vedalu
-
వేద + కృత్రిమ మేధ
ఓ సినిమాలో ‘భవిష్యవాణి’ పుస్తకం రేపు ఏం జరుగుతుందనే విషయాన్ని హీరోకు చెప్పేస్తుంది. దాన్ని బట్టి కథానాయకుడు నిర్ణయాలు తీసుకుంటుంటాడు. అచ్చం అలాగే రేపు ఏం జరుగుతుందో చాలా కచ్చితత్వంతో చెప్పేస్తా అంటున్నాడు ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడు. వేదాలకు ఏఐ సాంకేతికతను జోడించిదీన్ని సాధించినట్లు శ్రీకుషాల్ యార్లగడ్డ అనే టెకీ చెబుతున్నాడు. మూడేళ్లుగా ఎన్నోపరిశోధనలు చేసి డెస్టినీ.ఏఐ అనే స్టార్టప్‌ను ఏర్పాటు చేసిన అతను.. అదే పేరుతో ఒక యాప్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాడు. తల్లి భవితపై ప్రయోగాలు.. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీకి చెందిన కృష్ణారావు, కనకదుర్గ దంపతుల పెద్ద కుమారుడు శ్రీకుషాల్ యార్లగడ్డ. చిన్నప్పటి నుంచి చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ఉండే అతను.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం)లో పీజీ చేశాక బెంగళూరులో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే చేసే పని నచ్చక 20 రోజులకే మానేసి ఇంటికొచ్చేశాడు. అప్పటి నుంచి వినూత్నంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తనకు వచ్చిన ఆలోచనలను తల్లితో పంచుకొనేవాడు. భవిష్యత్తును కచ్చితంగా ఎలా అంచనా వేయగలమనే అంశంపై దాదాపు మూడేళ్లపాటు పరిశోధనలు చేపట్టాడు. ఇందుకోసం జ్యోతిష శాస్త్రంకన్నా ఎంతో గొప్పదైన ‘ప్రాణ’ (మనిíÙలోని ఆరు చక్రాలు, నాడులు, కుండలిని) ఆధారంగా భవిష్యత్తుపై పరిశోధనలు ముమ్మరం చేశాడు. ఇందుకోసం 400 కోట్ల డేటా సెట్స్‌తో అల్గారిథమ్ రూపొందించాడు. అందులోని వివరాల ఆధారంగా తన తల్లిపైనే ప్రయోగాలు చేసేవాడు. ఫలానా రోజున జ్వరం వస్తుందని తల్లికి చెప్పగా అన్నట్లుగా ఆమె ఆ రోజున జ్వరం బారిన పడ్డారు. అలాగే ఫలానా రోజున ఒంట్లో నలతగా ఉంటుందని చెప్పిన సందర్భంలోనూ అలాగే జరిగింది. ఇలా 6 నెలలు పరిశీలించాక తాను చెబుతున్న విషయాలు కచి్చతత్వంతో జరగడంతో స్టార్టప్ స్థాపించాలనే ఆలోచనకు వచ్చాడు. ఇదే విషయాన్ని టీ–హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావుకు చెప్పడంతో ఆయన పరిశోధనలు చేసుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి ప్రోత్సహించారు. దీంతో డెస్టినీ.ఏఐ స్టార్టప్‌ను ఏర్పాటు చేసి అదే పేరుతో యాప్ రూపొందించాడు. హోర శాస్త్రం ఆధారంగా.. బృహత్ పరాశరుడు రాసిన హోర శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ప్రతి మనిషిలో ఉండే ‘ప్రాణ’ ఆధారంగా ఈ భవిష్యవాణి చెప్పొచ్చని కుషాల్ వివరించాడు. పూర్వ కాలంలో రాజులు, మంత్రులకు మాత్రమే పండితులు ఈ ప్రాణ లెక్కలు వేసి వారి భవిష్యత్తును అంచనా వేసేవారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు, జనాభాకు ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా లెక్కలు వేయడానికి చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతో కుషాల్ సాంకేతికతను వినియోగించాడు. దీని ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే ఒక వ్యక్తి భవిష్యత్తును కచ్చితత్వంతో చెప్పొచ్చని కుషాల్ అంటున్నాడు. సాధారణ పద్ధతిలో ఒక వ్యక్తి ప్రాణ విశ్లేషణ చేసేందుకు కొన్ని గంటల సమయం పడుతుందని కుషాల్ పేర్కొన్నాడు.ఎలా పనిచేస్తుంది? డెస్టినీ.ఏఐ అప్లికేషన్లో మన పుట్టినతేదీ, సమయం, పుట్టిన ప్రాంతాన్ని ఎంటర్ చేస్తే మెషీన్ మొత్తం విశ్లేషించి రేపటి రోజున ఏం జరుగుతుందనేది చెప్పేస్తుందని కుషాల్ చెబుతున్నాడు. ప్రస్తుతం యాప్ బీటా వెర్షన్లో ఉందని.. దాదాపు 60 శాతం కచ్చితత్వంతో సమాచారం అందిస్తోందని వివరించాడు. సమీప భవిష్యత్తులో యాప్‌ను మరింతగా అభివృద్ధి చేసి 99 శాతం కచ్చితత్వంతో భవిష్యవాణి చెప్పేలా రూపొందిస్తానని కుషాల్ అంటున్నాడు.నిర్ణయాలుతీసుకోవడానికి దోహదం జీవితంలో కీలక నిర్ణయాలుతీసుకొనే విషయంలో ఈ యాప్ ఉపయోగపడుతుందని కుషాల్ అంటున్నాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాలు తెలిస్తే ఆందోళనకు గురికాకుండా అప్లికేషన్లో భవిష్యత్తుతోపాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదనే అంశాలను కూడా మెషీన్ పొందుపరుస్తుందని వివరించాడు. -
గురుకులం: వేద విద్యామణులు
నలుగురు అక్కచెల్లెళ్లు. లక్ష్మి ఆర్య, కవిత ఆర్య, రజిత ఆర్య, సరిత ఆర్య. వీరిది తెలంగాణలోని ఓ వ్యవసాయ కుటుంబం. ఈ నలుగురూ వేదాలను అభ్యసించారు. కంప్యూటర్ యుగంలో అందులోనూ ఆడపిల్లలకు వేదాలెందుకు అనేవారి నోళ్లను మూయిస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, అపార పాండిత్యంతో ఔరా అనిపిస్తూ సంస్కృతంలో విద్యార్థులను నిష్ణాతులు చేస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఎదిర గ్రామమైన ఈ అక్కాచెల్లెళ్లను కలిస్తే వేదాధ్యయనం గురించి ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు. ‘‘మా అమ్మానాన్నలు ఆంచ సుమిత్ర, జంగారెడ్డి. నాల్గవ తరగతి వరకు ఊళ్లోనే చదువుకున్నాం. మా మామయ్య విద్వాంసుడవడంతో అతని సూచన మేరకు మా నలుగురు అక్కచెల్లెళ్ల ను కాశీలోని పాణిని కన్యా మహావిద్యాలయంలో చేర్చారు. కాశీ అంటేనే విద్యానగరి. విద్యలన్నీ అక్కడ సులభంగా లభిస్తాయని ప్రతీతి. అక్కడే పదేళ్లపాటు వేదాదేవి సాన్నిధ్య శిష్యరికాలలో విద్యాభ్యాసం చేశాం. ఆత్మరక్షణ కోసం శస్త్ర, శాస్త్రాలు సాధన చేశాం. ► ఆడపిల్లలకు వేదాలా..? వేదాలు బ్రాహ్మణులు కదా చదివేది అనేవారున్నారు. ఆడపిల్లలకు వేదం ఎందుకు అన్నారు. ఎక్కడ రాసుంది స్త్రీ వేదాలు చదవకూడదని, వేద మంత్రమే చెబుతుంది ప్రతి ఒక్కరూ వేదాన్ని పఠించవచ్చు అని. మేం చదివిన గురుకులాన్ని కూడా ప్రజ్ఞాదేవి, భేదాదేవి అనే అక్కచెల్లెళ్లు ఎంతో కృషితో నడిపిస్తున్నారు. రిషిదయానంద్ అనే విద్వాంసుడు స్త్రీని బ్రహ్మ పదవిపై కూర్చోబెట్టారు. వారి వద్ద విద్యను నేర్చుకున్న ఆ అక్కచెల్లెళ్లు వాళ్లు. ఆడపిల్లలు వేదాలు వినడమే నిషేధం అనే రోజుల్లోనే వారిద్దరూ వేదాధ్యయనం చేసి, గురుకులాన్ని స్థాపించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారి శిష్యులు గురుకులాలు స్థాపించి, వేదాన్ని భావితరాలకు అందిస్తున్నారు. ► అన్ని కర్మలు ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలను ఔపోసన పట్టడమే కాదు పౌరోహిత్యం, పుట్టినప్పటి నుంచి మరణించేవరకు మధ్య ఉన్న అన్ని కర్మలూ విధి విధానాలతో చేస్తున్నాం. కొంతమంది ‘ఇదేం విచిత్రం’ అన్నవారూ లేకపోలేదు. అనేవారు చాలా మందే అంటారు. కానీ, మేం వాటికి మా విద్య ద్వారానే సమాధానం చెబుతున్నాం. పురాణ, ఇతిహాసాల్లో గార్గి, మైత్రి, ఘోశ, అపాల .. వంటి స్త్రీలు వేదాభ్యాసం చేసి, తమ సమర్థత చూపారు. అయితే, చాలా మందికి వారి గురించి తెలియదు. ► ఉచిత తరగతులు మా నలుగురిలో లక్ష్మి ఆర్య, సరిత ఆర్య చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో విద్యార్థులకు వేదవిద్యను బోధిస్తున్నారు. పౌరహిత్యంతో పాటు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్లైన్లోనూ భగవద్గీత, సంస్కృత పాఠాలను ఉచితంగా చెబుతున్నాం. మా నలుగురి ఆలోచన ఒక్కటే సంస్కృతం విస్తృతంగా ప్రచారం కావాలి. ఆడపిల్లలూ వేద విద్యలో ముందంజలో ఉండాలి. మా వద్ద పిల్లలతోపాటు పెద్దవాళ్లు కూడా సంస్కృతం అభ్యసిస్తున్నారు’’ అని వివరించారు ఈ నలుగురు అక్కచెల్లెళ్లు. నేటి కాలంలో వేద విద్యపై ఎవరూ ఆసక్తి చూపడం లేదని, అందుకోసమే తాము వేద విద్యలో పట్టు సాధించాలనుకున్నాం అని తెలిపారు ఈ సోదరీమణులు. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి సంస్కృత వ్యాకరణంలో రజిత ఆర్య, సరిత ఆర్య పీహెచ్డీ పట్టా అందుకుని ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. – నిర్మలారెడ్డి – బాలయ్య, కొందుర్గు, రంగారెడ్డి జిల్లా, సాక్షి -
సంస్కారాలను బోధించే కల్పసూత్రాలు
కల్పసూత్రాలు(శాస్త్రాలు)ఋగ్వేదాది వేదాలవారీగా శాఖాభేదంతో అనేకమంది ఋషులు రచించారు. అవి ఆ ఋషుల పేర్లమీదే ప్రచారం పొందాయి. ఋగ్వేదానికి ఆశ్వలాయన, సాంఖ్యాయన కల్పసూత్రాలు, శుక్ల యజుర్వేదానికి కాత్యాయన, కృష్ణ యజుర్వేదానికి ఆపస్తంభీయ, బోధాయన, వైఖానస, సత్యాషాఢ, భారద్వాజ, అగ్నివేశ కల్పసూత్రాలు, సామవేదానికి లాట్యాయన, ద్రాహ్యాయన, జైమినీయ కల్పసూత్రాలు ప్రచారంలో వున్నాయి. చదవండి: (కల్పసూత్రాలు) ఎవరెవరు ఏయే కర్మలను ఆచరించాలి, ఏయే కర్మలకు ఏయే మంత్రాలను ఉపయోగించాలి, దానికి కావల్సిన సామగ్రి, దానికి అధిష్టాన దేవత, యజ్ఞాయుధాలు ఏమేమి కావాలి, అవి ఎన్ని వుండాలి, వాటి ఆకారం ఏమిటి, అవి దేనితో తయారు చెయ్యాలి, ఎంతమంది ఋత్విక్కులు కావాలి, యజ్ఞగుండాలు ఎన్ని కావాలి, వాటి ఆకారాలు, వాటి కొలతలు, అవి ఎలా నిర్మించాలి, హోమ ప్రక్రియలు, హోమంలో వెయ్యాల్సిన హవిస్సులు, హోమ సమిధలు తదితర విషయాలను వివరిస్తాయి కల్పసూత్రాలు.. కల్పశాస్త్రాలలోని విషయాలన్నీ ముఖ్యంగా సూత్రాల రూపంలోనే వుంటాయి. సూత్రమంటే విశాలమైన విషయాన్ని ఒక చిన్న వాక్యరూపంలో చెప్పడం. శ్రౌత సూత్రాలు, గృహ్య సూత్రాలు, ధర్మ సూత్రాలు, శుల్బ (శిల్ప) సూత్రాలు అని కల్ప సూత్రాలు నాలుగు రకాలుగా విభజించారు. శ్రౌత సూత్రాలు శృతిని (వేదాన్ని) ఆధారం చేసుకుని చెప్పబడ్డాయి. ఉదాహరణకు, ఋగ్వేదంలో వివాహ సూక్తం, అథర్వణ వేదంలో వివాహ సంస్కారానికి సంబంధించిన సుమారు నూటనలభై మంత్రాలు మొదలైనవాటి ఆధారంగా అన్నమాట. వివాహం, గర్భాదానం, పుంసవనం, అక్షరాభ్యాసం, బ్రహ్మచర్యం, అంత్యేష్టి వంటి కొన్ని సంస్కారాల తాలూకు కొన్నిమంత్రాలు మనకు వేదాలలో కనబడినా, వాటికి సంబంధించిన నిర్దిష్టమైన విధి విధానాలు, పద్ధతులు వేదాలలో కనబడవు. వీటికి సంబంధించిన సంపూర్ణమైన వివరణలు మనకు శ్రౌత సూత్రాలే అందిస్తాయి. కర్మ సిద్ధాంత మూలాలు మనకు మొదటగా ఋగ్వేదంలోనూ ఆతర్వాత అథర్వణవేదంలోనూ కనిపిస్తాయి. ఈ సందర్భంగా అథర్వణవేదం గురించి కొంత చెప్పుకోవాల్సిన అవసరం వుంది. వేదాలలో అథర్వణవేదం చివరిదే అయినా, అందులో దేవతా స్తోత్రాలకు సంబంధించిన మంత్రాలే కాకుండా, వేదకాలంలోని సమాజం, దానికి సంబంధించిన చరిత్ర, మానవుల జీవన విధానం, ఇత్యాది అంశాలను అధ్యయనం చెయ్యడానికి అది మనకు ఎంతో ఉపయోగపడుతుంది. సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, సంస్కారాలు, గృహాలు, పాడిపంటలు, వ్యవసాయం, కులమతాలు, వ్యాపార వాణిజ్యాలు, ప్రభుత్వాలు, రాజ్యాంగాలు, కళలు, వస్తు ఉత్పత్తులు, పరిశ్రమలు, భూగోళ ఖగోళ విఙ్ఞానం, వేదాంతం, విశ్వం మొదలగు అంశాలగురించి అథర్వణవేదం ఎంతో సమాచారాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, ‘‘సర్వప్రాణుల మనుగడకు అన్నమే ఆధారం. ఆ అన్నానికి ఉత్పత్తిస్థానం క్షేత్రం (పొలం).ఆ క్షేత్రాన్నీ, అశ్వాన్నీ పోషిస్తూ క్షేత్రపతి (రైతు) మా మేలుకోసం కృషి (వ్యవసాయం) చేస్తాడు. ఆ బుద్ధిశాలి ఎంతో విఙ్ఞానం గడించి మాకు సుఖం కలిగించుగాక..!’’ అంటూ లౌకిక విషయాలైన వ్యవసాయ ప్రాధాన్యత, రైతుల ప్రాముఖ్యత గురించి అమోఘంగా స్తుతించిందీ వేదం. ఈ శ్రౌత సూత్రాలు, గార్హపత్య, ఆహవనీయ, దక్షిణ అనే మూడురకాల అగ్నులు వుపయోగించి చేసే యాగాలనుండి ఐదురకాల అగ్నులు ఉపయోగించి చేసే మహా క్రతువుల వరకు అన్నింటి గురించీ తెలియజేస్తాయి. ఉదాహరణకు, ఉపనయనంలో, బ్రాహ్మణులకు గాయత్రి, క్షత్రియులకు త్రిష్టుప్, వైశ్యులకు జగతీ మంత్రాలను ఉపదేశించే విధానాన్ని తెలిపేది శ్రౌత సూత్రాలే.అగ్న్యాధానం చెయ్యడానికి, వసంతే బ్రాహ్మణః గ్రీష్మే రాజన్యః వర్షాసు రథకారః శరదివైశ్యః అను వేద ప్రమాణం చేత, పూర్వకాలంలో ప్రతి వసంతఋతువులోను సోమయజ్ఞం చేసేవారు. ఇందుకు అవసరమైతే భిక్షాటన కూడా చేసేవారు. వీరిని ‘వసంత సోమయాజులు’ అనేవారు. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు -
మానవ మనుగడకు వేదాలే మూలం
సైన్సుకు సైతం అవే ఆధారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు ముక్కామల (అంబాజీపేట) : మానవ మనుగడకు, నేటిæ సైన్సుకు సైతం మూలాధారం వేదాలు, వేదవాజ్ఞS్మయమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బులుసు శివశంకరరావు అన్నారు. అటువంటి వేదాలను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముక్కామలలోని శ్రీ కోనసీమ యజుర్వేద పాఠశాల నాలుగో వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ శివశంకరరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తికులందరికీ విద్యారణ్య బోధనలు, వేదాలే శరణ్యమని, వాటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పేర్కొన్నారు. ఆరు శాస్త్రాలు, అంగాలు తెలుసుకోవడం ఆచరించడం వల్ల దేశానికి క్షేమం కలుగుతుందన్నారు. ప్రతి విద్యార్థీ భాష్యం తప్పక చదవాలని సూచించారు. ధర్మాన్ని ఆచరించడంవల్ల దేశాభివృద్ధి జరిగి, అందరికీ మేలు కలుగుతుందన్నారు. ప్రస్తుత తరుణంలో వేదవిద్య పట్ల పలువురు విద్యార్థులు మక్కువ చూపుతున్నారని, వీరిని మంచి ప్రతిభ కలిగిన వేద పండితులుగా తయారు చేయవచ్చని అన్నారు. వేద వాంజ్ఞS్మయంలో పలు విషయాలను ఆయన విద్యారులకు వివరించారు. హైదరాబాద్ కామకోటి పుణ్యభూమి ట్రస్ట్, పాఠశాల పాలక వర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థికి నగదు పురస్కారం అందచేశారు. వేదపాఠశాల పాలకవర్గ అధ్యక్షుడు దువ్వూరి బాలకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు పి.కె.రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు, కంచి కామకోటి పీఠాధిపతి ప్రతినిధి స్వయంపాకుల జానకిరామమూర్తి, కార్యదర్శి దువ్వూరి లక్ష్మీనారాయణ సోమయాజులు, భమిడిపాటి శేఖర్, కొంపెల్ల కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.