ULC
-
‘మిగులు’కు మరో ఛాన్స్ '
♦ దరఖాస్తుల నమోదు గడువు పొడిగింపు ♦ ప్రభుత్వానికి లేఖ రాసిన యంత్రాంగం ♦ ఆక్రమణదారులు ముందుకు రాకపోవడమే కారణం ⇒ జిల్లాలోని 601 ఎకరాల మిగులు భూముల్లో ఖాళీస్థలాలను గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం.. వీటిని 5,700 మంది ఆధీనంలో ఉన్నట్లు తేల్చింది. ⇒ మీ సేవ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 4,627 అర్జీలే అందారుు. శివార్లలోని 12 పట్టణ మండలాల్లో క్షేత్రస్థారుులో యూఎల్సీ స్థలాలు పరిశీలించి మరీ సమాచారం అందించినా తక్కువ సంఖ్యలో దరఖాస్తులొచ్చారుు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్సీ) భూముల క్రమబద్ధీకరణ గడువును పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మిగులు భూముల క్రమబద్ధీకరణకు ఇదే చివరి ఛాన్ ్స అని హెచ్చరించినా ఆశించిన స్పందన రాలేదు. దీంతో ఆక్రమణదారులకు మరోసారి అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరుతూ జిల్లా యంత్రాంగం లేఖ రాసింది. జీఓ 92 కింద యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ర్ట సర్కారు వెసులుబాటు కల్పించింది. మిగులు భూములుగా గుర్తించిన స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రకటించింది. దీంట్లో భాగంగా జిల్లాలోని 601 ఎకరాల మిగులు భూముల్లో ఖాళీస్థలాలను గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం.. వీటిని 5,700 మంది ఆధీనంలో ఉన్నట్లు తేల్చింది. ఈ మేరకు గత నెల 25వ తేదీవరకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఒకవేళ క్రమబద్ధీకరణకు ముందుకు రాకపోతే.. వాటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. అరుునప్పటికీ మీ-సేవ కేంద్రాల ద్వారా 4,627 అర్జీలు మాత్రమే అందారుు. శివార్లలోని 12 పట్టణ మండలాల్లో క్షేత్రస్థారుులో యూఎల్సీ స్థలాలు పరిశీలించి మరీ సమాచారం అందించినా తక్కువ సంఖ్యలో దరఖాస్తులు నమోదు కావడంతో రెవెన్యూయంత్రాంగం ఆశ్చర్యపోరుుంది. అరుుతే గుర్తించిన భూములను క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తూ వీరందరికి నోటీసులు జారీ చేసినా.. నిర్ణీత వ్యవధిలో వారికి అందలేదని అధికారుల పరిశీలనలో బయటపడింది. అర్జీల సమర్పణ గడువు ముగిసిన తర్వాత చాలా మందికి నోటీసులు అందినట్లు తేలింది. ఇది దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి కారణమైనట్లు స్పష్టమైంది. దీనికితోడు.. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల అప్‌లోడ్‌లో జాప్యం, ఆక్రమణదారుల్లో చాలా మంది స్థానికంగా నివసించకపోవడం.. పొజిషన్ లో ఉన్నవారికి తమ స్థలాలు యూఎల్సీ పరిధిలో ఉన్నాయని తెలియకపోవడం కూడా దరఖాస్తులపై ప్రభావం చూపిందని గుర్తించింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల గడువును పెంచే అంశాన్ని పరిశీలించాలంటూ యూఎల్సీ ప్రత్యేకాధికారి ప్రభుత్వాన్ని కోరారు. కనీసం మూడు వారాలపాటు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఇవ్వాలని లేఖ రాశారు. -
చెక్ మెమోలివ్వకుండా దరఖాస్తుల తనిఖీ ఎలా?
* యూఎల్సీ ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణలో గందరగోళం * ప్రిప్రింటెడ్ చెక్ మెమోలు జారీ చేయని సీసీఎల్ఏ * 10లోగా పరిశీలన చేయాలంటున్న జాయింట్ కలెక్టర్లు సాక్షి, హైదరాబాద్: పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం (యూఎల్సీ) పరిధిలోని ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాల (హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్) నుంచి వచ్చిన సుమారు ఆరువేల దరఖాస్తులను పరిశీలించేందుకు రెవెన్యూ సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. యూఎల్సీ ఖాళీస్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను 90 రోజుల్లోగా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న ఉన్నతాధికారులు.. సదరు పరిశీలనకు అవసరమైన చెక్ మెమోను మాత్రం 45 రోజులు గడిచినా నేటికీ జారీ చేయలేదు. ఒకవైపు సీసీఎల్ఏ కార్యాలయం నుంచి రావాల్సిన ప్రిప్రింటెడ్ చెక్ మెమో రాకుండానే.. మరోవైపు జిల్లాల్లో దరఖాస్తుల పరిశీలన ఈ నెల 10లోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లినపుడు దరఖాస్తులోని పేరు, తండ్రి పేరు, చిరునామా, ఆధార్ నంబరు, స్థలం పొడవు, వెడల్పు.. తదితర వివరాలను తనిఖీ అనంతరం ప్రిప్రింటెడ్ చెక్ మెమోలోని వివరాలతో సరి చూడాలి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చెక్ మెమో అందకపోవడంతో ఒకే పనిని రెండు సార్లు చేయాల్సి వస్తుందని సిబ్బంది వాపోతున్నారు. సదరు స్థలానికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాలనూ చెక్ మెమోలో పేర్కొనాలని ఉన్నతాధికారులు ఆదేశించడం మరింత ఇబ్బందికరంగా తయారైంది. మండలాల్లో ద రఖాస్తుల పరిశీలనకు సర్వేయర్ల కొరత ఉండటం, ప్రిప్రింటెడ్ చెక్ మెమో అందకపోవడంతో పరిశీలన చేయడం ఎలాగంటూ తహసీల్దార్లు తల పట్టుకుంటున్నారు. క్రమబద్ధీకరణకు ఆరువేల దరఖాస్తులు: యూఎల్సీ భూములున్న ప్రాంతాల నుంచి సుమారు ఆరువేల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. గరిష్టంగా రంగారెడ్డి జిల్లాలో 5,600 దరఖాస్తులు రాగా, హైదరాబాద్ జిల్లాలో 300, వరంగల్ జిల్లా నుంచి సుమారు వంద దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. దరఖాస్తు గడువు గత నెల 25తో ముగిసింది. చివర్లో ఆధార్ నుంచి మినహాయింపు ఇచ్చినా ఆ సమాచారం ఎక్కువమందికి చేరలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలంటూ లబ్ధిదారులు జిల్లా కలెక్టర్లకు మొర పెట్టుకుంటున్నారు. కాగా యూఎల్సీ మిగులు భూముల ను డిక్లరెంట్ ద్వారా కొనుగోలు చేసిన పలువురు గ త ఎనిమిదేళ్లుగా స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. -
అంచనా తప్పింది!
♦ యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణకు స్పందన కరువు ♦ నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు ♦ గుర్తించిన ఖాళీ స్థలాల్లో సగానికే అర్జీలు ♦ నోటీసుల జారీలో యంత్రాంగం వైఫల్యం జిల్లా వ్యాప్తంగా 601 ఎకరాల విస్తీర్ణంలో వివాదరహిత స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 5,700 మంది పొజిషన్లో ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలో చాలామంది దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పటివరకు కేవలం 2,984 మందికే రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ లెక్క తప్పింది. మిగులు భూముల క్రమబద్ధీకరణ ఖజానాకు కాసులవర్షం కురిపిస్తుందని భావించిన సర్కారు అంచనాలు తలకిందులవుతున్నాయి. పట్టణ భూగరిష్ట పరిమితి (యూఎల్సీ) భూముల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం అని హెచ్చరించినా ఆక్రమణదారులు పెద్దగా స్పందించడం లేదు. ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తులు చే యని స్థలాలను స్వాధీనం చేసుకుంటామని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. ఖాళీ భూములను 22ఏ కింద ప్రభుత్వ భూములుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. జీఓ 92 కింద యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మిగులు భూములుగా గుర్తించిన స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 601 ఎకరాల విస్తీర్ణంలో వివాదరహిత ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తించిన జిల్లా యంత్రాంగం.. వీటిలో 5,700 మంది పోజిషన్లో ఉన్నట్లు నిర్ధారించింది. సగం మందికే నోటీసులు యూఎల్సీ స్థలాల రెగ్యులరైజేషన్‌కు ఇదే ఆఖరి చాన్స్ అని ప్రకటించిన జిల్లా యంత్రాంగం.. ఈ మేరకు శివార్లలోని 11 మండలాల్లో గుర్తించిన ఖాళీ మిగులు భూముల ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను వారం రోజుల క్రితమే పూర్తి చేసినట్లు ప్రకటించింది. ప్రతి కాలనీకి ప్రత్యేక బృందాలను పంపి మరీ క్రమబద్ధీకరణ సమాచారాన్ని చేరవేసినట్లు స్పష్టం చేసింది. అధికారయంత్రాంగం చెప్పినట్లు క్షేత్రస్థాయిలో నోటీసుల జారీ జరగలేదని, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. రాజధాని పరిసరాల్లో 11 మండలాల్లో 5,476 పార్శిళ్లలో యూఎల్సీ ఖాళీ స్థలాలున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు సర్వేలో తేలింది. తగ్గిన ఖాళీ స్థలాలు మిగులు భూములను కూడా క్రమబద్ధీకరణ పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కొన్నాళ్ల క్రితం రెవెన్యూ సిబ్బందితో జిల్లా యంత్రాంగం సర్వే చేయించింది. దీంట్లో 5,476 చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తించింది. తాజాగా క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీఓ జారీ చేయగానే వీటి సంఖ్య భారీగా తగ్గింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి మరి ఖాళీ స్థలాల జాబితా రూపొందించడంతో ఈ సంఖ్య 4,720గా తేలింది. ఈ మేరకు గుర్తించిన స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తూ వీరందరికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినా అది సాధ్యపడలేదు. అర్జీల సమర్పణకు తుది గడువు సమీపించినా.. ఇప్పటివరకు కేవలం 2,984 మందికే నోటీసులు అందజేసి రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకున్నారు. క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు పొడగిస్తారనే ధీమా కాబోలు.. నోటీసుల జారీని చాలా తేలికగా తీసుకున్నారు. మిగులు భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు ముందుకు రాకపోవడానికి అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ ధరకు అటు ఇటుగా వెచ్చించి కొనుగోలు చేసిన భూములకు ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కొందరికి సాధ్యంకాకపోవడం.. న్యాయపర చిక్కులు.. స్థలాలు చేతులు మారడం వంటివి దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. -
చివరి అవకాశం!
మిగులు భూముల క్రమబద్ధీకరణపై కలెక్టర్ రఘునందన్‌రావు ♦ 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి ♦ క్రమబద్ధీకరించుకోని స్థలాలు వెనక్కి.. ♦ యూఎల్సీ స్థలాల రెగ్యులరైజేషన్‌తో రూ.వెయ్యి కోట్ల రాబడిట ♦ విలేకరుల సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్సీ) భూములను క్రమబద్ధీకరించుకోవడానికి ఇదే చివరి అవకాశమని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు వెల్లడించారు. ఈ నె ల 25వ తేదీలోపు దరఖాస్తులను సమర్పించాలని, గడువు పొడగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ మిగులు భూములుగా గుర్తించిన ఖాళీ స్థలాలనే క్రమబద్ధీకరించనున్నట్లు ఆయన చెప్పారు. దరఖాస్తు చేయని మిగులు భూములను 22ఏ కింద ప్రకటించి వీటిని ప్రజోపయోగ అవసరాలకు లేదా వేలం ద్వారా ప్రభుత్వం విక్రయిస్తుందని తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో హైదరాబాద్ కలెక్టర్ రాహుల్‌బొజ్జ, జేసీ రజత్కుమార్సైనీతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. జంట జిల్లాల్లో 672 ఎకరాల విస్తీర్ణంలో వివాదరహిత యూఎల్సీ స్థలాలున్నాయని, వీటిని క్రమబద్ధీకరణకు జీఓ 92ను జారీచేసిన ట్లు తెలిపారు. ఆర్డీఓ అధ్యక్షతన గల కమిటీ మూడు వేల గజాల వరకు క్రమబద్ధీకరిస్తుందని, అపై విస్తీర్ణం కలిగిన స్థలాలు మాత్రం ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 601 ఎకరాల విస్తీర్ణంలో మిగులు భూములు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామని, ప్రతి కాలనీకి ప్రత్యేక బృందాలను పంపి క్రమబద్ధీకరణ సమాచారాన్ని ఆక్రమణదారులకు తెలియపరిచామని తెలిపారు. నిర్ధారించిన ఖాళీ మిగులు భూములు 5,700 మంది పొజిషన్లో ఉన్నట్లు గుర్తించామని, వీరిలో 250 గజాల్లోపు దాదాపు 4,200 మంది వరకు ఉన్నారని తెలిపారు. అంతేగాకుండా.. ఆయా భూములకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 750 దరఖాస్తులు వచ్చాయని, రెండు జిల్లాల్లో యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణ ద్వారా కనిష్టంగా రూ.1000 కోట్ల మేర ఖజానాకు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్న గురుకుల్ ట్రస్ట్ భూములను క్రమబద్ధీకరించే అవకాశంలేదని కలెక్టర్ రఘునందన్ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 71 ఎకరాల పరి ధిలో ఖాళీ మిగులు భూములున్నాయని, వీటి ని క్రమబద్ధీకరిస్తామని రాహుల్ బొజ్జ చెప్పా రు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దరఖాస్తు ఇలా... ♦ రిజిస్టర్ సేల్ డీడ్, దరఖాస్తు పత్రం, ఆధార్ కార్డును జతపరిచి మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు సమర్పించాలి. ♦ దస్తావేజు గత నెల 26వ తేదీకి ముందు రిజిస్టర్ అయి ఉండాలి. ♦ దరఖాస్తుతోపాటు రూ.2,035 ప్రాసెస్ రుసుము మీ సేవ కేంద్రంలో చెల్లించాలి. ♦ క్రమబద్ధీకరణ ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన మిగులు భూములకే వర్తిస్తుంది. చెల్లించాల్సిన రుసుం ♦ 250 గజాల వరకు మే 26, 2016 నాటి రిజిస్ట్రేషన్ విలువలో 25శాతం ♦ 251 -500 గజాల వరకు నిర్దేశిత విలువలో 50 శాతం ♦ 500 గజాలపైబడిన స్థలాలకు నిర్ధిష్ట రిజిస్ట్రేషన్ విలువలో 75 శాతం ♦ గుర్తించిన మురికివాడల్లో 125 గజాల వరకు పది శాతం ♦ క్రమబద్ధీకరణకు అర్హమైనవిగా తేల్చి నోటీసులు అందుకున్న దరఖాస్తుదారులు నెలరోజుల్లోపు 40శాతం, ఆ తర్వాత మూడు మాసాల్లో 30శాతం, మిగతా మొత్తం నోటీసు తీసుకున్న ఏడు మాసాల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. ♦ నిర్దేశిత మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించినవారికి ఐదుశాతం డిస్కౌంట్‌ను కూడా ప్రభుత్వం ప్రకటి ంచింది. -
పాఠాలు నేర్వలే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల ధరలు ఆకాశన్నంటుతుండడం.. శివార్లలో వలసలు పెరిగిపోవడంతో ఆక్రమణకు గురవుతున్న సర్కారు స్థలాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం 2008లో 166 జీఓను జారీ చేసింది. చాలా ఏళ్ల తర్వాత క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించడంతో 90,677 దరఖాస్తులొచ్చాయి. వీటన్నింటిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు 79,549 దరఖాస్తులు తిరస్కరించగా, 7,683 దరఖాస్తులకు మాత్రమే జిల్లాస్థాయి కమిటీ ఆమోదముద్ర వేసింది. 80 గజాలవే ఎక్కువ.. క్రమబద్ధీకరించిన వాటిలో అధికం 80 చదరపు గజాల్లోపు స్థలాలే. ఈ కేటగిరీలో 32,927 దరఖాస్తులను అనర్హమైనవిగా తేల్చిన జిల్లాస్థాయి కమిటీ 3,811 అర్జీలను ఓకే చే యడం ద్వారా 53.05 ఎకరాలను క్రమబద్ధీకరించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు ఉచితంగా ఇళ్లపట్టాలివ్వాలని నిర్ణయించడంతో ఖజానాకు నయాపైసా సమకూరలేదు. ఇక 81-250 గజాలకు సంబంధించి 3,872 దరఖాస్తులకు ఆమోదముద్ర వేసిన యంత్రాంగం 110.12 ఎకరాలకు యాజమాన్య హక్కులు కల్పించింది. 251 నుంచి 500 చ.గజాల వరకు వచ్చినవాటిలో 1,064 దరఖాస్తులకు సీసీఎల్ఏ మోక్షం కలిగించింది. తద్వారా 72.18 ఎకరాలను క్రమబద్ధీకరించింది. ఆపై విస్తీర్ణం కలిగిన చాలావాటిని ప్రభుత్వం తిరస్కరించగా, 351 దరఖాస్తులు ఇప్పటికీ పరిశీలనలో ఉన్నాయి. లోపాల పుట్ట! కమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన 58,59 జీఓలు తప్పుల తడకగా ఉన్నాయి. మరి ముఖ్యంగా కనీస ధరల వర్తింపులో మార్కెట్ ధరలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించింది. వాస్తవికతను పరిగణనలోకి తీసుకోకుండా 2014 బేసిక్ వాల్యూ మేరకు స్థలాలను క్రమబద్ధీకరించాలనే నిర్ణయం దరఖాస్తుదారులకు ఆశనిపాతంగా పరిణమించింది. శివార్లలో ఇప్పటికే కొన్నిచోట్ల బహిరంగ మార్కెట్లో కంటే రిజిస్ట్రేషన్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు మాదాపూర్ ప్రాంతంలో ప్రస్తుతం కనీస ధర రూ.20వేలు పలుకుతుండగా, ఈ విలువను చెల్లించి స్థలాలను క్రమబద్ధీకరించాలనడం సరికాదనే వాదన వినిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నవారికీ, ఇటీవల ఆక్రమించిన వారిని ఒకే గాటిన కట్టడాన్ని అధికారవర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణలోనూ ప్రభుత్వం మెలిక పెట్టింది. నిర్మాణాలుంటేనే స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామని నిబంధన విధించింది. రెండు తప్పులు చేసిన వారిపట్ల కరుణ చూపి.. తెలిసో తెలియకో స్థలం కొన్నపాపానికి తమను శిక్షించడమేమిటనే వాదన వినిపిస్తోంది. సేల్‌డీడ్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నప్పటికీ, నిర్మాణం లేదనే సాకుతో తమను విస్మరించడంపై అభ్యంతరం చెబుతున్నారు. క్రమబద్ధీకరించే స్థలంపై పరిమితి విధించకపోవడంతో భారీ విస్తీర్ణంలోని సినిమా థియేటర్లు, ఫంక్షన్‌హాళ్లు కూడా ఈ ముసుగులో రెగ్యులరైజ్ అవుతాయనే ప్రచారమూ జరుగుతోంది. క్రమబద్ధీకరణ అధికారం ఆర్డీఓలకు కట్టబెట్టడాన్ని రెవెన్యూ వర్గాలే వ్యతిరేకిస్తున్నాయి. గతంలో 80 గజాల్లోపు జాగాల క్రమబద్ధీకరణలో నామమాత్రపు ఫీజును వసూలు చేయడం ద్వారా స్థలంపై హక్కులను కల్పించారు. తాజాగా స్థల విస్తీర్ణం పెంచినప్పటికీ, స్థలంపై యాజమాన్య హక్కులు లేకపోవడం పేదలను నిరాశపరుస్తోంది. -166 జీఓ కింద పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రభుత్వం ప్రస్తావించలేదు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, యూఎల్సీ కింద దరఖాస్తు చేసుకున్నవాటికీ, ఇప్పటికే కొంత మొత్తాన్ని చెల్లించినవారికీ ఇప్పటి ధరల తరుగుదలను వర్తింపజేస్తారా? లేదా అనే అంశంపై స్పష్టీకరించలేదు.