Vaigo
-
వై'గో'?
ఎన్నికల సంగ్రామంలో ముందుండి నడిపించాల్సిన రథసారధే తప్పుకుంటే... గెలుపు వ్యూహంతో అందరికీ మార్గదర్శనం చేయాల్సిన వ్యక్తే పోటీ నుంచి తప్పుకుంటే. ప్రజా సంక్షేమ కూటమిలో సోమవారం ఇదే జరిగింది. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రజా సంక్షేమ కూటమి అధినేత వైగో అకస్మాత్తుగా అస్త్రసన్యాసం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించేశారు. * పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన * వైగో వైఖరిపై నిరసన ప్రదర్శన * సంకటంలో సంక్షేమ కూటమి చెన్నై, సాక్షి ప్రతినిధి: కూటమి నేతలతో కలిసి గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కోవిల్పట్టి నుంచి పోటీ చేయబోతున్నట్లు వైగోనే ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రకారం సో మవారం ఆయన నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత కూడా వైగో నామినేషన్ వేయనున్నట్లే ప్రచారం జరిగింది. సోమవారం ఉదయం పరిమిత సంఖ్యలో వెన్నంటి వచ్చిన అనుచరులతో కలిసి కోవిల్పట్టికి చేరుకున్న వైగో తాను పోటీచేయడం లేదని ప్రకటించడంతో నేతలంతా ఖిన్నులయ్యారు. తన బదులుగా ఎండీఎంకే తూత్తుకూడి జిల్లా యువజన విభాగం కార్యదర్శి వినాయక రమేష్‌తో సోమవారం నామినేషన్ వేయించారు. జాతి, మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న డీఎంకే వైఖరిని నిరసిస్తూ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వైగో తెలిపారు. పసుంపొన్ ముత్తరామలింగ దేవర్ విగ్రహానికి గత నలభై ఏళ్లుగా మాల వేసి గౌరవిస్తున్నానని, దేవర్ కులస్తులకు తాను అనేక విషయాల్లో అండగా నిలిచినట్లు తెలిపారు. కోవిల్పట్టిలో దేవర్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నందున అదే కులానికి చెందిన సుబ్రమణియం డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని అన్నారు. తన అభ్యర్థిత్వంతో దేవర్, నాయుడు కులస్తుల మధ్య విద్వేషాలు రగిల్చేం దుకు డీఎంకే సిద్ధమైందని ఆయన ఆరోపించారు. తన పోటీ కారణంగా దేవర్, నాయుడు సామాజిక వర్గాల మధ్య విభేదాలు రాకూడదని డీఎంకేకు ఆ అవకాశం ఇవ్వకూడదనే పోటీ నుంచి తప్పుకుంటున్నానని వివరించారు. తమ కూ టమి అభ్యర్థుల విజయానికి పాటుపడతానని చెప్పారు. ఇదిలా ఉండగా, వైగో తన అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలుకు వెళుతుండగా ఇండియ దేవర్ ఇన మక్కల్ కూటమి కార్యకర్తలు నల్లజెండాల ప్రదర్శన నిర్వహించారు. కోవి ల్పట్టిలోని దేవర్ విగ్రహానికి మాలవేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సుమారు వంద మంది ని పోలీసులు అరెస్ట్ చేశారు. మిశ్రమ స్పందన పోటీ చేయబోవడం లేదంటూ వైగో చేసిన ప్రకటన కూటమిలో మిశ్రమ స్పందన కలిగించింది. అకస్మాత్తుగా ఆయన ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదని వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ పేర్కొన్నారు. తనకే కాదు, కూటమిలోని పార్టీలూ ఆశ్చర్యచకితులైనారని అన్నా రు. వైగో తన నిర్ణయాన్ని మార్చుకుం టారని ఆశిస్తున్నట్లు చెప్పారు. వైగో నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ అన్నారు. తన గెలుపు కోసం కాక కూట మి గెలుపు కోసం వైగో పనిచేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ప్రజా సంక్షేమ కూటమిని ఏర్పాటు చేసిన వైగో తన వాక్చాతుర్యం తో దాన్ని ఎంతో బలోపేతం చేశాడు. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేను గట్టిపోటీ మీద కూటమిలో చేర్చుకున్నాడు. ఎటుపోవాలో తెలియక తంటా లు పడుతున్న తమిళ మానిల కాంగ్రెస్‌ను కూటమిలో భాగస్వామిని చేశాడు. దళిత నేత వీసీకే అధినేత తిరుమావళవన్ అంతకు ముందే కూటమి తీర్థం పుచ్చుకున్నాడు. కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్‌ను వైగో రంగంలోకి దించాడు. తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు సాగించాడు. తూత్తుకూడి జిల్లా కోవిల్పట్టి నియోజకవర్గం నుంచి సోమవారం దాఖలు చేయకుండా చల్లగా తప్పుకున్నాడు. వైగో వైఖరితో సంక్షేమ కూటమి సంకటంలో పడిపోయింది. దేవర్, నాయుడు కులస్తుల మధ్య ఘర్షణలు తలెత్తకూడదన్న కారణంతోనే ఆయన పోటీ నుంచి తప్పుకున్నారా. ఘర్షణలు తలెత్తకూడదన్న కారణంతోనే ఆయన పోటీ నుంచి తప్పుకున్నారా, పోటీకి దూరంగా ఎందుకు (వై), వెళ్లిపోయారు (గో) అనే సందేహాలు తలెత్తుతున్నాయి. -
విజయకాంత్ మోసపోకూడదు: వైగో
టీనగర్: కరుణానిధి చేత విజయకాంత్ మోసపోకూడదని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో హితవు పలికారు. ప్రజా కూటమి వెబ్సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎగ్మూరులోగల ఎండిఎంకే కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఇందులో ప్రజాకూటమి సమన్వయకర్త వైగో, సీపీఎం కార్యదర్శి రామకృష్ణన్, సిపిఐ కార్యదర్శి ముత్తరసన్, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైగో విలేకరులతో మాట్లాడుతూ నేటి నుంచి ఈ వెబ్సైట్ ఇతర సామాజిక మాధ్యమాలలో తమ కూటమి విశేషాలు, ప్రకటనలు వంటివి పొందుపరుస్తామన్నారు. వీటి ద్వారా ప్రజలు తమతో నేరుగా సంప్రదించవచ్చన్నారు. రాష్ట్రంలో 65 శాతం ప్రజల మనోభావాలను ప్రతిఫలించే విధంగా మక్కల్ నలకూట్టని ( ప్రజాకూటమి) ఏర్పాటైందన్నారు. తమిళ మానిల కాంగ్రెస్‌ను తమ కూటమికి ఆహ్వానించామని, ఇంతవరకు వారు నిర్ణయం తీసుకోలేదన్నారు. డీఎండీకేను డీఎంకే కూటమికి ఆహ్వానించడం గురించి మంగళవారం కరుణానిధి మాట్లాడుతూ పండు పక్వానికి వచ్చిందని, ఏ సమయంలో పాలలో పడుతుందోనని వేచిచూస్తున్నట్లు తెలిపారన్నారు. ఈ పండు రాలి స్వచ్ఛమైన పాలలో పడితే బాగుంటుందని, అయితే డిఎంకే అవినీతి విషం కలిగిన పాలని, అందులో పడకూడదని అన్నారు. ఈ విషయంలో విజయకాంత్ మోసపోకూడదని హితవు పలికారు. -
‘మహా’ కుట్ర!
సాక్షి, చెన్నై : ఎండీఎంకేను నిర్వీర్యం చేయడానికి మహా కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నేత వైగో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ వర్గాలకు నగదు, పదవుల్ని ఎరగా వేస్తూ డీఎంకే వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఇక, ప్రజా కూటమిలోకి రావాలని డీఎండికే అధినేత విజయకాంత్‌కు పిలుపునిచ్చారు. ఎండీఎంకే నుంచి వలసల పర్వం సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు మళ్లీ పాత గూటికే (డీఎంకే)లోకి చేరే పనిలో పడ్డారు. మరి కొందరు అన్నాడీఎంకే వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా, ఎండీఎంకేకు బలం అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల మీద డీఎంకే కన్నేసింది. అక్కడి ఆ పార్టీ ముఖ్య నాయకుల్ని తమ వైపు ఆకర్షించేందుకు శ్రీకారం చుట్టి, కార్యరూపం దాల్చే పనిలో డీఎంకే వర్గాలు పడ్డాయి. ఎక్కడెక్కడ జంప్ జిలానీలు ఉన్నారో వారిని పసిగట్టే పనిలో పడ్డ ఎండీఎంకే నేత వైగో, వారు పార్టీ ఫిరాయించకుండా చూసేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. బలం ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ వర్గాలకు భరోసా ఇస్తున్నారు. ఇందులో భాగంగా తన పార్టీని దెబ్బతీసేందుకు మహా కుట్ర జరుగుతున్నదంటూ గురువారం వైగో తీవ్రంగానే స్పందించారు. ఈ కుట్రకు వ్యూహకర్త డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ అని నిప్పులు చెరిగారు. పధకం ప్రకారం తనను, తన పార్టీని టార్గెట్ చేసి స్టాలిన్ ముందుకు సాగుతున్నట్లుందని ధ్వజమెత్తారు. ఈ ప్రయత్నాలను, కుట్రను ఎదుర్కొని తన బలాన్ని చాటుకుంటానని ప్రకటించారు. కొన్ని చోట్ల తన పార్టీ వర్గాలకు నగదు, పదవులు ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. దీన్ని బట్టి చూస్తే, డీఎంకే ఎంతగా దిగజారుడు నీచ రాజకీయాలు సాగిస్తోందో స్పష్టమైందని దుయ్యబట్టారు. ఇక, డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రజా కూటమికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా, అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో ఏర్పడిన ఈ ప్రజా కూటమిలోకి డీఎండీకే అధినేత విజయకాంత్ కూడా రావాలని ఎదురు చూస్తున్నామని, ఆయనకు ఆహ్వానం సైతం పలికామన్నారు. ఒకవేళ విజయకాంత్ ప్రజా కూటమిలోకి వస్తే, ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా? అన్న ప్రశ్నకు.. ఆయన వస్తే ఆనందమేనని, అయితే ప్రజా కూటమికి నాయకత్వం ఎవరు వహించాలన్నది అందరూ చర్చించుకుని సమష్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
‘టాడా’ రద్దు
ఎండీఎంకే నేత వైగోతో సహా తొమ్మిది మందిపై నమోదైన టాడా కేసు రద్దు చేస్తూ పూందమల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విచారణను ముగిస్తూ, సోమవారం తన తీర్పును న్యాయమూర్తి మోని వెలువరించారు. సాక్షి, చెన్నై: మదురై జిల్లా తిరుమంగళం వేదికగా జరిగిన బహిరంగ సభలో ఎండీఎంకే నేత వైగో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎల్‌టీటీఈలకు మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పటి ప్రభుత్వానికి ఆగ్రహాన్ని తెప్పించాయి. ఆయన్ను, ఆ వేదిక మీదున్న మరో 8 మందిపై తీవ్రవాద నిరోధక చట్టం(టాడా) ప్రయోగించారు. ఎండీఎంకే నేత వైగోతో సహా 9 మందిని అరెస్టు చేసి కటకటాల్లో పెట్టారు. ఏడాదిన్నరపాటు కారాగారావాసాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఎట్టకేలకు బెయిల్ మీద బయటకు వచ్చిన వైగో తనతో పాటుగా 9 మందిపై దాఖలు చేసిన కేసును వ్యతిరేకిస్తూ ఆ చట్టం వ్యవహారాలకు సంబంధించిన ప్రత్యేక కమిటీని ఆశ్రయించారు. రద్దు: ఏళ్ల తరబడి సాగిన ఈ విచారణలో వైగోతో సహా ఎనిమిది మందికి విముక్తి కల్పించే విధంగా ఆ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో గత్యం తరం లేక ఆ కేసును వెనక్కు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయినా, టాడా కోర్టు వెనక్కు తగ్గలేదు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ కోర్టు తిరస్కరించి, విచారణ కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పన్నెండేళ్లుగా ఈ కేసు నుంచి విముక్తి పొందేందుకు న్యాయ స్థానంలో వైగో అండ్ బృందం పోరాడుతూనే ఉంది. ఈ కాలంలో ఆ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు మరణించారు. ఎట్టకేలకు మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ రూపంలో వైగో అండ్ బృందానికి విముక్తి కలిగింది. కేసు కొనసాగింపునకు టాడా కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు రద్దు చేసింది. దీంతో మళ్లీ టాడా కోర్టును ఈ నెల 21న వైగో ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను వివరిస్తూ వైగో అండ్ బృందం దాఖలు చేసిన పిటిషన్‌ను టాడా కోర్టు న్యాయమూర్తి మోని పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసు రద్దుకు నిర్ణయించడం, తమ ఉత్తర్వుల్ని హైకోర్టు రద్దు చేయడాన్ని పరిగణనలోకి తీసుకుని ఇక, విచారణను ముగిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. వైగోతో సహా మిగిలిన వారిపై నమోదైన టాడా చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు తీర్పు వెలువరించారు. దీంతో ఆ కేసు నుంచి వైగోతో సహా ఏడుగురికి పూర్తిగా విముక్తి కల్గినట్టు అయింది. -
రజనీ ఎంట్రీపై నో కామెంట్!
టీనగర్: సినీ నటుడు రజనీకాంత్ రాజ కీయాల్లోకి రావడంపై వ్యాఖ్యానించదలచుకోలేదని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తెలిపారు. చెన్నై, ప్యారిస్ బస్టాండ్ సమీపానగల రాజా అన్నామలై మండ్రంలో గత 2008లో తమిళ ఈలంలో జరుగుతున్నదేమిటి? అనే అంశంపై ఎండీఎంకే తరపున అభిప్రాయవేదిక జరిగింది. ఈ వేదికలో వైగో పాల్గొని ప్రసంగించారు. ఆ సమయం లో నిషేధిత ఎల్టీటీఈ సంస్థకు మద్దతుగా మాట్లాడినట్లు ఆయనపై దేశద్రోహ కేసు నమోదయింది. కేసు విచారణ మద్రాసు హైకోర్టు ప్రాంగణంలోని అదనపు సెషన్సు కోర్టులో జరిగింది. పిటిషనుదారుడైన క్యూ బ్రాంచి మాజీ ఇన్స్పెక్టర్ మణివన్నన్ కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చారు. దీనికి సంబంధించి వైగో తర పు న్యాయవాది దేవదాస్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మళ్లీ సోమవారం విచారణ జరిగింది. వైగో కోర్టు కు హాజరయ్యారు. ఇన్స్పెక్టర్ వద్ద క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. తర్వాత విచారణను డిసెంబరు 11వ తేదీకి వాయిదా వేశారు. కోర్టు నుంచి బయటికి వచ్చిన వైగో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం రాజకీయ బ్రోకర్లను శ్రీలంకకు పంపి అధ్యక్షుడు రాజపక్సేతో సన్నిహిత సంబంధాలు కుదుర్చుకుంటోందని ఆరోపించారు. తమిళులకు వ్యతిరేకంగా పనిచేయడాన్ని కేంద్రం విడనాడాలని కోరారు. ఆ తర్వాత రాజకీయ ప్రవేశంపై వ్యాఖ్యానించమని కొందరు కోరగా ఈ ప్రశ్నకు సమాధా నం ఇవ్వనని అంటూ ఆయన అక్కడి నుంచి బయలుదేరారు. -
ఇండియా పేరు మారుస్తా
నాకే అధికారం వస్తే ఇండియా పేరు మార్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చేస్తానని అంటున్నారు తమిళనాట ఎండీఎంకె అధినేత వైగో. అసలు భిన్నత్వంలో ఏకత్వం అంటూ మాట్లాడేవారు క్రమేపీ అధికారమంతా ఢిల్లీలోనే కేంద్రీకృతం అయ్యేలా చేశారని, అందుకే దేశాన్ని శక్తివంతంగా చేసేందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని దేశం పేరు మారుస్తానని వైగో తన పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు. అంతే కాదు. అసలు తమిళ ఈళంపై రిఫరెండం జరగాలని, ఎల్ టీ టీ ఈ పై నిషేధాన్ని తొలగిస్తామని కూడా ఆయన తన పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు. పైగా ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేయిస్తామని కూడా ఆయన వాగ్దానం చేస్తున్నారు. తమాషా ఏమిటంటే వైగో తమిళనాట బిజెపితో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. బిజెపి మరి ఈ విధానాలను ఆమోదిస్తుందా లేదా అన్నది అసలు ప్రశ్న. అయినా మారిస్తే దేశం తీరు మార్చాలి కానీ, పేరు మారిస్తే ఏమవుతుందని అంటున్నారు రాజకీయ పండితులు.