vanished
-
జాడ లేని పెళ్లికూతురు.. నిరాశతో తిరిగొచ్చిన పెళ్లికొడుకు
లక్నో: పాపం ఓ పెళ్లికొడుకు పెళ్లి చేసుకోవడం కోసం బంధుమిత్రులు, బాజా భజంత్రీలతో పెళ్లి కూతురు ఇంటికి బయలుదేరాడు. ఇక్కడే అతడికి పెద్ద షాక్ తగిలింది. వెళ్లినచోట ఎంత వెతికినా పెళ్లికూతురు ఇల్లు దొరకలేదు. పెళ్లి కూతురు, ఆమె అమ్మానాన్నలకు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వచ్చింది.అక్కడ ఇరుగుపొరుగు వాళ్లను అడిగితే అసలు మీరు చెబుతున్నవారెవరు ఇక్కడ ఉండరు అని సమాధానం వచ్చింది. ఇంకేముంది పోలీసులకు ఫిర్యాదు చేసిన పెళ్లికొడుకు నిరాశతో వెనుదిరిగాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో లక్నోలోని రహీమామాబాద్ ప్రాంతంలో ఆదివారం(జులై 14) జరిగింది. ఉన్నావోకు చెందిన సోనూ అనే యువకుడికి కాజల్ అనే అమ్మాయికి చండీగఢ్‌లో పరిచయమైంది. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు. భాజాభజంత్రీలు అన్నీ రెడీ చేసుకుని వస్తే పెళ్లి చేసుకుందాం అని కాజల్ సోనూకు ఫోన్లో చెప్పింది. పెళ్లి ఏర్పాట్లు మొత్తం చేసేశామని కాజల్ తండ్రి కూడా సోనూకు ఫోన్లో చెప్పాడు. ఈ మాటలు నిజమని నమ్మిన సోనూ పెళ్లి చేసుకుందామని వెళ్లి పెళ్లికూతురు ఇల్లు దొరకక షాక్‌లో వెనుదిరిగి వచ్చాడు. -
మూడు గంటల్లో రూ. 3లక్షల కోట్లు
సాక్షి,ముంబై: జియో పొలిటికల్ అందోళన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయంగా స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాక్‌పై ఆంక్షలు, బెదింపులతో దలాల్ స్ట్రీట్ అల్లకల్లోలమైంది. సోమవారం మధ్యాహ్నం నాటికి 3లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. ఈ రోజు (సోమవారం) కేవలం మూడుగంటల్లో రూ. 3 లక్షల కోట్లు నష్టపోయారు. కాగా మధ్యాహ్నం 2.30 సమయానికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 154 లక్షల కోట్లకు దిగజారింది. గత శుక్రవారం ఈ విలువ రూ. 157 లక్షల కోట్లు. సెన్సెక్స్ 788 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్లు పతనమైనాయి. తద్వారా శుక్రవారం ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేసిన కీలక సూచీలు సెన్సెక్స్ 41వేల కిందికి, నిఫ్టీ 12 వేల దిగువకు చేరింది. ప్రతి ఐదు షేర్లలోనాలుగు నష్టపోగా, స్మాల్ క్యాప్స్ లో ఎక్కువ షేర్లు భారీగా నష్టపోయి లోయర్ సర్క్యూట్ కావడం గమనార్హం. మరోవైపు ఇరాన్ ఉద్రిక్తతలతో బ్రెంట్‌క్రూడ్ 70 డాలర్లను చేరడంతో రూపాయి కూడా బలహీననడింది. ఈ పరిస్థితి ఇలాగాఏ కొనసాగితే ముందుగా క్రూడ్ 75 డాలర్లను చేరవచ్చని అంచాన. క్రూడ్ దెబ్బతో డాలర్ పుంజుకోగా, దేశీయ కరెన్సీ బలహీనపడింది. డాలరు మారకంలో రూపాయి మరోసారి 72 స్థాయికి చేరింది. ఇరాన్ స్పందన తీవ్రంగా ఉంటే ప్రపంచ క్రూడ్ సరఫరాలో 20 శాతం మేర దెబ్బతింటుందని, దీంతో క్రూడాయిల్ ధర 20 శాతం మేర పెరగవచ్చని అంతర్జాతీయ నిపుణుడు జొనాథన్ బారాత్ వ్యాఖ్యానించారు. చదవండి : ఇరాన్-అమెరికా ఉద్రిక్తత : కుదేలైన రూపాయి చదవండి : ప్రతీకార హెచ్చరికలు, మార్కెట్ల పతనం -
ఏపీలోనూ టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు
సాక్షి, అమరావతి/గుంటూరు: మొన్నటి ఎన్నికల్లో చావు దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లోనూ రాజకీయ భవిష్యత్తు లేదని.. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దాలన్నది తమ పార్టీ జాతీయ నాయకత్వ లక్ష్యమని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సభ్యత్వ నమోదు కన్వీనర్ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పరిశీలన నిమిత్తం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం గుంటూరు, కృష్ణా జిల్లా గన్నవరంలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా 25 లక్షల మందిని పార్టీ ప్రాథమిక సభ్యులుగా చేర్చుకోవాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా రూ.17 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని.. ఇప్పటికీ కేంద్రం ఆ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. హోదాకు బదులుగా ప్యాకేజీ తీసుకోవడానికి అంగీకరించిన చంద్రబాబు, కేంద్రం ఇస్తామన్న నిధులను నేరుగా విడుదల చేయాలని కోరారని.. కేంద్రం నేరుగా నిధులు విడుదల చేస్తే అవి తమ జేబుల్లోకి మళ్లించుకోవాలన్నది వారి ఉద్దేశంగా చెప్పారు. కేంద్రం మాత్రం ప్యాకేజీగా ఇస్తామన్న నిధులను నేరుగా కాకుండా వివిధ ప్రాజెక్టులకు విడుదల చేస్తామని చెప్పిందన్నారు. బీజేపీలో చేరడానికి ఎంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. రాష్ట్రంలో 25 లక్షల మందిని పార్టీ సభ్యులుగా చేర్చడం తమ లక్ష్యమని, అందులో ఎవరైనా ఉండొచ్చంటూ బదులిచ్చారు. పార్టీ ఏపీ ఇన్చార్జి రామ్ మాధవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ లేదని, అమెరికాలో తానా సభల్లో మాత్రమే కనిపిస్తోందన్నారు. మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య, టీడీపీ గుంటూరు నగర మాజీ అధ్యక్షుడు చందు సాంబశివరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ సిద్దావెంకట్రావుతో పాటు పలువురు టీడీపీ నేతలు చౌహాన్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి, జీవీఎల్ నరసింహారావు, సునీల్ ధియోదర్ పాల్గొన్నారు. -
పుష్కర పనులు నిష్ఫలం
నిధులు నీళ్లపాలు నాసిరకం పనులు కుంగిపోతున్న ట్యాంకులు 'పుష్కర పనుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. బిల్లులు నిలిపివేస్తాం. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెడతాం' ఇవీ పదేపదే మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ నోటి వెంట వచ్చిన హెచ్చరికలు. ఆదరాబాదరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చినా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలాయి. నాణ్యత లోపించి నీళ్లట్యాంకులు కుంగిపోయాయి. భూములోకి కూరుకుపోతున్నాయి. - కరీంనగర్ (ధర్మపురి) : పుష్కర సంబరాల హోరు మరిచిపోనేలేదు. పుష్కర ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన పనులు నాణ్యతాలోపంతో వెక్కిరిస్తున్నాయి. ధర్మపురి సోమవిహార్ పుష్కరఘాట్ వద్ద కుంగిపోయిన నీటిట్యాంక్, నెర్రెలుబారిన సీసీరోడ్లు నాణ్యతలోపానికి సాక్షిగా నిలుస్తున్నాయి. ఏళ్ల తరబడి ఉండాల్సిన నిర్మాణాలు పట్టుమని పది రోజులకే కూలే దశకు చేరుకున్నాయి. రూ. కోటితో తాగునీటి ట్యాంక్‌లు ధర్మపురికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.కోటితో తాగునీటి ట్యాంక్‌లు నిర్మించారు. పుష్కర భక్తులతోపాటు పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. పుష్కరాలకు నెలల ముందుగానే నిధులు విడుదల చేసిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నత్తనడకన సాగాయి. పుష్కరాలు దగ్గరపడడంతో ఆదరాబాదరగా చేసేశారు. ధర్మపురితోపాటు రాయపట్నం, తిమ్మాపూర్ గ్రామాల్లో దాదాపు 30 వరకు తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. ధర్మపురిలో 20 వేల లీటర్ల సామర్థ్యం గల 20 ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి రూ.2.60 లక్షలతో పనులు చేపట్టారు. వీటితో పాటు రాయపట్నం, తిమ్మాపూర్ గోదావరి తీరాలలో 5 వేల లీటర్ల సామర్థ్యం గల 10 చిన్నట్యాంకులను ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి రూ.60 వేలు వ్యయం చేశారు. కుంగుతున్న ట్యాంకులు తాగునీటి ట్యాంకులు చూసేందుకు అందంగానే కనిపిస్తున్నాయి. పుష్కరాలు ముగిసి పది రోజులు కాలేదు. ట్యాంకులు నేలకు కుంగిపోతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో భూమి మెత్తబడి ట్యాంకులు ఒకవైపు వంగి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ధర్మపురి సంతోషిమాత, మంగలిగడ్డ, సోమవిహార్ ఘాట్ల వద్ద 30 ట్యాంకుల్లో 9 ఇక్కడే ఏర్పాటు చేశారు. 20 వేల లీటర్ల సామర్థ్యం గల 9 ట్యాంకులు గోదావరి ఒడ్డున నిర్మించారు. వాటిలో ప్రస్తుతం మూడు ట్యాంకులు భూమిలో కుంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. పెద్దట్యాంకులకు రూ.2.60 లక్షలు, చిన్నట్యాంకులకు రూ.60 వేలు వెచ్చించారు. కమీషన్ల పర్వం పుష్కరాల పనుల్లో నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఒక్కరూ పనుల వద్ద కనిపించలేదు. కమీషన్లకు కక్కుర్తిపడి గుత్తేదారులు సబ్‌కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పడంతో పనులు ఇలా మారారుు. నాణ్యతాలోపంతో వెక్కిరిస్తున్న ట్యాంకుల పరిస్థితిపై ఎవరూ సమాధానం చెబుతారోనని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.