Vinay Babu
-
‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’ బాగా ఆడాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎమ్.వినయ్ బాబు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. శ్రీ ధనలక్ష్మి మూవీస్ పతాకంపై బీఉ చందర్ గౌడ్ నిర్మిస్తున్న ఈ ప్రేమ కథా చిత్రంతో రణధీర్, నందిని రెడ్డి హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని తెలంగాణ మంత్రి శీనివాస్ గౌడ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాటలు, టీజర్ చూశాక ఇదొక చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమని అర్థమవుతోంది. అందరూ కొత్తవారు నటించిన ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. సింగిల్ విండో విధానం ద్వారా తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకోవడానికి తక్కువ రేట్లతో పర్మిషన్స్ ఇస్తున్నాం. తెలంగాణలో ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మంచి కల్చర్ ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల చిత్రాలు కూడా ఇక్కడ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకి అన్నివిధాలసహకరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ భాష, యాసలో వచ్చే చిత్రాలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఈ కోవలో సీతారామపురంలో ఒక ప్రేమ జంట చిత్రం కూడా బాగా ఆడాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్షలు`` అన్నారు. దర్శకుడు వినయ్ బాబు మాట్లాడుతూ.. డిఫరెంట్ వేలో ఆలోచించి తీసిన లవ్ స్టోరి ఇది. ప్రేమించడం కాదు...ఆ ప్రేమను నిలబెట్టుకోవాలన్న అంశాన్ని మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం. ఎక్కడా వల్గారిటీకి తావుండదు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుంది’అన్నారు. నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ…‘దర్శకుడు వినయ్ బాబు చెప్పిన కథ నచ్చి మా అబ్బాయి రణధీర్ ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మించాను. ఎక్కడా రాజీ పడకుండా కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టాం. గ్రామీణ వాతావరణంలో జరిగే చక్కటి ప్రేమకథా చిత్రమిది. కథలో మంచి మలుపులు ఉన్నాయి. కథా పరంగా చాలా పెద్ద సినిమా ఇది. విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా అవుట్ పుట్ బాగొచ్చింది. దర్శకుడు చెప్పినదానికన్నా సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు. -
లారీ డ్రైవర్‌కి భరోసా ఇచ్చిన వైఎస్ జగన్
-
నా భార్య కిడ్నాపయ్యింది.. సీఎంగారూ సాయం చేయండి
హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఓ యువకుడు తన భార్య ఆచూకీ తెలుసుకునేందుకు సాయం చేయాల్సిందిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెను అభ్యర్థిస్తున్నాడు. నెల రోజుల నుంచి తన భార్య కనిపించడం లేదంటూ, ఆమె కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేశాడని ఆరోపించాడు. వివరాలిలా ఉన్నాయి. బి వినయ్ బాబు (28) హైదరాబాద్‌లోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. అతను రాజస్థాన్‌కు చెందిన మమత (23) అనే యువతిని ప్రేమించాడు. రెండు నెలల క్రితం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే తమ పెళ్లికి మమత తల్లిదండ్రులు అంగీకరించలేదని చెప్పాడు. పెళ్లయిన తర్వాత మమత తల్లిదండ్రుల నుంచి తమకు ముప్పు ఉందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. తన కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాల్సిందిగా మమత కూడా ఫిర్యాదు చేసింది. దీంతో కౌన్సిలింగ్‌కు రావాల్సిందిగా మమత కుటుంబ సభ్యులకు పోలీసులు సమన్లు పంపారు. ఈ సంఘటన తర్వాత వినయ్, మమత దంపతులు కొత్త ఇంటికి మారారు. నెల రోజుల క్రితం తాను డ్యూటీకి వెళ్లిన సమయంలో మమతను కిడ్నాప్ చేశారని వినయ్ చెప్పాడు. ఆమెను బలవంతంగా తీసుకుపోయినట్టు ఇరుగుపొరుగువారు చెప్పారని వెల్లడించాడు. ఆమె కుటుంబ సభ్యులు సొంతూరు జోధ్‌పూర్‌కు తీసుకెళ్లారని ఆరోపించాడు. వినయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని జోధ్‌పూర్ బృందాన్ని పంపారు. కాగా మమత ఆచూకీ ఇంకా లభించలేదని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఇదిలావుండగా, పెళ్లి అనంతరం మమత 5 కిలోల బంగారం తీసుకుని పారిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు జోధ్‌పూర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'నా భార్య ఆచూకీ తెలుసుకునేందుకు సాయం చేయాల్సిందిగా రాజస్థాన్ ముఖ్యమంత్రిని వేడుకుంటున్నా. ఆమె భద్రతపై ఆందోళనగా ఉంది. నా భార్య క్షేమంగా ఉన్నట్టయితే కచ్చితంగా నాకు ఫోన్ చేసేది' అని వినయ్ అన్నాడు.