vasavi engineering college
-
ఫీజు వివాదం కారణంగా పరీక్షలకు వెళ్లకుండా అడ్డుకోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: బోధన రుసుము చెల్లించలేదన్న కారణంగా ఏ ఒక్క విద్యార్థిని కూడా పరీక్షలకు వెళ్లకుండా వాసవీ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం అడ్డుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) నిర్ధారించిన బోధనా రుసుము కంటే ఎక్కువగా వాసవీ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి వసూలు చేస్తోందంటూ వాసవీ కళాశాల పేరెంట్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా, పిటిషనర్ తరఫు న్యాయవాదులు వి.మోహన, మహేశ్‌బాబు వాదనలు వినిపిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 3ను పట్టించుకోవడం లేదని, ఏఎఫ్ఆర్సీ నిర్ధారించిన బోధనా రుసుము కంటే అదనంగా వసూలు చేస్తున్నారని నివేదించారు. ఈ నేపథ్యంలో ఏఎఫ్ఆర్సీ ఇచ్చిన ఉత్తర్వులను సమర్పించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ వినీత్ శరణ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశిస్తూ, విచారణ నవంబర్ 13కు వాయిదా వేసింది. -
పెంచిన ఫీజులను ఉపసంహరించిన వాసవి కాలేజ్
సాక్షి, హైదరాబాద్ : విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో వాసవి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం దిగొచ్చింది. పెంచిన ఫీజులను ఉపసంహరించుకుంది. టీఎఫ్ఆర్సీ 2016-17 విద్యాసంవత్సరంలో చేరిన విద్యార్థులకు 86వేల ఫీజును నిర్ణయించినప్పటికీ, కాలేజ్ యాజమాన్యం లక్ష అరవై వేలు చెల్లించాల్సిందిగా విద్యార్థులపై ఒత్తిడి పెంచింది. దీనికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులు, తెలంగాణ పేరెంట్స్ అసోషియేషన్‌తో కలిసి ఆందోళనకు దిగారు. విద్యార్థులు కూడా తరగతులు బహిష్కరించి పేరెంట్స్‌తో పాటు నిరసనలో పాల్గొన్నారు. తల్లిదండ్రుల, విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన కళాశాల యాజమాన్యం వారితో చర్చలు జరిపింది. పెంచిన 63వేల ఫీజును ఉపసంహరిస్తామని యాజమాన్యం తెలిపింది. నాలుగు సంవత్సరాల పాటు ఫీజులు కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయమని వారికి హామి ఇచ్చింది. -
‘వాసవి’ ఫీజు రూ.1.6 లక్షలు
టీఎఫ్ఆర్సీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: వాసవి కాలేజీలో ఇంజనీరింగ్ కోర్సుల ట్యూషన్ ఫీజును రూ.1.6 లక్షలుగా నిర్ణయించాలని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ఫీజు నియంత్రణ కమిటీ (టీఎఫ్ఆర్సీ)ని ఆదేశించింది. రెండువారాల్లో ఈ ఫీజును ప్రకటించాలని ఉన్నత విద్యా శాఖ అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు.