రేవంత్‌రెడ్డికి జీవితాంతం చిప్పకూడే: పల్లా
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఇప్పటికే నెల రోజులు జైల్లో గడిపిన టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి తన తీరు మార్చుకోకపోతే జీవితాంతం జైలులో చిప్పకూడు తినక తప్పదని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. కోస్గిలో టీడీపీ పాదయాత్ర ముగింపు సందర్భంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుపై రేవంత్‌రెడ్డి అనుచిత విమర్శలు చేశారని మండిపడ్డారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌తో కలసి గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ దీపం ఆరిపోయే దశలో ఉందని, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్న చందంగా రేవంత్ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు.