tragic event
-
పెళ్లి వేడుకలో అపశ్రుతి
కుషినగర్: వివాహ వేడుక ఏకంగా 13 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలోని నెబువా నౌరంగియా గ్రామంలో ఈ విషాద ఘటన బుధవారం రాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పరమేశ్వర్ కుష్వాహా ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. ఆయన కుమారుడి పెళ్లిలో భాగంగా స్థానికంగా ‘మట్‌కోర్బా’ అనే శుభకార్యం నిర్వహిస్తారు. కుష్వాహా ఇంటికి 100 మీటర్ల సమీపంలోని ఒక పాడుబడ్డ బావి దగ్గర ఈ వేడుక కొనసాగుతోంది. ఆ వేడుక చూసేందుకు జనం గుమిగూడారు. మూసేసి ఉన్న ఒక బావి పై మహిళలు, చిన్నారులు కూర్చుని వేడుక చూస్తున్నారు. 70 ఏళ్ల క్రితంనాటి వినియోగంలో లేని పాత బావిపై దాదాపు పదేళ్ల క్రితం వేసిన స్లాబ్ పాడైంది. సామర్థ్యానికి మించి దానిపై కూర్చోవడంతో అది ఒక్కసారిగా కూలింది. దీంతో 23 మంది బావిలో పడిపోయారు. హుటాహుటిన అక్కడి వారు లోపలి వారందరినీ పైకి తేగలిగారు. వారికి ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే 13 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యులు వెల్లడించారు. 10 మంది గాయపడ్డారు. ఈ గ్రామాన్ని ఎంపీ విజయ్ దుబే గతంలో దత్తత తీసుకున్నారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని జిల్లా మేజిస్ట్రేట్ రాజలింగం చెప్పారు. ఘటనపై ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. -
ఉత్తరప్రదేశ్‌లో విషాదం
► యమునా నదిలో పడవ మునిగి 19 మంది మృతి ► బాగ్పట్ జిల్లాలో ప్రమాద ఘటన బాగ్పట్: యమునా నదిలో పడవ మునిగి 19 మంది మరణించిన విషాద ఘటన గురువారం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి ప్రయాణికు లతో వెళ్తున్న పడవ బాగ్పట్ జిల్లా కేంద్రానికి 20 కి.మీ. దూరంలోని కాఠా గ్రామ సమీపంలో మునిగిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బోటులో 60 మంది వరకూ ప్రయాణిస్తున్నారని జిల్లా కలెక్టర్ భవానీ సింగ్ చెప్పారు. పడవ మునిగిన కాఠా గ్రామ సమీపంలో వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 20 మంది ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా.. 15 మందిని రక్షించారు. మొత్తం 22 మంది మరణించారని తొలుత ప్రకటించినా.. అనంతరం ఆ సంఖ్యను అధికారులు 19కి తగ్గించారు. ‘ మొదట 22 మంది మరణించారని భావించాం. అయితే మృతదేహాల మేరకు 19 మంది మరణించారని నిర్ధారించాం’ అని కలెక్టర్ సింగ్ చెప్పారు. ఈ సంఘటన అనంతరం స్థానికులు కోపంతో రెండు వాహనాలకు నిప్పుపెట్టారని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. -
కూటి కోసం వస్తే..కడుపుకోత
గోడ కూలి ఇద్దరు చిన్నారుల దుర్మరణం హైదరాబాద్: పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆ దంపతులకు కడుపుకోత మిగిలింది. ఇంటిగోడ కూలి వారి ఇద్దరు పిల్లలు నిద్రలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లారు. ప్రమాదం నుంచి స్వల్పగాయాలతో తల్లిదండ్రులు బయటపడ్డారు. సంజీవరెడ్డినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. కాగా ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సై లక్ష్మణ్ కథనం ప్రకారం... కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయికి చెందిన చింతకుంట రాజు కొంత కాలం క్రితం నగరానికి వచ్చి కూలీగా పని చేస్తున్నాడు. రాజు తన భార్య జ్యోతి, కుమారుడు సాయిచరణ్(ఏడాదిన్నర), కుమార్తె నవ్య(రెండున్నర)లను తీసుకొని గత ఆదివారం(29న) బోరబండ సైట్-3లోని వీకర్స్ సెక్షన్ దేవయ్యబస్తీలో వాంబే పథకంలో నిర్మించిన ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. సోమవారం రాత్రి అందరూ కలిసి భోజనం చేసి పడుకున్నారు. రాత్రి 10.30 ప్రాంతంలో ఇంటి మధ్యలో ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో గోడ పక్కనే పడుకుని ఉన్న చిన్నారులు సాయిచరణ్, నవ్య తలలకు తీవ్రగాయాలు కాగా... రాజు, జ్యోతిలకు స్వల్ప గాయాలయ్యాయి. గోడ కూలి పెద్ద శబ్దం రావడంతో కింది పోర్షన్లో ఉంటున్న వారు వచ్చి గాయాలకు గురైన చిన్నారులను బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందారు. స్వల్పగాయాలకు గురైన తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొంది డిశ్చార్జి అయ్యారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ రమణగౌడ్, ఎస్ఐ లక్ష్మణ్ హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి పరిశీరించారు. చిన్నారుల మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, రాజు,జ్యోతి దంపతుల మధ్య రాత్రి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. గోడ కూలినప్పుడు పెద్ద శబ్దం రావడంతో కింది పోర్షన్లో ఉండే యువకులు వెళ్లి తలుపు తట్టగా చాలా సేపటి వరకూ తెరవకపోవడం, పిల్లలకు తీవ్రగాయాలై, తల్లిదండ్రులకు స్పల్పగాయాలు కావడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూలిన గోడ అతి పురాతనమైందని.. అయితే, ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక వేరే కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.