Venkatesh Maha
-
నరేష్ గారితో నటించాలంటే ఏదోలా ఉంది: వెంకటేష్ మహా
-
అలా మాట్లాడటం సరైంది కాదు.. మహా కామెంట్స్‌పై నాని
ఇటీవల దర్శకుడు వెంకటేశ్ మహా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ చిత్రంపై విమర్శలు చేశారు. ఆయన తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కూడా చెప్పారు. అయితే తాజాగా ఈ విషయంపై నాచురల్ స్టార్ నాని స్పందించారు. ఇలా జరగడం దురదృష్ణకరమని.. అతను అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు. తాజాగా దసరా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాని మహా కామెంట్స్‌పై స్పందించారు. నాని మాట్లాడుతూ.. 'ఇటీవల దర్శకులు పాల్గొన్న చర్చా కార్యక్రమాన్ని చూశా. వెంకటేశ్ మహా మాట్లాడిన విధానం సరిగా లేదు. థియేటర్లో ఒక సినిమా చూసిన తర్వాత బయటకొచ్చి మన ఫ్రెండ్స్‌తో ఒక విధంగా చెబుతాం. కానీ అదే ఇంటర్వ్యూల్లోకి వచ్చేసరికి అదే మరోలా చెబుతాం. అక్కడ చర్చలోనూ అదే జరిగింది. అందుకే అతను విమర్శలు ఎదుర్కొన్నాడు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సింది. ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నలుగురు దర్శకులు నాకు తెలిసిన వాళ్లే. వాళ్లకు మాస్, కమర్షియల్ సినిమా అంటే ఎంతో ఇష్టం. చిన్న వీడియో క్లిప్ చూసి వాళ్లపై ఒక అభిప్రాయానికి రాను. ఏది ఏమైనా ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం'. అని అన్నారు. కాగా.. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, నందినిరెడ్డి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, వెంకటేశ్ మహా ఓ డిబేట్లో పాల్గొన్నారు. కేజీఎఫ్‌ను ఉద్దేశించి వెంకటేశ్ మహా మాట్లాడుతూ..'తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి.. చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి వ్యక్తి గురించి సినిమాలు చేస్తే మనం చప్పట్లు కొడుతున్నాం' అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. -
ఆ విషయంలో క్షమించండి.. కానీ నా మాటలను వెనక్కి తీసుకోను: వెంకటేశ్ మహా
‘కేరాఫ్ కంచెరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా కేజీయఫ్ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. సినిమా పేరు చెప్పకుండా స్టోరీ చెబుతూ సెటైర్లు వేశాడు. దీంతో అతడిపై కామెంట్స్‌పై కేజీయఫ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు క్షమాపణలు చెప్పాలంటూ కన్నడ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వెంకటేశ్ మహాకు వ్యతిరేకంగా పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు. ఇక తనపై వస్తున్న తీవ్ర నెగిటివిటీ, ట్రోల్స్‌కి వెంకటేశ్ మహా స్పందించాడు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ తాజాగా ఓ వీడియో షేర్ చేశాడు. చదవండి: కళ్లు చెదిరేలా కమెడియన్ రఘు లగ్జరీ ఇల్లు.. చూశారా? క్షమాపణలకు బదులుగా తన కామెంట్స్‌ని సమర్థించుకోవడం గమనార్హం. తన అభిప్రాయం సరైనదే అని అయితే తాను వాడిన భాష కరెక్ట్ కాదన్నాడు. ఇంతకీ వెంకటేశ్ మహా ఈ వీడియో ఏం చెప్పాడంటే.. ‘‘కొంతమందిని ఉద్దేశించే నా అభిప్రాయం చెప్పాను. నాలాగే చాలామంది ఆ సినిమా నచ్చలేదు. నా అభిప్రాయం నచ్చినవాళ్లు ‘మీరు చెప్పింది కరెక్ట్ సార్’ అంటూ నాకు మెసెజ్‌లు పెట్టారు. కాబట్టి వారందరి తరపున నా వాయిస్ వినిపించాను. అయితే ఈ క్రమంలో నేను వాడిన పద భాష కరెక్ట్ కాదు. దానికి నా క్షమాపణలు. కానీ, నేను సినిమాలోని కల్పిత పాత్రను మాత్రమే విమర్శించాను. రియల్ పర్సన్ కాదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ట్రెండింగ్‌లో అల్లు అర్జున్-స్నేహల ఫొటో! స్పెషల్ ఏంటంటే.. అనంతరం మాట్లాడుతూ.. ‘తాను దూషించింది కేవలం ఓ కల్పిత పాత్ర మాత్రమే. కానీ రియల్ పర్సన్ అయినా నన్ను దూషించడం ఎంతవరకు కెరెక్ట్. నాపై తప్పుడు ఇమేజ్ క్రియేట్ చేస్తూ అసభ్యంగా దూషిస్తున్నారు. ఇదేం నాకు కొత్త కాదు. చాలా సార్లు ఇలాంటివి ఎదుర్కొన్నాను. అయితే మీరంత అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారని, ఒకేలా చూస్తారని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ మరోసారి వైరల్‌గా మారాయి. కాగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేశ్ మహా ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, నందిని రెడ్డి, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయలతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన వారి సమక్షంలోనే ఈ మూవీ వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనికి వారంత నవ్వడం యశ్ ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి గురి చేసింది. దీంతో నందిని రెడ్డిని కొందరు ప్రశ్నించగా ఆమె ట్విటర్ వేదికగా క్షమాపణలు కోరారు. pic.twitter.com/SzJ5mt07ml — Venkatesh Maha (@mahaisnotanoun) March 6, 2023 -
కేజీఎఫ్.. వాడంత పిచ్చోడు ఉంటాడా?.. దర్శకుడి తీవ్ర వ్యాఖ్యలు
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ 1, 2 సినిమాలు బాక్సాఫీస్‌ను గడగడలాడించాయి. కేవలం కన్నడలోనే కాకుండా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ వసూళ్ల వర్షం కురిపించాయి. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. కానీ ఈ సినిమా ఓ టాలీవుడ్ దర్శకుడికి అస్సలు నచ్చలేదు. దీంతో సదరు సినిమాపై ఓ ఇంటర్వ్యూలో బాహాటంగా విమర్శలు గుప్పించాడు కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా. కేజీఎఫ్ సినిమా పేరు ప్రస్తావించకుండా కేవలం కథ గురించి చెప్తూ సెటైర్లు వేశాడు. 'ఇప్పుడేవైతే వంద కోట్లు, వెయ్యి కోట్లు, లక్ష కోట్లు సంపాదిస్తున్నాయో అవన్నీ పాప్‌కార్న్ ఫిలింస్. పాప్‌కార్న్ తింటూ సినిమా చూడొచ్చు. ఏదైనా సీన్ మిస్సైనా ఏం పర్లేదు అన్నట్లుగా ఉంటుంది. ఆ సినిమాలు ఓటీటీలో చూడాల్సినవి. మేము తీసినవి అలాంటివి కావు. ఒక సినిమా పేరు చెప్పను కానీ వివరాలు చెప్తాను. ప్రపంచంలో ఒక తల్లి.. కొడుకుని నువ్వెప్పటికైనా గొప్పోడివి అవ్వాలిరా అని చెప్తుంది. అంటే బాగా సంపాదించి నలుగురికీ ఉపయోగపడు అని! తల్లి ఓ పెద్ద వస్తువు కావాలంటుంది. ఈ హీరో వెళ్లి దాన్ని తవ్వేవాళ్లను ఉద్ధరిస్తాడు. వాడు ఆ బంగారం తీసుకెళ్లి ఎక్కడో పారదొబ్బుతాడు. వాడంత పిచ్చోడు ఎవడైనా ఉంటాడా? ఆ మహాతల్లి నిజంగా ఉంటే తనను కలవాలనుంది. ఇలాంటి కథను సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాం' అంటూ వెటకారంగా మాట్లాడాడు. ఈయన వ్యాఖ్యలు యశ్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాయి. పాన్ ఇండియా లెవల్లో హిట్టయిన సినిమా గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నాడేంటని మండిపడుతున్నారు అభిమానులు. ఈ ఇంటర్వ్యూలో వెంకటేశ్ మహా మాటలకు పడీపడీ నవ్విన డైరెక్టర్ నందినీరెడ్డి సోషల్ మీడియాలో ఈ వివాదంపై స్పందిస్తూ.. క్షమాపణలు కోరింది. Every commercial film which has become a success is bec the audience hs loved something in tht effort . The conversation was nvr meant 2deride anyones work but rathr hv a positive debate on what cn diversify the narrative of “commercial cinema”. Apologies fr any offence caused 🙏🏼— Nandini Reddy (@nandureddy4u) March 6, 2023 -
తనకు బాగా నచ్చిన పాట పాడిన ఎన్టీఆర్.. షాకింగ్‌గా డైరెక్టర్ ట్వీట్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటనతోనే కాదు సింగర్‌గా కూడా ఆకట్టుకున్నాడు. ఇదివరకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన నాన్నకు ప్రేమతో సినిమాలో 'ఫాలో ఫాలో' సాంగ్ పాడి అభిమానులను, ఆడియెన్స్‌ను అలరించాడు. తాను పాడింది మొదటిసారే అయినా ప్రఫెషనల్ సింగర్‌గా పాడి మెస్మరైజ్ చేశాడు. తాజాగా మరోసారి తన గాత్రం వినిపించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందులోనూ తనకు ఎంతో బాగా నచ్చిన పాటను పాడి అబ్బురపరిచాడు. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దుబాయ్, బెంగళూరు, ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన స్మార్ట్‌ఫోన్‌లో ఏ పాట ఎక్కువగా ప్లే చేస్తారో చెప్పమంటూ యాంకర్ తారక్‌ను అడిగింది. దానికి ఎన్టీఆర్.. 'కేరాఫ్ కంచరపాలెం చిత్రంలోని ఆశ పాశం.. పాట' అని సమాధానమిచ్చాడు. ఆ పాట పాడమని యాంకర్ కోరగా ఎంతో ఉత్సాహంగా పాడి వినిపించాడు తారక్. అయితే ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పాట పాడటం చూసిన 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా డైరెక్టర్ వెంకటేష్ మహా సంతోషం వ్యక్తం చేశారు. 'మీ ఫోన్ ప్లేలిస్ట్‌లో ఆశ పాశం.. సాంగ్ ఉండటం సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తారక్ గారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలి' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యామాల్లో చక్కర్లు కొడుతోంది. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు విశ్వ లిరిక్స్ అందించగా, స్వీకర్ అగస్తీ కంపోజ్ చేశారు. కాగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'రౌద్రం.. రణం.. రుధిరం..' సినిమాలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్‌గా తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కానుంది. Glad to know that #AasaPaasam is the most played song on your phone. Thank you @tarak9999 garu… you made my day. Wish you a great success with #RRR pic.twitter.com/kACWnAEKXV — Venkatesh Maha (@mahaisnotanoun) March 23, 2022 -
కేరాఫ్ రాయలసీమ!
‘కేరాఫ్ కంచరపాలెం’తో కంచరపాలెం గ్రామంలో జరిగే కథను కళ్లకు కట్టారు దర్శకుడు వెంకటేశ్ మహా. ఆ తర్వాత ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ తెరకెక్కించారు. తాజాగా రానా హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి వెంకటేశ్ మహా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో జరిగే పీరియాడికల్ చిత్రం ఇది అని తెలిసింది. ఈ స్క్రిప్ట్‌కి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. వెంకటేశ్ మహా తొలి చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’ను సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా సమర్పించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
రివ్యూ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య
టైటిల్: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య జానర్: లవ్ అండ్ రివేంజ్ స్టోరీ రచనా, దర్శకత్వం: వెంకటేష్ మహా నటీనటులు: సత్యదేవ్, హరిచందన, రూప, నరేశ్, సుహాస్, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు నిర్మాతలు: విజయ ప్రవీణ పరుచూరి, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ సినిమాటోగ్రఫి: అప్పు ప్రభాకర్ గతేడాది నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల హవా నడుస్తోంది. విభిన్న కాన్సెప్ట్ ఆధారంగా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ హిట్ కొట్టడమే కాకుండా ప్రేక్షకుల మనసునూ గెలుచుకుంటున్నాయి. తాజాగా జూలై 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" ఈ కోవలోకే వస్తుంది. ఇది జాతీయ అవార్డును అందుకున్న "మహేషింటే ప్రతీకారమ్" అనే మలయాళ సినిమాకు రీమేక్‌గా తెరెకెక్కింది. మరి ఈ చిత్రం ఎంతవరకు 'క్లిక్' అవుతుందో చూసేద్దాం.. కథ: హీరో మహేశ్(సత్యదేవ్) అరకులోని ఓ ఫొటోగ్రాఫర్. గొడవలంటే ఆమడదూరం పరిగెడతాడు. అలాంటిది ఓ రోజు వీధి రౌడీ జోగినాథ్ (రవీంద్ర విజయ్)తో దెబ్బలాడుతాడు. కొట్లాటకు దిదిగడం ఇదే తొలిసారి అయినందువల్ల తిరిగి కొట్టడం చేత కాలేదు. కానీ అందరి ముందు దారుణంగా తన్నులు తినడంతో హీరో ఆత్మాభిమానం దెబ్బ తింటుంది. తనను చితక్కొట్టిన రౌడీని మళ్లీ తిరిగి కొట్టేవరకు చెప్పులు కూడా వేసుకోనని మంగమ్మ శపథం చేస్తాడు. అలా అప్పటివరకు నవ్వుతూ సరదాగా ఉండే హీరో ఉగ్ర రూపం దాలుస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. (‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ టీజర్ రిలీజ్) అతి సాధారణంగా ప్రారంభమైన సినిమా కాసేపటికి బోరింగ్ అనిపిస్తుంది. ఇక్కడ ప్రేక్షకుడు దారి తప్పకుండా తిరిగి కథలోకి తీసుకొచ్చేందుకు దర్శకుడు కాస్త ఎక్కువగానే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. అందరి ముందు రౌడీ చేతిలో హీరో తన్నులు తినే కీలక సన్నివేశంతో ప్రేక్షకుడు మళ్లీ కథలో లీనమవుతాడు. సరిగ్గా ఇదే సమయంలో ప్రేమికురాలు స్వాతి (హరిచందన) బ్రేకప్ చెప్తుంది. ఇక్కడ బ్రేకప్ చెప్పిన తర్వాత ప్రేమికుల పరిస్థితి ఎలా ఉంటుందనేది హీరోహీరోయిన్ల పాత్రల ద్వారా ఆసక్తకిరంగా మలిచాడు. అయితే స్వాతి వేరొకరిని పెళ్లి చేసుకోగా ఉమా రౌడీ చెల్లెలు జ్యోతి (రూప)తో ప్రేమలో పడతాడు. కథలో ప్రేమను, అనుబంధాలను రమ్యంగా చూపించాడు. మరి ఉమా రౌడీపై ప్రతీకారం తీర్చుకున్నాడా? జ్యోతితో ప్రేమకు ఏమైనా అడ్డంకులు ఎదురయ్యాయా? అనేవి చెప్పడం కన్నా సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. కథ చివర్లో ఎలాంటి ట్విస్ట్‌లు, మ్యాజిక్‌లు లేకుండానే సింపుల్‌గా ముగించేశాడు. విశ్లేషణ: "మహేషింటే ప్రతీకారమ్" సినిమాను బాగా వంటబట్టించుకున్న 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేశ్ మహా మాతృక నుంచి బయటకు రాలేడేమో అనిపిస్తుంది. నటీనటులు మేకప్ లేకుండా కనిపించడం, మెలోడ్రామా లేని నటనతో పాత్రలన్నీ సహజసిద్ధంగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం. అప్పు ప్రభాకర్ అరకు అందాలను మరింత అందంగా చూపించాడు. హీరో ఫొటోగ్రఫీ గురించి కొత్త అర్థాన్ని చెప్తాడు. సంగీతం ఫర్వాలేదు. కానీ ఈ సినిమాకు 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' అనే భారీ టైటిల్ సూటయినట్లు అనిపించదు. ఇందులో హీరో ఉగ్రరూపం కంటే మంచితనం, అమాయకత్వమే పెద్దగా హైలెట్ అయ్యాయి. అంతేకాక అమాయకంగా ఉండే హీరో ఉగ్రావతారం ఎత్తి రౌడీని ఎలా ఎదుర్కొన్నాడు? అనే ఒక్క పాయింట్‌ను సాగదీసి చెప్పడం ప్రేక్షకుడి సహనానికి. (‘ఓ.. పిట్ట కథ’ మూవీ రివ్యూ) సత్యదేవ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, అమాయకంగా కనిపించడమే కాక ఉగ్ర రూపంలోనూ దర్శనమిస్తూ నవరసాలు ఒలికించాడు. నరేష్ తన పాత్రలో జీవించేశాడు. స్వాతి పాత్రలో హీరోయిన్ హరిచందన గ్లామరస్‌కు దూరంగా ఉంటే, రౌడీ చెల్లెలు జ్యోతి పాత్రలో రూప కాస్త గ్లామరస్‌గా కనిపించారు. ఇద్దరూ చాలా సహజంగా నటించారు. షూటింగ్ ప్రధానంగా జరిగిన అరకు అందాలు అడుగడుగునా కనిపిస్తాయి. అయితే కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారు మాత్రం దీన్ని కాస్త ఓపికగా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ సినిమాటోగ్రఫీ హీరో నటన అరకు అందాలు రౌడీతో హీరో తలపడే సన్నివేశాలు మైనస్ పాయింట్స్ కథనం స్లో నెరేషన్ -
‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’
సాక్షి, హైదరాబాద్: ఈ పేరేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఇది కొత్త తెలుగు సినిమా టైటిల్. సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది. ‘c/o కంచరపాలెం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకటేశ్ మహ ఈ సినిమాకు దర్శకుడు. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 2016లో విడుదలై ఘన విజయం సాధించిన మలయాళం సినిమా ‘మహేశింతే ప్రతీకారం’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాను 2020, ఏప్రిల్ 17న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేసింది. సత్యదేవ్‌తో పాటు సీనియర్ నటుడు నరేశ్ ఇందులో కనిపించారు. ‘చెప్పు లేసుకోవయ్యా అంటే.. తిరిగి ఆణ్ణి కొట్టేవరకు చెప్పులు వేసుకోను’ అంటూ హీరో సమాధానం ఇస్తాడు. ప్రతీకారం నేపథ్యంలో కథ నడుస్తుందని తెలుస్తోంది. విలక్షణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ప్రతీకార కథతో..
మొదటి సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’లో ప్రేమనే ఇతివృత్తంగా, మూడు దశల్లో ప్రేమకథలను చూపించారు దర్శకుడు వెంకటేశ్ మహా. ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రతీకార ఛాయలున్న కథతో రూపొందిస్తున్నారట. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘మహేషింటె ప్రతీకారం’ చిత్రానికి ఈ సినిమా రీమేక్ అని తెలిసింది. ‘మహేషింటె ప్రతీకారం’లో చిత్రం ఫాహద్ ఫాజల్ ముఖ్యపాత్ర చేశారు. తెలుగు రీమేక్‌లో ఆయన పాత్రను సత్యదేవ్ చేస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. ‘మహేషింటె ప్రతీకారం’ సినిమాకి జాతీయ అవార్డు లభించింది. తమిళంలో ఈ సినిమాను దర్శకుడు ప్రియదర్శన్ రీమేక్ చేశారు. -
సారీ.. నిన్ను ఓడిపోయేలా చేశాను
గతేడాది రిలీజైన ‘కేరాఫ్ కంచరపాలెం’ ఆడియన్స్‌కు ఎంతగా నచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2018లో వచ్చిన ఉత్తమ చిత్రమంటూ పొగడ్తల వర్షాలు కురిపించారు. రానా సమర్పించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మహా వెంకటేశ్ డైరెక్ట్ చేయగా, తెలుగు మూలాలున్న అమెరికన్ డాక్టర్ పరుచూరి ప్రవీణ నిర్మించారు. ఈ ఏడాది నేషనల్ అవార్డ్స్ లిస్ట్‌లో ‘కేరాఫ్ కంచరపాలెం’ సెలెక్ట్ కాలేదు. కారణం నిర్మాత అమెరికన్ కావడమే. ఈ విషయాన్ని ట్వీటర్లో పేరొన్నారు ప్రవీణా పరుచూరి. ‘‘సారీ వెంకటేశ్ మహా. కేవలం నా వల్ల నీ కష్టాన్ని, శ్రమని నేషనల్ అవార్డ్ వాళ్లు అనర్హంగా భావించారు. నా వల్లే నువ్వోడిపోయావ్. నేనే నిన్ను ఓడిపోయేలా చేశాను’’ అని తన బాధను వ్యక్తపరిచారు. దీనికి దర్శకుడు వెంకటేశ్ మహా సమాధానమిస్తూ – ‘‘అది మీ తప్పు కాదు. ఇంకా ఆ పాత రూల్స్‌తోనే నడుస్తున్న మన దేశానిది. ఒక ఇండియన్ డైరెక్టర్, ఇండియన్ యాక్టర్స్‌తో ఇండియా వాళ్ల కోసం తీసిన సినిమా ఇండియన్ నేషనల్ అవార్డ్స్‌కు అర్హత సాధించకపోవడమేంటో నాకు అర్థం కావడం లేదు. మార్పుకు సమయం ఆసన్నమైంది’’ అని పేర్కొన్నారు. -
‘డేర్’ ఆఫ్ కంచరపాలెం
సినిమా చేయడానికి కథ కావాలి. కథకులు కావాలి.. యాక్టర్లు కావాలి. దర్శకుడు కావాలి.. క్యాష్ కావాలి. ఇవన్నీ ఒక ఎత్తు. అసలు కావాల్సింది ‘డేర్’. అంటే.. ధైర్యం. ఎత్తులు పొత్తులు కాదు. డేర్ అన్న ఎత్తుగడ కావాలి. టాలీవుడ్లో ‘కంచరపాలెం’ చిన్న ఊరు. కానీ ఇవాళ అది చాలా పెద్ద పేరు. కంగ్రాట్స్.. ఒక్కసారిగా అందరూ మీ గురించి మాట్లాడుకునేలా చేశారు.. విజయ ప్రవీణ, వెంకటేశ్ మహా: థ్యాంక్స్. హానెస్ట్‌గా చేసిన ప్రయత్నం సక్సెస్ అయినందుకు మేం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంత హిట్ ఇచ్చాక క్రేజీ ఆఫర్స్ వస్తాయి. మీరు న్యూయార్క్‌లో ఫిల్మ్ కోర్స్ చేస్తానంటున్నారు? వెంకటేశ్ మహా: నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా తెలుసుకోవడం ఇంట్రెస్ట్. మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, ఉంటాయి. వీఎఫ్ఎక్స్ మీద ఆరు నెలలు క్రాష్ కోర్స్ చేయాలని వెళ్తున్నాను. సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే ఫీల్డ్. రోజుకో కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది. సో.. మనల్ని మనం అప్డేటెడ్గా ఉంచుకోవాలి. జనరల్‌గా ఆర్థిక కష్టాలుంటే వచ్చిన సినిమాలు ఒప్పేసుకునేవారేమో. న్యూయార్క్ వెళ్లాలనుకుంటున్నారంటే మీరు సౌండ్ పార్టీయేనా? వెంకటేశ్: (నవ్వేస్తూ) అస్సలు కాదండీ. అసలా సౌండ్ కూడా వినిపించనంత దూరం. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను 17 ఏళ్లకే ఇండిపెండెంట్‌గా ఉందాం అని బయటకి వచ్చేశాను. డిగ్రీ డ్రాప్ అవుట్. చిన్నప్పటి నుంచి జీవితంలో స్ట్రగుల్ ఉండబట్టే ఇంత మంచి సినిమా వచ్చిందని నమ్ముతాను. సినిమా అనేది మీ లైఫ్‌లోకి ఎప్పుడొచ్చింది? వెంకటేశ్: నా చిన్నప్పుడంతా సినిమా మధ్యలోనే పెరిగాను. ఇంట్లో మారాం చేస్తుంటే మా అమ్మ డబ్బులిచ్చి సినిమాకు వెళ్లమని చెప్పేది. అలా నాలుగో తరగతి నుంచి ఒంటరిగా సినిమాలకు వెళ్లడం నేర్చుకున్నాను. నేను పెరిగే కొద్దీ సినిమాల మీద ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది. డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు కాబట్టి వేరే దాంట్లో అవకాశం లేక సినిమాల్లోకి వచ్చారా? వెంకటేశ్: అలా ఏమీ కాదండీ. ఒకవేళ నేను సినిమాల్లో రాకపోయుంటే ఓ కంపెనీలో ఫ్లోర్ మేనేజర్‌గా ఉండేవాడ్ని, లేదా బీపీఓ కంపెనీలో డీసెంట్‌గా సంపాదిస్తూ ఉండేవాడ్ని. ఏదో ఓ పని మాత్రం చేసేవాడ్ని. సినిమా అంటే ప్యాషన్ . అందుకే వచ్చాను. సినిమా ప్రయత్నాలు.. ఆ ఎక్స్పీరియన్స్? వెంకటేశ్: నిజానికి యాక్టర్ అవుదాం అని హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించా. ‘గడ్డం పెంచు తమ్ముడూ.. అవకాశం ఇచ్చేస్తాం’ అనేవారు. అలా గడ్డం పెంచుతూనే ఉండేవాడ్ని. ఈలోపు ఆ సినిమాలు రిలీజ్ అయ్యేవి. అవకాశాలు చాలా అరుదుగా వచ్చేవి. ఈలోపు ‘నాన్న’ పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ చేశాను. అది చేసినది యు ట్యూబ్‌లో వ్యూస్ కోసం కాదు... నన్ను నేను ‘సెల్ఫ్ చెక్’ చేసుకోవడానికే. మంచి పేరు వచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేసిన యు ట్యూబ్ చానల్ వాళ్లు నన్ను ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉండమన్నారు. అసలు ప్రొడక్షన్ డిజైన్ అంటే ఏంటీ? అని గూగుల్‌లో తెలుసుకున్నాను. ఓ ఆరు నెలలు చేశాను. ఆ తర్వాత ‘రంగం’ అనే డ్యాన్స్ స షోకి కో డైరెక్టర్‌గా చేశాను. నా లైఫ్‌లో నాకు వచ్చిన ప్రతీ చాన్స్‌ని కాదనుకుండా అంది పుచ్చుకున్నాను. వెంకట్‌లానే మీకూ ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేదా? విజయ ప్రవీణ: ఇండస్ట్రీలో నాకు పరిచయాలు ఏమీ లేవు. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. కానీ స్క్రీన్ మీద కనిపించాలనో, ఆఫ్ స్క్రీన్ ఏదైనా చేయాలనో.. ఇలా ఏదీ అనుకోలేదు. ఇండస్ట్రీలో ఉండాలి.. పెద్ద పొజిషన్లో ఉండాలి అనుకున్నాను. కానీ ఇంట్లో ఎంకరేజ్ చేయలేదు. మెడిసిన్ చదివాను. కార్డియాలజిస్ట్‌గా చేస్తున్నాను. నాకు ఒకరు అవకాశం ఇచ్చే బదులు ఇండస్ట్రీలో నాకు అవకాశం నేనే ఇచ్చుకోవాలనుకున్నాను. సినిమా నిర్మించాలనుకున్నాను. నా సంపాదనతో సినిమా తీస్తే నాకు నచ్చింది తీసుకోవచ్చు అని అనుకున్నాను. అలానే తీశాను. ‘కంచరపాలెం’లాంటి సినిమాలు బ్యాకింగ్ ఉంటేనే వెలుగులోకి వస్తాయి. సురేశ్‌బాబుగారు ఆ స్టెప్ తీసుకోవడానికి మీరు కారణం.. దాని గురించి? వెంకట్ సిద్దారెడ్డి: ఈ సినిమాను గతేడాది డిసెంబర్ 26న చూశాను. ఫస్ట్ 15 నిమిషాలు చూడగానే ఈ సినిమాలో ఏదో ఉందని డిసైడ్ అయ్యాను. వెంటనే సురేశ్‌బాబుగారికి ఫోన్ చేశాను. ‘ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నట్లు ఇంటర్వెల్లో మీరు అనౌన్స్ చేయాలి సార్’ అన్నాను. ఆయన ఏదో పనిలో ఉండి క్లైమాక్స్‌లో వచ్చి ‘ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్ ప్రజెంట్ చేస్తుంది’ అని చెప్పారు. రానా తన భుజాల మీద వేసుకొని ప్రివ్యూ షోలు వేశారు. ఫస్ట్ సినిమాను ఎడిట్ చేద్దాం.. కొన్నిచోట్ల స్లోగా ఉందనుకున్నాం. కానీ మన రోజువారి జీవితాల్లో ఇలానే కదా ఉండేది. అన్నీ చకచకా జరిగిపోవు కదా. ఇది సినిమా కాదు జీవితం. వెంకటేశ్ మహా చక్కగా క్యాప్చర్ చేశాడు. ఈ సినిమా క్రెడిట్ అంతా వెంకటేశ్‌కే. ఇంతకు ముందు తమిళం, మలయాళ భాషల్లో ఇలాంటి సినిమాలు వచ్చేవి అని మాట్లాడుకునే వాళ్లం. కానీ ఇప్పుడు మనం కూడా వాటికి పోటీగా.. కాదు.. కాదు వాటి కంటే మంచి సినిమా తీశాం అని కాలర్ ఎగరేసుకొని తిరగొచ్చు. (‘కేరాఫ్ కంచరపాలెం’ పోస్టర్) విజయగారూ.. ఆపరేషన్ థియేటర్ నుంచి సినిమా థియేటర్‌కి రావడం ఎలా ఉంది? విజయ: అక్కడంతా (ఆపరేషన్ థియేటర్) నిశబ్దంగా ఉంటుంది. ఇక్కడేమో ఈలలు, గోల, చప్పట్లు. కొత్త ఎక్స్పీరియన్స్. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఓ మంచి అనుభూతి కలిగింది. నేను కావాలనుకున్న అనుభూతి ఇది. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. కార్డియాలజిస్ట్‌గా గుండె జబ్బులు నయం చేసేవారు. ఇప్పుడేమో సినిమా ద్వారా హృదయాలను ఆహ్లాదంగా మార్చారు. మొత్తానికి ఎక్కడున్నా ఆరోగ్యాన్ని వదలరు. విజయ: (నవ్వుతూ). వినడానికి చాలా బాగుంది. అయితే ఇక్కడ అడ్జెస్ట్ అవ్వడానికి టైమ్ పట్టేలా ఉంది. 2 ఏళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ఇంత కష్టపడ్డాక వచ్చిన సక్సెస్ రుచి చాలా స్పెషల్‌గా ఉంటుంది కదా. (నవ్వుతూ) మల్టీప్లెక్స్‌లు సందర్శించాం. అక్కడ అంతా హౌస్‌ఫుల్ (చెమర్చిన కళ్లతో). నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది. వెంకటేశ్: (మధ్యలో అందుకుంటూ) హలో మా ఇండియన్స్ కి ఎమోషన్స్ ఉన్నాయి. ఏదైనా డీప్‌గా అర్థం చేసుకుంటాం. మీరు అమెరికాలో పెరిగిన ఇండియన్ కదా.. మా అంతగా మీకు ఎమోషన్స్ ఉండవేమో (నవ్వులు). ‘ఇలాంటి సినిమా కావాలి’ అని ఓ ప్రొడ్యూసర్‌గా మీక్కావల్సింది కోరుకున్నారా? విజయ: ఈ సినిమా స్టార్టింగ్ అప్పుడు 3000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. నీ ఆర్టిస్టిక్ ఫ్రీడమ్‌కి ఎప్పుడూ నో చెప్పను. వేరే ఎవరి కోసమో కాదు. ఇది నా కోసం నేను తీసుకుంటున్న సినిమా. ముందు నాకు నచ్చాలన్నాను. నేను వెంకటేశ్ నుంచి ఎదురు చూసింది రెగ్యులర్ సినిమా కాదు. ‘హానెస్ట్ సినిమా’. వెంకటేశ్: ఈవిడ మాత్రం తన కోసం సినిమా చేయ మంది. నేను మాత్రం జనాల కోసమే తీశానండి. వెంకటేశ్‌కి, మీకు పరిచయం ఎలా ఏర్పడింది? విజయ: సినిమా తీయాలనుకున్నప్పుడు ఇండియాలో అపర్ణా మల్లాది అనే ఫ్రెండ్ ద్వారా సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలంటే ఏం ఫార్మాలిటీలు ఉంటాయి? అనే విషయం తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. ఆమె ద్వారానే మహాని కలిశాను. మేం ముగ్గురం ఆ రోజంతా.. దాదాపు 8 గంటలు సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ముగ్గురు అనే కన్నా ఇద్దరు అంటే కరెక్ట్. ఎందుకంటే నేను వెంకట్‌ని అసలు పట్టించుకోలేదు. సరిగ్గా ఆ రోజు నా ఫోన్ పోయింది. ఎక్కడెక్కడికి వెళ్లామో ఫోన్ వెతుక్కుంటూ మళ్లీ ఆ ఏరియాలకి వెళ్లాం. దొరకలేదు. సరే.. సాయంత్రం స్టార్‌బక్స్‌లో కూర్చున్నాం. అప్పటి వరకు మహాతో మూడు ముక్కలు కూడా మాట్లాడలేదు. అప్పుడు మహాతో అపర్ణ ‘నీ స్టోరీ ఐడియా వీడియో విజయకి ఎందుకు చూపించకూడదు’ అన్నారు. మహా వీడియో చూపించాడు. నాకు విపరీతంగా నచ్చేసింది. ఆ షాట్ చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. వెంటనే నేను తనని అడిగిన క్వశ్చన్‘స్క్రిప్ట్ రెడీయా?’ అని. రెడీ అన్నాడు. రెండో ప్రశ్న బడ్జెట్ ఎంత? అని అడిగితే.. ఇంత అని చెప్పాడు. వెంటనే సినిమా చేసేద్దాం అన్నాను. వెంకటేశ్: విజయ అలా చెప్పిన మరుసటి రోజు మార్నింగే కంచరపాలెం బస్ ఎక్కాను. ముందు నిర్మాతగా మాత్రమే చేయాలనుకున్నారు. తర్వాత ఈ సినిమాలో ‘సలీమా’ క్యారెక్టర్ కూడా చేశారు. ఆ నిర్ణయం ఎవరిది? విజయ: సినిమా తీసే ప్రాసెస్‌లో ఓసారి ఆడిషన్స్ చాలా కష్టం అని అంటే నేను ఆడిషన్ ఇస్తాను అని చెప్పాను. నన్ను యాక్ట్ చేయమన్నారు. కొన్ని సీన్స్ ఇచ్చారు.. చేశాను. ఆ తర్వాత పాటలు పాడమన్నారు. ‘ఇప్పటికింకా నా వయసు’ పాటకు డ్యాన్స్ చేయమన్నారు. చేశా. బట్.. అదంతా సరదాగా చేసినదే. సినిమాలో క్యారెక్టర్ చేస్తానని అప్పుడు అనుకోలేదు. వెంకటేశ్: ముందు సలీమా పాత్రకు వేరే అమ్మాయిని అనుకున్నాం. తన కాలు విరిగిపోయింది. అప్పుడు ప్రవీణ ఇచ్చిన ఆడిషన్స్ గురించి మా అసిస్టెంట్ డైరెక్టర్ గుర్తు చేశాడు. మళ్లీ ఆ వీడియో చూశాను. సలీమా క్యారెక్టర్‌కి విజయ సరిపోతుందనిపించింది. విజయ: మహా ఫోన్ చేసి, క్యారెక్టర్ చేయమని అడిగితే అర్థం కాలేదు. ‘నాకైతే చేయడానికి ఇష్టమే. నీకు నమ్మకం ఉందా’ అంటే, ఉందన్నాడు. చేసేశాను. వెంకటేశ్: స్కైప్ కాల్స్‌లో ఓ నెల రోజులు వర్క్‌షాప్ చేయాలనుకున్నాం. ప్రవీణ ఆ యాసను 15 రోజుల్లోనే పట్టేసింది. మరి యాక్టింగ్‌లో కంటిన్యూ అవుతారా? విజయ: అవ్వాలి. ఒకవేళ మహా మళ్లీ సినిమా తీస్తా అంటే తప్పకుండా. తను చాలా గ్రేట్ డైరెక్టర్. యాక్టింగ్ ఈజ్ పర్సనల్ అని ఫీల్ అవుతాను. మనం.. మనం అనే విషయం మరచిపోయి వేరే వాళ్లలా ట్రాన్ ఫార్మ్ అవ్వగలగాలి. సినిమాలైతే కచ్చితంగా నిర్మిస్తా. ఎందుకంటే అది చేయకపోతే చచ్చిపోతా కాబట్టి. సినిమా పరంగా ప్రస్తుతానికి బాగున్నా. అమెరికాలో నా ఆఫీస్‌లో మాత్రం హ్యాపీగా లేరు (నవ్వుతూ). ప్రాజెక్ట్ కోసం అటూ ఇటూ తిరుగుతున్నాను కదా. అమెరికాలో ఫ్రెండ్స్‌కి ఈ సినిమా చూపించారా? విజయ: చూపించాను. సబ్ టైటిల్స్‌తో చూస్తూ ఏదైనా ఫీల్ మిస్ అవుతారేమో అనుకున్నాను కానీ బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కడ నవ్వాలో అక్కడే నవ్వారు. ఎక్కడ ఏడవాలో అక్కడే కనెక్ట్ అయ్యారు. వాళ్లందరికీ రాజు అనే క్యారెక్టర్ తెగ నచ్చాడు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి అయితే రాజు కలలోకి వచ్చాడట. ఎంత గొప్ప క్యారెక్టర్ అని అభినందించింది. దర్శకుడికి సోషల్ రెస్పాన్సిబులిటీ ఉండాలా? వెంకటేశ్: దర్శకుడికి అని కాదు. ఆర్టిస్ట్‌కి. అది చిత్రకారుడికి కావచ్చు. రచయితకు, నటుడికి ఎవ్వరికైనా ఉండాలి. ఎందుకంటే ఆర్టిస్ట్‌ల పని వాళ్ల కాలంలో జరిగిన సంఘటనలు, మన కల్చర్ భవిష్యత్ తరాల వారికి అందజేయడం. మన పూర్వీకులు రాయబట్టే మనం చరిత్ర చదువుకుంటున్నాం. మన సినిమాల గురించి మాట్లాడుకుంటే అప్పట్లో ‘ఆకలి రాజ్యం’ సినిమా తీసుకుందాం. అందులోని నిరుద్యోగ సమస్య అయినా, కమ్యూనిజం భావాలైనా చూస్తే రక్తం ఉడుకుతుంది. ఇప్పుడు తీసే సినిమాలు నెక్ట్స్ జనరేషన్‌కి ఎంతో కొంత నేర్పించాలని నమ్ముతాను. విజయ: మాస్ సినిమా, కమర్షియల్ సినిమా, ఆర్ట్ సినిమా అని కాదు. గుడ్ సినిమా. ‘గుడ్ ఫిల్మ్ ఈజ్ ఏ గుడ్ ఫిల్మ్’. జానర్ ఏదైనా సరే. నేను ఐటమ్ సాంగ్స్ ఎంజాయ్ చేస్తాను. మన సినిమాల్లో చాలా మంది క్యారెక్టర్స్‌కి ఏ పనీ ఉండదు. అలా ఫ్రేమ్ నిండుగా ఉండటం కోసం ఉంటారు. అది మారాలి. ప్రతి క్యారెక్టరైజేషన్ కీ సినిమాలో పని ఉండాలి. ఈ సినిమా మంచి రిజల్ట్ ఇవ్వకపోయుంటే? వెంకటేశ్: సినిమా స్టార్ట్ చేసినప్పుడే చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాం అని మాకు తెలుసు. ‘నేనింతే’ సినిమా క్లైమాక్స్‌లో రవితేజ ఓ మాట చెబుతాడు. ‘సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా చేస్తాం. హిట్ అయినా ఇంకోటి చేస్తాం. హిట్ అయిపోయింది అని మూట కట్టుకొని వెళ్ళిపోం కదా’. రిజల్ట్‌తో సంబంధం లేకుండా మా కథలు చెబుతూనే ఉంటాం. విజయ: ఏమో.. నా కేస్‌లో వేరేలా ఉండేదేమో. ఈ సినిమా చేయాలి అనుకున్నప్పుడే కొన్ని హద్దులు పెట్టుకొని వచ్చాను. డాక్టర్ని కదా. చిన్న ఆల్గోరిథమ్ గీసుకొని వచ్చాను. సినిమా నాకు నచ్చినట్టు రావాలనుకున్నాను. అలా కాకుండా వేరేలా జరిగి ఉంటే ఆల్రెడీ నా జాబ్, దాని టెన్షన్స్ ఉండనే ఉన్నాయి. మళ్లీ తలనొప్పి అవసరమా? అనుకునేదాన్నేమో. కానీ ఒకసారి సినిమా సెట్ ఎక్స్పీరియన్స్ చేశాక ఫ్లాప్ అయినా సినిమాలు తీస్తూనే ఉండాలని ఫిక్స్ అయిపోయాను. ఫిల్మ్ మేకింగ్ అనేది మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తుంది. విజయగారు అంత నమ్మారని ప్రెషర్ ఏమైనా? వెంకటేశ్: తను ఈ సినిమా ఓకే అనేప్పుడు రిటర్న్ ఏం ఆశించలేదు. వండర్ఫుల్ సినిమా కావాలనుకుంది. మంచి సినిమా తీయాలంటే మనం సక్రమంగా పని చేస్తే ఆటోమేటిక్‌గా సినిమా రిలీజ్ తర్వాత దాని పని అది సక్రమంగా చేసుకుంటుంది. (నవ్వుతూ) విజయ: సినిమా నిర్మాణం అంటేనే గ్యాంబ్లింగ్. ఎక్కడ వస్తుందో.. ఎక్కడ పోతుందో తెలియదు. అందుకే నేను ఎవరి డబ్బుతోనూ రిస్క్ చేయదలచుకోలేదు. నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో సినిమా తీయాలనుకున్నాను. ఫస్ట్ అటెమ్ట్‌లో పోయినా ఓకే అనుకునే వచ్చాను. ఓ భారతీయురాలిగా అమెరికాలో మీ ఎక్స్పీరియన్స్? విజయ: మా ఏరియాలో, మా స్కూల్లో అన్ని చోట్లా నేనొక్కదాన్నే ఇండియన్ రూట్స్ ఉన్న అమ్మాయిని. మా అమ్మ రెండు జడలు వేసి పంపించేది. స్కూల్లో ఏడిపించేవారు. జడలు లాగేవాళ్లు. ఎగతాళి చేసేవాళ్లు. నేను చాలా సీరియస్‌గా గొడవలు పడిన సందర్భాలున్నాయి. భారతీయులంటే చిన్న చూపు. అమెరికన్స్ కు ఇండియన్ సినిమాలంటే ఎలాంటి అభిప్రాయం ఉంది? విజయ: అమెరికన్స్‌కు ఇండియన్ సినిమాలంటే హిందీ సినిమాలే. ఆ పాటలు, ఆ డ్రీమ్ సీక్వెన్స్ చూసి వెటకారం చేస్తారు. ఇండియన్ యాక్టర్స్ పాపులర్ అవుతున్నారు. కానీ మన తెలుగు సినిమాకు ఆ స్థాయి గుర్తింపు రావడం లేదని ఎప్పుడూ ఓ చిన్న బాధ అయితే ఉండేది. నాకు ఇష్టం అయినదాన్ని హేళన చేయడం తట్టుకోలేకపోయా. అయితే కొన్ని సంవత్సరాలు మన తెలుగు సినిమాలు ఫ్లాట్ అయ్యాయని ఒప్పుకుంటాను. అప్పుడు కోపం వచ్చింది. కొన్నేళ్లు తెలుగు సినిమాలు చూడటం మానేశాను. నా జాబ్‌తో సగం టైమ్ సరిపోయేది. అంత బిజీలో రెండు గంటలు కేటాయించాలంటే న్యాయం అనిపించేది కాదు. అప్పట్లో కచ్చితంగా ఓ రేప్ సీన్ ఉండాలని ఫిక్స్ అయ్యేవారు. అవసరం లేకపోయినా అవి వచ్చేవి. వయలెన్స్ విపరీతంగా ఉండేది. సినిమాల్లో అంత వయలెన్స్ చూసి మన నార్మల్ లైఫ్‌లో కూడా అది కామన్ అనుకుంటున్నాం. వెంకటేశ్: ఈ విషయంలో నేను నీతో ఏకీభవించడం లేదు. హింస అనేది కొత్తగా మనం పుట్టించలేదు. సొసైటీలో ఉన్నదాన్ని తీసుకున్నాం. కానీ మనం చేసిన పొరపాటేంటే దాన్ని హైలైట్ చేయడం. మనం ఏదైనా ఎక్కువే చేస్తాం. ఈ జర్నీలో మీరు పర్సనల్‌గా ఫీల్ అయిన బెస్ట్ మూమెంట్స్ విజయ: నాకు ఈ జర్నీలో రెండు పీక్ మూమెంట్స్ ఉన్నాయి. ఒకటి మహా నాకీ ఐడియాని చూపించినప్పుడు. ఆ తర్వాత డిసెంబర్ 26. సురేశ్‌బాబుగారు ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు. కెరీర్ గోల్స్ ఏంటీ? వెంకటేశ్: గర్వం, పొగరు అని అనుకోండి కానీ నా వరకూ నేను అనుకునేది ఏంటంటే తెలుగు సినిమా అనగానే మనకు కొంతమంది గుర్తొస్తారు కదా. ఎల్వీ ప్రసాద్, కేవీ రెడ్డి, ఎన్టీఆర్, నాగేశ్వరరావు.. ఇలా నా పేరు కూడా ఆ వంద మందిలో ఉండాలని ఆకాంక్ష. ఈ రోజుల్లో ఐడెంటిఫికేషన్ రావడం చాలా కష్టం. ప్రతి వారం ఓ పది సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో మనకంటూ ఓ ప్రత్యేక స్థానం తెచ్చుకోవడం కష్టం. నా వల్ల ఇండస్ట్రీ మారిపోవాలనడంలేదు. కొత్త జనరేషన్, న్యూ వేవ్ సినిమాలు కూడా ఇంకా రావాలనుకుంటున్నాను. ఫైనల్లీ నెక్ట్స్ ప్లాన్? విజయ: సినిమాలు కంటిన్యూ చేస్తాను. నిర్మించడమే కాదు.. మంచి క్యారెక్టర్ అనిపిస్తే నటిస్తాను కూడా. వెంకటేశ్ ఓ మంచి ఐడియా చెప్పాడు. దాని మీద వర్కవుట్ చేయాలనుకుంటున్నాను. వెంకటేశ్: ఆరు నెలలు కోర్స్ చేసే ప్లాన్ ఉంది. మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. ఇంకా ఏమీ సైన్ చేయలేదు. ‘కంచరపాలెం’ వైపు లైఫ్ టర్న్ అయింది. నెక్ట్స్ టర్న్ గురించి మళ్లీ చెబుతాను. – డి.జి.భవాని -
డైరెక్టర్ అవుతానంటే ఎవరూ నమ్మలేదు
‘‘నేను డైరెక్టర్ అవుతానంటే నా చుట్టూ ఉన్నవాళ్లు నమ్మలేదు. కానీ నా గోల్ పట్ల నాకు క్లారిటీ ఉంది. తెలుగు పరిశ్రమకే స్టిక్ అవ్వాలనుకోవడం లేదు. ఇంటర్నేషనల్ ఫిల్మ్‌మేకర్ అవ్వాలనుకుంటున్నాను. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా నా లైఫ్‌లో ‘కేరాఫ్ కంచరపాలెం’ మార్పు తీసుకువచ్చింది’’ అన్నారు వెంకటేశ్ మహా. నూతన నటీనటులతో ఆయన దర్శకత్వంలో రానా దగ్గుబాటి సమర్పణలో పరుచూరి విజయ ప్రవీణ నిర్మించిన చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. ఈ రోజు సినిమా విడుదలవుతున్న సందర్భంగా వెంకటేశ్ మహా చెప్పిన విశేషాలు. ► మాది విజయవాడ. అక్కడి గాంధీనగర్ వీధుల్లో పెరిగాను. కొంత కాలం మిర్యాలగూడలో కూడా ఉన్నా. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాను. సినిమాలపై ఇష్టంతో సెట్బాయ్గా స్టార్ట్ అయ్యా. టెలివిజన్ షోస్‌కి వర్క్ చేశాను. ప్రాక్టీస్ కోసం షార్ట్ ఫిల్మ్స్ చేశా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా. యాక్టర్‌గానూ ట్రై చేశా. రచయితగా నా ఫ్రెండ్‌తో కలసి ఓ సినిమాకు వర్క్ చేశాను. కానీ అది సెట్స్‌పైకి వెళ్లలేదు. ఆ తర్వాత ఓ కథ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగాను. వర్కౌట్ కాలేదు. ఓ ఆఫీసులో ‘నిన్ను ఎవరు పంపించారు’ అని అడిగారు. అప్పటికే బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్న నేను ‘జాగ్రత్తగా వెళ్లి రా అని మా అమ్మ పంపించింది సార్’ అని చెప్పి వచ్చాను. కంచరపాలెంలో నేను 8 నెలలు ఉన్న రోజులు గుర్తుకువచ్చాయి. అక్కడికి వెళ్లి రిలాక్స్ అవ్వాలని నా ఫ్రెండ్‌కి కాల్ చేశాను. అక్కడికి వెళ్లాక ఇక్కడే ఎందుకు సినిమా తీయకూడదనిపించింది. ఆ ఆలోచన మరుసటి రోజుకు బలపడింది. అలా ‘కేరాఫ్ కంచరపాలెం’ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. ► నటీనటులుగా కంచెరపాలెంలో ఉండేవాళ్లే బాగుంటుందనుకున్నాను. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ముందుకు వెళ్దామనుకున్నా. ఈ సినిమా ప్లాట్‌ఫామ్, ఐడియాను నా బ్లాగ్‌లో పోస్ట్ చేశాను. ఒకరి ద్వారా ఆ పోస్ట్‌ను యూఎస్‌లో కార్డియాలజిస్ట్‌గా ఉన్న ప్రవీణగారు చూసి నన్ను కాంటాక్ట్ చేశారు. ► సహజమైన సినిమా తీయాలనుకున్నాను. నా ఫ్రెండ్ సాయంతో కంచరపాలెంలోని కొందరికి తెలియకుండానే వాళ్ల ఫొటోలు తీశాను. ఆ తర్వాత వారికి చూపించి నటించడానికి ఒప్పించాను. ఇందులో దాదాపు 86 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరికీ ముందు నేను నటించి, ఆ తర్వాత వాళ్లను యాక్ట్ చేయమని చెప్పాను. ప్రవీణ మంచి పాత్ర చేశారు. ఇందులో నటించినవాళ్లు సినిమా చూసి ఎగై్జట్ అయ్యారు. ఓవర్‌నైట్ స్టార్స్ అయ్యామన్న ఫీలింగ్‌లో ఉన్నారు (నవ్వుతూ). ► ప్రివ్యూస్ వేశాం. మంచి స్పందన వచ్చింది. ప్రవీణగారు సురేశ్‌బాబుగారిని కలుద్దా మన్నారు. ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట సిద్ధారెడ్డిగారి ద్వారా కలిశాం. మా కాన్ఫిడెన్స్, ఎగై్జట్‌మెంట్ చూసి సురేశ్‌బాబుగారు రిలీజ్‌కు ఒప్పుకున్నారు. ► ప్రస్తుతం మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ సైన్ చేయలేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి యూఎస్‌లో ఓ క్రాష్ కోర్స్ చేద్దామనుకుంటున్నాను. సినీ ప్రముఖులు మా సినిమాను మెచ్చుకోవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. -
‘C/o కంచరపాలెం’ మూవీ రివ్యూ
టైటిల్ : C/o కంచరపాలెం జానర్ : డ్రామా తారాగణం : సుబ్బారావు, రాధ బెస్సీ, కేశవ కర్రీ, నిత్య శ్రీ, కార్తీక్ రత్నం, విజయ ప్రవీణ, మోహన్ భగత్, ప్రణీత పట్నాయక్ సంగీతం : స్వీకర్ అగస్తీ దర్శకత్వం : వెంకటేష్ మహా నిర్మాత : విజయ ప్రవీణ పరుచూరి సమర్పణ : రానా దగ్గుబాటి కొంత కాలంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. రొటీన్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి రియలిస్టిక్‌గా తెరకెక్కిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అనవసరమైన బిల్డప్‌లు, హీరోయిజం, యాక్షన్ లాంటివి లేకుండా సమాజంలో కనిపించే వ్యక్తిత్వాలనే కథగా తెరకెక్కించే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అదే బాటలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో రియలిస్టిక్ మూవీ ‘C/o కంచరపాలెం’. వెంకటేష్ మహా దర్శకుడిగా విజయ ప్రవీణా పరుచూరి నిర్మాతగా తెరకెక్కించిన సినిమా C/o కంచెరపాలెం. కంచెరపాలెం అనే గ్రామంలో అక్కడి ప్రజలతోనే తెరకెక్కించిన ఈ సినిమాను యంగ్ హీరో రానా దగ్గుబాటి తన సమర్పణలో రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో C/o కంచరపాలెం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? కథ : ఇది వయసు పరంగా నాలుగు కేటగిరిలో ఉన్న నాలుగు జంటల ప్రేమకథ. సుందరం (కేశవ కర్రి) స్కూల్ పిల్లాడు. తన క్లాస్‌మెట్ సునీత (నిత్య శ్రీ) అంటే సుందరానికి చాలా ఇష్టం. స్నేహితుడి సాయంతో ఎలాగైన సునీతతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటాడు. జోసెఫ్ (కార్తీక్ రత్నం) టీనేజ్ కుర్రాడు. ఓ జిమ్‌లో పనిచేస్తూ గొడవలు, సెటిల్మెంట్స్ చేసే జోసెఫ్ ఓ గొడవ వల్ల పరిచయం అయిన భువనేశ్వరి (ప్రణీతా పట్నాయక్) అనే బ్రాహ్మణుల అమ్మాయిని ప్రేమిస్తాడు. గడ్డం (మోహన్ భగత్) వైన్ షాపులో పనిచేసే కుర్రాడు. తమ షాప్‌లో రోజు మందుకొనే ఓ వేశ్య సలీమా( విజయ ప్రవీణా పరుచూరి)ను కళ్లు చూసి ప్రేమిస్తాడు. రాజు (సుబ్బారావు) ఓ గవర్నమెంట్ ఆఫీసులో అటెండర్. 49 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాకపోవటంతో ఊళ్లో అంతా రాజు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. అదే సమయంలో ఒరిస్సా నుంచి ట్రాన్సఫర్ మీద తమ ఆఫీసుకు వచ్చిన ఆఫీసర్ రాధ( రాధ బెస్సీ) తో ప్రేమలో పడతాడు. భర్త చనిపోయి చాలాకాలంగా ఒంటరిగా ఉంటున్న రాధ, రాజును పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇలా కంచరపాలెంలో మొదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాలలో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి.? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి..? చివరకు వారి కథలు ఎలా ముగిసాయి..? అన్నదే కేరాఫ్ కంచరపాలెం కథ. విశ్లేషణ : ఓ గ్రామంలోని వ్యక్తులు వారి జీవితాలే కథా వస్తువుగా తీసుకున్న దర్శకుడు వెంకటేష్ మహా.. ఎక్కడా సినిమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేయలేదు. సినిమాను పూర్తిగా సహజంగా తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు. ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయో, ఎలా మాట్లాడతాయో అలాగే తెర మీద ఆవిష్కరించాడు. అదే సమయంలో సమాజంలో ఉన్న అంతరాలు, కులమత భేదాలు వాటి పర్యవసానాలను మనసును తాకేలా చూపించాడు. కమర్షియల్ లెక్కల కోసం హాస్య సన్నివేశాలను ఇరికించకుండా.. లీడ్ క్యారెక్టర్స్ ప్రవర్తన నుంచే కామెడీ పండించి ఆకట్టుకున్నాడు. అందుకే సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి కంచరపాలెంలో అక్కడి ప్రజలతో కాసేపు గడిపిన భావన కలుగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు నెమ్మదిగా కథ నడిపించాడు. నాలుగు కథలను ప్యారలల్‌గా నడిపించిన దర్శకుడు క్లైమాక్స్ ట్విస్ట్‌తో ఆడియన్స్‌కు షాక్ ఇచ్చాడు. నిర్మాణ పరంగాను సినిమాకు మంచి మార్కులు పడతాయి. తమకున్న లిమిటేషన్స్ మధ్య అద్భుతమైన అవుట్ పుట్ ఇవ్వటంలో నిర్మాత కృషి ప్రతీఫ్రేమ్‌లో కనిపిస్తుంది. లైవ్ రికార్డింగ్ అయినా ఎక్కడ ఆడియో డిస్ట్రబెన్స్ లేకుండా క్వాలిటీ సౌండ్‌ను అందించారు. సినిమాకు మరో ఎసెట్ వరుణ్, ఆదిత్యల సినిమాటోగ్రఫి. కంచరపాలెం వాతావరణాన్ని వ్యక్తిత్వాలను అందంగా ఫ్రేముల్లో బందించారు. స్వీకర్ అగస్థి సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమా అంతా ఆఫ్‌బీట్ తరహాలో సాగటంతో కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక నటీనటుల విషయానికి వస్తే దాదాపు 52 మంది కొత్త తారలు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. మేకప్, కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ లాంటివి లేకుండా తెర మీద సహజంగా కనిపించారు. అయితే అంతా కొత్త వారు కావటంతో అక్కడక్కడ వారి నటనలో కాస్త నాటకీయత కనిపించినా.. ఒకసారి కథలో లీనమైతే అవేవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. రొటీన్ కమర్షియల్ మూసకు భిన్నంగా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ‘C/o కంచరపాలెం’ సినిమాకు ఇప్పటికే సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
‘పటాస్’ రానా కోసం రెడీ చేసిన కథ.. కానీ!
‘‘ఈ సినిమాను నాకు దర్శకుడు వెంకటేశ్, విజయ ఆరేడు నెలల క్రితం చూపించారు. సినిమా చాలా బాగా నచ్చింది. అయితే ప్రమోట్ చేయడం చాలా కష్టం అనుకున్నాను. ఎందుకంటే మంచి మనలోకి వెళ్లడానికి టైమ్ పడుతుంది కదా. మంచి చెప్పులు వేసుకొనే లోపే చెడు ఊరు చుట్టి వస్తుంది అంటాం కదా.. అలాగ. అప్పట్లో సినిమాలకు మూడు వారాల లైఫ్ ఉండేది. కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. దానికి మౌత్ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ అని నమ్ముతాను’’ అని సురేశ్‌బాబు అన్నారు. వెంకటేశ్ మహా దర్శకత్వంలో నూతన నటీనటులతో విజయా పరుచూరి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది ఈ సందర్భంగా సురేశ్‌బాబు చెప్పిన విశేషాలు... ► స్పాట్బాయిగా ఇక్కడ పని చేసి దర్శకుడుగా మారదాం అని ఒక కథ తయారు చేసుకొని, ఆ కథకి టీజర్ రెడీ చేసుకొని నిర్మాతను వెతికి పట్టుకొని, కంచెరపాలెం అనే ఊరికి వెళ్లిపోయాడు వెంకట్ మహా. అక్కడ నటీనటులతో సినిమా తీశాడు. అది చాలా కష్టం. విజయా పరుచూరి అమెరికాలో డాక్టర్. తెలుగు సినిమాలకు తను చాలా దూరం. సాధారణంగా అందరూ ఫారిన్ సినిమాల గురించే మాట్లాడతారు.. తెలుగు సినిమాల గురించి ఎందుకు మాట్లాడుకోరు? అనే ఉద్దేశంతో తెలుగు సినిమా తీద్దామనుకుంది. కానీ ఇంట్లో డాక్టర్ అవ్వాలన్నారు. డాక్టర్ అయ్యి, దాచుకున్న డబ్బులతో ఈ పెద్ద చిన్న సినిమా తీసింది. ► ఈ సినిమా ప్రీమియర్స్‌కి సెలబ్రిటీలను మేం ‘మీరు తప్పక రావాలి’ అని ఆహ్వానించలేదు. ఫస్ట్ చూసినవాళ్లే మిగతా వాళ్లను తీసుకువచ్చారు. చంద్రశేఖర్ యేలేటి చూసి కీరవాణిని తీసుకువచ్చాడు. కీరవాణి రాజమౌళిని తీసుకొచ్చాడు. వాళ్లు కూడా ప్రీమియర్ చూశాం కదా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పలేదు. సినిమా చుసి తర్వాత మాట్లాడతాం అన్నారు. ఇంటికి వెళ్లిపోయి మరుసటి రోజు పిలిచి సినిమా గురించి వివరంగా మాట్లాడారు. ఈ ప్రీమియర్స్ కాన్సెప్ట్ అంతా మౌత్ పబ్లిసిటీ కోసం. ► ఇది ఫుల్ కమర్షియల్ సినిమా. నాలుగు జంటల లవ్ స్టోరీలు ఈ సినిమా కథ. ఇందులో మ్యూజిక్ బావుంటుంది. మన డైలీ లైఫ్‌లో చూసే తమాషా సంఘటనలుంటాయి. మానవత్వాన్ని తెలియజేస్తుంది. అందుకే ఇలాంటి పెద్ద చిన్న సినిమాలంటే నాకు ఇష్టం. ఇలాంటి సినిమాలను బ్యాక్ చేయడం ముఖ్యం అని ఫీల్ అయ్యాను. ► విశేషం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత దర్శకుడు వెంకటేశ్ మహా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో జాయిన్ అవుతున్నాడు. నేనేదో గొప్ప సినిమా తీశాను అని కూర్చోవడం లేదు. తన క్రాఫ్ట్‌లో ఇంప్రూవ్ అవ్వాలని క్రాఫ్ట్ నేర్చుకోవాలనే తపన. అలాంటి వాళ్లంటే నాకు చాలా ఇష్టం. ► సినిమాలో ఆల్మోస్ట్ 52 మంది కొత్తవాళ్లు నటించారు. సినిమా అయిపోగానే వాళ్ల పనుల్లో వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఓ నలుగురైదుగురు యాక్టింగ్ మీద ఆసక్తితో ఉండి ఉంటారు. ఇందులోని క్యారెక్టర్స్‌ను ఆధారం చేసుకొని వెబ్ సిరీస్ కూడా రూపొందించొచ్చు. రానాకు సినిమా విపరీతంగా నచ్చింది. వాళ్లందర్నీ కలవడానికి కంచరపాలెం కూడా వెళ్లాడు. అలాంటి చిన్న ఫిల్మ్ మేకర్స్ షైన్ అయితేనే ఇండస్ట్రీ బావుంటుంది. చిన్న వాళ్లను తొక్కేస్తున్నారు అని అనడం కరెక్ట్ కాదు. ఆర్ట్‌కి ఎప్పుడూ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అవకాశాలు అందరికీ ఉన్నాయి. ► ఇలాంటి సినిమాలను ఎప్పుడైనా మా సంస్థ ప్రమోట్ చేస్తుంది. ఈ మధ్య యంగ్ ఫిల్మ్ మేకర్స్ కేవలం కమర్షియల్ పం«థాలోనే సినిమాలు చెప్పాలనుకోవడం లేదు. కొత్త కొత్తగా స్టోరీ టెల్లింగ్ చేస్తున్నారు. ► నేను ఇలాంటి కథలు విని రిజెక్ట్ చేసినవి ఏమీ లేవు. ఓ కథ విని వద్దని, ఆ తర్వాత అబ్బా ఈ కథ మిస్ అయ్యానని ఫీలైన సందర్భాలు తక్కువ. అలా అయితే మన జడ్జిమెంట్‌లో తేడా ఉన్నట్టు లెక్క. ‘పటాస్’ కథ నచ్చింది. రానా కోసం రెడీ చేసిన కథ. తను ‘బాహుబలి’తో బిజీగా ఉండటంవల్ల కుదర్లేదు. -
రానా సమర్పించు ‘కేరాఫ్ కంచరపాలెం’
విలక్షణ పాత్రలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరో రానా దగ్గుబాటి. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా విభిన్న పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. అంతేకాదు నిర్మాతగానూ తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. న్యూయార్క్ కు చెందిన పరుచూరి ప్రవీణ నిర్మించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి సమర్పిస్తున్నారు. చాలా ఏళ్లు సినీ రంగంలోకి అడుగుపెట్టాలని ఎదురుచూస్తున్న ప్రవీణ.. అపర్ణ మల్లాది సహాయంతో వెంకట్ మహా దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ షోలో కేరాఫ్ కంచరపాలెం సినిమాను చూసిన నిర్మాణ సురేష్ బాబు, హీరో రానాలు చిత్రంలో భాగస్వాములయ్యేందుకు అంగీకరించారు. కేన్స్‌లో ప్రదర్శించాలన్న ఆశయంతో తెరకెక్కించిన ఈ అచ్చ తెలుగు సినిమా న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు అర్హత సాధించిన తొలి సినిమాగా రికార్డ్ సృష్టించింది. Congratulations to team #COKancharapalem, the first Telugu film to be selected for New York Indian Film Festival @nyindianff ! Proud to be presenting it. pic.twitter.com/jJySRY1kmI — Rana Daggubati (@RanaDaggubati) 2 April 2018 Happy to be presenting the film #COKancharapalem in association with Suresh Productions. Can't wait for you guys to watch this Big Small film of the Year. pic.twitter.com/a7Xv5qtKTP — Rana Daggubati (@RanaDaggubati) 2 April 2018