత్రులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు చెప్పారు. 40 రోజుల పాటు చర్చించాలని సీమాంధ్ర నేతలు పట్టుబట్టవచ్చని, దాన్ని అధిగమించడానికి తెలంగాణ సభ్యులంతా పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలని ప్రతిపాదించారు. భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వస్తారు, పార్టీల అభిప్రాయాలేమిటి, ఏ పార్టీకి ఎలాంటి లాభం జరుగుతుందనే విషయాలను పక్కన పెట్టి బిల్లును వీలైనంత త్వరగా రాష్ట్రపతికి పంపించడానికి కృషి చేయాలని కోరారు. బిల్లును తెలంగాణ సభ్యులంతా అంశాలవారీగా విభజించుకుని, స్పష్టంగా, క్లుప్తంగా ప్రసంగించాలని సూచించారు. మంత్రుల నేతృత్వంలో చలో రాజ్‌భవన్ సోమవారం అసెంబ్లీకి బిల్లు రాకుంటే ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమానికి మంత్రులే నాయకత్వం వహించాలని, వారితో తామంతా కలిసి వస్తామని టీఆర్ఎస్ ప్రతిపాదన చేసింది. అసెంబ్లీ నుంచి పాదయాత్రగా రాజ్‌భవన్‌కు వెళ్లి, అక్కడే బైఠాయించాలని సూచించింది. బిల్లును విజయవంతంగా పార్లమెంటుకు పంపించాల్సిన బాధ్యత మంత్రులపై ఎక్కువగా ఉందని ఆ పార్టీ నేతలన్నారు. భేటీలో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బసవరాజు సారయ్య, డి.కె.అరుణ, జి.ప్రసాద్‌కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి, విప్‌లు ఈరవత్రి అనిల్, ఆరేపల్లి మోహన్, అన్ని పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ అధ్యక్షత వహించగా జేఏసీ చైర్మన్ కోదండరాం, కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, నేతలు సి.విఠల్, దేవీ ప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, కె.రవీందర్ రెడ్డి, పల్లె రవికుమార్, పి.వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
లేని ఆంక్షలు రుద్దొద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లు రూపకల్పనకు రాజ్యాంగాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని టీ-జేఏసీ డిమాండ్ చేసింది. అందులో లేని అంశాలను, ఆంక్షలను బిల్లులో చేర్చి తెలంగాణపై రుద్దవద్దని హెచ్చరించింది. ఇప్పటికే నష్టపోయిన తెలంగాణకే మరింత నష్టం జరిగేలా బిల్లులో ఎన్నో అంశాలున్నాయని.. వాటిని సవరించాల్సిందేనని స్పష్టం చేసింది. బిల్లులోని లోపాలను, వాటి వల్ల జరిగే నష్టాలను అధ్యయనం చేస్తున్నామని, దీనిపై సవివర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపింది. ఎలాంటి లోపాలు లేని సంపూర్ణ తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించేదాక పూర్తి అప్రమత్తంగా ఉంటామని తెలిపింది. ‘‘తెలంగాణ రాష్ట్ర బిల్లు-మన దృక్పథం’’ అంశంపై తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సోమవారం చర్చా కార్యక్రమం జరిగింది. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం, నాగం జనార్ధన్‌రెడ్డి (బీజేపీ), కె.తారక రామారావు (టీఆర్ఎస్), కె.యాదవరెడ్డి (కాంగ్రెస్ ఎమ్మెల్సీ), ఆకుల భూమయ్య (తెలంగాణ ప్రజా ఫ్రంట్), టీ-జేఏసీ ముఖ్య నేతలు వి. శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, దేవీప్రసాద్, బి.మధుసూదన్‌రెడ్డి (ఇంటర్ విద్యా జేఏసీ), డి.పి.రెడ్డి (టీడీఎఫ్), బెల్లయ్య నాయక్ (ఎల్‌హెచ్‌పీఎస్), ఎం.చంద్రశేఖర్ గౌడ్ (గ్రూప్-1 అధికారుల సంఘం), రాజ్‌కుమార్ గుప్తా (సచివాలయ ఉద్యోగుల జేఏసీ), కరాటే రవి (ఓయూ జేఏసీ), అరుణ్‌కుమార్ (అడ్వకేట్ జేఏసీ), సీనియర్ జర్నలిస్టులు ఎన్.వేణుగోపాల్, ఆర్.శైలేష్‌రెడ్డి, పి.వి.శ్రీనివాస్, పల్లె రవి, క్రాంతి పాల్గొనగా టీ-జేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఉద్యమకారులు వ్యూహాత్మకంగా ఉండాలి: కోదండరాం ‘‘తెలంగాణ బిల్లు అనే దానికి రాజ్యాంగమే ప్రామాణికంగా ఉండాలి. రాజ్యాంగంలో లేని ఆంక్షలను, అంశాలను బిల్లులో చేర్చి తెలంగాణపై రుద్దొద్దు. ఇందుకోసం అందరం కేంద్రం మీద అదే ఒత్తిడిని కొనసాగిద్దాం. తెలంగాణ ముసాయిదా బిల్లులోని లోపాలను, తెలంగాణకు జరిగే నష్టాలను అధ్యయనం చేస్తున్నాం. ఈ లోపాలపై సవివర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తాం. లోపాలు లేని తెలంగాణ బిల్లును ఆమోదించేదాకా అప్రమత్తంగా ఉందాం. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం, బిల్లు అడ్డుకోవడానికి జరిగే కుట్రలను బట్టి ఉద్యమకారులు వ్యూహాత్మకంగా ఉండాలి.’’ ఆంక్షలన్నీ కుట్రలో భాగమే: నాగం జనార్దన్‌రెడ్డి ‘‘కుట్రలో భాగంగానే తెలంగాణపై ఇంకా ఆంక్షలు పెడుతున్నారు. వాటిని తిప్పికొడదాం. 10 జిల్లాలతో కూడిన, ఎలాంటి ఆంక్షలూ లేని సంపూర్ణ తెలంగాణ ఏర్పాటయ్యే దాకా మేం అండగా ఉంటాం. హైదరాబాద్‌ను పదేళ్లు రాజధానిగా ఉంచాలనడం మాకు సమ్మతం కాదు. తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని పంపించాలి. అవసరమైతే సీమాంధ్రలోని సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించుకోవాలి. తెలంగాణ బిల్లులో లోపాలను సవరించుకునే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలపైనే ఉంది.’’ గవర్నర్ గిరి పేరుతో దాదాగిరి కుదరదు: కేటీఆర్ ‘‘తెలంగాణ బిల్లు ముసాయిదాలో అభ్యంతరకరంగా ఉన్న ఆరు అంశాలపై ప్రధానమంత్రికి లేఖ రాస్తాం. గవర్నర్ గిరి పేరుతో తెలంగాణపై దాదాగిరి చేస్తామంటే ఒప్పుకొనేది లేదు. తెలంగాణలో విద్యావ్యవస్థను దెబ్బతీస్తామంటే అంగీకరించం. జనాభా దామాషా ప్రకారం ఆస్తులు-అప్పులను పంపిణీ చేస్తామంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ ప్రాజెక్టు ఉంటే అప్పులు ఆ ప్రాంతానికే చెందాలి. పెన్షనర్ల భారాన్ని కూడా జనాభా దామాష ప్రకారం పంచితే తెలంగాణకు అన్యాయం జరుగుతది. రిటైరైన ఉద్యోగి స్థానికత ఆధారంగా పెన్షన్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.’’ 1956కు ముందున్న ఆస్తులేవి..?: శ్రీనివాస్‌గౌడ్, విఠల్, దేవీప్రసాద్, అద్దంకి దయాకర్ ‘‘తెలంగాణలో 1956కు ముందున్న చాలా ఆస్తులను సమైక్య రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసింది. నష్టం జరిగిన తెలంగాణకే ఇంకా నష్టం చేసే విధంగా బిల్లులో అంశాలున్నాయి. వాటిని సవరించాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి. గవర్నర్ పాలనలో ఉద్యోగుల హక్కులను హరించే కుట్ర ఉంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మానసిక స్థాయిపై అనుమానాలు కలుగుతున్నాయి. బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా ఆపుతానంటాడేమో?. తెలంగాణ బిల్లు ముసాయిదాలో కొన్ని స్వాగతించే అంశాలు కూడా ఉన్నాయి.’’ బిల్లులోని నష్టాలపై పోరాడుతం: కె.యాదవరెడ్డి, ఆకుల భూమయ్య ‘‘తెలంగాణకు నష్టం జరిగే అంశాలేమున్నా వ్యతిరేకిస్తాం. ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలంటూ అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తాం. ఈ నెల 16న చలో అసెంబ్లీ నిర్వహించుకుందాం. అసెంబ్లీలో బిల్లుపై చర్చ జరిగే అవకాశమున్నందున ఉద్యమకారులు భారీగా తరలిరావాలి. ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ కావాలని డిమాండ్ చేయాలి.’’ -
తెలంగాణ ప్రక్రియను సాగదీసేందుకే అఖిలపక్షం
సిద్దిపేట : కేంద్రం మళ్లీ అఖిలపక్షం సమావేశం పేరుతో రాష్ట్ర ఏర్పాటును సాగదీసే ప్రయత్నం చేస్తోందని జేఏసీ నాయకులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి కమలాకర్‌రావు ఆరోపించారు. ప్రత్యేక రాష్ర్టం కోసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 1,399వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయానికి గురైందని, సీమాంధ్ర పాలకులు దశాబ్దాల కాలంగా ఇక్కడి వనరులను కొల్లగొట్టారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతాన్ని దోచుకోవడానికి అలవాటు పడ్డ సీమాంధ్ర పాలకులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్నారని తెలిపారు. తెలంగాణ సాధించే వరకూ దీక్షలను విరమించేది లేదన్నారు. కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. పుల్లూరు గ్రామానికి చెందిన మహిళలు మంద ఎల్లవ్వ, బూదవ్వ, పద్మ, శాంతవ్వ, నర్సవ్వ, యశోద, కనకవ్వ, ఎల్లవ్వ తదితరులు దీక్షలో కూర్చున్నారు. వీరికి పలువురు టీఆర్ఎస్, జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. -
తెలంగాణా జెఎసి నేతలపై కాంగ్రెస్ కన్ను
-
టీ.జేఏసీ నేతల రహస్య ఢిల్లీ పర్యటన
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ పొలిటికల్ జేఏసీ నేతల రహస్య ఢిల్లీ పర్యటన.... జేఏసీలో చిచ్చు రేపుతున్నాయి. తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్, మరో ముఖ్యనేత శ్రీనివాస్‌గౌడ్‌లు ఢిల్లీ వెళ్లి ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భేటీ అయినట్లు సమాచారం. అయితే దీనిపై కోదండరామ్ నోరు మెదపటం లేదు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఆయన ఈరోజు ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. కాగా తెలంగాణ ఏర్పాటుతో ఆ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా మారాలని భావించిన కాంగ్రెస్ ఆశించిన ఫలితం దక్కకపోవడంతో తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో బలంగా ఉన్న టీఆర్ఎస్ నుంచి వలసలు ప్రోత్సహించి ఆ పార్టీని బలహీనపరచాలని భావించిన కాంగ్రెస్ పెద్దలు ఆ ప్రయత్నంలో కాస్త సఫలమయ్యారు. పనిలో పనిగా ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లిన జేఏసీ ముఖ్యనేతల్ని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఈనేపథ్యంలో కోదండరామ్, శ్రీనివాస్‌గౌడ్ ఢిల్లీ పర్యటన ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. జేఏసీలోని మిగిలిన నేతలకు సమాచారం లేకుండా వీరిద్దరూ ఢిల్లీ వెళ్లడంపై జేఏసీలో చర్చ ప్రారంభమైంది. హస్తిన పర్యటనలో ఇద్దరు నేతలు కాంగ్రెస్ పెద్దలతో భేటి అయ్యారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణపై పార్టీపరంగా నిర్ణయం తీసుకునే నేపధ్యంలో జేఏసీ మద్దతు కోసం కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలను టీఆర్ఎస్ నిశితంగా గమనిస్తోంది. -
టీ.జేఏసీ నేతల రహస్య ఢిల్లీ పర్యటన
-
‘సీఎం కిరణ్ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు’
హైదరాబాద్: విద్యుత్ రంగం సమస్యలపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని టీ.జేఏసీ నేతలు విమర్శించారు. ఈ క్రమంలో భాగంగా వారు డీప్యూటీ సీఎం రాజ నర్శింహను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సమస్యలపై సీఎం అసత్యాలు మాట్లాడుతన్నారని జేఏసీ నేతలు మండిపడ్డారు. వాటి వివరాలను డీప్యూటీ సీఎంకు వివరించామన్నారు. ఈ నెల 19 వ తేదీన ఆంటోనీ కమిటీతో సమావేశమై తమ వాదనలను సమర్ధవంతంగా వినిపిస్తామన్నారు. తెలంగాణ కల సాకరమవడానికి రాజనర్శింహనకృషి చేశారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ నెల 18వ తేదీన తెలంగాణ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో విస్తృతసాయి సమావేశాన్ని నిర్వహించడానిక సన్నద్దమవుతున్నారు.