నా టార్గెట్ ఆమే: సైనా | Saina Nehwal aims at Carolina | Sakshi
Sakshi News home page

నా టార్గెట్ ఆమే: సైనా

Published Thu, Sep 3 2015 5:09 PM | Last Updated on Mon, Aug 13 2018 3:45 PM

నా టార్గెట్ ఆమే: సైనా - Sakshi

నా టార్గెట్ ఆమే: సైనా

ప్రపంచ బ్యాడ్మింటన్ లో 'చైనా వాల్'ను కూల్చేసిన భారత మహిళా బ్యాడ్మింటన్ స్టార్ సైనా.. తాజాగా తన గురి స్పెయిన్ షట్లర్ మారిన్ కరొలినా పై ఎక్కుపెట్టింది. ఇటీవల రెండు మేజర్ టోర్నీల్లో సైనా టైటిటల్ ఆశలపై నీళ్లు చల్లిన ఈ యువ క్రీడాకారిణిపై ఆధిపత్యం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సైనా తెలిపింది.

ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, ప్రపంచ ఛాంపియన్ షిప్ లను అడ్డుకున్న కరోలినాను జపాన్ ఓపెన్ లో ఓడించి తీయని ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. దీనికోసం కోచ్ విమల్ తో కలిసి కఠోర శిక్షణ తీసుకుంటున్నట్లు వివరించింది. ఏడాది కాలంలో దాదాపు అందరు చైనీస్ క్రీడాకారిణులను ఓడించానని.. ఇక కరోలీనాను అడ్డుకోవడమే మిగిలిందని చెప్పింది. టాప్ ర్యాంక్ నిలబెట్టుకోవాలంటే.. అగ్రశ్రేణి క్రీడాకారులను మట్టికరిపించడమే కాదు.. అదే దూకుడును కొనసాగించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. బెంగళూరుకు మకాం మార్చాక తన ఆటతీరు, ఫిట్నెస్ ఎంతో మెరుగయ్యాయని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement