Trading volume
-
ఈ మిడ్ క్యాప్స్ భలే స్పీడ్ సుమా!
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి మరింత జోరందుకున్నాయి. భారీ లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 480 పాయింట్లు జంప్‌చేసి 35,894కు చేరగా.. నిఫ్టీ 138 పాయింట్లు ఎగసి 10,567 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం భారీగా ఎగసింది. జాబితాలో జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, పాలీకేబ్ ఇండియా ఫోర్టిస్ హెల్త్‌కేర్, కింగ్ఫా సైన్స్ అండ్ టెక్నాలజీ, రాణే హోల్డింగ్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎన్ఎస్ఈలో ఈ ఎన్బీఎఫ్సీ షేరు ప్రస్తుతం 11 శాతం దూసుకెళ్లి రూ. 101 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 103 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 1.19 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 7.4 లక్షల షేర్లు చేతులు మారాయి. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ స్టీల్ పైపుల తయారీ ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 1778 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1792 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 2000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 4,000 షేర్లు చేతులు మారాయి. పాలీక్యాబ్ ఇండియా ఎలక్ట్రికల్ కేబుల్స్, అప్లయెన్సెస్ తయారీ ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8 శాతం జంప్‌చేసి రూ. 861 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1790 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 28,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 46,000 షేర్లు చేతులు మారాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్ హెల్త్‌కేర్ సర్వీసుల ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 6 శాతం పుంజుకుని రూ. 130 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 132 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 3.95 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 2.71 లక్షల షేర్లు చేతులు మారాయి. కింగ్ఫా సైన్స్ పాలీప్రొఫిలీన్ కాంపౌండ్స్ తయారీ ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 12 శాతం పురోగమించి రూ. 393 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 422 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 1400 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 3000 షేర్లు చేతులు మారాయి. రాణే హోల్డింగ్స్ ఆటో విడిభాగాల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 13 శాతం దూసుకెళ్లి రూ. 473 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 490 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 3000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1500 షేర్లు మాత్రమే చేతులు మారాయి. -
భారీ ట్రేడింగ్‌తో ఈ షేర్ల హైజంప్
అంతర్జాతీయ సంకేతాలకుతోడు దేశీయంగానూ సెంటిమెంటు బలపడటంతో మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 35,191కు చేరగా.. నిఫ్టీ 68 పాయింట్లు బలపడి 10,380 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ షేర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో మిశ్ర ధాతు నిగమ్(మిధానీ), ఇమామీ లిమిటెడ్, బిర్లా కార్పొరేషన్, మయూర్ యూనికోటర్స్, తాల్‌బ్రోస్ ఆటోమోటివ్, బనారస్ బీడ్స్ తదితరాలున్నాయి. వివరాలు చూద్దాం.. మిశ్ర ధాతు నిగమ్ పీఎస్‌యూ రంగ కంపెనీ మిశ్ర ధాతు నిగమ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6.5 శాతం జంప్‌చేసి రూ. 219 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 222 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 2.17 లక్షల షేర్లు కాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 2.76 లక్షల షేర్లు చేతులు మారాయి. \ ఇమామీ లిమిటెడ్ ఎఫ్ఎంసీజీ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం పురోగమించి రూ. 218 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 228 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 46,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1.26 లక్షల షేర్లు చేతులు మారాయి. బిర్లా కార్పొరేషన్ సిమెంట్ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 602 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 612 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 19,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 16,000 షేర్లు చేతులు మారాయి. మయూర్ యూనికోటర్స్ సింథటిక్ లెదర్ ప్రొడక్టుల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 206 సమీపంలో ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 3,600 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 3.19 లక్షల షేర్లు చేతులు మారాయి. తాల్‌బ్రోస్ ఆటోమోటివ్ ఆటో విడిభాగాల తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 13 శాతం దూసుకెళ్లి రూ. 114 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 120 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 7,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 31,000 షేర్లు చేతులు మారాయి. బనారస్ బీడ్స్ ఇమిటేషన్ ఫ్యాషన్ జ్యువెలరీ తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 46.3 వద్ద ఫ్రీజయ్యింది.బీఎస్ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 3,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 5,000 షేర్లు చేతులు మారాయి. -
ఈ మిడ్ క్యాప్స్ జోరు చూడతరమా
విదేశీ సానుకూల సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 525 పాయింట్లు జంప్‌చేసి 34,812కు చేరగా.. నిఫ్టీ 154 పాయింట్లు పెరిగి 10,296 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్ క్యాప్ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ కౌంటర్లు భారీ లాభాలతో మార్కెట్లను మించి కదం తొక్కుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం ఊపందుకుంది. జాబితాలో డిష్మన్ కార్బొజెన్, చెన్నై పెట్రోలియం, స్టార్ సిమెంట్, జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. డిష్మన్ కార్బొజెన్ హెల్త్‌కేర్ రంగ డిష్మన్ కార్బొజెన్ కౌంటర్లో అమ్మకందారులు కరువుకాగా.. కొనేవాళ్లు అధికమయ్యారు. దీంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 14 పెరిగి రూ. 86 వద్ద నిలిచింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 31,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.51 లక్షలకుపైగా షేర్లు చేతులు మారాయి. చెన్నై పెట్రోలియం ముడిచమురు శుద్ధి చేసే ఇంధన రంగ కంపెనీ చెన్నై పెట్రోలియం షేరు ఎన్ఎస్ఈలో 14 శాతం పురోగమించింది. రూ. 72 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 73 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 89,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.08 లక్షలకుపైగా షేర్లు చేతులు మారాయి. స్టార్ సిమెంట్ ప్రయివేట్ రంగ కంపెనీ స్టార్ సిమెంట్ షేరు ఎన్ఎస్ఈలో 14 శాతం జంప్‌చేసింది. రూ. 89 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 93 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 6,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 55,000 షేర్లు చేతులు మారాయి. జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ డైవర్సిఫైడ్, టైర్ల తయారీ కంపెనీ జేకే టైర్ షేరు ఎన్ఎస్ఈలో 12 శాతం జంప్‌చేసింది. రూ. 65 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 66 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 63,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.7 లక్షల షేర్లు చేతులు మారాయి. శ్రీరామ్ సిటీ యూనియన్ ఎన్బీఎఫ్సీ.. శ్రీరామ్ సిటీ యూనియన్ షేరు ఎన్ఎస్ఈలో 12 శాతం దూసుకెళ్లింది. రూ. 712 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 738 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 1,400 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 9,500 షేర్లు చేతులు మారాయి. -
29,600పైన స్థిరపడితే ర్యాలీ
మార్కెట్ పంచాంగం గత రెండు వారాల్లో మార్కెట్ పెరగడానికి కారణం ప్రపంచ సానుకూల ట్రెండే తప్ప బడ్జెట్ అంచనాలు కాదని, ఫలితంగా ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు సాదాసీదాగా వున్నా, మార్కెట్‌కు పతన ప్రమాదం లేదంటూ గత కాలమ్‌లో సూచించాము. ఇదే క్రమంలో బడ్జెట్ రోజున భారత్ స్టాక్ సూచీలు 4 వారాల గరిష్టస్థాయిలో ముగిసాయి. ముఖ్యంగా గతవారం చివరి రెండురోజుల్లో అత్యధిక ట్రేడింగ్ పరిమాణంతో సూచీలు పెరిగినందున, వెనువెంటనే పెద్దగా క్షీణించే అవకాశం లేదు. అయితే సూచీల్లో ఎక్కువ వెయిటేజీ వున్న ఐటీసీ షేరు రికార్డు గరిష్టస్థాయి నుంచి భారీ టర్నోవర్‌తో 8 శాతం పతనంకావడం ఆందోళనకారకం. ఇప్పటివరకూ సూచీలు గరిష్టస్థాయిలో ట్రేడ్‌కావడానికి ఐటీసీ సహకరిస్తూ వచ్చింది. ఇక నుంచి అప్‌ట్రెండ్ కొనసాగాలంటే ఐటీ, ఫార్మా షేర్లతో మరిన్ని రంగాల షేర్లు జతకలవాల్సివుంటుంది. ఇక సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... ఫిబ్రవరి 28తో ముగిసిన 6 రోజుల ట్రేడింగ్‌వారంలో 28,694-29,560 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 130 పాయింట్ల లాభంతో 29,361 పాయింట్ల వద్ద ముగిసింది. గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించినట్లు సెన్సెక్స్‌ను 29,500-600 శ్రేణి నిరోధించింది. రెండు వారాలుగా అవరోధం కల్పించిన ఈ శ్రేణిని చేధిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఆ సందర్భంలో 29,800 స్థాయికి చేరవచ్చు. ఆపైన స్థిరపడితే క్రమేపీ 30,100 స్థాయిని అందుకునే వీలుంటుంది. ఈ వారం 29,500-600 శ్రేణిపైన ముగియలేకపోతే 28,970 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 28,880-28,690 పాయింట్ల మద్దతు శ్రేణి కీలకం. ఈ శ్రేణి దిగువన ముగిస్తే మార్కెట్ డౌన్‌ట్రెండ్‌లోకి మళ్లవచ్చు. నిఫ్టీ కీలక నిరోధం 8,965 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,670-8,941 కదిలిన తర్వాత చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 68 పాయింట్ల లాభంతో 8,902 పాయింట్ల వద్ద ముగిసింది. జనవరి నెలలో 8,996 పాయింట్ల వరకూ ర్యాలీ జరిగిన సందర్భంగా 8,965 స్థాయి నుంచి అధిక ట్రేడింగ్ పరిమాణంతో నిఫ్టీ పడిపోయింది. ఈ కారణంగా వచ్చేవారం 8,965 పాయింట్ల నిరోధస్థాయిని దాటి, స్థిరపడితేనే తర్వాతి అప్‌ట్రెండ్ కొనసాగుతుంది. అటుపైన శరవేగంగా 9,030 పాయింట్ల వద్దకు ర్యాలీ జరగవచ్చు. 8,965 స్థాయిపైన కొద్దిరోజులపాటు నిలదొక్కుకోగలిగితే, క్రమేపీ 9,200 పాయింట్ల స్థాయికి కూడా నిఫ్టీ పెరిగే ఛాన్స్ వుంది. తొలి నిరోధంపైన స్థిరపడలేకపోతే 8,750 స్థాయికి తగ్గవచ్చు. గత నాలుగురోజుల్లో రెండు సందర్భాల్లో ఈ స్థాయి నిఫ్టీని సంరక్షించింది. ఈ స్థాయిని కోల్పోతే తిరిగి 8,670 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. రానున్న రోజుల్లో నిఫ్టీ ఈ స్థాయి దిగువన ముగిస్తే, మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తే ప్రమాదం వుంటుంది.