umpires decision
-
రాహుల్‌ది క్లియర్‌గా ఔట్.. అదొక చెత్త నిర్ణయం.. మండిపడ్డ గంభీర్!
Gautam Gambhir And Graeme Swann Rage At 3rd umpire Decision: ఐపీఎల్లో 2021లో నిష్క్రమణ చేరువగా వచ్చిన దశలో పంజాబ్ కింగ్స్‌కు కీలక విజయం దక్కింది. శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. కాగా, పంజాబ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో కేఎల్ రాహుల్ భారీ షాట్‌కు ప్రయత్నించగా అది మిస్ టైమ్ అయ్యింది. దీంతో రాహుల్ త్రిపాఠి పరిగెత్తుతూ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. అయితే ఫీల్ఢ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ నాటౌట్‌గా ప్రకటించి థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. ఈ క్రమంలో ఒకే కోణంలో పరిశీలించిన థర్డ్ అంపైర్ ఫీల్ఢ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఆధారంగా నాటౌట్ ప్రకటించాడు. అయితే రీప్లేలో బాల్ కింద త్రిపాఠి చేతివేళ్లు ఉన్నట్టు క్లియర్‌గా కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అది క్లియర్‌గా ఔట్ అని తెలిసినా.. ఇవ్వలేదని సీనియర్ క్రికెటర్ల దగ్గర నుంచి నెటిజెన్ల వరకు అందరూ మండిపడుతున్నారు. ఈ విషయంపై భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్, ఇంగ్గండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఘాటుగా స్పందించారు. థర్డ్ అంపైర్ నిర్ణయం షాక్‌కు గురి చేసిందిని గంభీర్ తెలిపాడు. "అది నిజంగా ఒక షాకింగ్ నిర్ణయం. అది క్లియర్‌గా ఔట్. అతడు ఒకటి కంటే ఎక్కువసార్లు రీప్లేని కూడా చూడాల్సిన అవసరం లేదు. స్లో-మోషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే.. అది క్లియర్‌గా కనిపిస్తుంది. చివరి ఓవర్లలో పంజాబ్ కాస్త ఒత్తిడికి గురి అవుతున్నట్లు కనిపించింది. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి మేజర్ లీగ్‌లో ఇలా జరగకూడదు. ఇది ఆటగాడికి మాత్రమే కాకుండా మొత్తం ఫ్రాంచైజీకి నష్టం కలిగించవచ్చు " అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో చెప్పాడు. అదే విధంగా గ్రేమ్ స్వాన్ మాట్లడూతూ.. ఇప్పటి వరకు తను చూసిన థర్డ్ అంపైరింగ్ చెత్త నిర్ణయాల్లో ఇది ఒకటి అని అతడు విమర్శించాడు. "నేను నా జీవితంలో చూసిన అత్యంత దారుణమైన థర్డ్ అంపైరింగ్ నిర్ణయాల్లో ఇది ఒకటి. అది క్లియర్‌గా ఔట్ అని తెలుస్తోంది. త్రిపాఠి అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు." అని స్వాన్ పేర్కొన్నాడు. కాగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (67), మయాంక్ అగర్వాల్ (40) రాణించడంతో కోల్‌కతా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చదవండి: Virender Sehwag: ‘ఇక చాలు... ఈసారి ముంబై అస్సలు పైకి రావొద్దు’ -
ఆ ఆప్షన్ అంపైర్లకెందుకు ఉండకూడదు..?
అహ్మదాబాద్: టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వివాదాస్పద రీతిలో ఔటైన తీరుపై కెప్టెన్ విరాట్ కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాలుగో టీ20లో సామ్ కర్రన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ ఆడిన షాట్‌ను డేవిడ్ మలాన్ వన్ స్టెప్ క్యాచ్ పట్టాడు. బంతి నేలకు తాకి ఫీల్డర్ చేతిలో పడ్డట్టు స్పష్టంగా కనిపించినా అంపైర్ ఔటివ్వడాన్ని కోహ్లి తప్పుపట్టాడు. అనుమానాస్పద క్యాచ్ విషయంలో థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ కాల్ ఆధారంగా ఔట్‌గా ప్రకటించడంపై ఆయన మండిపడ్డాడు. ఇలాంటి సందర్భాల్లో అంపైర్లకు 'నాకు తెలీదు' అనే ఆప్షన్ ఎందుకుండకూడదని ఆయన ప్రశ్నించాడు. కాగా, అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించి, 2-2తో సిరీస్‌ను సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. నాల్గో టీ20లో భాగంగా స్యామ్ కరన్ వేసిన 14వ ఓవర్ తొలి బంతిని స్వీప్‌షాట్‌తో లెగ్‌సైడ్ సిక్సర్ బాదిన యాదవ్ తర్వాత బంతిని అలాగే ఆడాడు. కానీ ఫైన్‌లెగ్‌లో మలాన్ క్యాచ్‌పట్టాడు. అయితే బంతి అతని చేతుల్లో పడీపడగానే నేలనీ తాకింది. టీవీ అంపైర్ పలుమార్లు రీప్లే చేసి నిమిషాలపాటు చూసి ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన ‘సాఫ్ట్ సిగ్నల్ అవుట్’కే మొగ్గుచూపడంతో సూర్యకుమార్ క్రీజు వీడాడు. అంత స్పష్టంగా నేలను తాకినా అవుటివ్వడంపై డగౌట్లో ఉన్న కోహ్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. కెరీర్లో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టాడు. శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. ఆర్చర్‌కు 4 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (23 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జేసన్ రాయ్ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఈ దశలో 17వ ఓవర్ వేసిన శార్దుల్ వాళ్లిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. కోహ్లి సేన 8 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. -
అది నన్ను తీవ్రంగా దెబ్బతీసింది: ప్రీతి జింటా
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ అసలైన ఐపీఎల్ మజా ఏంటో రుచి చూపించింది. సూపర్ ఓవర్‌దాకా వెళ్లిన మ్యాచ్‌లో రబాడా అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మయాంక్ అగర్వాల్(89) అసాధారణ ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లలో 8 వికెట్లకు 157రన్స్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు రబాడ వేసిన మొదటి బంతికి రెండు పరుగులు రాబట్టింది. రెండో బంతికి కేఎల్ రాహుల్, మూడో బంతికి పూరన్ ఔట్ కావడంతో పంజాబ్ కథ ముగిసింది. 3 పరుగుల లక్ష్యంతో సూపర్ ఓవర్ బరిలోకి దిగిన ఢిల్లీ సునాయాసంగా ఛేదించి సూపర్ విక్టరీ అందుకుంది. (ఢిల్లీని బోణీ కొట్టించిన రబడ) అయితే పంజాబ్ చేజింగ్ చేస్తున్న సమయంలో 19వ ఓవర్లో ఫీల్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పడు సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది. రబాడా వేసిన 19వ ఓవర్లో మూడవ బంతిని ఎక్స్ట్రా కవర్‌వైపు ఆడి రెండు పరుగులు తీశారు. అయితే ఆన్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వాటిలో మొదటి పరుగు షార్ట్ రన్‌గా నిర్ణయించాడు. టీవీ రీప్లేలో మాత్రం పరుగును పూర్తి చేసినట్టే కనిపించింది. దీంతో మీనన్ నిర్ణయంపై పంజాబ్ యజమాని ప్రీతిజింటా అది సరైన నిర్ణయం కాదంటూ ఫైర్ అయ్యింది. (రైజింగ్‌కు వేళాయె...) ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతాలో.. 'నేను కరోనా మహమ్మారిని సంతోషంగా జయించాను. 6 రోజుల హోం క్వారంటైన్, 5 కోవిడ్ పరీక్షలు చిరునవ్వుతో పూర్తి చేసుకున్నాను. కానీ ఒక షార్ట్ రన్ నన్ను తీవ్రంగా దెబ్బతీసింది. టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే దాని ప్రయోజనం ఏమిటి..?. బీసీసీఐ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాల్సిన సమయం ఇది. ఇలా ప్రతి సంవత్సరం జరగదు' అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో.. 'నేను ఎప్పుడూ ఆటలో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తాను. అయితే ఆటలో మరిన్ని మార్పులు, నిబంధనలు కూడా చాలా ముఖ్యం. జరిగిపోయిన విషయాలను వదిలేసి భవిష్యత్‌లో అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతూ సానుకూల థృక్పథంతో ముందుకు సాగాలి' అంటూ ట్వీట్ చేసింది. -
మ్యాక్స్‌వెల్‌కు మందలింపు
ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ను మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా హెచ్చరించారు.