unity of country
-
విచ్ఛిన్న శక్తులను ఎదిరిద్దాం
కేవాడియా: భారతదేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు శత్రువులు కుట్రలు పన్నుతున్నారని, అలాంటి కుయుక్తులకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విచ్ఛిన్నకర శక్తులను ఎదిరించాలని అన్నారు. దేశ తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్‌లోని కేవాడియాలో ఐక్యతా ప్రతిమ (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) వద్ద ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘‘మోర్బీ వంతెన దుర్ఘటనలో మృతిచెందిన వారి పట్ల నా మనసంతా ఆవేదనతో నిండిపోయింది. అయినా విధి, బాధ్యత నన్నిక్కడి తీసుకొచ్చాయి’’ అన్నారు. ఐక్యతా ప్రతిమ వద్ద సాంస్కృతిక నృత్యాలను ప్రమాదం దృష్ట్యా రద్దు చేశారు. ‘‘పటేల్ లాంటి నాయకుడు లేకపోతే ఇండియా పరిస్థితి ఏమిటో ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ఐక్యత అనేది మనకు నిర్బంధం, బలవంతం కాదు. అదే మన విశిష్టత. గతంలో వెదజల్లిన విషం తాలూకూ దుష్పరిణామాలు ఇప్పుడూ కనిపిస్తున్నాయి. విదేశీ శక్తులు మనకు చేటు చేసేందుకు చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాయి. వారికి గుణపాఠం చెబుదాం’’ అన్నారు. పటేల్ ప్రధాని అయ్యుంటే... జయంతి వేడుకలో అమిత్ షా వ్యాఖ్యలు న్యూఢిల్లీ: సర్దార్ పటేల్ భారత తొలి ప్రధాని అయితే ప్రస్తుతం దేశానికి కొన్ని సమస్యలుండేవి కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పటేల్ 147వ జయంతి సందర్భంగా ఢిల్లీలో సర్దార్‌పటేల్ పాఠశాల విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘లక్షద్వీప్, జోధ్‌పూర్, జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్ వంటి కీలక సంస్థానాలను పటేలే దేశంలో విలీనం చేశారు. కాంగ్రెస్ వర్కింట్ కమిటీలో అత్యధిక ఓట్లు సాధించినా ప్రధాని పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు దేశాన్ని కొన్ని అంశాలు వేధిస్తున్నాయి’’ అని అన్నారు. సర్దార్ పటేల్‌కు మోదీ సెల్యూట్ -
ముమ్మాటికీ మనమే నేరస్తులం
మనిషి సంఘజీవి. సంఘంలో ప్రాతినిధ్యం ప్రారంభమైన దశ నుంచి (గ్రీకుల కాలం తరువాత) తన ప్రాబల్యం కోసం స్వార్థ చింతన పెంచుకోవడం ప్రారంభించాడు. అక్కడ ప్రారంభమైన ఈ స్వార్థం ఎక్కడికి దారితీసిందంటే తన సొంత మనుషులకు కూడా ప్రమా దం జరిగిందంటే ఆందోళన చెందనంత స్థాయికి చేరుకుంది. మహాకవి కాళోజీ గారన్నట్లు ‘తనకు అందినంత వరకు తనదని, తనకు అందనిది, కనిపించినంత వరకు మనదని’ సొమ్ము చేసుకు నేంత స్వార్థం మనిషిలో పెరిగి పోయిన కాలంలో తన సౌకర్యం, విలాసాల కోసం ప్రకృతిని వాడు కుని నాశనం చేయడం ప్రారం భించి, అదే పరోక్షంగా తన వినాశ నానికి కారణం అయ్యేంతవరకూ తెచ్చుకున్నాడు. స్వైన్‌ఫ్లూ, ఎబోలా, ‘జికా’. ఈ వైరస్‌లకు పూర్తి వైవిధ్య మైనది నేడు మనం ఎదుర్కొంటున్న మహమ్మారి ‘కరోనా వైరస్’. మానవ ఆరోగ్య చరిత్రలో మొదటి వైరస్, వ్యాధి అయిన సిర్సాను సృష్టించిన చైనానే కరోనా వైరస్ వ్యాప్తికి కూడా దోహదం చేసింది. చైనాలోని వూహాన్ నగరంలో మొదటి కేసు నమోదై మొత్తం దేశం వ్యాపించి ప్రపంచాన్ని చుట్టేసింది. చిన్న చిన్న దీవుల నుంచి అగ్ర రాజ్యమైన అమెరికా వరకు బీద బిక్కి, ధనిక దక్కి లేకుండా భయ కంపితులను చేస్తోంది. చైనా తర్వాత అత్యంత జనాభా కలిగిన దేశం మనది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్థికంకన్నా మన ఆహార్యం గొప్పది, మెడిసిన్ కన్నా మన మేధస్సు గొప్పది. ఐక్యతే ఈ దేశంలో మహ మ్మారిని కట్టడి చేయగలుగుతుంది. కుల, మత, ప్రాంత, వర్గ, పార్టీ భేదం లేకుండా దేశమంతా ఒక్కటే అన్న నినాదంతో ప్రధాని సూచనను తప్పకుండా పాటిస్తూ కరోనాను ఐక్యంగా తరిమికొట్టడానికి సిద్ధ పడుతున్నారన్నది నిర్వివాదాంశం. కనుక భౌతిక దూరం, స్వీయ గృహ నిర్బంధం ఇకపైనా పాటిద్దాం. – కొండల్ ప్రజాపతి,రాజనీతి శాస్త్ర పరిశోధకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం మొబైల్ : 96763 54999 -
విభేదాలు సహజమే!
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో భేదాభిప్రాయాలు ఉండొచ్చని.. కానీ ప్రతి ఒక్కరు ఐకమత్యం కోసం కృషిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలోని మూఢవిశ్వాసాలను తరిమేసేందుకు, సమాజంలో మార్పు తీసుకురావటంలో బాధ్యత తీసుకోవాలని ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, శకటాల కళాకారులకు ప్రధాని సూచించారు. ‘బలోపేతమైన, ప్రగతిశీల దేశాన్ని నిర్మించేందుకు అవసరమైన శక్తి అందరు ఐకమత్యంగా ఉంటేనే లభిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అభిప్రాయాలు వేర్వేరుగా ఉండటంలో తప్పులేదన్నారు. కులం, మతం, సమాజం వంటి జాఢ్యాలను పక్కనపెట్టి సమాజాన్ని ఏకం చేసేందుకు ప్రతిఒక్కరు ప్రయత్నించాలన్నారు. మూఢనమ్మకాలను పారద్రోలటాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటినుంచే ప్రారంభించాలని యువతకు సూచించారు. 2019 కల్లా స్వచ్ఛభారత్ లక్ష్యాలను చేరటంలో చొరవతీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశసేవలో భాగంగా పౌర,మిలటరీ పురస్కారాలను పొందిన వారి గురించి యువత తెలుసుకుని ప్రేరణ పొందాలని మోదీ తెలిపారు. కంబోడియాతో 4 ఒప్పందాలు భారత్–కంబోడియాల మధ్య రక్షణ బంధాల బలోపేతానికి కృషిచేయాలని ఇరుదేశాల ప్రధానులు నిర్ణయించారు. ఉగ్రవాద నిర్వీర్యం చేయటంలో అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేయటంపై కలిసి పోరాడాలని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య మధ్య రక్షణ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పరస్పరసాయానికి చర్చలు జరిగాయి. అనంతరం వీరిరువురి సమక్షంలో ఇరుదేశాల మధ్య 4 ఒప్పందాలపై శనివారం ఢిల్లీలో ఒప్పందాలు జరిగాయి. నేరస్తుల అప్పగింత, నేర సంబంధిత విచారణకు న్యాయసాయం, కంబోడియాలోని స్వా హబ్ నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టుకు భారత రుణసాయం (దాదాపు రూ.234 కోట్లు) అంశాలపై ఈ ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కంబోడియాకు ఆరోగ్యం, రోడ్ల అనుసంధానత, డిజిటల్ అనుసంధానత తదితర అంశాల్లోనూ రుణసాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉగ్రవాదం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అని.. ప్రపంచశాంతికి ఇది పెనువిఘాతం కల్గిస్తోందని మండిపడ్డారు. కాగా, ప్రధాని మోదీ ఫిబ్రవరి 9నుంచి నాలుగురోజుల పాటు విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. వరుసగా పాలస్తీనా, యూఏఈ, ఓమన్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. -
30మంది చనిపోయినా డిస్ట్రబ్ అవ్వను
లక్నో: అయోధ్యలో కరసేవకులపై జరిగిన కాల్పుల ఘటనను సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సమర్థించుకున్నారు. 30మంది ప్రాణాలుపోయినా సరే దేశ రక్షణ, ఐక్యత కోసం తాను చేసిన చర్యలను డిస్ట్రబ్ చేయలేవని అన్నారు. నాడు కరసేవకులపై కాల్పులు జరిపించిన మానవత్వ హంతకుడు ములాయం సింగ్ అని బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చేసిన ఆరోపణలు ఆయన కొట్టి పారేశారు. వాస్తవానికి నాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తాను అయోధ్యలో కాల్పులు జరపాలని ఆదేశించలేదని చెప్పారు. అయినప్పటికీ తాను ఆ ఫలితాన్ని ఇప్పటికీ అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. ఆ సంఘటన జరిగిన తర్వాత తాను ఎప్పుడు అయోధ్యవైపు వెళ్లినా చాలామంది రాళ్లు విసరడం, తుపాకులు గురిపెట్టి కాల్చడంలాంటివి చేశారని ములాయం చెప్పారు. విశ్వహిందూ పరిషత్ ఇచ్చిన పిలుపు మేరకు 1990 అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేపట్టేందుకు పెద్ద సంఖ్యలో కరసేవకలు వచ్చారు. ఈ క్రమంలో వారిని నియంత్రించే క్రమంలో జరిపిన కాల్పుల్లో 16మంది ప్రాణాలుకోల్పోయారు. ఇదిలా ఉండగా.. తాను అయోధ్యలో కాల్పులకు ఆదేశించడం కొంత బాధాకరమని, కానీ, మత ప్రాధాన్య స్థలాన్ని రక్షించేందుకు తనకు ఆ పరిస్థితుల్లో అలా ఆదేశించక తప్పలేదని వివరించారు.