Vimal Kumar
-
మా నాన్న నా బెస్ట్ హ్యూమన్: శ్రుతీహాసన్
‘మా నాన్న నా బెస్ట్ హ్యూమన్’ అన్నారు శ్రుతీహాసన్. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా తండ్రి కమల్‌హాసన్ గురించి శ్రుతి చెప్పిన విశేషాలు ఈ విధంగా... ► మా చైల్డ్‌హుల్డ్ చాలా కంఫర్టబుల్. నాన్నగారు నన్ను, చెల్లి (అక్షరా హాసన్)ని చెన్నైలో మంచి ప్రైవేట్ స్కూల్లో చదివించారు. ఆ తర్వాత అమెరికాలో బెస్ట్ కాలేజీలో చేర్చారు. మంచి ఫుడ్, మంచి బట్టలు, ఖరీదు గల కార్లు, మంచి ఇల్లు... ది బెస్ట్ ఇచ్చారు. 21ఏళ్లకే నేను హీరోయిన్ అయి, సంపాదించడం మొదలుపెట్టాను. నిజానికి నాన్న చాలా స్వేచ్ఛ ఇస్తారు. ఆయనతో ఏ విషయాన్నయినా చెప్పుకునేంత స్వేచ్ఛ మాకుంది. తండ్రి మీద ప్రేమతో పాటు చాలా గౌరవం కూడా ఉంటుంది కాబట్టి... ఆ గౌరవంతో మాకు మేముగా కొన్ని హద్దులు పెట్టుకుంటాం. మన నాన్న మనకు బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు ఆ కూతురికి అంతకన్నా కావాల్సినది ఏముంటుంది? ఆయన కేవలం తండ్రి మాత్రమే కాదు.. నా ఫేవరెట్ హ్యూమన్ కూడా. ► ఎవరి దగ్గరైతే జీవితం గురించి చాలా విషయాలు నేర్చుకుంటామో, ఎవరైతే మనల్ని బాగా నవ్విస్తారో ఆ వ్యక్తే మన తండ్రి అయితే ఇక అదే పెద్ద ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదం దక్కి నందుకు నాకు ఆనందంగా ఉంది. ఎప్పటికీ నాకు ‘డియరస్ట్ డాడ్’గా ఉంటున్నందుకు మా నాన్నకి థ్యాంక్స్. ‘హ్యాపీ ఫాదర్స్ డే’. ► బర్త్ డే, ఫాదర్స్ డే.. అంటూ ముందుగా ప్లాన్ చేసుకుని మా ఇంట్లో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయం. సో.. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా మా నాన్నకు శుభాకాంక్షలు చెబుతాను. మా నాన్నగారు సాధించిన విజయాలకు నేనెప్పటికీ గర్వపడుతుంటాను. ఇప్పటికీ ఆయన అదే ఎనర్జీతో కొనసాగుతున్నారు. ప్రొఫెషన్ అంటే అదే ప్యాషన్. ఒక మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు. మా నాన్న పరంగా నేను గర్వించే విషయాల్లో ఇవి. జీవితం పట్ల ఆయనకు ఉన్న ప్యాషన్ నాకే కాదు... నాలాంటివారికెందరికో స్ఫూర్తి. మా నాన్నలా తమ ఇళ్లలో సమానత్వాన్ని పాటిస్తూ, ప్రోత్సహిస్తున్న గుడ్ ఫాదర్స్ అందరికీ ఈ ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. -
విదేశీ కోచ్‌లకు జవాబుదారీతనం ఉండాలి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ముందు భారత బ్యాడ్మింటన్ డబుల్స్ విదేశీ కోచ్ ఫ్లాండీ లింపెలె (ఇండోనేసియా) తన పదవికి రాజీనామా చేయడం పట్ల భారత మాజీ బ్యాడ్మింటన్ కోచ్ విమల్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారీ మొత్తం చెల్లించి వారిని తీసుకుంటే బాధ్యతారాహిత్యంగా కీలక టోర్నీల ముందు చేతులెత్తేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ కోచ్‌లకు కచ్చితంగా జవాబుదారీతనం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ‘ఫ్లాండీ వెళ్లిన తీరు అనైతికం, దురదృష్టకరం. భారత డబుల్స్ జోడీ దాదాపుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. డబుల్స్‌లో మనకు మంచి ఫలితాలు రానున్న ఈ తరుణంలో ఆయన పదవీ కాలాన్ని ముగించకుండానే అర్ధాంతరంగా వెళ్లిపోవడం నిరాశ కలిగించింది. జనవరిలో నేను ఫ్లాండీతో చాలాసేపు చర్చించాను. ఆయన మన ఆటగాళ్ల గురించి మాట్లాడారు. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి సరిదిద్దుతానన్నారు. కానీ ఇలా ఆల్ ఇంగ్లండ్ టోర్నీకి ముందే మధ్యలోనే వెళ్లిపోయారు. ఇది సరి కాదు’ అని భారత్ బ్యాడ్మింటన్‌కు 2003 నుంచి 2006 వరకు చీఫ్ కోచ్‌గా వ్యవహరించిన విమల్ అసహనం వ్యక్తం చేశారు. గతేడాది మార్చిలో డబుల్స్ కోచ్‌గా నియమితులైన లింపెలె... కుటుంబ కారణాలను చూపిస్తూ పదవీకాలం ముగియకుండానే భారత కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఇలా చేసిన నాలుగో విదేశీ కోచ్ లింపెలె. అతని కన్నా ముందు పీవీ సింధు ప్రపంచ చాంపియన్‌గా మారడంలో కీలక పాత్ర పోషించిన కొరియా కోచ్ కిమ్ జీ హ్యూన్, ఇండోనేసియా కోచ్ ముల్యో హండాయో, మలేసియా కోచ్ టాన్ కిమ్ పలు కారణాలతో ఇలాగే పదవీ కాలం ముగియకుండానే వెళ్లిపోయారు. ప్రతీసారి ఇలాగే జరుగుతుండటంతో విదేశీ కోచ్‌లను నియమించే సమయంలోనే కఠిన నిబంధనలు విధించాలని విమల్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘కోచ్‌లకు జవాబుదారీతనం ఉండేలా నిబంధనలు రూపొందించాలి. వారికి నిర్దేశించిన పనికి, వ్యక్తులకు వారే బాధ్యులుగా ఉండేలా ఫలితాలు రాబట్టేలా కాంట్రాక్టులోనే నియమాలు పొందుపరచాలి. విదేశీ కోచ్‌లకు చాలా పెద్ద మొత్తం ఇస్తున్నాం. ఇలా చెప్పా పెట్టకుండా వెళ్లిపోకూడదు’ అని విమల్ అన్నారు. ఇప్పటివరకు భారత్ నుంచి సింగిల్స్‌లో సింధు, సాయి ప్రణీత్‌తో పాటు డబుల్స్‌లో చిరాగ్ శెట్టి–సాత్విక్ సాయిరాజ్ జోడీ మాత్రమే ప్రస్తుతానికి ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అర్జున జాబితాలో రవీంద్ర జడేజా
గోపీచంద్ అకాడమీ ఆణిముత్యం, తెలుగుతేజం సాయిప్రణీత్‌కు భారత ప్రభుత్వం నుంచి ఘనమైన గుర్తింపు లభించనుంది. యేటికేడు తన రాకెట్ పదును పెంచుకుంటున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్‌కు ‘అర్జున’ అవార్డు ఖాయమైంది. పారాలింపియన్ దీప మాలిక్ రెండో ‘ఖేల్‌రత్న’గా ఎంపిక కాగా... బ్యాడ్మింటన్ గురువు విమల్ కుమార్ ద్రోణాచార్యుడయ్యాడు. క్రికెటర్లు రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ అర్జునలుగా నిలిచారు. అయితే ఎప్పటిలాగే చిన్నపాటి అసంతృప్తుల సమేతంగానే ఈ సారి కూడా క్రీడా పురస్కారాల జాబితా వెలువడింది. న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారానికి మరో తెలుగు షట్లర్ ఎంపికయ్యాడు. భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంటాబయటా నిలకడగా రాణిస్తున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్ ప్రతిభను అవార్డుల కమిటీ గుర్తించింది. 2017లో ప్రణీత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నిలకడైన ప్రదర్శనతో సింగపూర్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్లలో టైటిల్స్ గెలిచాడు. సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. పారాలింపియన్ దీపా మాలిక్‌కు భారత అత్యున్నత క్రీడాపురస్కారం దక్కనుంది. రియో పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన ఆమెను ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు నామినేట్ చేశారు. ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆ అవార్డుకు ఎంపికవగా ఈ ఏడాది సంయుక్తంగా ఇద్దరికి ఆ పురస్కారం లభించనుంది. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్‌లు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని అవార్డుల కమిటీ 19 మందిని ‘అర్జున’కు, ఇద్దరిని ‘ఖేల్‌రత్న’కు ఎంపిక చేసింది. మరో ముగ్గురిని ‘ద్రోణాచార్య’కు నామినేట్ చేసింది. దీపకు మూడో పురస్కారం పారా అథ్లెట్ దీప 2012లో అర్జున అవార్డు అందుకుంది. రెండేళ్ల క్రితం 2017లో భారత పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని దక్కించుకుంది. వరుసగా మూడు పారా ఆసియా గేమ్స్ (2010, 2014, 2018)లో పతకాలు గెలిచిన భారత మహిళా అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. జకార్తా (2018) ఈవెంట్లో ఆమె డిస్కస్ త్రో, జావెలిన్ త్రోలో కాంస్యాలు గెలిచింది. గడిచిన నాలుగేళ్ల ప్రదర్శన ఆధారంగా ఇచ్చే ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఆమె అర్హురాలని కమిటీ నిర్ణయించింది. పూనియాతో పాటు ఆమెను ఎంపిక చేసింది. మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ ఐసీసీ ఈవెంట్లలో పరుగుల ప్రవాహం సృష్టించడంతో ‘అర్జున’కు ఎంపికైంది. మహిళల భారత జట్టు 2017లో వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్, గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. విమల్‌కు ద్రోణాచార్య సైనా నెహ్వాల్ మాజీ కోచ్ విమల్ కుమార్ ‘ద్రోణాచార్య’కు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), మొహిందర్ సింగ్ ధిల్లాన్ (అథ్లెటిక్స్) కోచ్‌లకు ఇచ్చే పురస్కారానికి ఎంపికయ్యారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కోచ్ సంజయ్ భరద్వాజ్, మెర్జ్బన్ పటేల్, రణ్బిర్సింగ్ ఖోఖర్ జీవిత సాఫల్య పురస్కారాలకు నామినేట్ అయ్యారు. కమిటీ నామినీల జాబితాను కేంద్ర క్రీడాశాఖ ఆమోదించిన వెంటనే అధికారికంగా విజేతలను ప్రకటిస్తారు. యేటా హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 23)ని జాతీయ క్రీడాదినోత్సవంగా నిర్వహిస్తారు. ఆ రోజు రాష్ట్రపతి భవన్లో ఘనంగా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఖేల్‌రత్న విజేతకు పతకంతో రూ.7.5 లక్షలు, అర్జున, ద్రోణాచార్యలకు మెమెంటో, రూ. 5 లక్షలు బహుమతిగా అందజేస్తారు. మేరీ తప్పుకుంది... భారత చాంపియన్ బాక్సర్ మేరీకామ్ అవార్డుల కమిటీలో ప్రధాన సభ్యురాలు. కానీ ఆమె శనివారం ‘ద్రోణాచార్య’ ఎంపికలో పాలుపంచుకోలేదు. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ బాక్సర్ వ్యక్తిగత కోచ్ చోటేలాల్ యాదవ్ కూడా ‘ద్రోణాచార్య’ ప్రతిపాదిత జాబితాలో ఉన్నారు. దీంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు దూరంగా ఉండాలని భావించిన ఆమె ఎంపిక ప్రక్రియ నుంచి స్వయంగా తప్పుకుంది. అవార్డు నామినీల జాబితా రాజీవ్ ఖేల్‌రత్న: బజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీపామాలిక్ (పారా అథ్లెట్). అర్జున: సాయిప్రణీత్ (బ్యాడ్మింటన్), రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ (క్రికెట్), తేజిందర్‌పాల్ సింగ్, మొహమ్మద్ అనస్ యాహియా, స్వప్న బర్మన్ (అథ్లెటిక్స్), సోనియా లాతర్ (బాక్సింగ్), చింగ్లేశన సింగ్ (హాకీ), అజయ్ ఠాకూర్ (కబడ్డీ), గౌరవ్‌సింగ్ గిల్ (మోటార్ స్పోర్ట్స్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), సుందర్‌సింగ్ గుర్జార్ (పారా అథ్లెట్), అంజుమ్ మోద్గిల్ (షూటింగ్), హర్మీత్ దేశాయ్ (టేబుల్ టెన్నిస్), పూజ ధండ (రెజ్లింగ్), ఫౌవాద్ మిర్జా (ఈక్వెస్ట్రియన్), గుర్‌ప్రీత్‌సింగ్ సంధు (ఫుట్‌బాల్), సిమ్రన్‌సింగ్ షెర్గిల్ (పోలో). ఆర్డీటీకి పురస్కారం క్రీడలను ప్రోత్సహించడంలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ సంస్థను అవార్డు కమిటీ ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’కు ఎంపిక చేసింది. ఐదు దశాబ్దాల క్రితం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’గా మొదలైన ఈ స్వచ్ఛంద సంస్థ మొదట్లో ప్రజల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం శ్రమించింది. కాలక్రమంలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్‌గా మారాక గత 20 ఏళ్లుగా క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 2002లో స్పోర్ట్స్ సెంటర్‌ను ప్రారంభించింది. 32 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పరచింది. సకల సౌకర్యాలతో క్రీడలకు, క్రీడాకారులకు ఎనలేని సేవలందజేస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన నిరుపేద బాలబాలికల్లో ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తోంది. ‘‘చాలా సంతోషంగా ఉంది. సరైన సమయంలో ఈ అవార్డుకు ఎంపికయ్యాను. రాబోయే టోర్నీల్లో మరింత పట్టుదలతో రాణించేందుకు ఈ అవార్డు ఊతమిస్తుంది’’ – ‘సాక్షి’తో సాయి ప్రణీత్ ‘‘మన దేశంలో తమవాళ్లకే అవార్డులు ఇచ్చుకుంటారు. అంటే కమిటీలో మనవారుంటే గుర్తిస్తారు. అంతే తప్ప ప్రదర్శనతోనూ, ప్రతిభతోనూ కాదు. ఇండియాలో ఇంతే. ఎవరేం చేయలేరు. మన పని మనం చేసుకోవాల్సిందే’’ – ట్విట్టర్లో హెచ్.ఎస్.ప్రణయ్ ఆవేదన ‘‘ఆటగాళ్ల విజయంలో కోచ్‌ల పాత్ర ఎంతో ఉంటుంది. నేను ఆ కోచ్‌ల వల్లే ఎదిగాను. జస్పాల్రాణా షూటింగ్లో ఉత్తమ కోచ్. మను భాకర్, సౌరభ్ చౌదరి, అనీశ్ భన్వాలాలను ప్రపంచశ్రేణి షూటర్లుగా తీర్చిదిద్దారు. అలాంటి రాణాను విస్మరించడం సరికాదు. ఇలాంటి తప్పటడుగులు టోక్యో ఒలింపిక్స్‌లో ప్రభావం చూపిస్తాయి’’ – ఒలింపిక్స్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా దీప, జడేజా, పూనమ్, అజయ్, బర్మన్ -
‘ఆల్ ఇంగ్లండ్’లో సైనాకు సువర్ణావకాశం: మాజీ కోచ్ విమల్
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మానసికంగా బలమైన షట్లర్ అని ఆమె మాజీ కోచ్ విమల్ కుమార్ కితాబిచ్చారు. ఆమె అంతటి మానసిక స్థయిర్యమున్న షట్లర్ భారత్‌లో మరొకరు లేరన్నారు. ప్రపంచ టాప్ స్టార్లు తై జు యింగ్ (చైనీస్ తైపీ), కరోలినా మారిన్ (స్పెయిన్)లు గాయాలతో సతమతమవుతున్నారని ఈ నేపథ్యంలో సైనా మార్చిలో జరిగే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ గెలిచేందుకు ఇదే సువర్ణావకాశమని 2014 నుంచి 2017 వరకు ఆమెకు కోచ్‌గా పని చేసిన విమల్ అన్నారు. ‘తాజా ఇండోనేసియా టైటిల్ విజయం సైనాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తప్పకుండా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిపే ఆమె లక్ష్యం కావాలి. మారిన్ కోలుకునేందుకు కనీసం ఐదారు నెలల సమయం పడుతుంది. తై జు యింగ్ ఇప్పటికే గాయంతో ఆటకు దూరమైంది. దీంతో సైనా, సింధులకు ‘ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్’ గెలిచేందుకు ఇది లక్కీ చాన్స్’ అని విమల్ అన్నారు. ‘వయసు రీత్యా సైనా ఇపుడు స్మార్ట్ శిక్షణపై దృష్టి పెట్టాలి. ఫిట్నెస్ కాపాడుకుంటూనే ఆటలో రాణించాలి’ అని వివరించారు. -
నా టార్గెట్ ఆమే: సైనా
ప్రపంచ బ్యాడ్మింటన్ లో 'చైనా వాల్'ను కూల్చేసిన భారత మహిళా బ్యాడ్మింటన్ స్టార్ సైనా.. తాజాగా తన గురి స్పెయిన్ షట్లర్ మారిన్ కరొలినా పై ఎక్కుపెట్టింది. ఇటీవల రెండు మేజర్ టోర్నీల్లో సైనా టైటిటల్ ఆశలపై నీళ్లు చల్లిన ఈ యువ క్రీడాకారిణిపై ఆధిపత్యం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సైనా తెలిపింది. ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, ప్రపంచ ఛాంపియన్ షిప్ లను అడ్డుకున్న కరోలినాను జపాన్ ఓపెన్ లో ఓడించి తీయని ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. దీనికోసం కోచ్ విమల్ తో కలిసి కఠోర శిక్షణ తీసుకుంటున్నట్లు వివరించింది. ఏడాది కాలంలో దాదాపు అందరు చైనీస్ క్రీడాకారిణులను ఓడించానని.. ఇక కరోలీనాను అడ్డుకోవడమే మిగిలిందని చెప్పింది. టాప్ ర్యాంక్ నిలబెట్టుకోవాలంటే.. అగ్రశ్రేణి క్రీడాకారులను మట్టికరిపించడమే కాదు.. అదే దూకుడును కొనసాగించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. బెంగళూరుకు మకాం మార్చాక తన ఆటతీరు, ఫిట్నెస్ ఎంతో మెరుగయ్యాయని తెలిపింది. -
నా వెంట కోచ్‌గా విమల్‌ను పంపండి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల కోసం తనతో పాటు కోచ్ విమల్ కుమార్‌ను కూడా ఇంచియాన్‌కు పంపించాలని స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)కు విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం కోచ్‌ల జాబితాలో ఆయన పేరును కూడా చేర్చాలని కోరింది. అయితే ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశామని, వాళ్ల నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని ‘బాయ్’ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘మొదట గోపీచంద్, మధుమిత బిస్త్, విజయ్‌దీప్ సింగ్‌లను పంపాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు విమల్ పేరును చేర్చాల్సి వచ్చింది. ఓ క్రీడా విశ్లేషకుడిని తగ్గించి జాబితాను సర్దుబాటు చేయాలి. పక్కపక్క కోర్టుల్లో ఒకేసారి మ్యాచ్‌లు అడుతున్నప్పుడు అదనపు కోచ్ ఉండటం లాభిస్తుంది’ అని సదరు అధికారి పేర్కొన్నారు. కారణాలు ఏమైనా... ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత చీఫ్ కోచ్ గోపీచంద్ నుంచి విడిపోయిన సైనా గత వారం నుంచి విమల్ వద్ద ప్రాక్టీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.