transfered
-
‘గుండె’ను వీడని గమనం ‘కంటి’ని వదలని జ్ఞాపకం
ఓ పాత సినిమా.. కంటిచూపు దెబ్బతిన్న ఒక యువకుడికి, అంతక్రితమే మరణించిన మరో వ్యక్తి కళ్లను అమర్చుతారు.. ఆపరేషన్ సక్సెస్.. యువకుడికి చూపు బ్రహ్మాండంగా వచ్చేస్తుంది.. కానీ తరచూ ఎవరో వచ్చి తనను కత్తితో పొడుస్తున్నట్టుగా కళ్ల ముందు ఏదో దృశ్యం తారాడుతూ ఉంటుంది.. నిజానికి ఆ కళ్లకు సంబంధించిన వ్యక్తి చనిపోవడానికి కారణమైన ఘటన అది.ఇదంతా జస్ట్ సినిమాటిక్ ఫిక్షన్, అవయవాల్లో అలా జ్ఞాపకాలేవీ నిక్షిప్తమయ్యే అవకాశమే లేదన్నది ఇటీవలి వరకు ఉన్న భావన. కానీ ఎవరి అవయవాలనైనా మరొకరికి అమర్చినప్పుడు.. వారి లక్షణాలు, అలవాట్లు కూడా వస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధన చేశారు.సెల్యులార్ మెమొరీతోనే ఇదంతా! శరీరంలో అన్ని కణాలకు కొంత జ్ఞాపకశక్తి ఉంటుందన్న ‘సెల్యులార్ మెమొరీ’ సిద్ధాంతాన్ని కొలరాడో వర్సిటీ శాస్త్రవేత్తలు తెరపైకి తెస్తున్నారు. ప్రతి వ్యక్తికి సంబంధించి కిడ్నీలు, గుండె, కళ్లు... వంటి వాటిలో.. వారి శారీరక, మానసిక లక్షణాల జ్ఞాపకాలు ఉంటాయని చెప్తున్నారు. వేరేవారికి ఈ అవయవాలు అమర్చినప్పుడు వారిని ఈ ‘సెల్యులార్ మెమొరీ’ ప్రభావితం చేస్తుందని.. అందుకే వారిలో కొత్త లక్షణాలు, అలవాట్లు కనిపిస్తాయని అంటున్నారు. మన కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసుకుంటే కొత్త ఆప్షన్లు అందుబాటులోకి వచ్చినట్టుగా.. దీనిని పోల్చుకోవచ్చని చెప్తున్నారు.అవయవ మార్పిడికి ముందు, తర్వాత..శాస్త్రవేత్తలు యూనివర్సిటీ పరిధిలోని ఆస్పత్రిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న 47 మందిని స్టడీకి ఎంచుకున్నారు. ఇందులో కిడ్నీ, లివర్ నుంచి గుండె మార్పిడి వరకు చేయించుకున్నవారు ఉన్నారు. వారిలో అవయవ మార్పిడికి ముందు, తర్వాత ఉన్న అలవాట్లు, లక్షణాలను నమోదు చేశారు. అవయవ మార్పిడి తర్వాత ఎదుర్కొన్న అనుభవాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నో చిత్రమైన అంశాలు వెల్లడయ్యాయి.డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్‌ను నేరస్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపేశారు. అతడి గుండెను ఓ యువకుడికి అమర్చారు. అవయవ మార్పిడి తర్వాత తరచూ తనను ఎవరో దగ్గరి నుంచి కాల్చేస్తున్నట్టుగా కలలు వస్తున్నాయని.. బుల్లెట్ తాకినట్టుగా నుదుటిపై తీవ్రంగా నొప్పికూడా వస్తోందని ఆ యువకుడు డాక్టర్లకు చెప్పాడు.ఓ మూడేళ్ల పిల్లాడికి పవర్ రేంజర్స్ బొమ్మలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వాటితోనే ఆడుకునేవాడు. కానీ అతడికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశాక.. ఒక్కసారిగా ఆ బొమ్మలను దూరం పడేయడం మొదలుపెట్టాడు. చిత్రమేంటంటే.. అతడికి అమర్చిన గుండె ఓ ఏడాదిన్నర చిన్నారిది. పవర్ రేంజర్స్ బొమ్మలను అందుకోవడానికి ప్రయత్నిస్తూ.. కిటికీ నుంచి పడిపోయి చనిపోయాడు.ఇవే కాదు. ఆపరేషన్‌కు ముందు వరకు ఎంతో ప్రశాంతంగా ఉండే వ్యక్తి.. తర్వాత తీవ్రంగా కోపతాపాలకు, తీవ్ర భావోద్వేగాలకు గురవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. మరోవైపు ఎప్పుడూ మూడీగా ఉండే కొందరు.. ఆపరేషన్ తర్వాత యాక్టివ్‌గా మారడం, అందరితో చనువుగా ఉండటాన్ని గుర్తించారు. ఒక్కసారిగా కొత్త అలవాట్లు రావడం, అప్పటివరకు ఇష్టంగా చేసిన పనులు అసలే నచ్చకపోవడం, ఆధ్యాత్మిక నమ్మకాల్లోనూ మార్పులు రావడం వంటివీ గమనించారు. -
పరిగి ఎస్ఐ ఓబుల్‌రెడ్డిపై వేటు
పరిగి, వికారాబాద్ : పరిగి ఎస్ఐ 2గా విధులు పని చేస్తున్న ఓబుల్‌రెడ్డిపై వేటు పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఓ కేసు విషయంలో పరిగి ఠాణాకు తీసుకొచ్చి ఓ యువకుడిని చితకబాదిన ఘటన ఇటీవల వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో స్పందించిన ఆయా దళిత, ప్రజా సంఘాల నాయకులు ఎస్ఐ ఓబుల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈక్రమంలో ఎస్పీ అన్నపూర్ణను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఆమె ఏఎస్పీ నర్సింలును విచారణాధికారిగా నియమించి జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశించారు. ఆయన మూడు రోజుల క్రితం పరిగిని సందర్శించి విచారణ జరిపారు. అనంతరం ఎస్పీకి నివేదిక అందజేశారు. అయితే, ఆయా సంఘాల నాయకులు ఘటనపై ఆందోళన కొనసాగించారు. మంగళవారం టీ మాస్ నాయకులు పరిగిలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఎస్ఐ ఓబుల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఓబుల్‌రెడ్డిపై బదిలీ వేటు వేసినట్లు తెలిసింది. అయితే, వేరే ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై ఓ పోలీస్ అధికారిని వివరణ కోరగా బదిలీ చేసింది వాస్తవమే..ఇంకా ఉత్తర్వులు అందాల్సి ఉందని తెలిపారు. -
ఏపీలో ఐపీఎస్‌ల బదిలీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.. ⇒ విశాఖపట్నం ఐజీగా ఉన్న ఏ.శ్రీకుమార్ విశ్వజిత్ ఆర్డినేషన్ ఐజీగా బదిలీ అయ్యారు. ⇒ వెయిటింగ్లో ఉన్న ఎన్.శ్రీధర్‌రావుకు ఐజీ (సిబ్బంది)గా పోస్టింగ్ ఖరారుచేశారు. ⇒ అడిషనల్ డీజీపీ సి.అంజనా సిన్హాను బదిలీ చేసి, డీఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ⇒ ఐదో బెటాలియన్(విజయనగరం) కమాండెంట్ కె. కోటేశ్వరరావును ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు. -
అన్నవరం దేవస్థానం ఈఓ నాగేశ్వరరావు బదిలీ
- విజయనగరం జేసీ–2గా బదిలీ చేసిన ప్రభుత్వం - కొత్త ఈఓ వచ్చేవరకూ ఇన్‌ఛార్జి ఈఓగా ఏసీ జగన్నాధరావు? అన్నవరం: అన్నవరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావును విజయనగరం జాయింట్ కలెక్టర్–2గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించ లేదు. రెవెన్యూ విభాగానికి చెందిన పలువురు స్పెషల్ గ్రేడ్ డిఫ్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి జీఓ ఆర్ఎస్ నెంబర్.1267 విడుదల చేసింది. అందులో రెండో పేరుగా ఈయనది ఉంది. ఇన్‌ఛార్జి ఈఓగా ఏసీ జగన్నాధరావు? ఇన్‌ఛార్జి ఈఓగా దేవస్థానం ఏసీ జగన్నాథ రావును నియమించే అవకాశాలున్నాయి. గతంలో పనిచేసిన ఈఓలు కె. రామచంద్రమోహన్, ప్రసాదం వేంకటేశ్వర్లు బదిలీ అయినపుడు వెంటనే రెగ్యులర్ ఈఓలను నియమించకుండా దేవస్థానం ఏసీ జగన్నాధరావునే ఇన్‌ఛార్జి ఈఓగా నియమించారు. అదే ఆనవాయితీని ఇప్పుడు కూడా పాటిస్తారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ విషయం ముందే చెప్పిన ‘సాక్షి’ ... దేవస్థానం ఈఓ బదిలీ అవుతున్న విషయాన్నిఈ నెల ఐదో తేదీన ‘అన్నవరం దేవస్థానానికి కొత్త ఈఓ’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైంది. ఈఓ పనితీరుతో అసంతృప్తిగా ఉన్న జిల్లాకు చెందిన కొంతమంది రాజకీయ ప్రముఖులు సీఎం వద్దకు వెళ్లి ఈఓను బదిలీ చేసి దేవాదాయశాఖకు చెందిన మరో అధికారిని ఇక్కడ నియమించాలని కోరగా అందుకు సీఎం అంగీకరించినట్టు, దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని ఆ వార్తలో ప్రస్తావించాం. అన్నట్టుగానే గురువారం రాత్రి ఈఓ బదిలీకి సంబంధించి జీఓ విడుదలైంది. -
ఆ ఆరుగురికీ స్థానచలనం
- ఎన్నాళ్ల కెన్నాళ్లకు బదిలీవేటు - కదిలిన దేవాదాయశాఖ - ‘సాక్షి’ ఎఫెక్ట్ సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేవాదాయ శాఖలో ఎన్నో ఏళ్లు తరువాత కదలిక వచ్చింది. ఏళ్ల తరబడి ఒకే కార్యాలయంలో తిష్టవేసి అవినీతిని పెంచిపోషిస్తున్న ఉద్యోగులకు స్థాన చలనం కలిగింది. దశాబ్దాల కాలంగా పట్టించుకోని కాకినాడ డీసీ కార్యాయాన్ని ప్రక్షాళన చేశారు. అక్కడ పాతుకుపోయిన ఆరుగురు ఉద్యోగులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సాగిన అవినీతికి ఆలవాలంగా మారిన ఉద్యోగుల బండారాన్ని ఈ నెల 12న ‘ఆ ఆరుగురిదే హవా’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన దేవాదాయశాఖ ఉన్నతాధికారులు డీసీ కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్టవేసిన ఉద్యోగుల వివరాలు సేకరించారు. అందులో అటెండర్‌గా ఉద్యోగంలో చేరి ఇక్కడే జూనియర్, సీనియర్ అసిస్టెంట్లుగా కూడా పదోన్నతులు పొందిన వారు కొందరు. జూనియర్ అసిస్టెంట్‌గా జాయినై సూపరింటెండెంట్‌గా పదోన్నతిపై అదే కార్యాలయంలో పనిచేస్తూ పైసలివ్వందే ఫైళ్లు కదలని పరిస్థితి తీసుకువచ్చిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కాకినాడ డీసీ కార్యాలయంలో సుమారు 20 మంది అన్ని గ్రేడ్ల ఉద్యోగులు పని చేస్తుండగా వారిలో ఆరుగురు మాత్రం అక్కడే తిష్టవేసిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడం ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఆ క్రమంలోనే ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బదిలీల కౌన్సెలింగ్‌లో భాగంగా డీసీ కార్యాలయంలో ఏళ్లతరబడి తిష్ట వేసిన ఉద్యోగులను సాగనంపారు. ఆ ఆరుగురికి స్థానం చలనం... సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎ.విజయలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ కృష్ణారెడ్డిలను రాజమహేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దీపారాణిని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి, మరో ఇద్దరు ఉద్యోగులు సురేష్‌కుమార్, రాజేశ్వరిలను కాకినాడలోని దేవాదాయశాఖ కార్యాలయంలోని డివిజనల్ ఇంజినీర్ కార్యాలయానికి బదిలీ చేశారు. మరొక సీనియర్ అసిస్టెంట్ సి.హెచ్. ఉదయకుమార్బాబు రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు. ఈ బదిలీలపై డిప్యుటీ కమిషనర్ పరిధిలోకి వచ్చే ఆలయాలు, సత్రాల కార్యనిర్వాహణాధికారులు సంబరపడుతున్నారు. కార్యాలయానికి వెళ్లాలన్నా, ఫైళ్లు తీసుకువెళ్లాలన్నా చేయి తడపందే పనయ్యే పరిస్థితి ఉండేది కాదంటున్నారు. డీసీ కార్యాలయంలో ఏళ్లతరబడి తిష్టవేసిన ఆ ఆరుగురిపైన ఇన్నేళ్ల తరువాతైనా ఏకకాలంలో బదిలీ వేటు వేయడానికి కారణమైన సాక్షి’కి దేవాదాయశాఖ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
పట్టుశాఖలో 30 మంది బదిలీ
అనంతపురం అగ్రికల్చర్: పట్టుపరిశ్రమశాఖలో శనివారం జిల్లా స్థాయిలో సాధారణ బదిలీలకు సంబంధించి అర్హులైన ఉద్యోగులకు జేడీ అరుణకుమారి సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి వారిచ్చిన ఆప్షన్ల మేరకు బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. టెక్నికల్ ఆఫీసర్స్ 13 మంది, టెక్నికల్ అసిస్టెంట్స్ ఏడుగురు, ఆఫీస్ సబార్డినేట్స్ ఏడుగురు, డ్రైవర్లు ముగ్గురు బదిలీ అయ్యారు. -
కృష్ణా జిల్లా జేసీగా గంధం చంద్రుడు
హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి - జి.జయలక్ష్మీ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ - పి. ఉషా కుమారి పర్యటాక శాఖ ముఖ్య కార్యదర్శి - నీరబ్ కుమార్ ప్రసాద్ వర్షాభావ ప్రాంత అభివృద్ధి విభాగం ముఖ్య కార్యదర్శి - డి.శ్రీనివాసులు సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శి - ఎం.జగన్నాథం కృష్ణా జిల్లా జేసీ - గంధం చంద్రుడు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వీసీ, ఎండీ - రేఖారాణి ఆయుష్ విభాగం కమిషనర్ - నళినీ మోహన్ ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి - చిరంజీవి చౌదరి ప్రణాళిక శాఖ అదనపు కార్యదర్శి - శాంతిప్రియ పాండే ఇంధన శాఖ అదనపు కార్యదర్శి, నెడ్‌క్యాప్ ఎండీ - రాహుల్ పాండే -
టీటీడీలో పలువురు డిప్యూటీ ఈవోలు బదిలీ
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లో పలువురు డిప్యూటీ ఈవోలను బదిలీ చేస్తూ టీటీడీ ఈవో డీ సాంబశివరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీవారి ఆలయం పరకామణి డిప్యూటీ ఈవోగా శ్రీధర్‌ను నియమించారు. అలాగే రిసప్షన్ ఆర్1 గా కోదండ రామారావు, రిసప్షన్ ఆర్2 గా హరినాథ్‌ను నియమించారు. కోదండరామస్వామి ఆలయ డిప్యూటీ ఈవోగా భూపతిరెడ్డి, శ్రీనివాస మంగాపురం ఆలయ డిప్యూటీ ఈవోగా వెంకటయ్యను నియమించారు. -
11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
హైదరాబాద్: పదకొండు మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది. ఈ మేరుకు గురువారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం సచివాలయం జాయింట్ సెక్రటరీగా జగన్నాథంను బదిలీ చేసింది. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా జేఎస్వీ ప్రసాద్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన ముఖ్య కార్యదర్శిగా కృష్ణబాబు, ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా ఏఆర్ సుకుమార్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌గా బీడీ ప్రియదర్శిని, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కమిషనర్‌గా బి.కిషోర్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఈడీగా భారతి, ఇంటర్మీడియెట్ విద్యా శాఖ కమిషనర్‌గా అధర్‌సిన్హా, మదనపల్లి జాయింట్ కలెక్టర్‌గా నారాయణ్ భరత్‌గుప్తా,వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జీఎస్పీ దాస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.