university students
-
సరిహద్దు వర్సిటీల్లోని వారే స్వదేశానికి!
సాక్షి, హైదరాబాద్: బయటకు ఎప్పుడు వస్తారో తెలియదు. స్వదేశానికి ఎప్పుడు చేరుకుంటారో తెలియదు. బయట ఏం జరుగుతోందో అంతకన్నా తెలియదు. ప్రస్తుతానికి వర్సిటీ అధికారులు ఆహారం అందిస్తున్నా.. బంకర్లలో భయం భయంగా ఎన్నాళ్లు ఉండాలో. సైరన్ మోగితే గుండెలదిరి పోతున్నాయి. మళ్లీ సైరన్ మోగేదాకా గుండె అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉండాలి. ఇదీ ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా యూనివర్సిటీలోని తెలుగు విద్యార్థుల దుస్థితి. ప్రస్తుతానికి ఉక్రెయిన్ సరిహద్దు యూనివర్సిటీల్లో ఉన్న భారతీయ విద్యార్థులనే అధికారులు స్వదేశానికి తీసుకురాగలుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ, ఏపీలకు చెందిన పదుల సంఖ్యలో విద్యార్థులు మాత్రమే స్వస్థలాలకు చేరుకోగా.. సరిహద్దు సమీప వర్సిటీల్లో, అలాగే జపోరిజ్జియా, మైకోలివ్ వంటి సరిహద్దుకు దూరంగా ఉండే వర్సిటీల్లో ఇంకా సుమారు 2 వేలమంది ఉక్రెయిన్‌లోనే క్షణం క్షణం భయం భయంగా గడుపుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఆ ఆనందం ఇక్కడ లేదు.. ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థుల కష్టాలు కొనసాగుతున్నాయి. అక్కడి వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉందని జపోరిజ్జియా నుంచి విద్యార్థులు ఫోన్ ద్వారా ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఈ వర్సిటీలోనే చదువుతుంటారు. ప్రస్తుతం వర్సిటీ అధికారులు, ఇండియన్ ఎంబసీ ఆదేశాల మేరకు బంకర్లలో తలదాచుకున్నామని వారు చెప్పారు. స్వదేశాలకు విద్యార్థుల తరలింపు ప్రక్రియ మొదలైందన్న ఆనందం వారి మాటల్లో వ్యక్తం కావడం లేదు. ఇప్పటివరకు స్వదేశానికి వచ్చిన విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన వారు 39 మంది ఉన్నారు. వీళ్ళంతా రొమేనియా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న బొకోవినియన్ వర్సిటీల్లాంటి యూనివర్శిటీల్లోనే చదువుతున్నారు. రుమేనియా సరిహద్దు ప్రాంతం ఇప్పటివరకు ప్రశాంతంగానే ఉంది. రొమేనియాకు దాదాపు 50 కిలోమీటర్లలో దూరంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి యుద్ధ భయం లేదని విద్యార్థులు తెలిపారు. దీంతో అధికారులు సురక్షితంగా ఉన్న ప్రాంతాల్లోని భారతీయ విద్యార్థులనే స్వదేశాలకు తరలించినట్టు స్పష్టమవుతోంది. బొకోవినియన్ వర్సిటీ నుంచి 45 నిమిషాలు బస్సులో ప్రయాణిస్తే రొమేనియాలోని బుకారెస్ట్ ఎయిర్ పోర్టుకు చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడి విద్యార్థులు రొమేనియా చేరుకుని, అక్కడినుంచి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల్లో స్వరాష్ట్రాలకు చేరుకున్నారు. అలాగే రాజధాని కీవ్‌లో ఉన్న వారిని పోలెండ్ సరిహద్దులకు బస్సుల్లో తీసుకువెళ్లి, అక్కడ నుంచి విమానంలో భారత్‌కు తీసుకువస్తున్నారు. అయితే రొమేనియా సరిహద్దుకు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపోరిజ్జియా యూనివర్సిటీలోని తెలుగు విద్యార్థులు ఒక్కరు కూడా స్వరాష్ట్రానికి చేరలేదు. వీరిని రొమేనియా సరిహద్దుకు తరలించాలంటే ఉక్రెయిన్ అధికారుల అనుమతులు అవసరం. వీళ్ళను ప్రత్యేక రైలు ద్వారా బోర్డర్ దాటించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే విద్యార్థులు ఇక్కడే చిక్కుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంకర్లలోనే బిక్కుబిక్కుమంటూ.. ఉక్రెయిన్ నిర్మాణాల్లో బంకర్లు నిర్మించుకోవడం సాధారణం. అసలీ వ్యవస్థ ఉంటేనే అక్కడి ప్రభుత్వాలు నిర్మాణాలకు అనుమతిస్తాయి. జపోరిజ్జియా యూనివర్సిటీలో గతంలో నిర్మించి న బంకర్లను ఇటీవల ఆధునీకరించారు. వందల మంది తలదాచుకునేలా ఏర్పాటు చేసినవి కావడంతో వీటిని క్రీడా స్థలాలుగా, జిమ్ సెంటర్లుగా వాడుకుంటున్నారు. ఇప్పుడు వీటినే ప్రాణ రక్షణకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం అన్ని ప్రాం తాల వారితో సహా తెలుగు విద్యార్థులు కూడా అక్కడే రక్షణ పొందుతున్నారు. ఎక్కువ మంది కారణంగా విశాలమైన బంకర్లు ఇరుకుగా మా రాయని విద్యార్థులు తెలిపారు. కాలకృత్యాలకు ఇబ్బందిగా ఉందని చెప్పారు. ప్రస్తుతానికి ఆహారం అందుతున్నా.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తిప్పలు తప్పేలా లేవని అంటున్నారు. దగ్గర్లోనే చెరువు ఉండటం వల్ల తాగునీటికి సమస్య లేదని, యుద్ధ తీవ్రత పెరిగితే ఆ నీళ్లు విషపూరితంగా మారే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. బంకర్లలో కొంతమంది మెలకువతో ఉంటే, కొంతమంది నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. -
మోదీజీ..ఏ యూనివర్సిటీకైనా ధైర్యంగా వెళ్లగలరా?
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంతో నిరుద్యోగం ప్రబలిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏ యూనివర్సిటీనైనా సందర్శించి ఎకానమీ మెరుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. నిరుద్యోగానికి దారితీసిన ఆర్థిక వ్యవస్ధ వైఫల్యంపై విద్యార్ధులు, యువత ఆగ్రహంగా ఉన్నారని రాహుల్ అన్నారు. విద్యార్ధుల డిమాండ్ న్యాయమైందని, వారి వాదనను ఆలకించాలని కోరారు. వర్సిటీల్లో పెచ్చుమీరుతున్న హింస, ఆందోళనల నేపథ్యంలో విపక్ష పార్టీలతో సంప్రదింపులు జరిపిన మీదట రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్ధ ఎందుకు విఫలమైందో ప్రధాని మోదీ యూనివర్సిటీల్లో యువత ఎదుట నిలబడి వివరించే ధైర్యం ప్రదర్శించాలని సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్ర మోదీ అంతటి సాహసానికి ఒడిగట్టబోరని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలకు ఆయన ఏం చేయబోతున్నారో ప్రధాని వివరించాలని కోరారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్ధుల్లో పెల్లుబుకుతున్న నిరసనల వెనుక అంతర్లీనంగా నిరుద్యోగం పట్ల వారి ఆగ్రహం వ్యక్తమవుతోందని, ప్రభుత్వం ఈ విషయం గ్రహించకుండా ఆందోళనలను అణిచివేస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. -
శాంతినికేతన్‌లోని విశ్వభారతి యూనివర్సిటీ 49వ స్నాతకోత్సవ కార్యక్రమం
-
ముందుగా మీకు క్షమాపణ చెబుతున్నా...
కోల్‌కతా : శాంతినికేతన్‌లోని విశ్వభారతి యూనివర్సిటీ 49వ స్నాతకోత్సవ కార్యక్రమం... ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక హసీనా, పశ్చిమబెంగాల్ గవర్నర్ కేఎన్ త్రిపాఠి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో కొన్ని ఆశ్చర్యపరిచే సన్నివేశాలను కూడా చూడాల్సి వచ్చింది. ప్రధాని పదవిలో ఉన్న మోదీనే ఏకంగా యూనివర్సిటీ విద్యార్థులను క్షమాపణ కోరారు. ఎందుకో తెలుసా..?? యూనివర్సిటీ పరిసరాల్లో సరియైన మంచి నీటి సౌకర్యం అందించలేకపోవడంతో మోదీ క్షమాపణ కోరారు. ‘విశ్వభారతి యూనివర్సిటీ ఛాన్సలర్‌గా నేను మీ క్షమాపణ కోరుతున్నా. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కొంతమంది విద్యార్థులు సంజ్ఞల ద్వారా యూనివర్సిటీలో మంచి నీరు సరిగ్గా అందడం లేదని చెప్పారు. మీకు అసౌకర్యం కలిగించినందుకు యూనివర్సిటీ ఛాన్సలర్‌గా క్షమాపణ కోరుతున్నా’ అని మోదీ అన్నారు. మోదీ రాకకు యూనివర్సిటీ విద్యార్థులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతున్న సమయంలో ప్రధాని ఇలా క్షమాపణ చెప్పి, తన ఔనత్యాన్ని చాటుకున్నారు. సరియైన మంచినీటి సౌకర్యం లేక యూనివర్సిటీలో పలువురు విద్యార్థులు అనారోగ్యం పాలైనట్టు కూడా పలు రిపోర్టులు పేర్కొన్నాయి. ఇక నుంచి యూనివర్సిటీలో మంచినీటి సౌకర్యానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావని హామీ ఇచ్చారు. -
ఉన్నత విద్యపై కరువు దెబ్బ
మెస్ బిల్లులు కట్టలేక విద్యార్థులు విలవిల ఎస్కేయూ: ‘ కేజీ నుంచి పీజీ వరకు ఉన్నత విద్య అందిస్తాం... ఇంటికో ఉద్యోగం కల్పిస్తాం.. జాబు వచ్చేంతవరకు నిరుద్యోగ భతి కల్పిస్తాం... ఉన్నత విద్య బలోపేతం చేసేందుకు వర్సిటీలను ప్రక్షాళన చేస్తాం...పేద ,మధ్యతరగతి విద్యార్థులు ప్రతి ఒక్కరూ వర్సిటీ చదువులు కొనసాగాలి..’ ఇవి గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ ఇచ్చిన హామీలు. అధికారంలోకి వచ్చాక ఇందుకు భిన్నంగా ప్రైవేటు వర్సిటీలకు ఎర్రతివాచీ పరిచి ఉన్నత విద్యను ప్రైవేటీకరణ చేసే దిశగా పావులు కదుపుతున్నారు. మధ్యతరగతి, పేద విద్యార్థులు మెస్ బిల్లులు కట్టలేక పడరాని పాట్లు పడుతున్నారు. అనంతపురం జిల్లాలోని శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సగటు విద్యార్థి దీనస్థితి ఇది...మెస్ బిల్లులు చెల్లించందే తరగతులకు అనుమతించేది లేదని వర్సిటీ అధికారులు తెలపడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రజాప్రతినిధులకు పట్టదా ..! కరువు నేపథ్యంలో ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్న వర్సిటీ విద్యార్థులకు దన్నుగా నిలిచే విధంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం నుంచి సరైన భరోసా దక్కలేదు. వర్సిటీ పూర్వ విద్యార్థి అయిన పల్లె రఘనాథ రెడ్డి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. మరో మంత్రి పి.సునీత సహకారంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మెస్‌బిల్లులను రీయింబర్స్ చేస్తే కరువు జిల్లాలోని విద్యార్థులకు కొంతైనా ఊరట కలుగుతుందనే చర్చ సర్వత్రా సాగుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో పెండింగ్‌లో ఉన్న మెస్‌బిల్లులను ఉస్మానియా యూనివర్సిటీకి ప్రభుత్వం రీయింబర్స్ చేసింది. ఇక్కడ కూడా అమలు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బిల్లు చెల్లించలే కున్నాం.... మెస్ బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆలస్యంగానైనా చెల్లించి పీజీ తరగతులకు హాజరుకావాలని ఉంది. అయితే హాజరు తక్కువగా వస్తే పరీక్షలకు అనుమతికి ఆటంకం కలుగుతుంది. –తిరుమలేశ్వర్ ,ఎంఎస్‌డబ్ల్యూ రెండో సంవత్సరం . ప్రభుత్వం చేయూతనివ్వాలి ఇక్కడి పరిస్థితులు అన్ని వర్సిటీలకు భిన్నం. మెస్ బిల్లులు చెల్లించేందుకు నాలుగు నెలలుగా బయట ఉద్యోగాలు చేసి డబ్బు చెల్లిస్తున్నాము. ప్రతిభకు కొదవలేని విద్యార్థులు ఎందరో ఎస్కేయూలో చదువుతున్నారు. వారందిరికీ ఆర్థిక చేయూతనివ్వాలి. – నారాయణ రెడ్డి, ఎంఏ . -
మోజామ్ బెగ్ అంటే టెర్రర్....
లండన్: అనుమానిత టెర్రరిస్టులు, టెర్రరిజం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ముస్లిం యువత తరఫున పోరాడేందుకు 2003లో లండన్‌లో ఏర్పాటైన సంస్థ ‘కేజ్ (సీఏజీఈ)’. టెర్రరిస్టుల అణచివేత పేరిట ఇప్పుడు సిరియాపై పాశ్చాత్య దేశాలు జరుపుతున్న దాడులను సాకుగా చూపించి ముస్లిం యువతను టెర్రరిజం వైపు రెచ్చగొడుతోంది. ముఖ్యంగా కేజ్ డెరైక్టర్ మోజామ్ బెగ్ విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకొని తన వాక్చాతుర్యంతో విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. టెర్రరిజం వైపు వారిని ప్రోత్సహిస్తున్నారు. కాలిఫా రాజ్యస్థాపనే లక్ష్యమంటూ వారికి నూరిపోస్తున్నారు. బెగ్ గత విద్యా సంవత్సరంలో బ్రిటన్‌లోని 11 విశ్వవిద్యాలయాల్లో 15 సార్లు ముస్లిం యువతను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారు. బర్మింగమ్, మన్చెస్టర్, బ్రాడ్ఫోర్డ్, ఈస్ట్ లండన్ విశ్వవిద్యాలయాల వేదికపై ఆయన బహిరంగంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. హేతువాదులను, జీవించే హక్కు కోసం పోరాడుతున్న మానవ హక్కుల సంఘాల నేతలను అనుమతించని ఈ విశ్వవిద్యాలయాలు బెగ్ ప్రసంగాలను అనుమతించడం మీడియాకే ముక్కుమీద వేలేసుకునేలా చేశాయి. దాడుల ద్వారా టెర్రరిస్టులను నిర్మూలించడం కన్నా టెర్రరిజం వైపు యువత వెళ్లకుండా నిర్మూలించడమే ఉత్తమ విధానమని నమ్మిన బ్రిటన్ ప్రభుత్వం ఏటా 40 కోట్ల రూపాయలను ఆలక్ష్యం కోసం ఖర్చు చేస్తున్నా ఏం సాధిస్తున్నట్లు? ఏ విశ్వవిద్యాలయంలోనైనా బెగ్ ప్రసంగం తీరు ఇలా ఉంటుంది....‘నాజీల సమయంలో యూదులను చూసినట్టు ఇక్కడి ప్రభుత్వం ముస్లింలను చూస్తోంది. సిరియాలో ఎంత మంది యువకులు పాశ్చాత్య దేశాల దాడుల్లో మరణిస్తున్నారో వీరికి పట్టదు. సిరియా తిరుగుబాటు దారులు ఒకరిద్దరిని చంపేస్తే అహో అన్యాయం జరిగిపోయిందన్నట్లు దానికెంతో ప్రాచుర్యం కల్పిస్తారు. అమాయక ముస్లింలను అరెస్టు చేసి వేధిస్తారు. ఐసిస్ దాడుల్లో మరణించిన ప్రతి పాశ్చాత్యుడి పేరు, ఊరుతో సహా మన దృష్టికి వస్తోంది. మరి వీరు చంపేసిన సిరియా పౌరుల్లో ఒక్కరి పేరు కూడా మనకు ఎందుకు వినిపించదు. టెర్రరిస్టు అనుమానితులుగా అరెస్టైన ముస్లిం యువకుల పేరు, ఊరు కాదుకదా! కనీసం వారెక్కడున్నారో కూడా మనకు తెలియదు. ఏమిటీ ఈ పరిస్థితి. బ్రిటన్‌లో కూడా ఖలీఫా రాజ్యం ఏర్పడితేనే ఈ పరిస్థితికి పరిష్కారం’ అని ఆయన పలు ప్రసంగాల్లో పిలుపునిచ్చారు. ఓ ప్రసంగంలో పారిస్‌పై జరిగిన దాడి గురించి ప్రస్తావిస్తూ ‘ పిల్లలను కూడా పొట్టన పెట్టుకున్నారని ప్రభుత్వంతోపాటు దాని బాకాలైన మీడియా కూడా గోల చేసింది. నేను చెబుతున్నా ఇదింతా ఉట్టి ప్రచారమే. ఒక్కరంటే ఒక్క పిల్లాడు కూడా పారిస్ దాడిలో చనిపోలేదు’ అని చెప్పారు. పారిస్ దాడుల్లో చనిపోయిన 130 మంది పౌరుల్లో పిల్లలు కూడా ఉన్న విషయం తెల్సిందే. టెర్రరిస్ట్ నేపథ్యం ఉన్న మోజామ్ బెగ్పైనే కాదు. ఆయన నిర్వహిస్తున్న ‘కేజ్’పై కూడా బ్రిటన్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేక పోతోంది. ఇటీవల సంస్థ ఆర్థిక లావాదేవీలను మాత్రం స్తంభింపచేసింది. అఫ్ఘానిస్తాన్‌లోని అల్ కాయిదా టెర్రరిస్టు శిక్షణా శిబిరాలను మూడుసార్లు సందర్శించిన బెగ్ 2002లో పాకిస్తాన్లో అమెరికా సైనికుల చేతుల్లో అరెస్టయ్యారు. గ్వాటెమాల బే జైల్లో గడిపారు. అనంతరం విడుదలయ్యాక తాను ఎలాంటి నేరం చేయకపోయినప్పటికీ తనను అన్యాయంగా జైల్లో పెట్టారంటూ బ్రిటన్ కోర్టులో దావా వేశారు. ఆ కేసులో విజయం సాధించి ఏకంగా పది కోట్ల రూపాయల నష్ట పరిహారం పొందారు. ఆ డబ్బులో ఐదు కోట్ల రూపాయలను వెచ్చించి బర్మింగమ్లో ఐదు పడక గదుల విశాలమైన భవనాన్ని కొన్నారు. అందులో కారు గ్యారేజీ, కారు సౌకర్యం ఉంది. ఆయనకు భార్యా నలుగురు పిల్లలు ఉన్నారు. వారంతా హాయిగానే జీవిస్తున్నారు. కోర్టు కేసులో తనకు అండగా నిలిచిన కేజ్ సంస్థలో బెగ్ చేరి ఇప్పుడు దానికి డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. యువతను టెర్రరిజం వైపు ప్రోత్సహిస్తున్నారు.