varalakshimi
-
వరలక్ష్మీ వ్రతం ప్రాశస్త్యం? ఈజీగా చేసుకోవాలంటే..?
శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది. భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరలక్ష్మి రూప, గుణ విశేషాలన్నీ శ్రీసూక్తంలో ప్రస్తావితమై ఉన్నాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘'వర'అంటే శ్రేష్ఠమైన అని అర్థం కూడా ఉంది.సిద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతిశ్రీ లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదాకార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత... ఇవన్నీ వరలక్ష్మీ స్వరూపమైన సద్గుణాలు. ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మీ వ్రతం. అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మీ వ్రతకథ చెబుతోంది. ఈ వ్రతం రోజు చదివే వరలక్ష్మీ కథలో.. సాక్షాత్తూ లక్ష్మీ దేవే కలలో సాక్షాత్కరించి, వ్రత విధానాన్ని వివరించడం.. గృహిణిగా చారుమతి ఆదర్శనీయతకు నిదర్శనం. నిస్వార్థత, తోటివారికి మేలు కలగాలనే మనస్తత్వం, ఎలాంటి భేదభావాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయే సహృదయత కలిగిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఈ కథ తెలియజేస్తోంది. ఈ లక్షణాలను అందరూ అలవరచుకోవాలనే సందేశాన్ని ఇస్తోంది.పూజా విధానం..భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం కూడా ఉంది.శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి, మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఇంటి ఆచారాన్ని బట్టి కలిశం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవడం లేదా అమ్మవారి ఫొటో లేదా రూపును తెచ్చుకుని పూజించాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.తోరం తయారు చేయు విధానం..తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.ఆ రోజు వీలుకాకపోతే..శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.కేవలం వరాల కోసం కాదు..లక్ష్మీ పూజ అంటే కేవలం ధన, కనక, వస్తు రూపాలను అర్థించడానికి కాదు... భావ దారిద్య్రాన్ని తొలగించాలని ప్రార్థించడానికి. మంచి గుణాలు, సంపద, ఉత్సాహం, కళాకాంతులు, ఆనందం, శాంతం, పెద్దల పట్ల గౌరవం, సామరస్యం, మంచి మనస్తత్వం, లోకహితాన్ని కోరుకోవడం.. ఇవన్నీ లక్ష్మీప్రదమైన లక్షణాలు. వాటిని కోరుకుంటూ లక్ష్మీ పూజ చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలి.(చదవండి: అభిషేకప్రియుడైన శివుడికి చీపురు సమర్పించడం గురించి విన్నారా..?) -
హత్యకేసు: సెంట్రల్ జైలుకి అఖిల్..
సాక్షి, విశాఖపట్నం: గాజువాక శ్రీనగర్‌లోని ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మిని పాశవికంగా హత్యచేసిన నిందితుడు అఖిల్‌సాయిని పోలీసులు సెంట్రల్ జైల్‌కి తరలించారు. అక్కడి అధికారులు అఖిల్‌కి ఖైదీ నెంబర్ 7411 కేటాయించారు. గాజువాక పోలీసులు నిందితుడు అఖిల్ సాయిని ఆదివారం అరెస్ట్ చేసి దిశ చట్టం ప్రకారం, సెక్షన్ 302 ప్రకారం హత్య కేసు నమోదు చేశారు. కోవిడ్ టెస్ట్ అనంతరం న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రణాళిక ప్రకారమే వరలక్షి్మని హత్య చేశారని దర్యాప్తులో తేలడంతో పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే నిందితుడు అఖిల్, అతని కుటుంబం గత చరిత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గాజువాక పోలీసులు సంఘటన స్థలంతోపాటు నిందితుడు, స్థానికులు, నిందితుడి కుటుంబ సభ్యులు, స్నేహితుల ద్వారా పలు విషయాలు సేకరించినట్లు చెబుతున్నారు. వరలక్ష్మి బయటకు వచ్చిన సమయంలో... కావాలనే వాగ్వాదానికి దిగి ఎలాగైనా చంపేద్దామని ప్రణాళిక ప్రకరం అఖిల్ వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు హత్యకు ముందు నాలుగు రోజుల నుంచి వరలక్ష్మిని అఖిల్‌సాయి ఫోన్లో వేధించేవాడని, దీంతో ఆమె మనస్తాపానికి గురైందని... బంధువుల పెళ్లి హడావిడిలో కుటుంబ సభ్యులంతా ఉండగా అఖిల్ యువతిని భయపెట్టేవాడని విచారణలో తేలింది. అఖిల్ తండ్రి సత్యారావుపై రౌడీషీట్.. అఖిల్ తండ్రి సత్యారావుపై అప్పట్లో 53/11పేరిట రౌడీషీట్ ఉందని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. భూ కబ్జా కేసుకు సంబంధించి పోలీసులు రౌడీషీట్ తెరవగా కొన్నాళ్ల తరువాత సత్యారావు సత్ప్రవర్తన నేపథ్యంలో ఆ షీట్ ఎత్తేశారని చెబుతున్నారు. అయితే ఆయన కుమారుడు అఖిల్ చేసిన హత్య తర్వాత... అఖిల్ తండ్రికి ఎవరెవరు రౌడీïÙటర్లతో పరిచయముందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ రౌడీషీటర్ కుమారుడు పాత్రపైనా అనుమానం..? అదేవిధంగా ఇటీవల హత్యకు గురైన ఓ రౌడీషీటర్ కుమారుడు పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరలక్ష్మి విషయంలో ఆమె సోదరుడు జయప్రకాష్, అఖిల్‌సాయి ఓ రౌడీషీటర్ కుమారుడితో కలిసి గత నెల 29న రామునాయడు అనే యువకుడిపై దాడికి దిగినట్లు చెబుతున్నారు. వరలక్ష్మితో రాము సన్నిహితంగా ఉంటున్నాడని తెలుసుకున్న అఖిల్ ప్రణాళిక ప్రకారం ఆమె సోదరుడు జయప్రకాష్‌ను రెచ్చగొట్టి రాముని భయపెట్టాడు. తాను కేవలం బండి మాత్రమే నడిపానని, రామునాయడిపై దాడి చేసింది అఖిల్ అని జయప్రకాష్ స్వయంగా పోలీసుల ముందు అంగీకరించినట్లు చెబుతున్నారు. -
మద్యపానం నిషేధించాలని మహిళల దీక్ష
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: మద్యపానాన్ని నిషేధించాలన్న డిమాండుతో గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఎదుట మహిళలు బుధవారం ఒక రోజు దీక్ష చేశారు. తెలంగాణ బీసీ సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వడ్డెబోయిన వరలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్ష శిబిరాన్ని ఖమ్మంలోని రిక్కాబజార్ హైస్కూల్ హెచ్ఎం మంజుల ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మద్యపానంతో ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. మద్య నిషేధం విధించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చెవుల వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు గుజ్జరి పండరినాధ్, సోమా అశోక్, మల్లేష్, చింతల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని వైఎస్ఆర్ సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ తోట రామారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మార్కం లింగయ్య, సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ కాంపల్లి బాలక్రిష్ణ, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ సంపెల వెంకటేశ్వర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు హెచ్.వెంకటేశ్వర్లు, వల్లూరి సత్యనారాయణ, దొడ్డి సాంబయ్య, నగర మహిళా కన్వీనర్ కొత్తకొండ్ల శ్రీలక్ష్మి, జిల్లా నాయకులు కీసర పద్మజారెడ్డి, రమాదేవి, వేముల సీత, జాకప్ ప్రతాప్; టీఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, నాయకులు నందగిరి శ్రీను, రమణయాదవ్, లక్ష్మి నారాయణ, సాగర్; టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరావు; ఉద్యోగ సంఘాల నాయకులు కత్తి నెహ్రూ, షౌకత్ అలి; సీపీఐ నాయకులు మేకల సంగయ్య, మల్లేశం; గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు పిట్టల నాగేశ్వరావు, అక్తర్, మేకల సుగుణారావు, వెంకటస్వామి; ఎంఆర్‌పీస్ జిల్లా ఇంచార్జి కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ; ఎంఎస్ఎఫ్ నాయకులు ఎన్.విజయరాజు మాదిగ, వెంకట్ తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు.