TPCC chief N. Uttam Kumar Reddy
-
కరోనా బాధితుల కోసం ఉచిత అంబులెన్సులు
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులకు ఉచితంగా సేవలందించేందుకు కాంగ్రెస్ పార్టీ మూడు అంబులెన్సులను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక సాయంతో కొనుగోలు చేసిన ఈ అంబులెన్సులను గాంధీభవన్‌లో సిద్ధంగా ఉంచింది. హైదరాబాద్‌లో 50 కిలోమీటర్ల పరిధి వరకు వీటిని ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, అంబులెన్స్ అవసరమైన వారు కంట్రోల్ రూం నెంబర్ 040–24601254కు ఫోన్ చేయాలని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు, డిశ్చార్జి తరువాత ఇంటికి వెళ్లేందుకు ఈ అంబులెన్సులను వినియోగించుకోవచ్చని తెలిపాయి. ఏఐసీసీ సూచనల మేరకు కరోనా సేవలో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు. ఆదివారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జెండా ఊపి అంబులెన్సులను ప్రారంభించారు. వణికిపోతున్న తెలంగాణ పల్లెలు: ఉత్తమ్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మాట్లాడుతూ, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కోవిడ్ మహమ్మారి పట్టణాలను దాటి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిందని, ప్రస్తుతం గ్రామీణ తెలంగాణ భయం గుప్పిట్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం కారణంగా ప్రజలు దినదినగండంగా బతకాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో కరోనాపై ప్రభుత్వ నియంత్రణ ఎక్కడా కనిపించడం లేదని, ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసి మధ్యతరగతి వర్గాలను పీక్కుతింటున్నా ప్రభుత్వానికి చలనం రావడం లేదని మండిపడ్డారు. పక్కరాష్ట్రాలు కరోనాకు ఉచిత వైద్యం అందిస్తుంటే ఇక్కడి ప్రజలు మాత్రం చికిత్స కోసం లక్షల రూపాయలు వెచ్చించి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం, కరోనా పరీక్షల విషయంలోనూ విఫలమైందన్నారు. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పాటించడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులను సైతం చేయడం లేదని దుయ్యబట్టారు. వెంటనే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక అంబులెన్సులు వేల రూపాయలు వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే ప్రభుత్వంలో కరువయ్యారని విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్‌గాంధీల సూచన మేరకు రాష్ట్రంలో కరోనా బాధితులకు సాయమందించడంలో కాంగ్రెస్ శ్రేణులు అంకిత భావంతో పనిచేస్తున్నాయని ఉత్తమ్ ప్రశంసించారు. తన సొంత ఖర్చుతో అంబులెన్సులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఆయన అభినందించారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలకు కూడా జగ్గారెడ్డి అండగా ఉంటున్నారని, కరోనా బాధితులకు ఎప్పటికప్పుడు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన కుమార్తె, కాంగ్రెస్ యువ నాయకురాలు టి.జయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క ఓటుతో ఇద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేస్తాం
చింతలపాలెం (హుజూర్నగర్) : హుజూర్‌నగర్‌లో ఒక ఓటుతో ఇద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేస్తామని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ క్యాంప్ కార్యాలయంలో ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. ఒక ఓటు వేసి పద్మావతిని గెలిపిస్తే తనతో పాటు పద్మావతి పని చేస్తారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ప్రజను ఎలా ఓటు అడుతున్నారని ప్రశ్నించారు. మాదిగ సామాజిక వర్గానికి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించలేదని, అందుకు మాదిగలు టీఆర్ఎస్ను బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి బెదిరింపు మాటలకు ఎవరూ భయపడవద్దని అన్నారు. ఆర్టీసీని లాభాపేక్షతో చూడొద్దని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి మద్దతు, సంఘీభావం తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో రింగ్ రోడ్డు, కోర్టు బిల్డింగ్, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ తదితర అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు. పాలకీడు మండలంలో కాల్వ చివరి భూములకు నీరు రాకపోవడంతో కొత్తలిఫ్ట్ నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. మిర్యాలగూడ, జగ్గయ్యపేట రైల్వే మార్గంలో ప్యాసింజర్ రైలు నడిపిస్తానని అన్నారు. హుజూర్నగర్ ప్రాంతలో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయిస్తానని చెప్పారు. మిర్యాలగూడెం – ఖమ్మం రోడ్డును విస్తరింపచేయిస్తానని, కేంద్ర ప్రభుత్వ నిధులతో అంతర్జాతీయ స్థాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం చేయిస్తానని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి కైలాష్ కుమార్, యరగాని నాగన్న గౌడ్, తన్నీరు మల్లిఖార్జున్ పాల్గొన్నారు. -
ఆచితూచి.. ప్రచారం..
కాంగ్రెస్ పార్టీ హంగూ.. ఆర్భాటం లేకుండా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తోంది. అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైన నియోజకవర్గాల్లోనే భారీ బహిరంగ సభల జోలికి వెళ్లకుండా రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారానికి పరిమితమవుతోంది. కామారెడ్డిలో ఇటీవల రోడ్‌షో నిర్వహించిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ నెల 11న బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి రానున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల ప్రచారం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. హంగూ.. ఆర్భాటం లేకుండా ప్రచారాన్ని కొనసాగిస్తోంది. టీఆర్ఎస్ మాదిరిగా భారీ బహిరంగసభల జోలికి వెళ్లకుండా ప్రస్తుతానికి రోడ్‌షో లు, ఇంటింటి ప్రచారానికి పరిమితమవుతోంది. అది కూడా పూర్తి స్థాయిలో స్పష్టత ఉన్న నియోజకవర్గాల్లోనే ఈ ప్రచారానికి తెరలేపారు. అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైన చోట్ల ఆశావహులు ప్రచారంపై దృష్టి సారించారు. కామారెడ్డిలో ఆ పార్టీ నుంచి బరిలోకి దిగనున్న షబ్బీర్‌అలీ ప్రచారాన్ని ప్రారంభించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితో ఇటీవల రోడ్‌షోలు నిర్వహించారు. భిక్కనూర్ నుంచి కామారెడ్డి వరకు కొనసాగిన ర్యాలీ రోడ్ షో ఆ పార్టీ శ్రేణుల్లో కొంత మేరకు ఉత్సాహం నిం పింది. ఇదే తరహాలో బోధన్ నియోజకవర్గంలో కూడా రేవంత్‌రెడ్డి తో ప్రచార కార్యక్రమాలను నిర్వ హించాలని నిర్ణయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి ఈ మేరకు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఈనెల 11న నియోజకవర్గానికి రానున్న రేవంత్‌రెడ్డి మొదట నవీపేట్ మండల కేంద్రం నుంచి రోడ్‌షోను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రెంజల్ మీదుగా బోధన్ పట్టణం వరకు రోడ్‌షో కొనసాగుతుందని నేతలు ప్రకటించారు. పట్టణంలోని అంబేద్కర్‌చౌరస్తాలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మరోవైపు ఆర్మూర్‌లో ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా దాదాపు 20 రోజుల క్రితం నుంచే గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మహాకూటమి పొత్తులు, టీడీపీకి కేటాయించనున్న స్థానం విషయంలో స్పష్టత లేకపోవడం, ఇంకా అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడంతో మిగిలిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రచా రం అంతగా సాగడం లేదు. కేవలం అసమ్మతి సెగలు లేని, స్పష్టత ఉన్న చోట్ల మాత్రమే ప్రచారం కొనసాగుతోంది. ఖరారు కాని టీపీసీసీ బహిరంగ సభలు.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార సభలకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే తొలి విడత సభల షెడ్యుల్‌లో నిజామాబాద్ జిల్లా ఖరారు కాలేదు. రెండో విడతలో ఈ సభలు జిల్లాలో నిర్వహించే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆర్థిక భారానికి జడిసి.. మరోవైపు పోలింగ్‌కు దాదాపు రెండు నెలలు గడువుంది. ఇప్పటి నుంచే ప్రచారం జోరుగా సాగిస్తే.. ఖర్చు తడిసి మోపెడవుతుందని భావిస్తున్న ఆశావహులు ప్రచారాన్ని కొద్ది కొద్దిగా జోరు పెంచాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ., కాంగ్రె స్ మాత్రం ఇంకా అభ్యర్థుల ప్రకటన ప్రక్రియను కూడా పూర్తి చేయలేదు. అభ్యర్థిత్వాలు ఖరారయ్యాక., ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు చల్లారిన తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేసే యోచనలో ఉన్నారు. -
మీ సంగతి చూస్తాం..
హసన్‌పర్తి (వరంగల్): ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఆపద్ధర్మ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై కేసులు పెడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. హసన్‌పర్తి మండలం భీమారంలోని జీఎంఆర్ గార్డెన్లో శుక్రవారం నిర్వహిం చిన మేధావుల ఫోరం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కార్ విపక్ష పార్టీలను అణచివేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. కేసులకు కాంగ్రెస్ భయపడదన్నారు. అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నాయకుల సంగతి చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా వసూలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగుల తల్లిదండ్రులకూ పెన్షన్ ఇస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. పెన్షన్ పొందే అర్హతను 65 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి స్త్రీలకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.2000, వికలాంగులకు రూ.1500 నుంచి రూ.3000కు పెంచుతామన్నారు. రాష్ట్రంలోని పది లక్షల మంది నిరుద్యోగులకు రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే 20 వేల టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. బీఎల్ఓలు, వీఏఓలకు నెలకు రూ.10 వేల వేతనం ఇస్తామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తామని ప్రకటించారు. వరి, మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ.2 వేలు, పత్తికి రూ.6 వేలు, పప్పులకు రూ.7 వేలు, మిర్చి, పసుపులకు రూ.10 వేలు మద్దతు ధర ఇస్తామన్నారు. పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రభుత్వమే అందుకు సంబంధించిన ప్రీమియంను చెల్లిస్తుందన్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. మేధావుల ఫోరం కన్వీనర్ ప్రొఫెసర్ అశోక్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జీ శ్రీనివాస కృష్ణన్, ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పోదెం వీరయ్య, విజయరామారావు, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, బందెల భ«ద్రయ్య, ఈవీ శ్రీనివాస్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, బత్తిని శ్రీనివాస్, గండ్ర జ్యోతి, వీసం సురేందర్‌రెడ్డి, డాక్టర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌దే గెలుపు : కొండా సురేఖ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రం తెలంగాణను తామే కొట్లాడి తెచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తాము మాట్లాడిందే వేదం.. తాము చేసిందే చట్టంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. అవినీతిలో రెండో స్థానం : పొన్నాల దేశంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ అవినీతిలో రెండో స్థానంలో ఉందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఉద్యమం సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిన కేసీఆర్ ఏ ఒక్కటి కూడా చేపట్టలేదని మండిపడ్డారు. -
మళ్లీ కాంగ్రెస్‌లోకి డీఎస్?..
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారా?. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అవుననే చెప్పాలి. ఈ గురువారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డీఎస్‌తో సమావేశం అయ్యారు. తిరిగి పార్టీలోకి రావాలని ఉత్తమ్ డీఎస్‌ను ఆహ్వానించారు. ఈ ఉదయం డీఎస్ ఇంటికి వెళ్లిన ఉత్తమ్ ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలో రాహుల్ గాంధీతో డీ శ్రీనివాస్ భేటీ కానున్నారు. గతంలో డీఎస్‌పై నిజమాబాద్ నేతలు కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన కొద్దిరోజులుగా టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి నిజామాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరికకు రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది. భూపతిరెడ్డికి నిజామాబాద్ రూరల్ టికెట్ కేటాయించినట్లు సమాచారం. -
సెంటిమెంట్ల కోసం ప్రజాధనం వృథా
సచివాలయం ముట్టడికి పీసీసీ యత్నం పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహా పలువురి అరెస్టు కూల్చివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పటిష్టంగా ఉన్న సచివాలయాన్ని వ్యక్తిగత మూఢ విశ్వాసాల కోసం కూల్చొద్దంటూ పీసీసీ గురువారం ఉద్యమించింది. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ముఖ్య నేతల నేతృత్వంలో పార్టీ శ్రేణులు.. సచివాలయం ముట్టడికి యత్నించాయి. శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు డి.కె.అరుణ, జి.చిన్నా రెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి, సంపత్ కుమార్, రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పీసీసీ నేతలు సర్వే సత్యనారాయణ, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, ఆరేపల్లి మోహన్, నేరెళ్ల శారద, అనిల్ కుమార్ యాదవ్, బల్మూరి వెంకట్ తదితరులు సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు. సచివాలయాన్ని కూల్చివేసి, రూ.వందల కోట్లు ఖర్చుతో కొత్తగా సచివాలయాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సచివాలయం వైపు దూసుకుపోయారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగాయి. షబ్బీర్ అలీ, సంపత్ కుమార్‌లను పోలీసులు నెట్టివేశారు. కొద్దిసేపు తోపులాట అనంతరం పోలీసులు నేతలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన పార్టీ నేతలను గాంధీనగర్, ఆబిడ్స, నాంపల్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఉత్తమ్ మాట్లాడుతూ, మంచిగా ఉన్న సచివాలయాన్ని కూల్చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్మార్గమని విమర్శించారు. సీఎం తీసుకున్న చర్య వల్ల రూ.వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. ఈ సచివాలయానికి వాస్తు బాగాలేదని, అందులోకి వచ్చిన వారు ఎవరూ పొడుగు కాలేద వ్యాఖ్యానించడం అనుచితమన్నారు. ఒక్క కేసీఆర్‌కే ఎందుకు అభద్రత ఇదే సచివాలయం నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు ఎన్నో ఏళ్లు పాలన సాగించారని, ఎన్నెన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు అందాయని ఉత్తమ్ చెప్పారు. అగ్నిమాపక జాగ్రత్తల్లేవని, పాత భవనాలని చెబుతూ కోర్టును కూడా ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఆరోపించారు. ఇదే సచివాలయం లో జడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబుతో సహా చాలా మంది సీఎంలుగా పని చేశారని గుర్తు చేశారు. వారికి లేని అభద్రత ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఎందుకొచ్చిందని ప్రశ్నిం చారు. సచివాలయంలోని కొన్ని భవనాల నిర్మాణం రెండేళ్ల క్రితమే పూర్తయిందని, అవి ఎట్లా పాతవో చెప్పాలన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నిధుల్లేవంటున్న ప్రభుత్వం రూ.వందల కోట్లను మూఢ విశ్వాసాల కోసం, వ్యక్తిగత సెంటిమెంట్ల కోసం వృథా చేస్తున్నారని విమర్శించారు. రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్మెంట్, ఆరోగ్యశ్రీకి బకారుులు, అభయహస్తం పించన్లు, హాస్టళ్ల నిర్వహణ, ఉపాధి హామీ కూలీల బకాయిలను చెల్లించడం లేదని ఆరోపించారు. దీంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిధుల్లేవంటూ కొత్త సచివాలయం కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేయాలనుకోవడం ప్రజా వ్యతిరేకమన్నారు.