జీవితాంతం గుర్తుండిపోతుంది
నటరాజన్ (కరాటే రాజు), సూర్య, పి.ఆర్. విఠల్‌బాబు ముఖ్య తారలుగా అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉద్యమసింహం’. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితం ఆధారంగా కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. కరాటే రాజు, నిర్మాత రాజ్ కందుకూరి బిగ్ సిడీని, నటుడు రవివర్మ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘కమల్‌హాసన్‌గారు నాకు కరాటే రాజా అనే పేరు పెట్టారు. నా అసలు పేరు కన్నా కరాటే రాజాగానే ఇండస్ట్రీలో తెలుసు. కేసీఆర్‌గారి పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.
జీవితాంతం గుర్తుండిపోయే పాత్ర. చాలెంజింగ్ రోల్. సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు కరాటే రాజా. ‘‘ఉద్యమ ఊపు ప్రచార చిత్రాల్లో కనిపిస్తోంది. ఖైలాష్ కేర్, వందేమాతరం శ్రీనివాస్ వంటి వారు ఈ సినిమాలోని పాటలు పాడారు. నేనూ చిన్న పాత్ర చేశాను’’ అన్నారు రవివర్మ. ‘‘బయోపిక్‌లు, ఉద్యమాల మీద సినిమాలు తీయడం కష్టం. ఈ సినిమా టీమ్ అందరిలో ఓ కసి కనిపిస్తోంది’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ‘‘కేసీఆర్‌గారి కథను మూడు గంటల్లో చెప్పడం కష్టం. అందుకే ఆయన జీవితంలోని ముఖ్య సంఘటనలు, ఉద్యమంలోని ముఖ్య అంశాలను తీసుకుని కథ తయారు చేశాను. ఈ నెలాఖరున చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత. ‘‘తెలుగు ప్రజలందరూ కేసీఆర్‌గారి గురించి తెలుసుకోవాలి’’ అన్నారు కృష్ణంరాజు.