Vijayanagar
-
సిగ్నల్ కోసమా? పవర్ ప్రాబ్లమా?
సాక్షి, విశాఖపట్నం : 08532 విశాఖ–పలాస రైలు కంటకాపల్లి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకు చినరావుపల్లి దగ్గర నిలిచిపోయింది. ఆ మార్గంలో మొత్తం మూడు లైన్లు ఉండగా.. మధ్యలైన్‌లో ఈ రైలు నిలిపారు. అయితే.. కంటకాపల్లి నుంచి దాని వెనుకే బయలుదేరిన 08504 రైలు అదే మూడో లైన్లోకి వచ్చేసింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. విశాఖ–పలాస రైలును మధ్య లైన్లో ఎందుకు నిలిపారు? ఆలమండ స్టేషన్ నుంచి సిగ్నల్ అందలేదా? లేదా ప్రమాద సమయంలో హైటెన్షన్ వైర్లు తెగిపడి ఉన్నాయా? ప్రమాదం జరగకముందే ఇవి తెగిపడటంవల్ల రైలు నిలిచిపోయిందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. ఒక రైలు ఆగి ఉన్నప్పుడు అదే మార్గంలో మరో రైలు వెళ్లేందుకు అనుమతి ఎలా ఇచ్చారనే కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ లోపంవల్లే వెనుక వస్తున్న రాయగడ రైలు.. మధ్య లైన్లోకి వచ్చినట్లు భావి స్తున్నారు.సిగ్నల్ లేక పలాస రైలును చినరావుపల్లెలో నిలిపినట్లయితే.. ఆ సమాచారాన్ని రాయగడ రైలుకు పంపాలి. అదీ జరగలేదు. పోనీ.. హైటెన్షన్ వైర్లు తెగిపడటంవల్ల నిలిచిపోయినట్లయితే.. ఆ సమాచారం కూడా వెనుక వస్తున్న రైళ్లకు చేర వేయాల్సి ఉంది. ఈ రెండూ జరగకపోవడంవల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా.. మానవ తప్పిదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ రైలువల్లే పెను ప్రమాదం తప్పింది.. సాధారణ రోజుల్లో ఈ 2 రైళ్లు నిరంతరం ప్రయాణికులతో నిండుగా ఉంటాయి. వ్యాపారులు, స్థానికులు, ఏదైనా పని, లేదా వైద్యం.. ఇతర అవసరాల కోసం విశాఖకి ఉదయాన్నే వచ్చి.. పనులన్నీ చూసుకుని సాయంత్రానికి తిరుగు ప్రయాణానికి ఈ రెండు రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. కానీ, ఆదివారం మాత్రం.. ఈ రైళ్లలో అంతగా జనం ఉండరు. దీనికి కారణం.. ఈ రైళ్లు బయలుదేరిన కొద్దిసేపటికే విశాఖపట్నం–విజయనగరం పాసింజర్ మెము రైలు (07468) ఉంటుంది. విజయనగరం వెళ్లే వాళ్లంతా శని, ఆదివారాల్లో ఈ రైలు కోసం ఎక్కువగా ఎదురుచూస్తుంటారు. ఈ రైలు లేకపోతే.. ఇందులో వెళ్లే ప్రయాణికులంతా ఈ 2 రైళ్లనే ఆశ్రయించేవాళ్లు. అప్పుడు ప్రమాద తీవ్రత మరింత పెరిగి ఉండేది. -
కొత్త కోర్టులతో సత్వర న్యాయం అందాలి
విజయనగరం లీగల్: విజయనగరం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన న్యాయస్థానాల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు అభిలషించారు. ఈ దిశగా న్యాయాధికారులు, న్యాయవాదులు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. విజయనగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో కొత్తగా మంజూరైన అదనపు సీనియర్ సివిల్ కోర్టుని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ దుప్పల వెంకటరమణ ప్రారంభించారు. న్యాయసేవా సదన్‌లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని జస్టిస్ ఏవీ శేషసాయి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువ న్యాయవాదులకు తగిన శిక్షణ ఇచ్చి మెరికల్లాంటి న్యాయవాదులను అందించాలని సీనియర్ న్యాయవాదులకు సూచించారు. న్యాయవాదులు, న్యాయాధికారులు పరస్పరం గౌరవించుకోవడం ద్వారా సమాజానికి మేలు చేయగలమన్నారు. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ జిల్లా కోర్టు భవన సముదాయాలకు రూ.99 కోట్లతో మంజూరైన కొత్త భవనాలను నాణ్యతగా నిరి్మంచేలా బార్ కౌన్సిల్, యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణచక్రవర్తి, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు తదితరులు పాల్గొన్నారు. -
కార్డు కష్టాలు తీరిన వేళ...
‘విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని ఎస్బీఐ కాలనీకి చెందిన గొర్లె శ్రీదేవి ఈ నెల 10న రైస్ కార్డు కోసం స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసింది. వార్డు వలంటీర్, గ్రామ రెవెన్యూ అధికారి దరఖాస్తును పరిశీలించి.. ప్రజాసాధికార సర్వే వివరాలతో సరిచూశారు. అర్హురాలిగా గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. అంతే... ఆమె పేరుతో ఈ నెల 18న పౌర సరఫరాలశాఖ కమిషనర్ రైస్ కార్డును మంజూరు చేశారు. ప్రింట్ కాపీని సచివాలయ సిబ్బంది అందజేశారు. వచ్చేనెల నుంచి ఆమెకు రేషన్ సరుకులు అందనున్నాయి’. విజయనగరం గంటస్తంభం: రైస్ కార్డు... పేదవారి బతుకుకు ఆధారపత్రం. అందుకే కార్డు పొందేందుకు ఆరాట పడతారు. చేతికందాక సంతోషపడతారు. గతంలో ఏళ్ల తరబడి తిరిగినా అందని కార్డు... ఇప్పుడు దరఖాస్తు చేసిన పది రోజుల్లోనే చేతికందుతుండడంతో సంబరపడుతున్నారు. కార్డును పదేపదేసార్లు చూస్తూ మురిసిపోతున్నారు. సచివాలయ వ్యవస్థతో చక్కని పాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డిని మనసారా అభినందిస్తున్నారు. ప్రక్రియ అంతా పదిరోజులే.. సచివాలయాలు రావడం, సిబ్బందికి అధికారాలు ఇవ్వడంతో రైస్ కార్డులకు సంబంధించిన పక్రియ సులభతరమైంది. పదిరోజుల్లోనే పరిశీలన పూర్తవుతోంది. కుటుంబ యజమాని దరఖాస్తు చేసుకున్న రోజే వీఆర్వో లాగిన్లోకి వెళ్తుంది. వీఆర్వో ఆ వివరాలు వలంటీర్‌కు ఇస్తే వారు వెంటనే ఈకేవైసీ చేసి తిరిగి వీఆర్వోకు అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఆ డేటా సిక్స్‌స్టెప్ వాల్యూడేషన్కు వెళ్తుంది. ప్రజాసాధికార సర్వే, ఇతర డేటాతో దరఖాస్తుదారుని కుటుంబ డేటాను పరిశీలించి అర్హత ఉంటే రైస్‌కార్డు మంజూరు చేసి డిజిటల్ సంతకం కోసం తహసీల్దార్‌కు వెళ్తుంది. అనంతరం ఆ డేటా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు చేరుతుంది. ఆయన రేషన్‌కార్డు పీడీఎఫ్ ఫైల్లో డీఎస్వోకు పంపిస్తారు. వెంటనే డీఎస్వో కార్డు ముద్రించి సీఎస్‌డీటీ, వీఆర్వో ద్వారా సచివాలయానికి పంపిస్తే వలంటీరు నేరుగా లబ్ధిదారుకు అందజేస్తారు. ఈ పక్రియ మొత్తం పదిరోజుల్లో పూర్తి అవుతుండడం.. ఎవరినీ ప్రాథేయపడకుండా చేతికి నేరుగా కార్డు అందుతుండడంతో లబి్ధదారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇప్పటికే వేలాది కార్డులు మంజూరు జిల్లాలో జూన్ నెల ఆరంభం నుంచి సచివాలయాల నుంచి రైస్‌కార్డుల జారీ సాగుతోంది. కార్డుల కోసం జిల్లాలోని సుమారు 13,500 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో ఇప్పటికే అన్ని రకాల పరిశీలన, విచారణ పూర్తిచేసి 7,150 దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించి పౌరసరఫరాలశాఖ కమిషనర్ కార్డులు మంజూరు చేశారు. కార్డుల డేటా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి లాగిన్లోకి వచ్చింది. ఇందులో 4,100 కార్డులను డీఎస్వో విశాఖపట్నంలో ముద్రించి సంబంధిత సచివాలయాలకు పంపించారు. వీటిని వార్డు, గ్రామ వలంటీర్లు ద్వారా పంపిణీ చేస్తున్నారు. మిగతా కార్డుల ముద్రణ జరుగుతోంది. నిరంతర పక్రియ అర్హులకు పది రోజుల్లోనే రైస్‌కార్డు జారీ అవుతుంది. ఇప్పటికే కొందరికి కార్డులు పంపిణీ చేశాం. కొన్ని కార్డులు ముద్రణలో ఉన్నాయి. ఇది నిరంత పక్రియ. ఎవరైనా కార్డులు లేనివారు ఇకపై సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. గతంలో వలే వ్యయప్రయాసలకు గురికావాల్సిన అవసరం లేదు. – ఎ.పాపారావు, డీఎస్వో, విజయనగరం -
చెదిరిన వ్యాపారాలు.. ప్రతీకారమా..?
-
విశాఖ ఫస్ట్ చాయిస్ లేదంటే విజయనగరమే సేఫ్
విజయనగరం కంటోన్మెంట్ : సార్! మా పిల్లలు వైజాగ్‌లో చదువుతున్నారు. మా బంధువులంతా విశాఖవాసులే! నాకు అక్కడికి బదిలీ అయ్యేలా ఓ మాట చెప్పండి!!....ఉన్నతాధికారికి ఓ అధికారి వేడుకోలు. లేదయ్యా! నీకు అక్కడ ప్లేస్ లేదు. అక్కడి పోస్టుకు ఆల్రెడీ ఒకాయన ఎంపీగారితో చెప్పిం చారు. నర్సీపట్నం ఖాళీగా ఉంది, వెళ్లిపోతావా?... ఉన్నతాధికారి సమాధానం అమ్మో వద్దు సార్! అయితే వైజాగ్ ఇవ్వండి! లేదంటే ఇక్కడే ఉండిపోతా! అంటూ అధికారి రిక్వస్ట్... ఇప్పుడు జిల్లాలో ఏ కార్యాలయానికి వెళ్లినా ఇవే డైలాగులు విని పిస్తున్నాయి. బదిలీలకు ప్రభుత్వం ఇచ్చిన గడువు దగ్గర పడుతుండడంతో ఎవరికి వారు తమకు కావలసిన స్థానాలను వెతుక్కుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి విశాఖ సిటీ మీదే ఉంది. పిల్లలు చదువుకుం టున్నారని కొందరు, బంధువులంతా అక్కడే ఉన్నారని మరికొందరు, సొంత ఇల్లు ఉంది అక్కడికి పంపండని ఇంకొందరు ఉన్నతాధికారులను వేడుకొంటున్నారు. వీలైతే రాజకీయ నేతలతో సిఫారసులు చేయించుకుంటున్నారు. విశాఖే ఎందుకు..? ఇంతవరకూ జిల్లా ఉన్నతాధికారులే విశాఖను కోరుకుంటున్నారని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు కింద క్యాడర్ అధికారులు కూడా విశాఖ వెళ్లేందుకు యత్నిస్తున్నారు. అక్కడ ఉన్నత విద్య, వైద్య సదుపాయాలు, రవాణా సదుపాయాలు అధికంగా ఉండడంతో విశాఖ సిటీపై అందరూ మోజు చూపుతున్నారు. విశాఖకు వెళ్లే ఛాన్స్ లేకపోతే విజయనగరమే సేఫ్ అని భావిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి విశాఖపట్నంకేవలం 50కిలోమీటర్ల దూరంలో ఉండడంతో షటిల్ సర్వీస్ చేసేందుకు అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఉన్నతాధికారుల నుం చి కిందిస్థాయి ఉద్యోగుల వరకూ ఈ రెండింటిలో ఏదో ఒక దానికిలో ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసి దాదాపు నెల రోజు లవుతోంది. ఇంకా బదిలీలకు 12రోజులే గడువుండడంతో ఇటు జిల్లా యం త్రాంగం కసరత్తు ముమ్మరం చే సింది. ఇప్పటికే మూడేళ్ల పాటు పనిచేసిన వారి జా బితా, సక్రమంగా పనిచేయని వారి జాబితాలు వేర్వేరుగా సిద్ధం చేసినట్టు తెలిసిం ది. ఇటీవలవరకూ బదిలీలపై పైరవీలు, ప్రచారాలు జోరుగా సాగినా ప్రస్తుతం ఎవరూ బయటపడడంలేదు. జోరుగా సాగుతున్న ఆధార్ అనుసంధాన ప్రక్రియలో తలమునకలై ఉండడం ఒక కారణం కాగా, మరో పక్క అమ్మవారి పండగ దగ్గరపడుతుండడంతో ఆ ఏర్పాట్లపై సమీక్షలు, సమావేశాలూ జరుగుతుండడంతో బదిలీలపై లోలోపల ప్రయత్నాలు సాగుతున్నాయి. జిల్లాలోని కొందరు అధికారులకు బదిలీలు తప్పవన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏజేసీ నాగేశ్వరరావు, డీఆర్వో హేమసుందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హెచ్‌వి ప్రసాదరావుతో పాటు పలువురు జిల్లా అధికారులకు బదిలీలు జరుగుతాయని భావిస్తున్నారు. మరికొందరు వారే స్వయంగా బదిలీలకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. పైరవీలే దిక్కు... అయితే జిల్లా స్థాయి అధికారులకు బదిలీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ లేకపోవడంతో పైరవీలే దిక్కు అన్నట్టు ప్రచారం సాగుతోంది. జిల్లా అధికారులకు కూడా కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరుతూ వినతిపత్రాలు అందించామనీ, ముఖ్యమంత్రితో ఈ విషయమై మాట్లాడామనీ కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. అయితే ఉన్నతాధికారులకు కౌన్సెలింగ్ ప్రక్రియ అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ఉండేందుకు యత్నాలు కోరుకున్న చోటు దొరకనప్పుడు చాలా దూరం వెళ్లి ప్రయాసకు గురయ్యే బదులు అధికారులు, ప్రజా ప్రతినిధులు పరిచయమున్న ఈ జిల్లాలో ఉండేలా చాలా మం ది యత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు పైరవీలు సాగిస్తున్నారు. ఇప్పటికే పలువురు జిల్లా అధికారులు సెలవు పెట్టి మరీ హైదరాబాద్ వెళ్లినట్టు భోగట్టా! వారిలో కొంత మంది తిరిగి వచ్చి విధుల్లో చేరిపోయారు కూడా! ఈ విషయమై వారి వద్ద ప్రస్తావిస్తే నవ్వే సమాధానంగా వస్తోంది.