వారిలో అద్వానీ ఎందుకు కనిపించలేదు?
న్యూఢిల్లీ: అతిపెద్ద జంబో కేబినెట్‌గా అవతరించిన మోదీ కేబినెట్ పునర్యవస్థీకరణ కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధుడు, ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు ఎల్ కే అద్వానీ హాజరుకాలేదు. దీంతో ఆయన ఎందుకు హాజరుకాలేదని చర్చ సర్వత్రా వినిపిస్తోంది. కొత్తగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయినప్పటి నుంచే పార్టీ వ్యవహారాల నుంచి కాస్తంత దూరంగా జరిగినట్లు కనిపించిన ఆయన ఇటీవల అడపాదడపా పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు.
అయితే, మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఆయన హాజరుకాలేదు. అయితే, ఈ కార్యక్రమాని హాజరుకావాల్సిందిగా ప్రధాని కార్యాలయం నుంచి అద్వానీకి ఆహ్వాన లేఖ వెళ్లిందట. కానీ, అద్వానీ సోదరికి ఆరోగ్యం బాగా లేక ఆయన అప్పటికే ముంబయి వెళ్లిపోయారంట. ఈ కారణంతోనే ఆయన కార్యక్రమానికి హాజరుకాలేదని అద్వానీ తరుపు అధికార ప్రతినిధి తెలిపారు.