Vindu Dara Singh
-
బాలీవుడ్ స్టార్ చాలా ఎక్కువ తింటాడు.. శునకంలా..: నటుడు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నటుడు విందు దార సింగ్ కాలేజీ నుంచే స్నేహితులు. చదువుకునేరోజుల్లో మొదలైన వీరి స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. తాజాగా అతడు సల్మాన్ గురించి కొన్ని సీక్రెట్స్ బయటపెట్టాడు. విందు మాట్లాడుతూ.. నా శరీరాకృతి చూశాక సల్మాన్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టాడని చెప్తుంటాడు. కానీ చాలా ఎక్కువ సేపు జిమ్‌లోనే గడుపుతాడు. తిండి విషయంలోనూ ఇంతే.. పందిలా తింటాడు.. కుక్కలా ఎక్సర్సైజ్ చేస్తాడు. చాలా తింటాడు.. అంతే కష్టపడతాడు అతడు చాలా ఎక్కువ తింటాడు. తిన్నదంతా ఎక్కడికి పోతుంది? అని అడిగితే.. ఎక్సర్సైజ్ ద్వారా ఆ తిన్నదంతా కరిగించేస్తానంటాడు. తను చాలా అద్భుతమైన వ్యక్తి. అతడంటే నాకెంతో ఇష్టం. తనది మంచి మనసు. సాయం చేసే గుణం కూడా ఉంది. అతడి తండ్రి, రచయిత సలీమ్ ఖాన్ ప్రతిరోజూ సల్మాన్‌కు డబ్బులిచ్చేవాడు. డబ్బులు ఉంచుకోడు ఆ డబ్బును ఇంట్లో పనిచేసేవారికి ఇచ్చేవాడు. రూ.50 వేలిచ్చినా, లక్ష రూపాయలిచ్చినా సరే దాన్ని పేదలకు దానం చేసేవాడు. ఇప్పటికీ అతడు అలాంటి దానధర్మాలెన్నో చేస్తాడు. నెలకు దాదాపు రూ.25- 30 లక్షల వరకు దానం చేస్తుంటాడు. ఇప్పటికీ తన పాకెట్‌మనీ తండ్రి దగ్గరే వసూలు చేస్తాడు. కానీ తన దగ్గర మాత్రం ఉంచుకోడు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: శరత్‌బాబుతో ప్రేమలో పడ్డా.. నేను చెడిపోయినా పర్వాలేదని లొంగిపోయాను -
మందు కొట్టి తీశారా?.. ఆదిపురుష్ మేకర్స్‌పై నటుడు ఆగ్రహం!
ప్రభాస్, కృతి సనన్ జంటగా ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు ఇంకా ఆగడం లేదు. దర్శకుడు ఔం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏ మూహుర్తనా మొదలెట్టాడో ఆది నుంచి విమర్శల పాలవుతోంది. టీజర్ మొదలు సినిమా రిలీజ్ తర్వాత కూడా పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో కొన్ని పాత్రలు, డైలాగ్స్, కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు మాజీ నటులు మేకర్స్‌పై మండిపడ్డారు. ఆ తర్వాత ఆదిపురుష్ టీం తమ తప్పులను అంగీకరించిన సినిమాలో మార్పులు కూడా చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆయనతో డేటింగ్.. నా జీవితమే నాశనమైంది: టాప్ హీరోయిన్) అయితే తాజాగా మరో నటుడు ఆదిపురుష్ మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ విందు ధారా సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా హనుమంతుని పాత్రను వక్రీకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. విందు ధారా సింగ్ చాలాసార్లు హనుమంతుడి పాత్రను తెరపై పోషించాడు. అంతే కాకుండా అతని తండ్రి, దివంగత నటుడు ధారా సింగ్, రామానంద్ సాగర్ టీవీ షో రామాయణంలో హనుమంతుడి పాత్రను కూడా పోషించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విందు ధారా సింగ్.. ఆదిపురుష్ నిర్మాతల తీరును ఎండగట్టారు. హనుమంతుడిగా నటించిన దేవదత్తా నాగేపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. హనుమంతుడు పవర్‌ఫుల్‌గా, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఆ పాత్రలో నటించిన దేవదత్తా నాగే హిందీలో కూడా సరిగ్గా మాట్లాడలేడు. అతడికి ఇచ్చిన డైలాగ్‌లతో ఆ పాత్రను మరోవిధంగా చూపారు. ఈ విషయంలో నిర్మాతలు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. హనుమంతుడి పాత్రలో తన తండ్రి ధారా సింగ్ చరిత్ర సృష్టించాడని.. ఆయన నటనకు మీరు దరిదాపుల్లోకి కూడా రాలేరని అన్నారు. విందు ధారా సింగ్ మాట్లాడుతూ.. 'వీళ్లు చేసిన పని చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. మందు తాగి వచ్చారో కానీ.. వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో కూడా వాళ్లకు తెలియదు. ఇంత భారీ బడ్జెట్‌తో అద్భుతమైన సినిమా తీసే గోల్డెన్ ఛాన్స్ నాశనం చేశారు. వారు తమాషా చేస్తూ కథతో ఆడుకున్నారు. అందుకే ఆదిపురుష్ తీవ్రంగా నిరాశపరిచింది.' అన్నారాయన. ఆదిపురుష్ వివాదం ఆదిపురుష్ చుట్టూ ఉన్న వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సినిమా నిర్మాతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముంబై పోలీసులకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సెన్సార్ బోర్డు, చిత్ర నిర్మాతలపై తీవ్ర స్థాయిలో మడిపడింది. సెన్సార్ బోర్డ్ ఏం చేస్తోంది? మీరు భవిష్యత్ తరాలకు ఏం నేర్పాలనుకుంటున్నారు?" అని కోర్టు ప్రశ్నించింది. డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా.. ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. -
లజ్‌పత్‌నగర్ దోపిడీ కేసుదర్యాప్తులో కీలక మలుపులు
న్యూఢిల్లీ: లజ్‌పత్‌నగర్ భారీ దోపిడీ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. వ్యాపారి రాజేశ్ కల్రా నుంచి దోపిడీకి గురైన మొత్తం దుబాయి నుంచి హవాలా మార్గం నుంచి వచ్చిందనడానికి కొన్ని ఆధారాలు దొరకడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ విషయమై మరిన్ని వివరాలు సేకరించేందుకు ముంబై పోలీసులను సంప్రదిస్తామని దర్యాప్తు అధికారులు గురువారం తెలిపారు. కల్రాకు లండన్, దుబాయిలోని బుకీలతోనూ సంబంధాలు ఉన్నట్టు వస్తున్న సమాచారంపైనా కన్నేశారు. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో నిందితుడు, బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్తోనూ ఇతనికి సన్నిహిత సంబంధాలున్నట్టు తేలింది. దుబాయి, జైపూర్, ముంబై, లండన్‌కు చెందిన వ్యక్తులతో ఈ వ్యాపారి తరచూ ఫోన్లలో మాట్లాడుతున్నట్టు కూడా గుర్తించారు. ఇతని డబ్బు దోపిడీ కావడానికి ముందు రోజు సైతం రాజేశ్ దుబాయి వ్యక్తితో 20 నిమిషాలు మాట్లాడారని ఢిల్లీ పోలీసుశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో ఆగ్నేయ ఢిల్లీ పోలీసులు, క్రైంబ్రాంచ్ అధికారులు కల్రా ఉద్యోగులు, అతని మేనేజర్, రాకేశ్ కుమార్ అనే వ్యాపారి సహా పలువురిని మండీనగర్లోని స్పెషల్స్టాఫ్ కార్యాయంలో ప్రశ్నించారు. ‘రాజేశ్ కల్రా వ్యాపార భాగస్వామి రాహుల్ అహుజానూ ఈ కేసులో ప్రశ్నించినా ఎటువంటి వివరాలూ వెల్లడికాలేదు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అరెస్టయిన జైపూర్ బుకీ చంద్రేశ్జైన్ ఎలియాస్ జూపిటర్తోనూ కల్రాకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించాం’ అని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. జూపిటర్తోపాటు, లండన్‌కు చెందిన బుకీ సంజీవ్ చావ్లా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో నిందితుడు. రాజేశ్‌కు పలువురు బుకీలతో సంబంధాలున్నట్టు వెల్లడయిన నేపథ్యంలో.. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా-న్యూజిలాండ్ క్రికెట్ పోటీల్లోనూ ఏవైనా అక్రమాలు జరుగుతున్నాయా అనే కోణంలోనూ పోలీసులు దృష్టి పెట్టారు. లజ్‌పత్‌నగర్ దోపిడీలో రూ.ఎనిమిది కోట్లు పోయినట్టు కల్రా చెబుతున్నా.. అంతకంటే పెద్ద మొత్తమే ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో విదేశీ కరెన్సీ కూడా ఉండి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.