UPSC prelims exams
-
ప్రశ్నల ట్రెండ్ మారొచ్చు
సాక్షి, హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జూన్ 5న నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఈసారి భిన్నంగా ఉండే అవకాశం ఉం దని నిపుణులు అంచనా వేస్తున్నారు. మునుపెన్నడూ లేనట్లు ఈసారి అంతర్జాతీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని, ప్రధాని మోదీ వ్యూహాత్మక అంతర్జాతీయ సంబంధాలు పరీక్షలో కీలకపాత్ర పోషించే వీలుందని భావిస్తున్నారు. రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గమనం, వ్యాక్సినేషన్, పరిశోధనలపై ప్రశ్నలకు ఎక్కువ చాన్స్ ఉంటుందని అంచనా. టెక్నా లజీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలూ ప్రశ్నావళిలో కనిపిస్తాయని చెబుతున్నారు. ప్రిలిమ్స్‌కు ప్రణాళికాబద్ధంగా చదవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. వీటిపై దృష్టి పెట్టాలి మోదీ డెన్మార్క్ పర్యటన, నార్డిక్ దేశాల సంబంధాలపై ప్రిలిమ్స్‌లో అడిగే అవకాశముంది. నార్డిక్ దేశాలేవనే ప్రశ్న వచ్చే అవకాశం కన్పిస్తోంది. నాటో దేశాల గురించి తెలుసుంటే మంచిది. రష్యా–ఉక్రెయిన్ దాడిలో నల్ల సముద్రానికి కీలకపాత్ర. ఇందులోంచి ప్రశ్నలు రావచ్చు. గవర్నర్, రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలకు తేడా పై చర్చ జరుగుతోంది. పార్లమెంట్ పదజాలం, విధివిధానాలు, పార్టీ ఫిరాయింపుల చట్టం, స్పీకర్ అధికారాలను పరిశీలించాలి. శాస్త్రసాంకేతిక విజ్ఞానంలో బయోటె క్నాలజీ, జెనిటిక్ ఇంజనీరింగ్ ప్రధానాంశాలు కావచ్చు. ఇస్రో,నాసా,ప్రైవేటు స్పేస్ ఏజెన్సీల నుంచి ప్రశ్నలు ఎక్కువ వస్తున్నా యి. ఈసారి ఈ సంస్థల సరికొత్త ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలి. నానో టెక్నాలజీ, రోబో టిక్స్‌పై ప్రశ్నలు ఉంటాయని భావిస్తున్నారు. కరోనా తర్వాతి మైక్రో బేస్డ్ అధ్యయనాలు ప్రిలిమ్స్‌లో అడిగే వీలుంది. ముఖ్యంగా వైరస్ రూపాంతరం, వాటి చరిత్ర, వ్యాక్సిన్, పరిశోధనలు లోతుగా అడగొచ్చు. టార్గెటెడ్ డ్రగ్ డెలివరీపై ప్రత్యేక అధ్యయనం అవసరం. నేషనల్ పార్కులు, మ్యాప్స్, పర్యావరణ విధానాలు, చట్టాలు, సంస్థలు, గ్రాఫీన్ అనే సబ్జెక్ట్ (ఒక విధమైన కార్బన్) ఈసారి రావచ్చు. ఫిజిక్స్‌లో బేసిక్స్ తప్పకుండా చూడాలి. నెల రోజులు ప్రణాళికతో సిద్ధమవ్వాలి ప్రిలిమ్స్‌కు ప్రణాళికాబద్ధంగా, అంశాల వారీగా ప్రిపేర్ కావాలి. రెండుమూడు రోజులకో సబ్జెక్టు రివిజన్ చేసుకోవాలి. ప్రిలిమ్స్‌లో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ మూలస్తంభాలు. సైన్స్ అండ్ టె క్నాలజీ, ఎన్విరాన్మెంట్, అంతర్జాతీయ, ప్రాం తీయ సంబంధాలు రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలి. ఈమధ్య ఆర్ట్ అండ్ కల్చర్ కొత్తగా వచ్చింది. – బాలలత (సీబీఎస్, ఐఏఎస్ అకాడమీ, హైదరాబాద్) -
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం
-
ప్రిలిమ్స్‌కు రెడీ
సాక్షి,సిటీబ్యూరో: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీన నిర్వహించే సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష–2019కు నగరంలో 103 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్, కో ఆర్డినేటింగ్ సూపర్వైజర్ మాణిక్‌రాజ్ కన్నన్ తెలిపారు. గురువారం ఇందిరా ప్రియదర్శని ఆడిటోరియంలో పరీక్షల నిర్వహణపై నిర్వహించిన అధికారుల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పరీక్షకు 49,033 మంది హజరవుతారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్ష ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు ఉంటుందన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు గంట ముందుగా ఆయా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. కేంద్రాల వద్ద సూపర్వైజర్లతో పాటు లోకల్ ఇన్స్పెక్షన్ అధికారులు ఉంటారని, 36 మంది రూట్ అఫీసర్లు, ఏడుగురి అదనపు ఆఫీసర్లను నియమించామని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించేందుకు ఆరుగురు ఎగ్జ్సామినేన్ అబ్జర్వర్లను సైతం నియమించినట్లు చెప్పారు. అభ్యర్థుల నిబంధనలు ఇవీ.. పరీక్ష రాసే అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, పెన్‌డ్రైవ్, వాచీలు, క్యాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, పర్సులు, వాలెట్లు, నోట్స్, చాట్స్, ఇతర రికార్డింగ్,ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. రిపోర్టింగ్ టైమ్‌లోగా పరీక్షకు హాజరు కావాలని, క్లోజింగ్ టైమ్ తర్వాత పరీక్షకు అనుమతించరన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ సూపర్వైజర్లు సిట్టింగ్ అరేంజ్మెంట్లతో పాటు ఇన్విజిలేటర్లను నియమించాలని సూచించారు. పరీక్ష సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, కేంద్రాల్లో తాగునీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పరీక్షా నిర్వహణలో అనుసరించాల్సిన విధి విధానాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో డీఆర్వో భూపాల్‌రెడ్డి, ఎగ్జామినేషన్ అబ్జర్వర్లు హైమావతి, సిక్తా పట్నాయక్, లోకల్ ఇన్స్పెక్టింగ్ అధికారులు, రూట్ అధికారులు, రెవెన్యూ ఇంచార్జిలు పాల్గొన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్‌కు ప్రత్యేక బస్సులు సాక్షి,సిటీబ్యూరో: వచ్చేనెల 2వ తేదీన జరిగే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 7 నుంచి 9.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఆయా సమయానికి అనుగుణంగా నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లో అదనపు బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ బస్సులకు ‘యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ స్పెషల్’ అనే తాత్కాలిక డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. బస్సుల సమాచారం కోసం అభ్యర్థులు 99592 26160, 99592 26154 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ప్రశాంతంగా సివిల్స్
ఉదయం పరీక్షకు 39.27 శాతం.. మధ్యాహ్నం 38.83 శాతం హాజరు నగరంలో 23 కేంద్రాల్లో నిర్వహణ ఆరోపణలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు హన్మకొండ అర్బన్ : జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 10, 858 అభ్యర్థులకు కనీసం సగం మంది కూడా హాజరు కాలేదు. ఉదయం 4,264(39.27 శాతం) మంది, మధ్యాహ్నం 4,216(38.83 శాతం) మంది మాత్రమే హాజరయ్యారు. మొత్తం 23 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కొత్త రాష్ట్రంలో జిల్లాకు మొదటగా వచ్చిన అవకాశం కావడంతో ఎలాంటి ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా కృషి చేశారు. నగరంలోని ఐదు ప్రధాన కేంద్రాల్లో సమాచార కేంద్రాలు, కలెక్టరేట్లో టోల్ ఫ్రీనెంబర్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ వాకాటి కరుణ, పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్రం, కేంద్రం నుంచి వచ్చిన యూపీఎస్సీ పరిశీలకులు సైతం ఏర్పాట్లు, నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్ట్స్ కాలేజీలో హాజరు ఎక్కువ.. మొత్తం 23 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా, ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీ సెంటర్లోనే ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సెంటర్లో ఉదయం 500 మందికి 268, మధ్యాహ్నం 275 మంది పరీక్ష రాశారు. అతితక్కువగా ఎస్ఆర్ నేషనల్ హైస్కూల్లో ఉదయం 539 మందికి 134 మంది మాత్రమే హాజరయ్యారు. సాయంత్రం సెషనల్లో యూనివర్సిటీ పీజీ కాలేజీలో 456 మందికి 116 మంది పరీ క్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో ఇదే తక్కువ హాజరుశాతమని అధికారులు వెల్లడించారు. కాగా, వికలాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన ఎస్ఆర్ నేషనల్ హైస్కూల్ సెంటర్లో మొత్తం 59 మందికి గాన 21 మంది హాజరయ్యా రని అధికారులు తెలిపారు.