ఇండియా పేరు మారుస్తా
నాకే అధికారం వస్తే ఇండియా పేరు మార్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చేస్తానని అంటున్నారు తమిళనాట ఎండీఎంకె అధినేత వైగో. అసలు భిన్నత్వంలో ఏకత్వం అంటూ మాట్లాడేవారు క్రమేపీ అధికారమంతా ఢిల్లీలోనే కేంద్రీకృతం అయ్యేలా చేశారని, అందుకే దేశాన్ని శక్తివంతంగా చేసేందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని దేశం పేరు మారుస్తానని వైగో తన పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు.
అంతే కాదు. అసలు తమిళ ఈళంపై రిఫరెండం జరగాలని, ఎల్ టీ టీ ఈ పై నిషేధాన్ని తొలగిస్తామని కూడా ఆయన తన పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు. పైగా ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేయిస్తామని కూడా ఆయన వాగ్దానం చేస్తున్నారు.
తమాషా ఏమిటంటే వైగో తమిళనాట బిజెపితో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. బిజెపి మరి ఈ విధానాలను ఆమోదిస్తుందా లేదా అన్నది అసలు ప్రశ్న. అయినా మారిస్తే దేశం తీరు మార్చాలి కానీ, పేరు మారిస్తే ఏమవుతుందని అంటున్నారు రాజకీయ పండితులు.