toy gun
-
HYD: బొమ్మ తుపాకీతో బెదిరించి దోపిడీ
సాక్షి,హైదరాబాద్: ఐటీ కారిడార్‌లో బొమ్మ తుపాకీ చూపించి దోచుకున్న ఘటన కలకలం రేపింది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలోని తేవర్ బార్లో దోపిడీ జరిగింది. బొమ్మ తుపాకీతో బార్ సెక్యూరిటీ గార్డును బెదిరించడమే కాకుండా రూమ్‌లో బందించి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్,ఒక ఆపిల్ ల్యాప్‌టాప్‌ను దుండగులు దోచుకెళ్లారు.దోపిిడీకి పాల్పడిన ఇద్దరిలో ఏ1 నిందితుడు శుభమ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఏ2 నిందితుడు విశ్వజిత్ పండా పరారీలో ఉన్నాడు. ఒడిశాకు చెందిన నిందితులిద్దరూ గతంలో తేవర్ బార్లో పనిచేశారు. మూడు నెలల క్రితం ఈ ఇద్దరినీ బార్ ఓనర్ పనిలో నుంచి తీసివేశాడు. ఇది మనసులో పెట్టుకునే దోపిడీకి పాల్పడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుకు బొమ్మ తుపాకీతో వెళ్లి.. 10 లక్షలు తీసుకెళ్లిన మహిళ
ఓ మహిళ గుంపుతో కలిసి బొమ్మ తుపాకీతో బ్యాంకులోకి ప్రవేశించి హల్చల్ చేసింది. మేనేజర్‌కు ఆ తుపాకీ ఎక్కుపెట్టి 13,000 డాలర్లు(రూ.10లక్షలు) విత్‌డ్రా చేసింది. ఆ డబ్బునంతా పాస్టిక్ బ్యాగులో పెట్టుకుని అక్కడి నుంచి క్షణాల్లో వెళ్లిపోయింది. లెబనాన్ రాజధని బెయరూత్లో ఈ ఘటన బుధవారం జరిగింది. సదరు మహిళ చేసిన పనిని ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఘటనకు పాల్పడిన మహిళ పేరు సలీ హఫేజ్. ఆమె తీసుకెళ్లిన డబ్బంతా తన సొంత సేవింగ్స్ ఖాతాలోదే కావడం గమనార్హం. తన ఖాతా నుంచి ఎక్కువ డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకు అధికారులను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో పక్కా ప్లాన్‌తో ఆమె ఈ పని చేసింది. కొంతమంది ఆందోళనకారులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆర్థిక ఆంక్షలు.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న లెబనాన్‌లో 2019 నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రజలు నెలకు 200 డాలర్లకు మించి విత్‌డ్రా చేసుకోవడానికి వీల్లేదు. దీంతో సేవింగ్స్ ఖాతాల్లో డబ్బు ఉన్నా దాన్ని ఉపయోగించుకోలేక లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద కారణం.. అయితే సలీ హఫేజ్ బొమ్మ తుపాకీతో బెదిరించి మరీ డబ్బు తీసుకెళ్లడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఆమె 23ఏళ్ల సోదరి చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. చికిత్సకు ప్రతినెలా చాలా డబ్బు అవసరం అవుతోంది. సేవింగ్స్ ఖాతాలో 20వేల డాలర్లు ఉన్నా వాటిని విత్ డ్రా చేసుకోలేక హఫేజ్ అవస్థలు పడింది. తన చెల్లికి క్యాన్సర్ అని చెప్పినా బ్యాంకు అధికారులు అసలు పట్టించుకోలేదు. ఎక్కువ డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించలేదు. దీంతో కొంతమంది నిరసనకారులతో కలిసి హఫేజ్ బొమ్మ తుపాకీతో బ్యాంకులోకి వెళ్లి నగదు విత్‌డ్రా చేసుకుంది. ఇంటర్వ్యూలో వివరణ తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో స్థానిక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సలీ హఫేజ్ వివరించింది. తన చెల్లి క్యాన్సర్ చికిత్సకు డబ్బు కావాలని, విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించాలని బ్యాంకు అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆలస్యమైతే తన చెల్లి ప్రాణాలకే ప్రమాదమని చెప్పినా వినలేదని వాపోయింది. ఇక తాను కోల్పోవడానికి ఏమీ లేదని నిర్ణయించుకున్న తర్వాతే ఇలా చేసినట్లు వివరించింది. ప్రత్యక్ష సాక్షి భయం.. అయితే ఈ ఘటనను చూసిన ఓ ప్రత్యక్ష సాక్షి మాత్రం భయాందోళన వ్యక్తం చేసింది. మొదట ఓ గుంపు బ్యాంకు లోపలికి వచ్చి నేలపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని బెదిరించిందని, ఓ మహిళ బ్యాంకు మేనేజర్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి నగదు ఇవ్వకపోతే కాల్చిపడేస్తానని బెదిరించిందని చెప్పింది. అయితే తాను ఎవరికీ హాని చేయాలనుకోలేదని హఫేజ్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. తన హక్కుల కోసమే గత్యంతరం లేక ఇలా చేసినట్లు స్పష్టం చేసింది. హఫేజ్కు లెబనాన్ ప్రజలంతా మద్దతుగా నిలిచారు. ఆమెను హీరోగా అభివర్ణించారు. ఆమె చేసినదాంట్లో తప్పేంలేదన్నారు. మరోవైపు డబ్బు అవసరమైనవాళ్లు తనలాగే చేయాలని హఫేజ్ పిలుపునిచ్చింది. చదవండి: నిమిషంలోపే హెయిర్ కట్.. గిన్నిస్ రికార్డు సృష్టించిన హెయిర్ డ్రస్సర్ -
బొమ్మ తుపాకీతో డ్యాన్సులు.. దిమ్మ తిరిగే షాకిచ్చిన పోలీసులు
అమలాపురం టౌన్(తూర్పుగోదావరి): ఇద్దరు యువకులు ఓ బొమ్మ తుపాకీతో సరదాగా చేసిన హడావుడి.. చివరకు వారికి దిమ్మ తిరిగేలా చేసింది. అమలాపురం ఇన్చార్జి డీఎస్పీ ఎస్.రాంబాబు శుక్రవారం సాయంత్రం ఈ వివరాలను విలేకర్లకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన పోలిశెట్టి శివ గంగాధర్ ఏడాది కిందట కాకినాడలో ఏర్పాటు చేసిన ఓ క్రాఫ్ట్ బజారులో రూ.1,500కు ఓ బొమ్మ తుపాకీ కొన్నాడు. దానిని అలంకారంగా ఇంట్లో గోడకు తగిలించాడు. గ్రామంలో గురువారం రాత్రి మరిడమ్మ జాతర జరిగింది. ఆ జాతరకు తన అన్న కొడుకైన ఎనిమిదేళ్ల నందన్‌తో కలిసి శివ గంగాధర్ వెళ్లాడు. ఆ బాలుడి ముచ్చట పడటంతో వెంట బొమ్మ తుపాకీ కూడా తీసుకు వెళ్లాడు. వారికి దగ్గర బంధువైన పోలిశెట్టి నరసింహమూర్తి కూడా కలిశాడు. జాతరలో ఒక స్టేజీపై యువకులు సినిమా పాటలకు అనుగుణంగా డీజేలతో డ్యాన్స్ చేస్తున్నారు. అదే సమయంలో సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఓ పాటకు అనుగుణంగా శివ గంగాధర్, నరసింహమూర్తి కూడా నృత్యాలు చేశారు. ఆ క్రమంలో బొమ్మ తుపాకీ పైకెత్తి చిందులు వేస్తూ సందడి చేశారు. అయితే నిజమైన తుపాకీతో వారు హల్చల్ చేసినట్టు ఒక టీవీ చానల్‌తో పాటు సోషల్ మీడియాలో శుక్రవారం ఉదయం వార్తలు ప్రసారమయ్యాయి. దీంతో కోనసీమ వ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. చల్లపల్లి చేరుకుని లోతైన విచారణ జరిపారు. చివరకు జాతరకు ఓ చిన్న పిల్లాడితో కలిసి వచ్చిన ఆకతాయిలు ఆ బొమ్మ తుపాకీ పట్టుకుని సరదాగా తిరిగారని తేల్చారు. బొమ్మ తుపాకీని స్వాధీనం చేసుకుని, దానితో జాతరకు వచ్చిన శివ గంగాధర్, నరసింహమూర్తిలపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. చెక్క, పల్చటి రేకు గొట్టాలతో ఆట»ొమ్మలా తయారు చేసిన ఆ బొమ్మ తుపాకీని డీఎస్పీ విలేకర్లకు చూపించారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ విలేకర్ల సమావేశంలో అమలాపురం రూరల్ సీఐ జి.సురేష్‌బాబు, ఉప్పలగుప్తం ఎస్సై జి.వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. -
బతుకు ఆగం జేసిన బొమ్మ తుపాకీ! 30 ఏళ్లు జైల్లో..
ఆ పెద్దాయనకు అస్సలు కిస్మత్ బాగోలేదు. అందుకే ముప్ఫైఏళ్ల క్రితం బొమ్మ తుపాకీతో బెదిరించి ఓ చోరీ చేశాడు. అదృష్టం బాగోలేక దొరికాడు. అది బొమ్మదని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. జీవిత ఖైదులో ముప్పై ఏళ్లు జైల్లోనే మగ్గాడు. చివరికి క్షమాభిక్ష దొరకడంతో జైలు నుంచి బయటపడేందుకు సిద్ధం అయ్యాడు. రోల్ఫ్ కయెస్టెల్(70).. అర్కన్సస్ రాష్ట్రంలో 1981లో ఓ చిరుతిళ్ల షాపులో దొంగతనం చేశాడు. బొమ్మ తుపాకీతో కౌంటర్ మీద ఉన్న వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. ఆ దొంగతనం కేసులో 40 ఏళ్ల జైలు శిక్ష.. బోనస్‌గా పదిహేను వేల ఫైన్ కూడా విధించింది కోర్టు. ఇక తాను చేసింది చిన్నతప్పేనని, క్షమాభిక్ష ప్రసాదించాలని కయెస్టెల్ అభ్యర్థిస్తూనే ఉన్నాడు. అంతెందుకు అతని చేతిలో దొపిడీకి గురైన వ్యక్తి కూడా.. వదిలేయాలని అధికారులను విజ్ఞప్తి చేస్తూ వచ్చాడు. ఐదుసార్లు క్షమాభిక్ష అప్పీల్ చేసుకున్నా అప్లికేషన్‌ను తిరస్కరించారు. సెలబ్రిటీలు సైతం అతని మంచి జీవితానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్లు నడిపించారు. చివరికి.. ఐదో సారికి అతనికి క్షమాభిక్ష దొరికింది. దీంతో పదేళ్ల ముందుగానే జైలు నుంచి బయటపడుతున్నాడు. అయితే విడుదల కోసం అతను మరో నెల రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ అసా హచిన్సన్ చేసిన ‘రోల్ఫ్ కయెస్టెల్ రిలీజ్’ ప్రతిపాదనను జనాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఇంతకీ అతను దొంగిలించిన సొమ్ము ఎంతంటే.. 264 డాలర్లు. -
బొమ్మతుపాకా అని అడిగినందుకు..
బరేలీ(యూపీ) : బొమ్మతుపాకో లేక నిజమైన తుపాకో తెలుసుకోవాలనుకున్న కామిని అనే పదేళ్ల బాలికపై విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపాడో వ్యక్తి. ఉత్తర్‌ప్రదేశ్‌లో సంబాల్ జిల్లాలోని కుర్ ఫతేఘర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాల్తా గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి అజయ్ పాల్ మౌర్య , అతని భార్య తమ వ్యవసాయ భూమిలో పని చేసుకుంటుండగా వారి కూతరు కామిని, కుమారుడు దగ్గరల్లోని గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో అటుగా వెళ్తున్నాడు. కామిని అతన్ని చూసి బొమ్మ తుపాకా అడగడంతో సదరు వ్యక్తి కోపంతో ఊగిపోయి బాలికపై కాల్పులు జరిపాడు. తాను అక్కడికి చేరుకునే లోపలే బుల్లెట్ గాయాలతో కామిని కిందపడిపోయిందని, ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడని అజయ్ తెలిపారు. బాలిక చేతు, పొట్టలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వలపన్ని నిందితుడు విద్యా రామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
బొమ్మ తుపాకీ చూపించి.. బ్యాంక్‌లో దోపిడీ
గచ్చిబౌలి: బురఖా ధరించిన ఓ వ్యక్తి బ్యాంక్ లోపలికి వెళ్లి బొమ్మ తుపాకీతో లాకర్ తెరవాలంటూ బ్యాంక్ మేనేజర్‌ను బెదిరించాడు. భయపడిన సిబ్బంది చేతులు పైకెత్తి వరుసగా నిలబడ్డారు. కౌంటర్లోని క్యాష్ తీసుకొని గన్ చూపిస్తూ పారిపోయాడు. దీనిని గుర్తించిన స్థానికులు రాళ్లతో దాడి చేసి, నిందితుడిని పట్టుకుని నగదుతో సహా బ్యాంక్ సిబ్బందికి అప్పగించారు. బ్యాంక్ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. సినిమా సీన్‌ను తలపించేలా ఉన్న ఈ సంఘటన మణికొండలోని కరూర్ వైశ్య బ్యాంక్‌లో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రాయదుర్గం సీఐ రాంబాబు, బ్యాంక్ మేనేజర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వైజాగ్, మహరిణిపేటకు చెందిన ప్రవీణ్ డేవిడ్ ఓయూ కాలనీలో ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం అతను బురఖా ధరించి, బొమ్మ తుపాకీ, యాసిడ్ బాటిల్, కత్తితో హుడాకాలనీలోని కరూర్ వైశ్యాబ్యాంక్‌లోకి ప్రవేశించాడు. మెయిన్‌డోర్ పక్కనే ఉన్న మేనేజర్ మహేందర్ కుమార్ క్యాబిన్‌లోని వెళ్లి బొమ్మ తుపాకీ చూపించి లాకర్ తెరవాలంటూ బెదిరించారు. దీంతో ఆందోళనకు గురైన మేనేజర్ సిబ్బంది వద్దకు పరుగు తీశాడు. నిందితుడు లే డౌన్ అంటూ తుపాకీ చూపించడంతో మేనేజర్‌తో పాటు సిబ్బంది ఒక వైపునకు వెళ్లి చేతులు పైకెత్తి వరుసగా నిలబడ్డారు. క్యాష్ కౌంటర్లోకి ప్రవేశించి నిందితుడు క్యారీ బ్యాగ్‌లో నగదు తీసుకొని బయటికి వెళుతూ రోడ్డుపై ఉన్న వారికి తుపాకీ చూపించి బెదిరించాడు. కొద్ది దూరం వెళ్లగానే స్థానికులు అతడిపై రాళ్లతో దాడి చేయడంతో తల కు తీవ్ర గాయాలైన అతడిని పట్టుకొని బ్యాంక్ సి బ్బందికి అప్పగించారు. నగదు తీసుకున్న బ్యాంక్ సిబ్బంది నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. నిందితుడికి అదే బ్యాంక్‌లో ఖాతా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి బొమ్మ తుపాకీ, కత్తి, యాసిడ్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు పరిశీలించారు. తుపాకీ అనుకుని బయపడ్డాం: మేనేజర్ నిందితుడి చేతిలో ఉన్నది తుపాకీ నిజమైన తుపాకీ అనుకొని బయపడ్డామని బ్యాంక్ మేనేజర్ మహేందర్ కుమార్ తెలిపారు. అతను తమను బెదిరించి క్యాష్ కౌంటర్లోని నగదు తీసుకొని పరారయ్యాడని. స్థానికులు అతడిని పట్టుకుని తమకు అప్పగించారన్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే.... బికాం వరకు చదువుకుని 2016లో విప్రోలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేశానని నిందితుడు ప్రవీణ్ డేవిడ్ తెలిపాడు. కొన్నాళ్లుగా ఉద్యోగం లేక పోవడంతో భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. రెండు రోజుల క్రితం సమీపంలోని కరూర్ వైశ్యా బ్యాంక్‌లో దోపిడీ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని భావించినట్లు తెలిపాడు. ఈ క్రమంలో టోలీచౌకీలో బురఖా, బొమ్మ తుపాకీ కొనుగోలు చేసినట్లు తెలిపాడు. -
ఆ డెలివరీ బోయ్ అంటే నేరస్తులకు దడదడ!
జపాన్‌లో నేరస్తుల పాలిట ఓ డెలివరీ బోయ్ సింహస్వప్నంలా మారాడు. ఆయుధాలతో వచ్చిన ఇద్దరు గ్యాంగ్స్టర్లను ఉత్త చేతులతో ఎదిరించి, అందరికీ ఆదర్శంగా నిలిచాడు. మత్సుబా - కై క్రైం సిండికేట్‌కు చెందిన ఇద్దరు నిందితులు యుసుకె కొడమా (32), హిడెకజు ఒబా (35) ఇద్దరూ దోపిడీకి ప్రయత్నించి.. చివరకు పోలీసులకు దొరికిపోయారు. వీళ్లిద్దరూ ఒక నకిలీ తుపాకీని డెలివరీ బోయ్ (38) ముఖంపై ఆడించి.. అతడి వద్ద ఉన్న ఓ ఖరీదైన వాచీని దోచుకోడానికి ప్రయత్నించారు. దాంతో చికాకు వచ్చిన ఆ బోయ్.. వాళ్ల దగ్గర్నుంచి ఆ తుపాకి లాక్కుని, తన ప్యాకేజిని కూడా వెనక్కి తీసుకున్నాడని టోక్యో పోలీసులు తెలిపారు. దాదాపు రూ. 5.33 లక్షల విలువచేసే రోలెక్స్ వాచీ కోసం ఒబా ఆర్డర్ చేశాడు. దానికి సంబంధించిన డబ్బు చెల్లించాల్సి వచ్చినప్పుడు.. డెలివరీ బోయ్ ముఖం మీద నకిలీ తుపాకి చూపించి, అక్కడినుంచి వెంటనే వెళ్లిపోవాలని బెదిరించారు. భయపడటానికి బదులు ఆ డెలివరీ బోయ్ వాళ్ల నుంచి తుపాకి లాక్కుని, పోలీసులకు ఫోన్ చేశాడు. డెలివరీ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి తమకంటే చాలా బలంగా ఉన్నాడని, అతడి ముందు తాము నిలబడలేకపోయామని పోలీసుల వద్ద ఒబా అంగీకరించాడు. ఇటీవలి కాలంలో దొంగలను కేవలం పోలీసులే కాక.. జపాన్ పౌరులు కూడా గట్టిగానే ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ డెలివరీ బోయ్‌లాగే వాళ్లు కూడా తమ పేర్లను మాత్రం వెల్లడించడం లేదు. -
బొమ్మ తుపాకీ చూపి.. బ్యాంక్ దోపిడీ
బెర్లిన్: 16 ఏళ్ల కుర్రాడు తెలివిమీరాడు. పెడదారి పట్టి పోలీసులకు పట్టుబడ్డాడు. బొమ్మ తుపాకీ చూపించి బ్యాంక్ సిబ్బందిని బెదిరించాడు. దర్జాగా లూటీ చేసి బైక్ మీద ఉడాయించాడు. పొరుగు దేశానికి పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వెంటనే అప్రమత్తమై అతన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన జర్మనీలో జరిగింది. దక్షిణ జర్మనీ ప్రాంతంలోని బవారియన్ పట్టణంలో గత వారం ఓ కుర్రాడు బ్యాంక్ లోకి ప్రవేశించాడు. ఆడుకునే తుపాకీ చూపించి బెదిరించడంతో బ్యాంక్ సిబ్బంది చేతులు పైకెత్తి హడలెత్తిపోయారు. దొంగకు కొంత సొమ్ము అప్పగించారు. అనంతరం పొరుగు దేశం ఆస్ట్రియా వెళ్లేందుకు ప్రయత్నించాడు. దేశ సరిహద్దు వరకు వెళ్లగలిగాడు. అయితే బోర్డర్ దాటుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. బొమ్మ తుపాకీతో బ్యాంక్ ను దోచుకున్నట్టు ఆ కుర్రాడు పోలీసులకు చెప్పాడు.