మానవ మనుగడకు వేదాలే మూలం
- సైన్సుకు సైతం అవే ఆధారం
- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు
ముక్కామల (అంబాజీపేట) :మానవ మనుగడకు, నేటిæ సైన్సుకు సైతం మూలాధారం వేదాలు, వేదవాజ్ఞS్మయమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బులుసు శివశంకరరావు అన్నారు. అటువంటి వేదాలను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముక్కామలలోని శ్రీ కోనసీమ యజుర్వేద పాఠశాల నాలుగో వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ శివశంకరరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తికులందరికీ విద్యారణ్య బోధనలు, వేదాలే శరణ్యమని, వాటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పేర్కొన్నారు. ఆరు శాస్త్రాలు, అంగాలు తెలుసుకోవడం ఆచరించడం వల్ల దేశానికి క్షేమం కలుగుతుందన్నారు. ప్రతి విద్యార్థీ భాష్యం తప్పక చదవాలని సూచించారు. ధర్మాన్ని ఆచరించడంవల్ల దేశాభివృద్ధి జరిగి, అందరికీ మేలు కలుగుతుందన్నారు. ప్రస్తుత తరుణంలో వేదవిద్య పట్ల పలువురు విద్యార్థులు మక్కువ చూపుతున్నారని, వీరిని మంచి ప్రతిభ కలిగిన వేద పండితులుగా తయారు చేయవచ్చని అన్నారు. వేద వాంజ్ఞS్మయంలో పలు విషయాలను ఆయన విద్యారులకు వివరించారు. హైదరాబాద్ కామకోటి పుణ్యభూమి ట్రస్ట్, పాఠశాల పాలక వర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థికి నగదు పురస్కారం అందచేశారు. వేదపాఠశాల పాలకవర్గ అధ్యక్షుడు దువ్వూరి బాలకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు పి.కె.రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు, కంచి కామకోటి పీఠాధిపతి ప్రతినిధి స్వయంపాకుల జానకిరామమూర్తి, కార్యదర్శి దువ్వూరి లక్ష్మీనారాయణ సోమయాజులు, భమిడిపాటి శేఖర్, కొంపెల్ల కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.