vedas
-
ప్రాచీన భారతంలో వ్యవసాయ తత్వం
హరప్పా నాగరికత ఇతర పురాతన నగర నాగరికతల కంటే ఎంతో పరిణతిని చూపింది. పూర్తిగా అభివృద్ధి చెందిన వ్యవసాయ తత్వశాస్త్రం లేకుండా అధునాతన శాస్త్రీయ సాధనాలను తయారు చేయడం సాధ్యం కాదు. క్రీ.పూ. 2600లో నిర్మితమైన చైనా తొలి నగరం చాంగ్జౌలో కాల్చిన ఇటుకలు, అధునాతన చెక్క పనితనం ఆనవాళ్లు దొరకలేదు. అంటే, భారతీయ వ్యవసాయవాద సంస్కృతి చైనా కంటే చాలా అభివృద్ధి చెందినది. అయితే చైనా వ్యవసాయ తత్వం చైనా చరిత్రలో భాగం. అదే భారతదేశంలో అలా జరగలేదు. ఒక తత్వశాస్త్రంగా వ్యవసాయవాదాన్ని అధ్యయనం చేయడానికీ, రాయడానికీ అనర్హమైనదిగా భావించారు. పారను, నాగలిని భారతదేశ నాగరికతకు చిహ్నాలుగా చూడకపోవడం ఉత్పత్తి పురోగతిని బలహీనపరిచింది. నా తాజా పుస్తకం ‘ద శూద్ర రెబెలియన్’ కోసం పరిశోధిస్తున్నప్పుడు, పూర్వ వేద కాలంలో వ్యవసాయవాదపు (అగ్రికల్చరిజం) తాత్విక ధార ఉందో లేదో తెలుసుకోవడానికి పురాతన భారతీయ సాహిత్యం పరిశీలించాను. రాతపూర్వక ఆధారాలు ఏవీ దొరకలేదు. పురాతన చైనా, గ్రీస్, ఇజ్రాయెల్, ఈజిప్ట్‌లో అటువంటి స్రవంతులు ఉండే అవకాశాలను పరిశీలించాను. భారతదేశమే కాకుండా ఈ దేశాలు కూడా పురాతన ఆలోచనా విధానాలకు ప్రధాన నిర్మాతలు అని మనందరికీ తెలుసు. పురాతన చైనాలో చాలా శక్తిమంతమైన వ్యవసాయవాదపు ఆలోచన ధార ఉందని గుర్తించాను. ఇది క్రీస్తు పూర్వం 770 నుండి 221 మధ్య వృద్ధి చెందింది. వ్యవసాయం గురించి ప్రచారం చేసిన, రాసిన ఆ ప్రధాన తత్వవేత్త జు జింగ్ (క్రీస్తు పూర్వం 372–289). ఇది చైనా చరిత్రలో భాగమైంది.నిజానికి భారతీయ వ్యవసాయ నాగరికతా చరిత్ర చైనీస్ నాగరికతకు పూర్వం నాటిది. ఆర్యులకు పూర్వం భారతీయులు హరప్పా నాగరికతను నిర్మించినప్పుడు భారతదేశం చాలా అభివృద్ధి చెందిన వ్యవసాయ ఉత్పత్తిని కలిగి ఉంది. ఆనాటికి చైనాలో అంత అధునాతన వ్యవసాయ నాగరికత లేదు. చైనా తొలి నగరం చాంగ్జౌ. ఇది క్రీ.పూ 2600లో స్థాపించబడింది. హరప్పా నాగరికత దీని కంటే చాలా పురాతనమైనది. పైగా చైనీస్ నగరం చిన్నది; కాల్చిన ఇటుకలు, అధునాతన చెక్క పనితనం, కాంస్య పనిముట్ల వంటి ఆధారాలు దొరకలేదు.హరప్పా నాగరికత ఇతర పురాతన నగర నాగరికతల కంటే ఎంతో పరిణతిని చూపింది. పూర్తిగా అభివృద్ధి చెందిన వ్యవసాయ తత్వశాస్త్రం లేకుండా అధునాతన శాస్త్రీయ సాధనాలను తయారు చేయడం సాధ్యం కాదు. తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం రెండూ సన్నిహిత సంబంధం ఉన్న మానసిక అభివృద్ధి ప్రక్రియలు. వేదాలకు పూర్వం భారతదేశం ఆ మిశ్రమ ఆలోచనా విధానాన్ని కలిగి ఉంది.వ్యవసాయం, వేదాలువేదాలు లిఖితరూపం దాల్చి, గ్రంథాలుగా లిఖితమైన తరువాత, తత్వశాస్త్రంగా వ్యవసాయవాదాన్ని అధ్యయనం చేయడానికీ, రాయడానికీ అనర్హమైనదిగా పరిగణించారు. విషాదంగా ఆ ఆలోచనా స్రవంతి మెల్లగా ఉనికిలో లేకుండా పోయింది. దీని ఫలితంగా ప్రాచీన, మధ్యయుగ భారతదేశంలో వ్యవసాయ, చేతివృత్తుల శాస్త్రంలో, ఉత్పత్తిలో భారీ స్తబ్ధత ఏర్పడింది. తోలు సాంకేతికతను అంటరానిదిగా పరిగణించడం; దాని ఉత్పత్తిదారులతో పాటు, పారను, నాగలిని భారతదేశ నాగరికతకు చిహ్నాలుగా ఎన్నడూ చూడకపోవడం ఉత్పత్తి పురోగతిని బలహీనపరిచింది. అప్పుడు ముస్లిం పాలకులు భిన్నమైన తత్వశాస్త్రంతో వచ్చారు. కానీ తమ పరంపర ప్రకారం కులంలో దైవత్వం ఉందనీ, శూద్ర, దళిత, ఆదివాసీలకు విద్యను అందించడం దేవుని మార్గదర్శకత్వంలో లేదనే పండితులు త్వరగా ముస్లింల చుట్టూ మూగిపోయారు.మరో మాటలో చెప్పాలంటే, భారతీయ వ్యవసాయవాద సంస్కృతి చైనా కంటే చాలా అభివృద్ధి చెందినది. మన జాతీయవాదపు పునాది తత్వశాస్త్రం వ్యవసాయ సంస్కృతే తప్ప వేద సంస్కృతి కాదు. కుల సంస్కృతి వ్యవసాయవాదం గురించి రాయడానికీ, దానిని సంరక్షించడానికీ అనుమతించలేదు. ఎందుకంటే, ఆర్యన్ పూర్వ హరప్పన్ లు అభివృద్ధి చెందిన లిపిని కలిగిలేరు; వైదిక అనంతర కాలంలోనేమో వ్యవసాయదారులను నాల్గవ వర్ణంగా లేదా శూద్ర బానిసలుగా ప్రకటించారు. ఇందులో ప్రస్తుత రెడ్లు, కమ్మలు, కాపులు, మరాఠాలు, పటేళ్లు, జాట్లు, మొదలియార్ల నుండి చాకలి వంటి శూద్ర కులాలన్నీ ఉన్నాయి. క్షురకులు (మంగలి) కూడా వీరిలో ఒక భాగం. అందువల్ల బ్రిటిష్ పాలకులు వారందరికీ పాఠశాలలు తెరిచే వరకు, శూద్ర కులాలకు చదవడానికీ, రాయడానికీ అనుమతి లేదు. అక్బర్ వంటి ముస్లిం రాజులు కూడా, శూద్రులను పర్షియన్ విద్యకు దూరంగా ఉంచాలని చెప్పిన బ్రాహ్మణ పండితుల సలహాను అనుసరించారు. ఇప్పుడు కూడా ఆ చారిత్రక నిరక్షరాస్యత శూద్ర, దళిత, ఆదివాసీ ప్రజానీకంపై తన ప్రభావం చూపుతున్నది.ఆర్థికంగా దృఢంగా ఉన్న శూద్ర, దళిత, ఆదివాసీలు ఇప్పుడు కూడా తత్వశాస్త్రంతో నిమగ్నమై ఉండకపోవడానికి కారణమవుతున్న ఈ అడ్డంకులను నా పుస్తకం పరిశీలిస్తుంది. చాలావరకు ఆర్ఎస్ఎస్ ప్రాపంచిక దృక్పథంతో ప్రభావితులైన సమకాలీన ద్విజులు వ్యవసాయ తత్వశాస్త్రంతో సంబంధం కలిగి ఉండరు. భారతీయ తత్వానికి మూలం వేదాలు అని వారు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. కానీ వేదాలు వ్యవసాయ ఉత్పాదక క్షేత్ర తత్వాన్ని ప్రతిబింబించలేదు. శూద్రులు, దళితులు, ఆదివాసీలు తాత్విక ఆలోచనలను ఉత్పత్తి చేయగలరని ద్విజ చింతనాపరులు ఇప్పటికీ భావించడం లేదు. వారు వ్యవసాయ తత్వశాస్త్రం, వేదవాదం మధ్య గోడను నిర్మించారు. ఈ గోడ వ్యవసాయ ఉత్పత్తిలో సృజనాత్మకతను నాశనం చేసింది. ప్రస్తుత కాలంలో చైనాలో, ఐరోపాలో జరిగిన విధంగా మన దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి పెరగడానికి ఈ వాదం అనుమతించలేదు.మంచి ఉత్పత్తి, భూమి, విత్తనాల మధ్య సంబంధం గురించీ; నేల స్వభావం, విత్తనాలు, జంతువులు, మానవులతో దాని సంబంధం గురించీ అనేక తాత్విక దర్శనాలు గ్రామ వ్యవసాయ సమాజాలలో ఉన్నాయి అనేది వాస్తవం కాదా? మన గ్రామాల్లో ఇప్పటికీ తాత్విక ఆలోచనలు కీలక పాత్ర పోషిస్తున్నాయా, లేదా? అవును, అవి పని చేస్తున్నాయి. ఒక ప్రదేశంలో వేట, చేపలు పట్టడం అనేవి తగినంత ఆహారం అందించలేనప్పుడు, మొక్కలు, ధాన్యం, పండ్లు, భూమి, నీటి చుట్టూ ఉన్న తాత్వికత మాత్రమే ఆహారం అందించగలిగింది. ప్రత్యామ్నాయ పద్ధతివ్యవసాయానికి సంబంధించిన భారతీయ తత్వాన్ని పునర్నిర్మించడానికీ, హరప్పా వ్యవసాయం నుండి దాని మూలాలను గుర్తించడానికీ ప్రస్తుత గ్రామ స్థాయి వ్యవసాయ ప్రజానీకాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయడం మిగిలి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం.పైన పేర్కొన్న పుస్తకంలో శూద్ర వ్యవసాయవాదం, భారతీయ నాగరికత అనే అధ్యాయం ఉంది. ఇది నిజానికి చైనీస్‌తో పోల్చి చూస్తే మన వ్యవసాయ తత్వశాస్త్రపు ప్రాథమిక అధ్యయనం. భారతదేశంలోని వ్యవసాయ కార్యకలాపాలు భౌతికవాదంతో ముడిపడి ఉన్న తాత్విక ఆలోచనలను ఎలా కలిగి ఉంటాయో ఇది నిర్వచిస్తుంది. మతం మాత్రమే తత్వశాస్త్రంతో ముడిపడి ఉందన్నది హిందుత్వ అభిప్రాయం. వాస్తవానికి ఋగ్వేదం రాయకముందే, రామాయణ, మహాభారతాలు రాయకముందే వ్యవసాయ తత్వశాస్త్రం ఆధ్యాత్మిక తత్వశాస్త్రం కంటే లోతుగా ఇక్కడ పాతుకుని ఉంది.వ్యవసాయదారులను శూద్ర బానిసలుగా అణచివేయడం ద్వారా వేదవాదులు వ్యవసాయవాద తత్వాన్ని కూడా అణచివేశారు. పైగా వ్యవసాయ వ్యతిరేక తాత్విక ఆలోచనా ధోరణి కొనసాగింది.అయితే, భారతీయ వ్యవసాయ విధానంపై చాలా కొత్త అధ్యయనాలు జరగాల్సి ఉంది. వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం కాబట్టి దీనికి వైదికం, వేదాంతం, ద్వైతం, అద్వైతం కంటే ఉన్నతమైన హోదా ఇవ్వాలి. మనం ఒక సృజనాత్మక దేశంగా మనుగడ సాగించడానికి వ్యవసాయవాదం వంటి గొప్ప తాత్విక ధోరణులను తిరిగి ప్రోత్సహించాలి. వ్యవస్థీకృత మతాలు ఒకప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా లేవు. అనేక శతాబ్దాల తరువాత అవి ఉండకపోవచ్చు. కానీ ఈ భూమిపై మానవ జీవితం ఉన్నంత కాలం ఉత్పత్తి, పంపిణీ తత్వశాస్త్రం మానవ జీవితంలో భాగంగా ఉంటుంది.- వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త (డిసెంబర్ 8న గుంటూరులో ‘ద శూద్ర రెబిలియన్’ ఆవిష్కరణ)- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
యాజ్ఞవల్క్యుడి స్వాభిమానం
అది ద్వాపరయుగం. వ్యాసుడు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజన చేశాడు. నాలుగు భాగాలనూ తన నలుగురు శిష్యులైన జైమిని, వైశంపాయనుడు, పైలుడు, సుమంతులకు అప్పగించాడు. లోకంలో వాటిని ప్రచారం చేయమని వారిని ఆదేశించాడు. వ్యాసుడి ద్వారా వైశంపాయనుడు యజుర్వేదాన్ని పొందాడు. గురువు ఆదేశం మేరకు యజుర్వేద ప్రచారం కోసం శిష్యులకు బోధించసాగాడు. వైశంపాయనుడి శిష్యులలో యాజ్ఞవల్క్యుడు మిగిలిన శిష్యులందరి కంటే చాలా తెలివైనవాడు. గురువుకు శ్రద్ధగా శుశ్రూష చేస్తూ, ఆయన వద్ద యజుర్వేదాన్ని కూలంకషంగా నేర్చుకున్నాడు. అదే కాలంలో ఒకనాడు మహర్షులందరూ మేరుపర్వతం మీద సభను ఏర్పాటు చేశారు. అన్ని రాజ్యాల్లో ఉన్న మహర్షులందరికీ వర్తమానం పంపారు. మహర్షులందరూ ఆ సభకు తప్పక రావాలని, ఎవరైనా సభకు రానట్లయితే వారికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని తీర్మానించారు. మహర్షుల సభకు రావలసినదిగా వైశంపాయనుడికి కూడా వర్తమానం అందింది. అయితే, కారణాంతరాల వల్ల ఆయన ఆ సభకు వెళ్లలేకపోయాడు. అందువల్ల మహర్షుల తీర్మానం ప్రకారం వైశంపాయనుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఈ పరిణామానికి వైశంపాయనుడు ఎంతగానో దిగులు చెందాడు. బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడే ఉపాయమేమిటని మహర్షులను అడిగాడు. ‘ఎవరైనా తపస్సు ధారపోస్తే బయటపడవచ్చు’ అని వారు తరుణోపాయం చెప్పారు. ఇదంతా జరిగినప్పుడు ఆశ్రమంలో యాజ్ఞవల్క్యుడు లేడు. ఏదో పని మీద బయటకు వెళ్లాడు. గురువుకు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కల్పించడానికి వైశంపాయనుడి మిగిలిన శిష్యులంతా ఆశ్రమ ప్రాంగణంలో తపస్సు ప్రారంభించారు. అదే సమయానికి యాజ్ఞవల్క్యుడు వచ్చాడు. ఆశ్రమంలో తన సహాధ్యాయులందరూ తపోనిష్ఠలో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకు వారంతా తపోనిష్ఠలో ఉన్నారో అతడికి అర్థంకాలేదు. నేరుగా గురువు వైశంపాయనుడి వద్దకు వెళ్లాడు. ‘గురువర్యా! నా సహాధ్యాయులందరూ తపోనిష్ఠలో ఉన్నారేమిటి? నేను లేనప్పుడు వారికి ఏదైనా దీక్ష ఇచ్చారా? లేదా ఏదైనా బృహత్కార్యం కోసం వారంతా తపస్సు చేస్తున్నారా?’ అని ప్రశ్నించాడు. ‘నాయనా! మేరుపర్వతం మీద మహర్షుల సభ జరిగింది. అనివార్య కారణాల వల్ల నేను ఆ సభకు వెళ్లలేకపోయాను. అందువల్ల మహర్షుల తీర్మానం ప్రకారం నాకు బ్రహ్మహత్యాపాతకం సంప్రాప్తించింది. తరుణోపాయం కోసం నేను మహర్షులనే ఆశ్రయించాను. వారు చెప్పిన తరుణోపాయం ప్రకారం నాకు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలగాలంటే ఎవరైనా తమ తపః ఫలాన్ని నాకు ధారపోయవలసి ఉంటుంది. తపః ఫలితాన్ని నాకు ధారపోయాలనే నా శిష్యులంతా తపస్సుకు పూనుకున్నారు’ అని చెప్పాడు వైశంపాయనుడు. ‘గురువర్యా! వీళ్లంతా అల్పజ్ఞులు. వీళ్ల తపస్సు వల్ల మీకు పాపవిమోచన కలగడానికి ఎన్నాళ్లు పడుతుందో! నాకు అనుజ్ఞ ఇవ్వండి. మీకోసం ఘోరమైన తపస్సు చేస్తాను’ అన్నాడు యాజ్ఞవల్క్యుడు. సహాధ్యాయులను అల్పజ్ఞులుగా సంబోధించిన యాజ్ఞవల్క్యుడిపై వైశంపాయనుడికి పట్టరాని కోపం వచ్చింది. ‘సాటివారిని అవమానించే నీలాంటి గర్వాంధుడితో నాకు పనిలేదు. నీలాంటి వాడికి నాకు శిష్యుడిగా ఉండే అర్హత కూడా లేదు. నేను చెప్పిన విద్యను ఇక్కడే వదిలేసి వెళ్లు’ హూంకరించాడు వైశంపాయనుడు. యాజ్ఞవల్క్యుడు స్వాభిమాని. గురువు మాటలు అతడికి అవమానంగా తోచాయి. గురువు వద్ద నేర్చుకున్న విద్యనంతా అక్కడే నల్లని నెత్తురుగా కక్కేశాడు. అతడు కక్కిన నెత్తురు కృష్ణ యజుర్వేదమైంది. ఆ నెత్తుటిని తిత్తిరి పక్షులు తిన్నాయి. తిత్తిరి పక్షులు తినేసిన నెత్తురు ఆ తర్వాత తైత్తరీయోపనిషత్తు అయింది. గురువు వద్ద నేర్చుకున్న వేదాన్నంతా కక్కేసిన యాజ్ఞవల్క్యుడు సూర్యుడి కోసం తపస్సు చేసి, ఆయనను ప్రసన్నుడిని చేసుకున్నాడు. సూర్యుడి వద్దనే నేరుగా వేదవిద్యను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. యాజ్ఞవల్క్యుడు సూర్యుడి వద్ద నేర్చుకున్నది శుక్లయజుర్వేదమైంది. ఈ వేదభాగాన్నే యాజ్ఞవల్క్యుడు తన శిష్యులైన కణ్వ, మధ్యందినాదులకు బోధించాడు. యాజ్ఞవల్క్యుడు బోధించిన శుక్లయజుర్వేదం ‘వాజసనేయ సంహిత’గా ప్రసిద్ధి పొందింది. వాజః అంటే అన్నం. సని అంటే దానం. యాజ్ఞవల్క్యుడి తండ్రి నిరతాన్నదానం చేసేవాడు. అందువల్ల ఆయనకు వాజసని అనే పేరు వచ్చింది. వాజసని కొడుకు కావడం వల్ల యాజ్ఞవల్క్యుడికి వాజసనేయుడు అనే నామాంతరం ఏర్పడింది. - సాంఖ్యాయన -
గురుకులం: వేద విద్యామణులు
నలుగురు అక్కచెల్లెళ్లు. లక్ష్మి ఆర్య, కవిత ఆర్య, రజిత ఆర్య, సరిత ఆర్య. వీరిది తెలంగాణలోని ఓ వ్యవసాయ కుటుంబం. ఈ నలుగురూ వేదాలను అభ్యసించారు. కంప్యూటర్ యుగంలో అందులోనూ ఆడపిల్లలకు వేదాలెందుకు అనేవారి నోళ్లను మూయిస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, అపార పాండిత్యంతో ఔరా అనిపిస్తూ సంస్కృతంలో విద్యార్థులను నిష్ణాతులు చేస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఎదిర గ్రామమైన ఈ అక్కాచెల్లెళ్లను కలిస్తే వేదాధ్యయనం గురించి ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు. ‘‘మా అమ్మానాన్నలు ఆంచ సుమిత్ర, జంగారెడ్డి. నాల్గవ తరగతి వరకు ఊళ్లోనే చదువుకున్నాం. మా మామయ్య విద్వాంసుడవడంతో అతని సూచన మేరకు మా నలుగురు అక్కచెల్లెళ్ల ను కాశీలోని పాణిని కన్యా మహావిద్యాలయంలో చేర్చారు. కాశీ అంటేనే విద్యానగరి. విద్యలన్నీ అక్కడ సులభంగా లభిస్తాయని ప్రతీతి. అక్కడే పదేళ్లపాటు వేదాదేవి సాన్నిధ్య శిష్యరికాలలో విద్యాభ్యాసం చేశాం. ఆత్మరక్షణ కోసం శస్త్ర, శాస్త్రాలు సాధన చేశాం. ► ఆడపిల్లలకు వేదాలా..? వేదాలు బ్రాహ్మణులు కదా చదివేది అనేవారున్నారు. ఆడపిల్లలకు వేదం ఎందుకు అన్నారు. ఎక్కడ రాసుంది స్త్రీ వేదాలు చదవకూడదని, వేద మంత్రమే చెబుతుంది ప్రతి ఒక్కరూ వేదాన్ని పఠించవచ్చు అని. మేం చదివిన గురుకులాన్ని కూడా ప్రజ్ఞాదేవి, భేదాదేవి అనే అక్కచెల్లెళ్లు ఎంతో కృషితో నడిపిస్తున్నారు. రిషిదయానంద్ అనే విద్వాంసుడు స్త్రీని బ్రహ్మ పదవిపై కూర్చోబెట్టారు. వారి వద్ద విద్యను నేర్చుకున్న ఆ అక్కచెల్లెళ్లు వాళ్లు. ఆడపిల్లలు వేదాలు వినడమే నిషేధం అనే రోజుల్లోనే వారిద్దరూ వేదాధ్యయనం చేసి, గురుకులాన్ని స్థాపించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారి శిష్యులు గురుకులాలు స్థాపించి, వేదాన్ని భావితరాలకు అందిస్తున్నారు. ► అన్ని కర్మలు ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలను ఔపోసన పట్టడమే కాదు పౌరోహిత్యం, పుట్టినప్పటి నుంచి మరణించేవరకు మధ్య ఉన్న అన్ని కర్మలూ విధి విధానాలతో చేస్తున్నాం. కొంతమంది ‘ఇదేం విచిత్రం’ అన్నవారూ లేకపోలేదు. అనేవారు చాలా మందే అంటారు. కానీ, మేం వాటికి మా విద్య ద్వారానే సమాధానం చెబుతున్నాం. పురాణ, ఇతిహాసాల్లో గార్గి, మైత్రి, ఘోశ, అపాల .. వంటి స్త్రీలు వేదాభ్యాసం చేసి, తమ సమర్థత చూపారు. అయితే, చాలా మందికి వారి గురించి తెలియదు. ► ఉచిత తరగతులు మా నలుగురిలో లక్ష్మి ఆర్య, సరిత ఆర్య చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో విద్యార్థులకు వేదవిద్యను బోధిస్తున్నారు. పౌరహిత్యంతో పాటు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్లైన్లోనూ భగవద్గీత, సంస్కృత పాఠాలను ఉచితంగా చెబుతున్నాం. మా నలుగురి ఆలోచన ఒక్కటే సంస్కృతం విస్తృతంగా ప్రచారం కావాలి. ఆడపిల్లలూ వేద విద్యలో ముందంజలో ఉండాలి. మా వద్ద పిల్లలతోపాటు పెద్దవాళ్లు కూడా సంస్కృతం అభ్యసిస్తున్నారు’’ అని వివరించారు ఈ నలుగురు అక్కచెల్లెళ్లు. నేటి కాలంలో వేద విద్యపై ఎవరూ ఆసక్తి చూపడం లేదని, అందుకోసమే తాము వేద విద్యలో పట్టు సాధించాలనుకున్నాం అని తెలిపారు ఈ సోదరీమణులు. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి సంస్కృత వ్యాకరణంలో రజిత ఆర్య, సరిత ఆర్య పీహెచ్డీ పట్టా అందుకుని ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. – నిర్మలారెడ్డి – బాలయ్య, కొందుర్గు, రంగారెడ్డి జిల్లా, సాక్షి -
నమస్కార సంస్కారం నేర్పిన కరోనా
షేక్ హ్యాండ్ ఇవ్వడం రాకపోతే చిన్నచూపు చూసిన ఆధునిక లోకం.. అదే షేక్ హ్యాండ్ ఇవ్వబోతే ఛీ కొట్టే స్థితికి వచ్చింది. కషాయం అంటే కడుపులో తిప్పుతుందన్న నోటితోనే వాటిని ఇష్టంగా తాగేలా చేసింది. కరోనా కారణంగా మన ఆచార వ్యవహారాలు, ఆరోగ్యమార్గాల విలువ నవతరానికి మాత్రమే కాదు ప్రపంచానికీ తెలిసింది. ఈ నేపథ్యంలో నగరవాసి వీటిని భావితరాలకు అందించాల్సిన అవసరాన్ని గుర్తించారు. అమెరికాలో ఉద్యోగం వదులుకుని వచ్చి వాటిని పాఠ్యాంశాలుగా మార్చే పనిలో నిమగ్నమయ్యారు. సాక్షి, హైదరాబాద్: ‘మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను ఒక మతానికి పరిమితం చేయడం సరైంది కాదు. అవెంత అవసరమో.. వాటిని పాటించడం అంటే మానవాళికి ఎంత మేలు కలుగుతుందో కరోనా తెలియజెప్పింది. ఇప్పుడు వాటిని భావితరాలకు అందించడమే నా లక్ష్యం’ అంటున్నారు నగరానికి చెందిన ఇండియన్ వేదిక్ ఫౌండేషన్ నిర్వాహకులు విక్రమ్ రాజు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి, అక్కడే చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదులుకుని నగరానికి వచ్చిన ఆయనకు భారతీయ ఆచార వ్యవహారాలంటే చాలా మక్కువ. వేదాలు, ఉపనిషత్తులు, యోగా, ఆయుర్వేదం గురించి తెలుసుకున్నారు. వాటిని పాఠ్యాంశాలుగా మారుస్తున్నారు. ఆయన చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే. సరళీకరణ ఓ నిర్విరామ ప్రక్రియ.. మనవైన వేదాలు రోజురోజుకూ మనకి దూరమవకుండా ఉండేందుకు మనకన్నా మన ముందు తరం వారే తగిన శ్రద్ధ వహించారు. కాలానుగుణంగా వాటిని సింప్లిఫై చేస్తూ వచ్చారు. తొలిదశలో వేదాలు అందరూ చదివగలిగేవారు. తర్వాత ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, తర్వాత దశలో పండుగలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు సంప్రదాయంగా పండుగలు ఆచరించేవారు కూడా లేరు కాబట్టి.. వాటిని భావితరాలకు ఉపకరించేలా మరింత సింప్లిఫై చేసి పాఠాల రూపంలో అందించాల్సి ఉంది. నాటి బాటే.. నేటి పాఠమై.. వేద పాఠశాలు చాలా ఉన్నా.. యోగా, ముద్ర, చక్రాస్, మెడిటేషన్‌లపై దేశంలో ఎవరి దగ్గరా సరైన విద్యా మెటీరియల్ లేదని నాకు అవగతమైంది. లాక్డౌన్ సమయంలో లభించిన వెసులుబాటుతో దాదాపు 25ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నవారితో కలిసి ఒక కర్రిక్యులం తయారు చేశా. అలాగే దాదాపు 2వేల పేజీలు ఉండే గరుణ పురాణంలోని ముఖ్యమైనదంతా కలిపి 100 పేజీల్లో కుదించి.. 18 పురాణాలూ చేయిస్తున్నాను. మనకు 18 శక్తి పీఠాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఒక్కో దేవత గురించి 2 పేజీల్లో పొందుపరచి పుస్తకాలు తెస్తున్నాం. ఈ కర్రిక్యులంని రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలకు, కళాశాలలకు అందుబాటులోకి తేవాలనేది ప్రయత్నం. ఆయుర్వేదం సహా 150 నుంచి 200 పేజీలలో వేదాల పుస్తకాలు తెస్తున్నాం. వేదగణితం.. కాల్క్యులేటర్కి సమానం.. మన వేదిక్ మ్యాథ్స్ చాలా సింప్లిఫైడ్.. ఈ వేద గణితం నేర్చుకున్నవారు కాల్క్యులేటర్తో సమానంగా లెక్కించగలరు అంటే నమ్మాలి. క్లాస్ 1 నుంచి క్లాస్ 10దాకా వేదిక్ సైన్స్‌తో పాటు వేదాలు, నాలుగు వేదాలు ఉపనిషత్తులు, మంత్రాలు, తంత్రాలపై కూడా పూర్తిస్థాయి సబ్జెక్టు తయారు చేశా. ఇవన్నీ రెగ్యులర్ సిలబస్‌తో పాటు అందించాలంటే.. వ్యక్తిగతంగా ఆసక్తి ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే సరిపడా స్థలం ఇస్తే ఇండియన్ వేదిక్ స్కూల్ నెలకొల్పాలని ఉంది. చిన్ననాటి నుంచే నేర్పాలి... డార్విన్ ఎవల్యూషన్ థియరీ చదువుతాం. కానీ అది ఎప్పుడో మనం దశావతారాల పేరిట మన పెద్దవాళ్లు చెప్పారనేది పిల్లలకి తెలియాలి. అలాగే మొత్తం సోలార్ సిస్టమ్ గురించి, గెలాక్సీ గురించి పురుష సూక్తంలోని నాసదీయసూక్తంలో ఉందని తెలియజెప్పాలి. అవన్నీ ఎప్పుడో కాదు ప్రతి పిల్లాడికీ వేదాలు, ఉపనిషత్తు 5వ ఏట నుంచే ఇవి పాఠ్యాంశాలు కావాలి. ఆ ఉద్ధేశ్యంతోనే మొత్తం 50 థియరీల మీద కలిపి బుక్స్ చేయిస్తున్నాను. – విక్రమ్ రాజు, వేదిక్ ఫౌండేషన్ -
గృహస్థు ఆచరించాల్సిన సంస్కారాలు గృహ్య సూత్రాలు
గృహ్య సూత్రాలనేవి గృహస్థులు ఆచరించాల్సిన ధర్మాలనూ, సంస్కారాలనూ వివరిస్తాయి. ఇవి ఇంట్లో చేయవలసిన కర్మలు. ద్రాహ్యాయనుడు, కాత్యాయనుడు తప్ప, కల్పసూత్రాలను రచించిన ఋషులందరూ గృహ్య సూత్రాలను రచించారు. వాటిలో కొన్ని, ఆపస్తంభ, బౌధాయన, ఆశ్వలాయన, భారద్వాజ, గోభిల, హిరణ్యకేశీయ, జైమినీయ, ఖదీర, మానవ, పారాస్కర, సాంఖ్యాయన గృహ్య సూత్రాలు. ఇవి వాటిని రచించిన ఋషులపేర్లమీద ప్రాచుర్యం పొందాయి. వీటిలో బోధాయన, ఆపస్తంభ, కాత్యాయనమొదలగు తొమ్మిది గృహ్యసూత్రాలు ప్రాచీనమైనవి. వైఖానస, శౌనకీయ, భారద్వాజ, అగ్నివేశ, జైమినీయ, వాధూల, మాధ్యందిన, కౌండిన్య, కౌశీతకీ గృహ్యసూత్రాలు తొమ్మిది ఆ తరువాతి కాలానివి. గృహ్యసూత్రాలు, నలభై సంస్కారాలను, ఎనిమిది ఆత్మ గుణాలను నిర్దేశించాయి. వైదికులు, ప్రతినిత్యం ఏడు హవిర్యజ్ఞాలు, ఏడు సోమయజ్ఞాలు, ఏడు పాకయజ్ఞాలు మొత్తం కలిపి ఇరవై ఒక్క యజ్ఞాలను ఆచరించే అగ్నికార్యం చేయాలని కల్పసూత్రాలు చెప్తున్నాయి. వీటిలో ఏడు హవిర్యజ్ఞాలు, ఏడు సోమయజ్ఞాలు, శ్రౌత సూత్రాలలోనికి వస్తాయి కనుక గృహ్యసూత్రాలలో వుండవు. మిగిలిన ఏడు పాకయజ్ఞాలు, పంతొమ్మిది సంస్కారాలతో కలిపి గృహస్థుడు ఆచరించాల్సిన మొత్తం ఇరవై ఆరు సంస్కారాలు గృహ్యసూత్రాలలో వుంటాయి. అసలు ఈ సంస్కారాల సంఖ్యమీద కొన్ని వాదోపవాదాలున్నాయి. అవి పన్నెండు అని కొందరు, పదహారు అని కొందరు, పంతొమ్మిది అని కొందరు అంటారు. కానీ ఎక్కువ భాగం పదహారు సంస్కారాలనే అంగీకరించారు. స్వామి దయానంద సరస్వతి రచించిన ‘సంస్కార విధి’ లో పదహారు సంస్కారాలనే పేర్కొన్నారు. అవి గర్భాదానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామకరణం, నిష్క్రమణం, అన్నప్రాసనం, చూడాకరణ, కర్ణవేధ, విద్యారంభం, ఉపనయనం, వేదారంభం, కేశాంతం, సమావర్తనం, వివాహం, అంత్యేష్టి. దేవయజ్ఞం(కర్మకాండలు, హోమాలు), పితృయజ్ఞం(తర్పణం, శ్రాద్ధక్రియలు), భూతయజ్ఞం(బలులు, అర్పణలు), బ్రహ్మయజ్ఞం (వేదాన్ని అధ్యయనం చెయ్యడం), మనుష్యయజ్ఞం (అతిథులకు, పేదలకు సేవచెయ్యడం)అనే ఐదునిత్యయజ్ఞాలు; అగ్నాధేయం, అగ్నిహోత్రం, సౌత్రాయణీ, అగ్రయణేష్టి, చాతుర్మాస్యం, దర్శపూర్ణమాస్యం, విరూఢపశుబంధఅనే ఏడు హవిర్యజ్ఞాలు; అగ్నిష్టోమ, అత్యగ్నిష్టోమ, ఉక్థ్య, వాజపేయ, అప్తోర్యామ, అతిరాత్రి, షోడశి అనే ఏడుసోమయజ్ఞాలు; అష్టక, అగ్రహాయణీ, ఆశ్వయుజీ, శ్రాద్ధ, పార్వణ, చైత్రీ, శ్రావణీ అనే ఏడుపాకయజ్ఞాలు; ప్రాజాపత్యం, సౌమ్యం, ఆగ్నేయం, వైశ్వదేవం అనేవి వటువు కోసం ఆచార్యుడు చేసే నాలుగుసంస్కారాలు; సమావర్తనం, వివాహం అనేవి తనకోసం తను చెయ్యాల్సిన రెండు స్వకృత్య సంస్కారాలు; గర్భాదానం, పుంసవనం, సీమంతం అనేవి తన భార్యకు చేయవల్సిన మూడు సంస్కారాలు; జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన, చౌలం, ఉపనయనం అనేవి తనసంతానం శ్రేయస్సు కోసం చేయవల్సిన ఐదుసంస్కారాలు; మొత్తం కలిపి గృహస్థుడు ఆచరించాల్సినవి నలభైసంస్కారాలు. వీటి గురించి, పారస్కరుడు, అశ్వలాయనుడు, బోధాయనుడు మాత్రమే తమ గృహ్య సూత్రాలలో వివరంగా తెలియజేశారు. ఈ గృహ్య సూత్రాలలో ముఖ్యంగా, గార్హపత్యాగ్నిని ఉపయోగించిచేసే క్రతువుల వివరణ వుంటుంది. దయ, అనసూయ (అసూయ లేకపోవడం), అకార్పణ్యం (మొండిగా లేకుండుట), అస్పృహ, అనాయాసం, శౌచం (శుభ్రత), మాంగల్యం (మధు స్వభావం), క్షాంతి (క్షమా గుణం) అనేవి ఆత్మ గుణసంస్కారాలు. ఇవి జాతి భేదం లేకుండా, ప్రతి మనిషికీ వర్తించే ధర్మాలు.పైన చెప్పిన నలభై సంస్కారాలు, ఈ ఎనిమిది ఆత్మగుణ సంస్కారాలు, మొత్తం కలిపి మనిషి పాటించాల్సిన సంస్కారాలు నలభై ఎనిమిది అనే నానుడి కూడా వుంది లోకంలో. ఈ సంస్కారాల సంఖ్య విషయంలో ఎన్ని అభిప్రాయ భేదాలున్నా, అన్ని సంస్కారాలూ మనిషిని సంస్కరించేవే, తనని ధర్మమార్గాన ప్రయాణింప జేసేవే. ఈ సంస్కారాలన్నీ కొన్ని స్వప్రయోజనాలకోసం చేసేవైతే, కొన్ని ఇతరుల లేక సామాజిక ప్రయోజనాలకోసం చేసేవి. ఒక వ్యక్తి సంస్కారవంతుడైతే, అది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమాజానికి ఉపయోగించేదే. కాబట్టే, మనిషి ఈ ధర్మాలను ఆచరించినంత కాలం సమాజం సంస్కారవంతంగా, ధర్మబద్ధంగా వుంటుంది. వ్యక్తులు ధర్మం తప్పితే, వ్యవస్థ కూడా గాడితప్పి యావత్ సమాజమూ భ్రష్టుపట్టిపోతుంది. ధర్మానికి హాని జరిగితే, సాక్షాత్తూ భగవంతుడే వచ్చి ధర్మ సంస్థాపన చేస్తానని చెప్పడంలో, ధర్మానికివున్న ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ గుర్తించి నడచుకోవాలి. ధర్మ హాని జరుగకుండా చూసుకోవాలి. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు -
అగ్నిదేవుడి అనుగ్రహాన్ని పొందడం ఎలా?
వేదకాలం నుండి సర్వదేవతారాధనలో అగ్నికి అత్యంత ప్రాముఖ్యం ఏర్పడింది. అనాది కాలం నుండి మానవ జీవితంలో కూడా అగ్ని ప్రముఖ స్థానం ఆక్రమించింది. వైదిక ఋషులు అగ్నిని భగవంతుడుగా పూజించారు. అగ్నిదేవుడని పేరు. ఈ అగ్ని దేవుడు అష్టదిక్పాలకులలో ఒకడుగా గుర్తింప బడ్డాడు. అగ్నికి మత పరంగా కూడా శ్రేష్ఠత్వం ఉంది. అగ్ని మిగిలిన దేవతలందరికి హవ్యాన్ని మోసుకుపోతాడని, దేవతలు అగ్ని ముఖులని వైదిక వాజ్ఞ్మయం చెబుతుంది. ఆద్యంత రహితుడు, అఖండుడు అని పరమాత్ముని సేవించడంలో అగ్నికి మించిన సాధనం వేరొకటి లేదు. అగ్నిమీళే పురోహితమ్మని వేదం. నక్షత్ర గ్రహతారకలు, నదీనదాలు, సాగరాలు, సూర్య చంద్రాది గోళాలు ఒకటేమిటి సృష్టిలోని ప్రత్యణువు అగ్నిచేత వివిధ రూపాలలో చైతన్యం కలిగి ఉన్నాయి. సంస్కృతభాషలో అగ్ని శబ్దానికి ఎన్నో పర్యాయ పదాలున్నాయి. విశ్వానరుడనే ఋషి పుత్రుడైనందున వైశ్వానరుడని, అశ్వమేధ యాగంలో గుర్రాలు హవిస్సుగా కలవాడైనందున వీతిహోత్రుడని, నీటి ఉత్పత్తి స్థానం కావటం వల్ల కృపేట యోని అని, వేదాలు పుట్టుకకు కారణభూతుడైన నందువల్ల జాతవేదుడని, ప్రతి వస్తువును పవిత్రం చేసినందున పావకుడని, శుచిత్వం కలిగివున్నందున శుచి అని అగ్నికి నామాం తరాలనేకం ఉన్నాయి. "దక్షిణాగ్నిర్గార్హ సత్యాహవనీయౌ త్రయోగ్నయః వేదికి దక్షిణమైన అగ్ని దక్షిణాగ్ని, యజమానుని చేత ఇతరాగ్నుల కంటే పూర్వం సంస్కరించబడిన అగ్ని గార్హపత్యం. క్రియా పరిసమాప్తి పర్యంతం హోమం చేయదగినది. అహవనీయం. ఇలా అగ్ని మూడు విధాలుగా వేదభూమిలో ప్రసిద్ది కెక్కింది. అన్ని శుభాలను అగ్ని ప్రజల్వనంతోనే. నూతన గృహ నిర్మాణ సమయంలో పాత ఇంటిలో ప్రజ్వలింపబడిన అగ్నిలో నుండి కొంత భాగాన్ని తీసుకొచ్చి కొత్త ఇంటిలోనికి ప్రవేశించాలని వేదాల్లో చెప్పబడింది. ఈ ఆచారం కొన్ని చోట్ల నేటికీ కనబడుతోంది. పురాణేతిహాసాలలో అగ్నికి వజ్రాయుధానికి భేదం లేదని చెప్పబడింది. అగ్ని ఇంద్రుడు ఒక్కరేనని పురాణాలలో ఉటంకించ బడింది. జలాంతర్హితమైన అగ్నిని బడబాగ్ని అంటారు. పరమోత్క్రుష్ట దశలో వెలిగే అగ్నిని బ్రహ్మాగ్ని అని చెప్పారు. సృష్టి సంబంధమైన పంచాగ్ని విద్యను గురించి ముండకోపనిషత్తు వివరించింది. హిందూ సమాజంలో జన్మించింది మొదలు మృత్యువు పర్యంతం అగ్ని యొక్క అవసరం ఉంది. పురిటిలో దీపం వెలిగించి నట్లే మృతదేహం దగ్గర కూడా ఆత్మజ్యోతిగా దీపం వెలిగిస్తారు. దీపారాధనతో ప్రారంభం కాని శుభాశుభ కర్మ అంటూ ఏది లేదు. మనిషి మనుగడకు అత్యంతోపకారి. తానే అగ్నిహోత్రుడై జఠరాగ్నిని దీపింపజేస్తున్నానని, అహం వైశ్వానరో భుత్వా ప్రాణీనాం దేహం మాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్" నేను జఠరాగ్ని రూపంన ప్రాణాల దేహము నందుండి ప్రాణాపాన వాయువులతో కూడిన వాడనై భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములను నాలుగు విధముల పదార్ధములను జీర్ణము చేయుచున్నాను" అని శ్రీ కృష్ణ పరమాత్మ గీతలో అంటాడు. అగ్ని, జ్యోతి, పగలు,శుక్ల పక్షము, ఆరు నెలలు గల ఉత్తరాయణము అను అభిమాన దేవతలుగల దేవయాన మార్గమైన ప్రయాణమే చేసిన సగుణ బ్రహ్మో పాసకులు బ్రహ్మమును పొందుతున్నారు అని గీతలో చెప్పబడింది. మృత్యువు అనంతరం స్వర్గాది శుభలోకాలకు వెళ్ళేందుకు అగ్ని దోహదం చేస్తుంది. అగ్నిహోత్రం గృహక్షేత్రే గర్భిణీం వృద్ధ బాలకా। రిక్తహస్తే. నా నోపయాత్ రాజానం గురుమ్ ॥ అగ్నిహోత్రమునకు ఆహుతులిచ్చునప్పుడు, గృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీస్త్రీలు, వృద్ధులు,బాలురు, రాజు, దేవుడు, గురువు వీరి వద్దకు వట్టి చేతులతో వెళ్ళకూడదు అనగా ఫలపుష్పాదులు తీసుకు వెళ్ళాలి. ఇక్కడ కూడా అగ్నికి ప్రాధాన్యతనిచ్చారు. మన పూర్వీకులు. ఆదిమానవుని జీవితంలోనూ జంతువుల జీవితంలోను సృష్టి ప్రారంభంలో ఎలాంటి వ్యత్యాసం ఉండేది కాదు. సర్వజీవుల్లా మానవుడు దిగంబరంగా సంచరించే వాడు, జంతువులను చంపి పచ్చి మాసం తినేవాడు. నీరు,నిప్పు అతని దిశను దశను మార్చివేసాయి. అరణ్యాలలో గాలికి చెట్టు కొమ్మల రాపిడితో అగ్ని పుట్టడం గమనించాడు. "కాష్ఠాదగ్నిర్జాయతే ", రెండు కట్టెలు రాపిడి చేస్తే అగ్ని జనిస్తుంది అని తెలుసుకున్నాడు. అగ్నిదేవుడు సంతసిస్తే మానవాళికి ఉపకారం చేస్తాడు, కోపగించుకుంటే అపకారమూ చేస్తాడు. అతణ్ణి పూజించినంత కాలం మన అభీష్టాలను నెరవేరుస్తాడు. కాని అతనికి ద్రోహం తలపెడితే సహించడు. త్రినేత్రుడు మూడో కన్ను తెరిచినట్లు తన నాలుకను సాగదీస్తాడు. ఒక గ్రామంలో శుద్ధ శోత్రియ బ్రాహ్మణుడు సకల జనాల క్షేమం కాక్షించి యజ్ఞం చేసాడు. యజ్ఞం పూర్తి అయినా యజ్ఞకుండం ఇంకా రాజుకునే ఉంది.ఒక బుద్ధిలేని మహిళ ఉచ్ఛీష్టం తెచ్చి యజ్ఞకుండంలో వేయడమే కాక పరిసరాలన్ని శుభ్రంగా ఉండడం చూసి ఎక్కడ ఉమ్మి వేయాలో తోచక యజ్ఞకుండంలో ఉమ్మి వేసింది. అయితే ఆమె ఉమ్మిన చోట ఆమే కొక బంగారు వరహా కనిపించింది. సంతోషంగా ఆ వరహాను తీసుకుని కొంగు కట్టుకొని ఇంటికి వెళ్ళింది. ఆడవారి నోట్లో నువ్వుగింజ నానదంటారు. దావాగ్నిలా ఆ మాట ఊరంతా పాకిరింది. మంట చల్లారకూడదని ప్రతి ఒక్కరు ఒక కర్ర వేస్తూ కుండంలో ఎంగిలి అన్నం, ఉమ్మి వేస్తు ఒకొక్క నాణెము తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన బ్రహ్మణుడు బాధ పడి ఇలా చేయడం అపచారం అని బోధ పరిచినా బంగారం మీద ఆశతో ఎవరు అతని మాటను లెక్క చేయ లేదు. ఇంత అనాచారము, అపరాధము జరుగుతున్న ఊరిలో ఉండనిష్ట పడక మూటాముల్లె సర్దుకుని భార్యాబిడ్డలతో ఊరు విడిచి పెట్టాడు. అతనావూరి పొలిమేర దాటగానే ఆ ఊరు మొత్తం అగ్నికి ఆహుతై, భస్మమైంది. ఆ బ్రాహ్మణుడు ఉన్నంత వరకు అగ్నిదేవుడు శాంతం వహించేడు. మనం మన ఇళ్ళల్లో ఈ నాడు మృష్ఠాన్న భోజనాలు వండుకుని తింటున్నామంటే అందుకు అగ్ని దేవుడి దయయే. ఒక కథ పెద్దలు చెప్తారు. పరమశివుడు అగ్నికి ఆజ్ఞాపించాడట. ప్రతి ఇంటిలో నువ్వు ఉండాలి. పొయ్యిలో నిత్యాగ్నిహోత్రం వెలుగుతూఉండాలని. శివుడాజ్ఞను అగ్ని దేవుడు ధిక్కరించివుంటే మనం ఆది మానవుల్లా ఉడకని పదార్ధాలు తినేవారం. అగ్ని దేవుడు ఆగ్రహయిస్తే ప్రతి అడవికి, ఊరుకు ఖాండవవనం గతే పడుతుంది. మనం మన నిత్య ధర్మమాలను పాఠిస్తూ అగ్నిదేవత అనుగ్రహాన్ని పొందుదాం. - గుమ్మా ప్రసాదరావు -
16 ఏళ్ల కుర్రాడి ప్రతిభ.. ప్రధాని అభినందనలు..!
న్యూఢిల్లీ : వేద, న్యాయ శాస్త్రాలకు సంబంధించిన వ్యాకరణ గ్రంథాలన్ని అవపోసన పట్టి ప్రియవ్రత అనే 16 ఏళ్ల కుర్రాడు చరిత్ర సృష్టించాడు. కష్టతరమైన 14 రకాల తెనాలి పరీక్షలు దాటుకుని ‘మహా పరీక్ష’లో ఉత్తీర్ణత సాధించాడు. దాంతో చిన్న వయసులోనే ‘మహా పరీక్ష’లో ఉత్తీర్ణత సాధించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఈ కుర్రాడి గొప్పతనాన్ని కృష్ణశాస్త్రి అనే వ్యక్తి ప్రధాని మోదికి ట్విటర్లో వివరించడంతో ఆయన స్పందించారు. చిన్న వయసులోనే గొప్ప ప్రావిణ్యం సంపాదించావని మెచ్చుకున్నారు. ‘కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అద్భుతం చేశావ్. అభినందనలు. నీ ఉన్నతి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది’అని ట్వీట్ చేశారు. తండ్రి దేవదత్తా పాటిల్, గురువు మోహనశర్మ వద్ద ప్రియవ్రత వేదాధ్యయనం చేస్తున్నాడు. Excellent! Congratulations to Priyavrata for this feat. His achievement will serve as a source of inspiration for many! https://t.co/jIGFw7jwWI — Narendra Modi (@narendramodi) September 8, 2019 -
జ్ఞానగర్భుడు... వేదముఖుడు
సృష్టికర్త అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బ్రహ్మ. ఆయన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలు ఆవిర్భవించాయి. సకల చరాచర సృష్టి ఆయన పని. ఆయనకు పూజార్హత లేదని లోక నానుడి ఉన్నా, సమస్త వేద వాంగ్మయరూపంలో జ్ఞాన నిధిగా ఆయన దర్శనమిస్తున్నాడు. వేదోద్ధారక గోవిందా అనే ఖ్యాతి కలిగిన కలియుగ వైకుంఠం తిరుమల గిరులకు పైన 5 కిలోమీటర్ల దూరంలో శ్రీవేంకటేశ్వర వేదవిజ్ఞాన పీఠం ఉంది. నిరంతర వేద ఘోషతో దానికి వేదగిరి అనే పేరు కూడా వచ్చింది. ఆ వేదపాఠశాల ప్రాంగణంలో అద్భుతమైన బ్రహ్మ విగ్రహం కొలువు తీరి ఉంది. పద్మంపై ఆసీనుడై నాలుగు తలలతో, నాలుగు చేతులతో ముందు వైపు నలుగురు వేదఋషులతో దర్శనమిచ్చేస్వామి రూపం అతి సుందరంగా శిల్పకళతో ఒప్పారుతుంది. బ్రహ్మ కుడిచేతిలో చిన్ముద్ర చూపుతూ, ఎడమచేతిలో పుస్తకం ధరించి, అలాగే వెనుక చేతులలో కుడివైపు జపమాల, ఎడమవైపు కమండలం పట్టుకుని ఉంటాడు. చిన్ముద్రలో చూపుడువేలు, బొటనవేలు కలిపి ఉంటుంది. తాత్త్వికంగా ఆలోచిస్తే చూపుడు వేలు జీవాత్మకు, బొటనవేలు పరమాత్మకు ప్రతీక. వీటిని రెంటినీ కలిపి ఉంచాలనే విషయాన్ని చిన్ముద్ర ద్వారా తెలుసుకోవాలి.ç ³#స్తకం జ్ఞానరూపం. సమస్త వేదసంపద పుస్తకరూపంలో ఆయన ఎడమచేతిలో నిలిచి ఉంది. జపమాల ద్వారా నిరంతరం భగవన్నామ జపం చేయమనీ, కమండలం ద్వారా సమస్త సృష్టి నిర్మాణానికి జలం ఎంతో ప్రాముఖ్యమైనదనీ తెలుసుకోవాలి. ఆయన కర్ణకుండలాలతో, అనేక ఆభరణాలతో బ్రహ్మ సూత్రం ధరించి ఉదరబంధం అనే అలంకరణ చూడముచ్చటగా ఉంటుంది. ఈయన వాహనం హంస. బ్రహ్మ భార్యకు సరస్వతీ, గాయత్రీ, బ్రహ్మాణీ, సావిత్రి అనే పేర్లు ఉన్నాయి. సనత్కుమారుడు బ్రహ్మనిర్మాల్యధారి. బ్రహ్మకు ఎర్రటి పట్టు వస్త్రాలు ప్రియమైనవి. బ్రహ్మ ద్వారపాలకులు ఎనిమిది మంది. తెలుగునాట బ్రహ్మను ఆరాధించే సంప్రదాయం చాలా ప్రాచీనకాలం నుండి ఉంది.అలంపురంలోని నవబ్రహ్మ ఆలయాలు అందుకు ప్రత్యక్షసాక్ష్యం. అథర్వవేద ఋషులు సాధించిన మనస్సంకల్పశక్తిని బ్రహ్మ అనే పేరుతో పిలిచారు. ధాత, విధాత, ప్రజాపతి అనే పేర్లతో ఆయనను పిలుస్తారు. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
వేదాలకు పచ్చని పంటలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘మంత్రాలకు చింతకాయలు రాలుతాయా’ అని అంటారు గానీ, వేదాలకు పచ్చని పంటలే పండుతాయట! ఈ మాటను అక్షరాల నమ్మిన గోవాలోని బీజేపీ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేస్తున్న విజయ్ సర్దేశాయ్ మంగళవారం నాడు అధికారికంగా ఓ స్కీమ్‌నే ప్రారంభించారు. దీనికి ‘శివ్ యోగ్ కాస్మిక్ ఫార్మింగ్’ అని కూడా నామకరణం చేశారు. రైతులు ప్రతిరోజు పంట పొలాల ముందు ధ్యాన ముద్రలో (మెడిటేషన్) కూర్చొని ‘ఓం రమ్ జమ్ సాహ్’ అంటూ 20 సార్లు ఉచ్ఛరిస్తే చాలట. అలా చేయడం వల్ల రైతుల నోటి నుంచి వెలువడే శబ్దాల వెంట కాస్మిక్ కిరణాలు ప్రయాణించి ఎదురుగా ఉన్న పంట పైర్లకు తాకి వాటికి కొత్త శక్తినిస్తాయట. నేల లోపల క్రిమికీటకాదులను చంపేస్తాయట. అలా జవసత్వాలను సంతరించుకున్న పైరు ఏపుగా పెరుగుతందట. ఇందులో పైసా ఖర్చులేదు, ప్రయత్నించి చూడమని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం పంటల కోసం ఉపయోగిస్తున్న నీరు, ఎరువులను ఇక ముందు వాడాల్సిన అవసరం ఉందా, లేదా? అన్న విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. దుక్కి దున్నీ నారుపోసి నీరుపోసి కష్టపడినా పంట చేతికొస్తదా, లేదా అన్న ఆందోళన పడే రైతుకు ఇవన్నీ లేకుండా పంట చేతి కొస్తదంటే రోజుకు 20 సార్లేం ఖర్మ 200 సార్లయినా వేదోక్తులను ఉచ్ఛరిస్తారు. ఈ శివ్‌యోగ్ కాస్మిక్ ఫార్మింగ్ విధానాన్ని మాజీ రసాయనిక ఇంజనీరు, ప్రస్తుత ‘శివ్ యోగ్ ఫౌండేషన్’ యోగా గురువు అవదూత్ శివానంద్ కనిపెట్టారట! ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్న మంత్రి సర్దేశాయ్ భార్య ఉష ఈ వ్యవసాయం గురించి చెప్పడంతో నమ్మిన మన మంత్రి సర్దేశాయ్ దాన్ని అమలు చేయడం కోసం ఏకంగా స్కీమ్‌నే ప్రారంభించారు. ఈ అంశంలో సరైన అధ్యయనం లేకుండా ఎలా కాస్మిక్ ఫార్మింగ్ విధానాన్ని ప్రారంభిస్తారని సదరు మంత్రిని మీడియా ప్రశ్నించగా, మధ్యప్రదేశ్‌లో ఈ విధానం మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిసి ప్రారంభించానని చెప్పారు. వ్యవసాయం అభివృద్ధి కోసం తాను ఏమి చేయడానికైనా సిద్ధమని, పంట పొలాల్లో రాక్ షో లేదా అందాల పోటీలను నిర్వహించడం వల్ల రైతుల్లో వ్యవసాయం పట్ల అంకిత భావం పెరుగుతుందంటే వాటిని ఏర్పాటు చేయడానికైనా తాను సిద్ధమని ఆయన చెప్పారు. ఆయన వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం పనాజీలో మంత్రి ప్రారంభించిన ఈ స్కీమ్‌ను విధిగా అమలు చేయాల్సిందిగా తాము రైతులను కోరడం లేదని చెప్పారు. -
జ్ఞానసముపార్జనలో నారీ రత్నాలు
వేదకాలం నుంచి... స్త్రీలు విజ్ఞాన సముపార్జనలో ముందున్నారు... వేదాధ్యయనం చేశారు... వేదాంత చర్చలో పాల్గొన్నారు... మండన మిశ్రుని భార్య ఉభయభారతి పాండిత్యంలోను, వేదాంతంలోను అగ్రస్థానాన నిలబడింది. జగద్గురు ఆది శంకరాచార్యులకు, తన భర్త మండన మిశ్రునికి మధ్య జరిగిన వాదనకు న్యాయనిర్ణేతగా నిలిచింది ఉభయభారతి. ఈ సంఘటనకు వేల సంవత్సరాల క్రితమే అంటే వేదకాలంలో... గార్గి అనే మహిళ వేదాలను ఔపోసన పట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచంతో మానవ సంబంధం గురించి గార్గి విస్తృతంగా చర్చించింది. ఆమె పేరు మీద గార్గి గోత్రం కూడా ఏర్పడింది. గార్గి వచక్నువు కుమార్తె. వచక్నువు అంటే నిర్భయంగా మాట్లాడగలిగే వ్యక్తి అని అర్థం. తండ్రి నుంచి గార్గికి నిర్భయంగా, నిస్సందేహంగా మాట్లాడే శక్తి అలవడింది. హిందూ సంప్రదాయంలో మహిళల గొప్పదనాన్ని గురించి ఉదహరించేటప్పుడు గార్గి పేరును తప్పనిసరిగా ప్రస్తావిస్తారు. యాజ్ఞ్యవల్కునితో వాదనకు దిగి, అతడి పాండిత్యానికి తల వంచింది.విదేహరాజు అయిన జనకమహారాజు రాజసూయయాగం నిర్వహించిన సందర్భంలో వివిధ దేశాల రాజులతో పాటు పండితులు కూడా హాజర య్యారు. వచ్చిన పండితులందరినీ చూసి సంతోషంతో, అందరికంటె ఉన్నతుడిని ఎంపిక చేయాలనుకుని, చర్చ గోష్ఠి ఏర్పాటు చే శాడు. యాజ్ఞవల్క్యునితో వాదించడానికి ఎవ్వరూ సాహసించలేకపోయారు. యాజ్ఞవల్క్యునితో వాదన చేస్తానని సవాలు విసిరింది గార్గి. చివరి వరకు వాదన చేస్తుంది. చివరలో యాజ్ఞవల్క్యుడు వాదనకు పరిసమాప్తి చెబుతాడు. ఈ వాదనలో గెలిచిన యాజ్ఞ్యవల్కునికి మహారాజు వెయ్యి గోవులు, పదివేల బంగారు నాణాలు బహూకరించారు. బహుమానాన్ని తిరస్కరించి యాజ్ఞవల్క్యుడు అడవులకు తన భార్య మైత్రేయితో కలిసి వెళ్లిపోతాడు. ఆవిడ కూడా భర్తతో సమానంగా చదువుకుంది. గార్గి చిన్నతనం నుంచే వేద పరిజ్ఞానం పెంచుకుంది. తన పరిజ్ఞానంతో పురుషులను అధిగమించింది. అపారమైన, అపరిమితమైన వేదాంత పరిజ్ఞానాన్ని సముపార్జించింది. వేదాలతో పాటు ఉపనిషత్తుల మీద కూడా పట్టు సాధించింది గార్గి. పురుషులతో చర్చల్లో పాల్గొనేది. కుండలినీ శక్తిని సాధించింది. విద్యావ్యాప్తి కోసం ఎంతో పాటు పడింది. ఛాందోగ్యోపనిషత్తులో సైతం గార్గి ప్రస్తావన ఉంటుంది. బ్రహ్మవాదిని అయిన గార్గి, ఋగ్వేదంలో అనేక ఋక్కులను రచించింది. మిథిలా నగర మహారాజైన జనకుని కొలువులో కొలువుతీరిన నవరత్నాలలో గార్గి కూడా ఉంది. మైత్రేయి: ఋగ్వేదంలో వెయ్యి దాకా ఋక్కులు ఉన్నాయి. ఇందులో 10 ఋక్కులను... యోగిని, వేదాంతి అయిన మైత్రేయికి అంకితం చేశారు. ఆమె తన భర్త అయిన యాజ్ఞవల్క్యుని వ్యక్తిత్వాన్ని, ఆధ్యాత్మిక ఆలోచనలను, జ్ఞానాన్ని వికసింపచేయడానికి కృషి చేసింది. ఉపనిషత్తుల్లో గార్గి పేరుతో పాటు మైత్రేయి పేరు కూడా ప్రసిద్ధిగా వినిపిస్తుంది.అగస్త్యుని భార్య లోపాముద్ర. భార్యాభర్తల మధ్య నిత్యం జరిగే జ్ఞాన చర్చకు సంబంధించిన అంశాలు ఋగ్వేదంలో ఉన్నాయి. – డా. వైజయంతి -
వేదాలు సంస్కృతికి చిహ్నాలు
భైంసా(ముథోల్) : వేద విద్య దేశవ్యాప్తం చేయాలని, వేదాలు సంస్కృతికి చిహ్నాలని వేద భారతి విద్యాపీఠం వ్యవస్థాపకుడు వేద విద్యానంద స్వామీజీ అన్నారు. బాసరలో నిర్వహిస్తున్న క్షేత్రియ వైదిక సమ్మేళనం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తరలివచ్చి న 108 మంది విశిష్ట వేద పండితులను ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. వేదమే దేశానికి మూలమని, ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు వేద విద్యను పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. గోదారమ్మకు 108 రోజులుగా నిత్యహారతి ఇస్తూనే ఉన్నామని, సూర్యచంద్రులున్నంత వరకూ హారతి కొనసాగుతూనే ఉంటుందన్నారు. బాసర అభివృద్ధికి కృషి : మంత్రి ఐకే రెడ్డి బాసర ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రూ.50కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. బాసరలో ఉన్న వేద విద్యాలయానికి ప్రభుత్వం నుంచి ఏటా రూ.10లక్షలు అందిస్తామని, ఇందుకు సంబంధించి మార్చి మొదటి వారంలో రూ.10 లక్షల చెక్కు అందజేస్తామన్నారు. నిత్యహారతి ఘాట్‌కు వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని లెక్కించి వర్షకాలంలోనూ నిత్యహారతి ఘాట్ నీటిలో మునగకుండా షెడ్ నిర్మిస్తామన్నారు. నిత్యహారతితో బాసరకు భక్తులు పెరిగారన్నారు. బాసర అభివృద్ధికి సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. బాసరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు మంత్రి అల్లోల దంపతులు నిత్యహారతి ఘాట్ వద్ద నిర్వహించిన హోమపూజలో పాల్గొన్నారు. వేద పాఠశాల నుంచి వెలువడనున్న ‘జై శ్రీ వేదం’ మాస పత్రికను ఆవిష్కరించారు. నేత్రానందంగా సాగిన నిత్యహారతిలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొని గంగమ్మ తల్లికి పూజలు చేశారు. -
వేదం శ్లాఘించిన స్త్రీ
వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం... స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి – యజుర్వేదం 10.03 , స్త్రీలు మంచి కీర్తి గడించాలి – అధర్వణవేదం 14.1.20 , స్త్రీలు పండితులవ్వాలి – అధర్వణవేదం 11.5.18, స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి – అధర్వణవేదం 14.2.74, స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి – అధర్వణవేదం 7.47.2, స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి – అధర్వణవేదం 7.47.1 పరిపాలన విషయంలో స్త్రీలు పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గొనాలి – అధర్వణవేదం 7.38.4 దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి – ఋగ్వేదం 10.85.46 ఆస్తిహక్కు పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో బాటు కుమార్తెకు కూడా సమాన హక్కు ఉంది – ఋగ్వేదం 3.31.1 కుటుంబం సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి – అధర్వణవేదం 14.1.20 స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి – అధర్వణవేదం 11.1.17 (స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది) ఉద్యోగాల్లో స్త్రీలు కూడా రథాలను నడపాలి – అధర్వణవేదం 9.9.2 , స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి – యజుర్వేదం 16.44 (ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం). సత్యభామ శ్రీకృష్ణునితోపాటు కదనరంగానికి వెళ్లి, నరకాసురునితో యుద్ధం చేసి, ఆ దుష్టరాక్షసుని నిలువరించడమే ఇందుకు ఉదాహరణ. దళపతి తరహాలో స్త్రీ సభలను ఉద్దేశించి ప్రసంగించాలి– ఋగ్వేదం 10.85.26 విద్య పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను. – ఋగ్వేదం 10–191–3 వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్ర వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్పబడింది. వివాహం – విద్యాభ్యాసం ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు – అధర్వణవేదం 14–1–64 (ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు). -
మాంసం ఏమైనా కొత్తగా తింటున్నామా?
చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారు మాత్రమే ధర్మం, నిజమైన మార్గం, పవిత్రమైనది లేదా అపవిత్రమైనది అనే దాని గురించిన ఆలోచిస్తారని మత్స్యేంద్రనాథ్( ఉత్తర భారతదేశంలో నాథ్ ఫౌండేషన్‌ను స్ధాపించిన గోరక్నాథ్ గురువు) ఆయన రాసిన అకుల్వీర్ తంత్ర గ్రంథంలో పేర్కొన్నారు. మరి మత్స్యేంద్రనాథ్ను అనుసరించే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బహుశా ఈ విషయం తెలుసో లేదో!. ధర్మం పేరిట సృష్టించుకున్న కొన్ని నిబంధనలను సడలించుకోవాలని గురు మత్స్యేంద్రనాథ్ ఆ కాలంలో పిలుపునిచ్చారు. కౌలోపనిషత్తులో ఈ విషయాన్ని మరింత విపులంగా వివరించారు. నిజమైన స్వీయ జ్ఞానం కలిగిన వ్యక్తి ఉపవాసం ఉండడని, సమాజంలో ఒక వర్గాన్ని స్ధాపించడని, ఎలాంటి నిబంధనలు పెట్టుకోడని, అతని దృష్టిలో మనుషులందరూ ఒకటేనని కౌలోపనిషత్తు వివరించింది. కానీ ప్రస్తుత పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతి విషయం త్వరగా రాజకీయ రంగు పులుముకుంటోంది. అందులోకి తాజాగా శాకాహారం వచ్చి చేరింది. శాకాహారిగా ఉండటం భారత సంప్రదాయమని చెబుతూ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాంసాహారంపై నిషేధం విధించారు. మాంసాహారం చరిత్ర వాస్తవానికి మాంసాహారాన్ని తీసుకునే అలవాటు రామాయణ కాలం నుంచి ఉంది. సింధు లోయ నాగరికత కాలంలో భారతీయులు ఎద్దు, దున్న, గొర్రె, మేక, తాబేలు, ఉడుం, చేపల మాంసాన్ని రోజూ వారీ ఆహారంగా వినియోగించారనడానికి ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో ఏర్పాటు చేసుకున్న మార్కెట్లలో మాంస క్రయ, విక్రయాలు జోరుగా సాగేవి. 250 రకాల జంతువుల్లో 50 రకాల జీవులను చంపి వాటి మాంసాన్ని తినొచ్చని వేదాల్లో రాసి ఉంది. గుర్రం, గేదే, మేకల మాంసాన్ని తినొచ్చని బుగ్వేదంలో ఉంది. ఇందులోని 162వ శ్లోకంలో చక్రవర్తులు గుర్రాలను ఎలా వధించేవారో వివరంగా ఉంది. ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన జంతువును బలి ఇచ్చేవారు. అగ్నికి ఎద్దు, ఆవులను, రుద్రుడికి ఎరుపు వర్ణం గల గోవులను, విష్ణువుకి మరగుజ్జు ఎద్దును, ఇంద్రుడికి తలపై మచ్చ కలిగిన ఎద్దును, పుషణ్కి నల్ల ఆవును బలి ఇచ్చేవారు. అగస్య మహాముని ఒకేసారి వంద ఎద్దులను బలి ఇచ్చిన సంఘటనను తైత్రేయ ఉపనిషత్తు ప్రశంసలతో ముంచెత్తింది. కొంతమంది బ్రహ్మణులు బంధువులు వచ్చిన సమయంలో కచ్చితంగా ఆహారంలో మాంసం ఉండేలా ఏర్పాట్లు చేసుకునేవారు. బృహాదారణ్యక ఉపనిషత్తులో మాంసాన్ని బియ్యంతో కలిపి వండే వారని ఉంది. దండకారణ్యంలో వనవాసానికెగిన రాముడు, సీత, లక్ష్మణులతో అలాంటి ఆహారాన్ని తీసుకున్నారని కూడా ఇందులో ప్రస్తావించారు. దీన్ని మాంసం భుత్తాదన అనేవారు. అయోధ్య రాజు దశరథుడు మటన్, పోర్క్, చికెన్, నెమలి మాంసంతో కూరలు వండే సమయంలో వాటిలో సుగంధ ద్రవ్యాలను ఉపయోగించేవారు. మహాభారతంలో కూడా మాంసానికి సంబంధించిన వివరణలు ఉన్నాయి. ఉడికించిన అన్నంతో కలిపి మాంసాన్ని తీసుకునేవారని, కొన్ని రకాల పక్షులను కాల్చి తినేవారని, గేదె మాంసంపై నెయ్యి వేసుకుని తినేవారని ఉంది. - ఓ సామాజిక వాది వ్యాసం -
సుధా 'మంగళ ప్రదం'
– శోభాయమానంగా మహోత్సవం – పీఠాధిపతులు, పండితుల మధ్య సాగిన విద్యార్థుల వ్యాఖ్యార్థం – ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రాలయం : వేద పండిత మహాశయులు ఒకే వేదికపై కొలువుదీరిన వేళ. పుష్కర కాలం వేద అభ్యసనం చేసిన విద్యార్థుల పరీక్ష సమయం. భక్తలోకం కను, వీనుల గావింతు వేదిక. దేశ సంస్కృత విద్యాపీఠాల్లో ఏనాడు కనీవినీ ఎరుగని సుధా మంగళ మహోత్సవం. శ్రీరాఘవేంద్రస్వామి సన్నిదానంలో మంగళప్రదంగా సాగిన వేడుక ఆసాంతం శోభాయమానం. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో పన్నెండేళ్ల విద్వత్ సభ బుధవారం ఆసక్తిదాయకంగా సాగింది. శ్రీమఠం డోలోత్సవ మంటపంలో పుష్పశోభిత అలంకార సభ నిర్వహించారు. ముందుగా సుబుధేంద్రతీర్థులు, పుత్తిగె మఠం పీఠాధిపతి సుగుణేంద్రతీర్థులు శ్రీరాఘవేంద్రస్వామికి విశిష్ట పూజలు నిర్వహించారు. వేదికపై కొలువుదీరిన వేదవ్యాసులు, 25 శ్రీమన్‌న్యాయ సుధా గ్రంథాలు, జయతీర్థులు(టీకాచార్యులు) చిత్రపటాలకు శాస్త్రోక్తంగా పూజా ఘట్టాలు గావించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్య స్వరాలు, భక్తుల హర్షధ్వానులు కురుస్తుండగా సుబుధేంద్రతీర్థులు జ్యోతి ప్రజల్వనతో సుధా మంగళ మహోత్సవానికి అంకురార్పణ పలికారు. పీఠాధిపతులు ఉత్సవ విశిష్టత, వాఖ్యార్థ ఉచ్ఛరణ విధానం ప్రవచించారు. అణువణువునా వేదం : తుంగాతీరాన సుధా మంగళం వేడుక అణువణువునా వేదం పలికించింది. పీఠాధిపతులు సుబుధేంద్రతీర్థులు, సుగుణేంద్రతీర్థులు, హణసోగె విశ్వనందన తీర్థులు, బెంగుళూరు విశ్వగురుప్రియ తీర్థులు, పండిత కేసరి గిరియాచార్ సమక్షంలో విద్యార్థులు శ్రీమన్ న్యాయ సుధా గ్రంథ వాఖ్యార్థం కానిచ్చారు. విద్యార్థులు వల్లించిన శ్లోకాలకు పీఠాధిపతులు, విద్వాన్లు విచారణ జరిపారు. విద్యార్థులు ఎంతో వినయ విధేయలతో పండితుల ప్రశ్నావళికి అర్థవంత సమాధానాలు చెప్పుకొచ్చారు. మొత్తం 20 మంది విద్యార్థులు 12 ఏళ్లపాటు వేద విద్యను అభ్యసించారు. మూడేళ్లలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు, పండిత కేసరి గిరియాచార్తో పఠనం చేసిన గ్రంథాలపై వాఖ్యార్థం నిర్వహించారు. మూడు బ్యాచ్‌ల విద్యార్థులూ తమ ప్రతిభతో విద్వాన్లను మెప్పించి పీఠాధిపతుల ఆశీస్సులతో అనుగ్రహ ప్రాప్తి పొందారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎంతో పవిత్రంగా సుధా మంగళం మహోత్సవం సాగింది. గురువారం విద్యార్థులకు 'వేదాంత శాస్త్ర విద్వాన్'గా పట్టా, ఒక్కోవిద్యార్థికి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకాలు అందజేస్తారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు : వేడుక సందర్భంగా యోగీంద్ర మండపంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పండిత శేషగిరిరావు ఆలపించిన దాసవాణి భజన సంకీర్తనలు భక్తులను అలరించాయి. ఉడిపికి చెందిన భార్గవి నృత్య ప్రదర్శన మైమరిపించింది. గురుసార్వభౌమ దాస సాహిత్య అకాడమీ నేతృత్వంలో 1000 మందితో హరిదాస భజన గేయాలపనలు వీనుల విందు చేశాయి. కార్యక్రమంలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, సంస్కృత విద్యాపీఠం ఉప కులపతి పంచముఖి, ప్రధానాచార్యులు వాదిరాజాచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, దాస సాహిత్య అకాడమీ అప్పన్నాచార్యులు, వాదిరాజాచార్, హనుమేశాచార్ పాల్గొన్నారు.