Venkatapalem
-
బాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడు..పేదల వ్యతిరేకులు
-
సీఆర్డీఏ పరిధిలోని వెంకటపాలెంలో బహిరంగసభకు హాజరై... లబ్ధిదారులకు ఇళ్లపట్టాల అందించిన సీఎం జగన్
-
పెత్తందారులపై పేదవాడు సాధించిన విజయం ఇది
-
కృష్ణాయపాలెం లేఅవుట్...పైలాన్ ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
-
Live: వెంకటపాలెం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
-
లబ్ధిదారుల భావోద్వేగం.. మా ‘బలగం’ మీరే జగనన్నా..
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ శుక్రవారం పండగలా జరిగింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన వేదికపై ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఎమ్మెల్యే, మంత్రులు, లబ్ధిదారులు ఏమన్నారంటే…వారి మాటల్లోనే.. మీరు గృహ ప్రవేశానికి రావాలి జగనన్నా.. అన్నా నాది పేద కుటుంబం, మేం రైల్వే పోరంబోకు స్ధలంలో ఇల్లు వేసుకుని ఉంటున్నాం. మాలాగే 750 కుటుంబాలు ఉన్నాయి, రైల్వే వారు నోటీసులు ఇచ్చారు. ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఎండకు ఎండి వానకు తడిశాం. నాకు ఇంటి స్ధలం వచ్చిందని చాలా ఆనందపడ్డాం. గజం భూమి కూడా కొనుక్కోలేని మాకు గుంటూరు-విజయవాడ మధ్యలో లక్షల విలువైన భూమిని ఇస్తున్నారు. మీరు లక్షల మందికి పట్టాలివ్వడమే కాదు వారిని ఆస్తిపరులను చేశారు. కుట్రలు, రాజకీయంతో మాకు రాకుండా చేశారు.పేదలు ఉంటే స్లమ్ లుగా మారుతాయన్నారు. అవన్నీ మీరు ధీటుగా ఎదుర్కొన్నారు. మాకు ఇది గొప్ప పండుగ. మీ మధ్యలో ఈ పండుగ చేసుకుంటున్నాం. నవులూరులో నాకు వచ్చిన స్ధలం చూడగానే సంతోషమేసింది. అక్కడ ఉన్న ఏర్పాట్లు చాలా బావున్నాయి. నేను ఇల్లు కట్టగానే మీరు గృహ ప్రవేశానికి రావాలని కోరుతున్నాను. మా పేదలకు మీరు తోడుగా ఉన్నారు. మీ చెరగని చిరునవ్వు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. దుష్టశక్తులకు తగిన బుద్దిచెబుతాం. మా మహిళలంతా మీ వెంటే నడుస్తామని చెబుతున్నాను, మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ని ప్రార్ధిస్తున్నాను. -గొట్టిముక్కల హైమావతి, లబ్ధిదారు, తాడేపల్లి మున్సిపాలిటీ ఆ యాగ ఫలితమే ఈ పండుగ.. అన్నా, నేను ఒక బీసీ వర్గానికి చెందిన మధ్యతరగతి మహిళను, నాకు వివాహం అయి 25 ఏళ్లు అయింది. నా భర్త హోటల్లో పనిచేస్తారు. నాకు ముగ్గురు పిల్లలు. నాకు వివాహం అయిన కొత్తలో ఎదుర్కున్న సమస్యను చెప్పాలనుకున్నాను. మా అత్తగారి అమ్మ చనిపోతే ఆ అద్దె ఇంటి యజమాని శవాన్ని ఉంచనీయలేదు, అప్పుడు చాలా క్షోభను అనుభవించాను. అద్దె పెరిగినప్పుడల్లా ఇల్లు మారుతూ జీవనం కొనసాగించాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ మా ఇంటికి వచ్చి మీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇస్తారు మీరు దరఖాస్తు చేసుకోండని చెప్పారు. మేం నమ్మి దరఖాస్తు చేశాం. మీరు పేదలకు ఇళ్లు అనే మహాయాగం ప్రారంభిస్తే ప్రతిపక్ష నాయకులు మారీచుడిలా అడ్డపడినా మీరు శ్రీరాముడిలా జయించి, వారిని ఎదిరించి మాకు యాగఫలం అందించారు. ఆ యాగ ఫలితమే ఈ పండుగ. నాతో పాటు యాభై వేల మంది మహిళలు ఇక్కడికి వచ్చారు. ఏ అన్నైనా పుట్టింటికి వెళితే ఒక చీర పెడతారు లేక ఒకరోజు భోజనం పెడతారు కానీ ఏ అన్నైనా ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి మరీ పట్టాల పంపిణీకి ఆహ్వనించి మీ సొంతింటి కల సాకారం చేసుకోమనే అన్న ఎవరైనా ఉన్నారా. అలాంటి అన్న నాకు ఉన్నారు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాకు ముగ్గురు పిల్లలు, వారిని బాగా చదివించడం కత్తి మీద సాము. నా పెద్దపాప పీజీ చదువుతుంది. చిన్నపాప బీటెక్ చదువుతుంది. విద్యాదీవెన, వసతిదీవెన ద్వారా నేను చదివించగలుగుతున్నాను. మీరు అమ్మలా ఆదరిస్తున్నారు. నాన్నలా మా భారం మోస్తున్నారు. అన్నలా మీ అనురాగం పంచుతున్నారు. మీ చల్లని నీడలో మేం సుస్ధిరంగా ఉండాలనుకుంటున్నాం. మాకు కేటాయించిన స్ధలం చూసినప్పుడు చాలా సంతోషమేసింది. చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా గృహ ప్రవేశాల పండుగకు రావాలి. దేవుడంటే ఎవరు అడిగిన వరాలిచ్చేవారు కానీ నా కుటుంబంలో నేను ఏదీ అడక్కుండానే, ఏదీ కోరుకోకుండానే అన్ని వరాలిచ్చిన మీరే నా ప్రత్యక్ష దైవం, మీరు ఉదయించే సూర్యుడు.. మీరు ఒక ప్రభంజనం.. మా మహిళలకు ఒక ధైర్యం, భరోసా, బలగం మీరు. మీరే మళ్లీ సీఎంగా రావాలి. మా ఓట్లు మీకే, మీ చల్లని పాలన సుస్ధిర కాలం ఉండాలి. లక్ష్మీ, లబ్ధిదారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పేదల జీవితాల్లో మీరు కాంతిరేఖలా నిలబడ్డారు: ఎమ్మెల్యే ఆర్కే అందరికీ నమస్కారం, అన్నా ఈ రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదలు 32 లక్షల మందికి ఇళ్ళస్ధలాలు ఇచ్చి అందులో లక్షల మంది నివాసాలు ఉంటుంటే, మా రాజధాని ప్రాంతంలో సొంత ఇల్లు లేదని పేదలు ఎదురుచూశారు, వీరందరికీ మీ దయ వల్ల పట్టాలు అందుతున్నాయి, ఈ పేదలంతా మీకు శాశ్వతంగా రుణపడి ఉంటారు. చంద్రబాబు ఈ రోజు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు సీఆర్డీఏ చట్టం ప్రకారం 5 శాతం ఈడబ్యూఎస్ కి ఇవ్వాలని పెట్టినా, ఆయనకు పేదల మీద ప్రేమ, అభిమానంతో పెట్టలేదు. తప్పనిసరిగా ఇవ్వాలని కాబట్టి 5 శాతం రిజర్వ్ చేసి కట్టలేదు. దళితుల్లో పుట్టాలా అని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు, బీసీల తోకలు కత్తిరిస్తాం అన్న చంద్రబాబు ఈ రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇల్లు ఎందుకు కట్టించాలి, ఇక్కడ పేదలు దళితులు ఉంటే ఇది రాజధాని కాదన్నాడు, చివరికి సమాధులతో సైతం పోల్చాడంటే ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. మీరు పట్టాలిస్తున్న వారంతా త్వరలోనే గృహప్రవేశం చేస్తారు. ఈ పేదలంతా సంక్రాంతి నాటికి ఆ పండుగ ఈ ఇళ్ళలో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను, మీ చేతుల మీదుగా సంక్రాంతినాడు గృహప్రవేశం జరుపుకునేలా ఉండాలి, ఈ రాజధాని ప్రాంతంలో కులం, మతం గురించి మాట్లాడారు, నా కులం మానవత్వం. నా మతం సమానత్వం అనే ధైర్యాన్ని ఈ పేదలలో నింపాలని కోరుకుంటున్నాను. పేదల జీవితాల్లో మీరు కాంతిరేఖలా నిలబడ్డారు. ఇల్లు లేని నిరుపేదలకు తెలుసు ఆ భాదలేంటో, ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్న మాటను నిలబెట్టుకుంటూ దేశానికి మీరు ఆదర్శంగా నిలవాలి. ఎల్లో మీడియా దారుణంగా ప్రవర్తిస్తుంది, ఏబీఎన్ చానల్లో ఆర్ 5 జోన్ ఆరిపోయే జోన్ అన్నారు, వారికి సంక్రాంతి పండుగ ఈ ఇళ్ళలో జరుపుకుని నిరూపించాలి. శాసన రాజధానికి నిండైన అర్ధం తీసుకొచ్చారు, ధన్యవాదాలు. -ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), మంగళగిరి ఎమ్మెల్యే అణగారిన వర్గాల వారంటే చంద్రబాబాబుకు పగ: మంత్రి ఆదిమూలపు సురేష్ అందరికీ నమస్కారం, పేదలను పెద్దోళ్ళుగా చూడాలన్న సీఎంగారి సంకల్పం ముందు కుళ్ళు కుతంత్రాలు కుట్రలు పటాపంచలు అయిన రోజు, పేదలకు పట్టాలతో పట్టాభిషేకం, ఇది ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు, 51 వేల పట్టాలు అన్ని హంగులతో ఇస్తున్న రోజు, వీటితో పాటు పట్టణ ప్రజలకు రూపాయికే ఇల్లు అని ప్రకటించిన విధంగా లక్ష ఇళ్ళు సిద్దం చేయడంతో పాటు 2,63,000 ఇళ్ళు ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకెళుతున్నాం. 8 లొకేషన్లలో 5,000 ఇళ్ళను సీఎంగారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తున్న పండుగ రోజు. ఇవి ఇళ్ళు కాదు ఊళ్ళు, జగనన్న తలపెట్టిన మహాయజ్జాన్ని భగ్నం చేయాలని చంద్రబాబు ప్రయత్నించారు. పేదలకు పట్టాలివ్వడంపై సుప్రిం ఉత్తర్వులే ఒక నిదర్శనం. చదవండి: మోసాల నారా చంద్రబాబును మాత్రం నమ్మొద్దు: సీఎం జగన్ పేదల కోసం ఎంతదూరమైనా వెళతాననే జగనన్న మరోసారి నిరూపించారు. బడుగు బలహీనవర్గాలు, అణగారిన వర్గాల వారంటే చంద్రబాబాబుకు పగ. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, చంద్రబాబు వ్యాఖ్యలు ఎవరూ మరిచిపోరు, అమరావతి పరిధిలో సామాజిక సమతుల్యం జరుగుతుంది. ఇది జగనన్నకు మాత్రమే చెల్లింది, రాబోయే రోజుల్లో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగనన్న ఉక్కు సంకల్పం ముందు అవన్నీ పటాపంచలు అవుతాయి, ఈ స్ధలాలను సమాధులతో పోలుస్తున్నారు, చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో మీకు దళితులు రాజకీయ సమాధి కడతారు. జగనన్నే మా నమ్మకం. మా భవిష్యత్, మళ్ళీ మళ్ళీ మీరే సీఎం అని మనం ఎలుగెత్తి చాటుదాం. ధ్యాంక్యూ. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు: మంత్రి మేరుగ నాగార్జున నమస్కారం, ఈరోజు సామాజిక న్యాయానికి పండుగ రోజు, సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. గతంలో ఇళ్ళస్ధలాల కోసం కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమాలు, ధర్నాలు చేసేవి, కానీ అవి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయో తెలీదు, వారు చంద్రబాబు పంచన చేరి ఇళ్ళస్ధలాలు ఇక్కడ వద్దంటున్నారు. ఈ ప్రాంతంలో రైతులను చంద్రబాబు నిలువునా ముంచారు, ఆయన్ను రాబోయే రోజుల్లో ఈ పేదలు వెంటబడి తరుముతారు. పేదల ఇళ్ళ స్ధలాలు ఇవ్వకూడదని కోర్టులకెళ్ళారు, పేదలకు అండగా ఉండాలని సీఎంగారు ముందుకెళుతున్నారు, టీడీపీ అధికారంలోకి వస్తే ఈ పట్టాలు క్యాన్సిల్ చేస్తామంటున్నారు, ఆరునూరైనా మళ్ళీ జగన్ గారు సీఎం అవుతున్నారు, ప్రజాస్వామ్యవాదులంతా జగన్ గారిని బలపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగనన్నా మేమంతా మీ వెంటే: మంత్రి జోగి రమేష్ పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగిన యుద్దంలో సుప్రిం సైతం పేదల పక్షాన నిలబడితే, పేదలకు ఇళ్ళస్ధలాలు వద్దు అని పెత్తందార్ల పక్షాన నిలబడ్డ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు. 31 లక్షల మందికి ఇళ్ళు కట్టిస్తుంటే దానిని అడ్డుకుంటున్నారు, రాజధానిలో పేదలు నివసించకూడదని, పేదలు పాలేర్లుగా ఉండాలనే విధంగా సుప్రింకు వెళ్ళారు. చంద్రబాబు పెత్తందార్ల పక్షాన ఉంటే మన జగనన్న పేదల వెంట ఉన్నారు, జగనన్నా మేమంతా మీ వెంటే ఉంటాం. 2024లో మరోసారి సీఎం చేద్దాం, మనమంతా జగనన్న వెంట ఉందాం. -
అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
మోసాల నారా చంద్రబాబును మాత్రం నమ్మొద్దు: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: పేద లబ్ధిదారులకు అందించబోయే ఇళ్ల పట్టాలు.. మహిళల పేరు మీదే ఉండబోతున్నాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అయితే పేదలకు మంచి జరగకుండా అడ్డుకున్న చంద్రబాబునాయుడు అండ్ కోపై వెంకటపాలెం బహిరంగ సభ వేదికపై మండిపడ్డారు సీఎం జగన్. ఏపీలో అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ. 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల సంపద ఉంచాం. ఇళ్ల స్థలాలతో పాటు 5 వేల టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తున్నాం. సీఆర్డీఏ ప్రాంతంలోనే నాలుగు వందల కోట్ల ప్రభుత్వ వ్యయంతో ఐదు వేల ఇళ్లను నిర్మిస్తున్నాం. రూపాయికే అన్ని హక్కులతో టిడ్కో ఇళ్లు అందజేస్తున్నాం. గత ప్రభుత్వ పాలకులు ఎప్పుడైనా ఇలాంటి మంచి ఆలోచన చేశారా? అని సీఎం జగన్ సభా వేదిక నుంచి నిలదీశారు. నరకాసురుడినైనా నమ్మొచ్చుగానీ.. సీఎం చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని.. దొంగల ముఠా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే యత్నం చేసింది. చంద్రబాబు హయాంలో పేదలకు సెంటు భూమి ఇవ్వలేదు. ఇళ్ల స్థలాల విషయంలోనూ మోసమే చేశారు. 2014 నుంచి 2019 వరకు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. తన హయాంలో చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేశారు. ఎన్నికలు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారు. మళ్లీ మోసపూరిత ప్రేమ చూపడానికి బాబు సిద్ధమవుతున్నారు. గజ దొంగల ముఠా ఏకమవుతోంది. ఐదేళ్ల చంద్రబాబు పాలనంతా దోచుకో.. పంచుకో.. తినుకో మాత్రమే. గతంలో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి, అందర్నీ మోసం చేశాడు. ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ.. మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు. సామాజిక వర్గాలు మీద మోసపూరిత ప్రేమ చూపిస్తాడు. వారికోసమే మేనిఫెస్టో అని చంద్రబాబు అంటాడు. మోసం చేసేవాడ్ని ఎప్పుడూ కూడా నమ్మకండి. నరకాసురుడినైనా నమ్మొచ్చు కాని, నారా చంద్రబాబునాయుడ్ని మాత్రం నమ్మకూడదు అంటూ ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. మంచి చేసే ప్రభుత్వం ఇది కోవిడ్ కష్టకాలంలోనూ ఎక్కడా రాజీపడలేదు. అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం పని చేశా. కోవిడ్ సమయంలోనూ 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. నవరత్నాల్లోని ప్రతీ హామీని అమలు చేశాం. మ్యానిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించాం. ఇచ్చిన 98 శాతం హామీలను అమలు చేశాం. ఈ నాలుగేళ్లలో అవినీతి, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. డీబీటీ ద్వారా నేరుగా రూ. 2.11 లక్షల కోట్లు అందజేశాం. నాన్ డీబీటీతో మొత్తం రూ. 3 లక్షల కోట్లు అందించాం. ఇంత మంచి జరుగుతుంటే.. గజ దొంగల ముఠా చూడలేకపోతోంది. చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5.. వీళ్లకు తోడు దత్తపుత్రుడు గజదొంగల ముఠా ఏకమవుతోంది. పేదలకు మంచి చేయాలనే ఆలోచన వీళ్లకు లేదు. ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో ఒక్క రూపాయి అవినీతి, వివక్ష లేదు. మా అక్క చెల్ల్మెల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.11లక్షల కోట్లు జమచేశాం. అప్పుల వృద్ధిరేటు చూస్తే… గత ప్రభుత్వం కన్నా.. తక్కవే. మరి చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరగలేదు?. ఎందుకంటే.. వారికి మంచి చేసే ఉద్దేశం లేదు కాబట్టి. ఆ దొంగల ముఠా దృష్టిలో అధికారంలోకి రావడం అంటే.. దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి మాత్రమే. దారుణాలను వాళ్లు రాయరు, చూపరు, ప్రశ్నిస్తామన్న వాళ్లు ప్రశ్నించరు. ఇదీ చంద్రబాబు హయాంలో మాయ. ఈరోజు కులాల మధ్య యుద్ధం జరగడంలేదు, జరుగుతున్నది క్లాస్ వార్. ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపే పేదవాళ్లకు మంచి జరగకూడదని కోరుకుంటూ పెత్తందార్లు యుద్ధం చేస్తున్నారు. పేదవాడికి ఇళ్లస్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి యుద్ధం చేస్తారు. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదనలు చేశారు. జగన్ మాదిరిగా పాలన చేస్తే.. రాష్ట్రం శ్రీలంక పోతుందని ఎల్లోమీడియాలో రాస్తారు.. చూపుతారు. పేదల బ్రతులకు మారాలని పరితపిస్తున్న ప్రభుత్వం మనది అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఇదీ చదవండి: ఇది పేదల విజయం.. ఇక సామాజిక అమరావతి: సీఎం జగన్ -
గత ప్రభుత్వ పాలకులు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశారా?: సీఎం వైఎస్ జగన్
-
ఇది పేదల విజయం.. ఇక సామాజిక అమరావతి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ‘‘దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టులకెక్కి అడ్డుకున్నారు. పేదల కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వమే న్యాయపోరాటం చేసింది. ఇది పేదల విజయం’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివర్ణించారు. శుక్రవారం అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. వెంకటపాలెం బహిరంగ సభ నుంచి సీఎం జగన్ ప్రసంగించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేదల కోసం న్యాయ పోరాటం చేశాం. విజయం సాధించాం. ఇప్పుడు రూ. ఏడు లక్షల నుంచి 10 లక్షల విలువ చేసే ఇంటి స్థలం.. అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుంది. మన అందరి అమరావతి అవుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నా అని ప్రసంగించారాయన. 👉 ఇవి ఇళ్ల పట్టాలే కాదు.. సామాజిక, న్యాయ పత్రాలు కూడా. సామాజిక అమరావతే.. మనందరి అమరావతి. 50, 793 మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తున్నాం. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో మొత్తం 25 లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. వారం పాటు ఇళ్ల పట్టాల పండు కార్యక్రమం ఉంటుందని, ఇళ్లు కట్టడానికి బీజం కూడా ఈ వారంలోనే పడుతుందని అని సీఎం జగన్ ప్రకటించారు. 👉 దివంగత మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా.. జులై 8వ తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే లే అవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయని, జులై 8వ తేదీ లోగా జియో ట్యాగింగ్ పూర్తి చేస్తామని తెలిపారాయన. 👉 ఇళ్ల నిర్మాణాలకు మూడు ఆప్షన్లు ఉంటాయని సీఎం జగన్ వెల్లడించారు. సొంతంగా ఇళ్లు కట్టుకుంటే.. రూ. లక్షా 80 వేలు బ్యాంకు ఖాతాల్లో వేస్తాం. రెండో ఆప్షన్లో నిర్మాణ కూలీ మొత్తాన్ని జమ చేస్తాం. ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుంది. స్టీల్, సిమెంట్, డోర్ ఫ్రేమ్‌లు సబ్సిడీపై అందిస్తాం. మెటీరియల్ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు అని సీఎం జగన్ ప్రకటించారు. -
అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు 12 నుంచి గ్రామసభలు
తాడికొండ: రాజధానిలో 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. గతంలో తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని రాజధాని పూలింగ్‌కు భూములిచ్చిన 29 గ్రామాలతో అమరావతి మెట్రోపాలిటన్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించగా తుళ్ళూరు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటూ రాజధాని అభివృద్ధికి అడుగులు వేసింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని నాన్ పూలింగ్ గ్రామాల ప్రజలు తమను కూడా మున్సిపాలిటీలో చేర్చాలని కోరిన నేపథ్యంలో ఆయా గ్రామాలను కూడా మున్సిపాలిటీలో కలిపేందుకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల్లో భాగంగా తుళ్ళూరు మండలంలోని పూలింగ్‌కు భూములిచ్చిన 16 గ్రామాలతో పాటు నాన్ పూలింగ్ గ్రామాలైన పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాలు, మంగళగిరి మండలంలోని మూడు గ్రామ పంచాయతీలను కలుపుతూ 22 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా శుక్రవారం గ్రామసభల షెడ్యూల్ ప్రకటించారు. ఈ గ్రామసభల ద్వారా ఆయా గ్రామాల్లో ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, వివరణలు సేకరించి తీర్మానం చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. తుళ్ళూరు ఎంపీడీవో శ్రీనివాసరావు శుక్రవారం ఈవోఆర్డీ సత్యకుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు సమావేశమై చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 12వ తేదీ సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. గ్రామసభల షెడ్యూల్ 12వ తేదీ లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, హరిశ్చంద్రపురం, 13వ తేదీ దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, 14వ తేదీ వెంకటపాలెం, మందడం, ఐనవోలు, 15వ తేదీ నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, రాయపూడి, 16వ తేదీ మల్కాపురం, వెలగపూడి, పెదపరిమి, 17వ తేదీ శాఖమూరు, నేలపాడు, తుళ్ళూరు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల ప్రజలు గ్రామసభలకు హాజరై వారి అభిప్రాయాలను తెలపాలని ఎంపీడీవో కోరారు. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు నిర్ణయం హర్షణీయం 712వ రోజు రిలే నిరాహార దీక్షల్లో బహుజన పరిరక్షణ సమితి నాయకులు అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 712వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహర దీక్షల్లో శుక్రవారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అమరావతి రైతులను మోసగించి మూడుపంటలు పండే 33 వేల ఎకరాలను పూలింగ్‌కు తీసుకున్న చంద్రబాబు వారికి ఏం న్యాయం చేశాడో చెప్పాలన్నారు. (క్లిక్ చేయండి: టీడీపీ నేత అనితకు బ్యాంకు నోటీసులు) రాష్ట్రంలోని 5 కోట్లమంది ప్రజల సంపదను ఒక ప్రాంతంలోనే కుమ్మరిస్తే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మహా నగరాల సరసన అమరావతిని చేరుస్తానంటూ మోసపూరిత హామీలతో చంద్రబాబు 29 గ్రామాల రైతులతో పాటు రాష్ట్ర ప్రజలను నమ్మించి భారీ అవినీతికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి అమరావతి ప్రాంత అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాలు వడివడిగా కొనసాగుతున్నాయని చెప్పారు. సమితి నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా తీరంలో తిరుమలేశుడు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి, అమరావతి/తాడికొండ: కృష్ణాతీరంలో తిరుమలేశుడు కొలువయ్యాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేశస్థానం నిర్మించిన ఆలయంలో భక్తులకు శ్రీవేంకటేశుడు దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయంలో గురువారం ఉదయం మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ట, మహాసంప్రోక్షణ జరిగింది. ఉదయం 7.50 నుంచి 8.10 గంటల నడుమ టీటీడీ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. అంతకు ముందు ఉదయం 4.30 నుంచి 6.30 గంటల వరకు పుణ్యాహవచనం, కుంభారాధన, నివేదన, హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 6.30 నుంచి 7.15 గంటల వరకు విమాన గోపుర కలశ ఆవాహన చేశారు. అనంతరం ఆగమోక్తంగా ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం బ్రహ్మఘోష, వేదశాత్తుమొర జరిగాయి. ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహించారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 25 ఎకరాల స్థలంలో టీటీడీ రూ.31 కోట్లతో ఈ ఆలయం నిర్మించింది. ఆలయం శిల్పకళ అద్భుతం : స్వరూపానందేంద్ర సరస్వతి ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరిక మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలో వేంకటేశ్వరస్వామి వారి ఆలయం నిర్మించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణంతో రాజధాని అమరావతిలో మరింతగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని అన్నారు. వైఖానస ఆగమానుసారం అద్భుతమైన శిల్ప కళతో ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఆలయంలో మూలమూర్తి సాక్షాత్తు తిరుమల వెంకన్నే వచ్చాడా అన్నట్లుగా ఉందని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం ప్రత్యేకంగా ఉన్నదని చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్రం బాగుండాలని ప్రార్థించినట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ప్రాంతాల్లో 1,300 ఆలయాలు : వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇటీవల విశాఖ, ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయాలు ప్రారంభించినట్లు చెప్పారు. జమ్మూలో 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో 500 ఆలయాలు పూర్తి చేసినట్లు చెప్పారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మత్స్యకార, బడుగు బలహీనవర్గాల ప్రాంతాలలో రాబోయే రెండేళ్లలో 1,300 ఆలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. అమరావతిలోనే స్వామి వారి దర్శనం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మనందరినీ ఆశీర్వదించడానికి స్వామివారు తిరుమల నుండి ఇక్కడికి వచ్చారన్నారు. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వెళ్లే భక్తులకు అమరావతిలోనే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. స్వామి వారి అనుగ్రహంతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, ఎంపీ నందిగం సురేష్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ హెనీ క్రిస్టినా, బోర్డు సభ్యులు బుర్రా మధుసూదన్‌యాదవ్, మల్లాడి కృష్ణారావు, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్‌ను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి శాలువతో సన్మానించి, స్వామివారి చిత్రపటం అందజేశారు. ఆలయ మహాసంప్రోక్షణ సందర్భంగా వైదిక క్రతువుల్లో పాల్గొన్న అర్చకులు, వేద పారాయణదారులను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి దంపతులు సన్మానించారు. సాయంత్రం కార్యక్రమాలు.. ఆలయంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, అనంతరం 5.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగాయి. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ నిర్వహించారు. చదవండి: (చిన్నవయసులోనే గుండెపోట్లు.. కారణాలేంటి..? జాగ్రత్తలేంటి..?) -
రాజధాని శంకుస్థాపనా ప్రైవేటుకే !
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణాన్ని విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం చివరకు దాని శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణ సైతం ప్రైవేటు ఏజెన్సీలకే అప్పగించనుంది. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) ఈవెంట్ ఏజెన్సీల కోసం టెండర్లు పిలిచింది. ఈ కార్యక్రమాన్ని తానే నిర్వహిస్తే సాధారణంగా ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌గా దీన్ని నిర్వహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 22న రాజధాని శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీతోపాటు సింగపూర్ ప్రధాని, జపాన్ వాణిజ్య శాఖా మంత్రిని ఈ కార్యక్రమానికి తీసుకువస్తోంది. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఆ స్థాయిని శంకుస్థాపనలోనే చూపించాలని ఆత్రుత పడుతోంది. వెంకటపాలెంలో 50 ఎకరాల్లో నిర్వహణ సీడ్‌క్యాపిటల్ ప్రాంతంలోని వెంకటపాలెంలో 50 ఎకరాలను కార్యక్రమం కోసం సిద్ధం చేస్తున్నారు. వంద మంది కూర్చునే వేదిక, వెయ్యి మంది విశిష్ట అతిథులు, 50 వేల మంది ప్రజలతో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు. అక్టోబర్ 1 నుంచే ప్రచారం : శంకుస్థాపన ప్రచారాన్ని అక్టోబర్ 1 నుంచే మొదలు పెట్టనున్నారు. పత్రికలు, టీవీలతోపాటు సోషల్ మీడియాలోనూ దీనిపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్, విజయవాడ అవసరమైతే ఢిల్లీలో ఈ ప్రమోషనల్ ఆడియో, వీడియోలను ప్రదర్శిస్తారు. ఇందు కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే సీఆర్డీఏ ఉన్నతాధికారులు పలు అంతర్జాతీయ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలతో సంప్రదించినట్లు సమాచారం. -
'బాబు వెంకటపాలెంనే ఎత్తుకుపోవాలని చూస్తున్నారు'
-
'బాబు వెంకటపాలెంనే ఎత్తుకుపోవాలని చూస్తున్నారు'
విజయవాడ : రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేయటం వల్లే చంద్రబాబు నాయుడును గెలిపించాలమని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం రైతులు అన్నారు. అధికారంలో కూర్చొబెడితే... ఇప్పుడు ఆయన వెంకటపాలెంనే ఎత్తుకుపోవాలని చూస్తున్నారని రైతులు మంగళవారమిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను హైదరాబాద్ పిలిపించి మాట్లాడితే సమస్య పరిష్కారం అవదని, తమ గ్రామానికి వచ్చి తిరిగితే కష్టాలు ఏంటో తెలుస్తాయన్నారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతులందరితో చంద్రబాబు నాయుడు మాట్లాడాలని వెంకటపాలెం రైతులు డిమాండ్ చేశారు. కాగా రాజధానికి భూసమీకరణలో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం ఎదుట వెంకటపాలెం రైతులు సోమవారం నిరసన తెలిపారు. ఏకపక్షంగా భూసమీకరణకు అంగీకరించేది లేదని, గ్యోబాక్ అంటూ నినాదాలు చేశారు. భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని కమిటీకి స్పష్టం చేసిన రైతులు సదస్సును బహిష్కరించి వెళ్లిపోవడంతో అభిప్రాయ సేకరణ పూర్తి చేయకుండానే కమిటీ సభ్యులు వెళ్లిపోవాల్సి వచ్చింది. కాగా రాయపూడి గ్రామ రైతులు కూడా భూములు ఇవ్వడానికి ససేమిరా అన్న విషయం తెలిసిందే. -
ఉరుముతున్న వెంక టపాలెం
సాక్షి, విజయవాడ బ్యూరో: డొక్కన చిన్నబ్బాయికి 68 ఏళ్ల వయసు. కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కూలి నాలి చేసుకుని సంపాదించిన డబ్బుతో ఎకరం పొలం కొనుక్కుని ఆరుగురు సభ్యులున్న కుటుంబాన్ని లాగుతున్నాడు. కూతురు పెళ్లీడుకొచ్చింది. సంబంధాలు చూస్తున్నాడు. ఇప్పుడీ కుటుంబం మొత్తానికి నిద్ర పట్టడం లేదు. శరీరం అలసిపోయి రాత్రి పూట పడుకున్నా అర్ధరాత్రో, అపరాత్రో చిన్నబ్బాయికి మెలకువ వచ్చేస్తోంది. రాజధాని పేరుతో ఉన్న పొలం ప్రభుత్వం లాగేసుకుంటే బతికేదెట్టా? ఇదే ఆలోచన.. ఆందోళన. ఇది చిన్నబ్బాయి ఒక్కడి పరిస్థితే కాదు. వెంకటపాలెంలోని ప్రతి కుటుంబం, ఈ గ్రామంపై ఆధారపడిన కూలీలందరిదీ దాదాపుగా ఇదే పరిస్థితి. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ జరిపే గ్రామాల జాబితాలో తుళ్లూరు మండలం వెంకటపాలెం కూడా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించడమే ఇందుకు కారణం. దీంతో శుక్రవారం జరగనున్న జన్మభూమి సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరైతే వారితో తాడోపేడో తేల్చుకోవాలని గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. మేం భూములివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి పుల్లారావు ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా నదిని ఆనుకుని పచ్చటి పొలాలతో, ప్రశాంత వాతావరణంలో వున్న వెంకటపాలెంలో సుమారు 4వేల జనాభా ఉంది. వీరందరికీ కలిపి దాదాపు 1,200 ఎకరాల వ్యవసాయ భూమి వుంది. 30 అడుగుల లోతులోనే సమృద్ధిగా నీరుపడుతుంది. దొండ, అరటి, పత్తి, మొక్కజొన్న, బెండ పంటలు ఏడాదిలో మూడుసార్లు పండించే బంగరు భూములు అవి. ఇతర ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడితే.. సంవత్సరం పొడువునా పొలం పనులు ఉండే ఈ గ్రామానికి కూలీలు వలస వచ్చి కడుపు నింపుకుంటుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో 1994 నుంచి వరసగా తొమ్మిదేళ్లు కరువు కాటకాలు ఏర్పడిన సమయంలో కూడా ఈ గ్రామంలో కరువన్నది కనిపించలేదు. విశేషమేమిటంటే.. వెంకటపాలెంలో ఏ ఇంట్లో కూడా కొళాయి కనిపించదు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 30 అడుగుల లోతులోనే నీళ్లు పడుతున్నందువల్ల ప్రతి ఒక్కరూ బోరు వేసుకుని ఆ నీటినే అన్ని అవసరాలకు వాడుకుంటున్నారు. ఇలాంటి విలువైన భూములు కావడం వల్లే గ్రామంలోని చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు మొత్తం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘మేం భూములివ్వం. రాజధాని కడితే మా బతుకులేం కావాలి. ఉన్నోళ్లంతా కలసి మా పొట్టకొడతారా? కాదూ కూడదు కడతామంటే మమ్మల్ని చంపి మా శవాలపై కట్టుకోవాల్సిందే..’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేం టీడీపీయే.. అయితే..? నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే. నాకు సభ్యత్వం కూడా వుంది. అంత మాత్రాన మా భూములను ప్రభుత్వానికిచ్చి మా బతుకులు రోడ్డున పడేసుకోవాలా? 80 శాతం మంది రైతులు భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారని మంత్రి పుల్లారావు ఎట్లా చెబుతారు. అంత అవసరమైతే వాళ్ల భూములు ఇచ్చుకోమని చెప్పండి. - దొడ్డక చిన్నబ్బాయి - వెంకటపాలెం అర ఎకరం పోతే మేం ఎట్లా బతకాల నాకు అరెకరం భూమి వుంది. ఏడాదిలో మూడు పంటలు పండిస్తున్నా. నాలాంటి వాళ్లే చాలామంది ఉన్నారు. మంత్రులు మేం భూములు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని ఎట్లా చెబుతారు. రేపు (శుక్రవారం) అటో ఇటో తేల్చుకుంటాం. - కన్నె బోయిన దోనయ్య - వెంకటపాలెం అన్ని భూములు వ్యాపారానికా..? రాజధానికి 30 వేల ఎకరాల భూమి ఎందుకు? మా భూములు తీసుకోని వాళ్లు వ్యాపారం చేసుకోవడానికా? భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. - రొద్ద వెంకటేశ్వర్లు - వెంకటపాలెం మా పిల్లల భవిష్యత్తేంటి? మా పొలాలను ప్రభుత్వం లాక్కుంటే మా బతుకులు పోతాయి. పిల్లల చదువులేమిటి? పెళ్లిళ్ల సంగతి ఏమిటి? రాజధాని కోసం మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. మంత్రి ఎప్పుడన్నా మా ఊరొచ్చాడా? మాతో మాట్లాడాడా? - దొడ్డక అప్పారావు - వెంకటపాలెం