బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నటుడు విందు దార సింగ్ కాలేజీ నుంచే స్నేహితులు. చదువుకునేరోజుల్లో మొదలైన వీరి స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. తాజాగా అతడు సల్మాన్ గురించి కొన్ని సీక్రెట్స్ బయటపెట్టాడు. విందు మాట్లాడుతూ.. నా శరీరాకృతి చూశాక సల్మాన్ ఎక్కువ ఎక్సర్‌సైజ్ చేయడం మొదలుపెట్టాడని చెప్తుంటాడు. కానీ చాలా ఎక్కువ సేపు జిమ్‌లోనే గడుపుతాడు. తిండి విషయంలోనూ ఇంతే.. పందిలా తింటాడు.. కుక్కలా ఎక్సర్‌సైజ్ చేస్తాడు.
చాలా తింటాడు.. అంతే కష్టపడతాడు
అతడు చాలా ఎక్కువ తింటాడు. తిన్నదంతా ఎక్కడికి పోతుంది? అని అడిగితే.. ఎక్సర్‌సైజ్ ద్వారా ఆ తిన్నదంతా కరిగించేస్తానంటాడు. తను చాలా అద్భుతమైన వ్యక్తి. అతడంటే నాకెంతో ఇష్టం. తనది మంచి మనసు. సాయం చేసే గుణం కూడా ఉంది. అతడి తండ్రి, రచయిత సలీమ్ ఖాన్ ప్రతిరోజూ సల్మాన్‌కు డబ్బులిచ్చేవాడు.
డబ్బులు ఉంచుకోడు
ఆ డబ్బును ఇంట్లో పనిచేసేవారికి ఇచ్చేవాడు. రూ.50 వేలిచ్చినా, లక్ష రూపాయలిచ్చినా సరే దాన్ని పేదలకు దానం చేసేవాడు. ఇప్పటికీ అతడు అలాంటి దానధర్మాలెన్నో చేస్తాడు. నెలకు దాదాపు రూ.25- 30 లక్షల వరకు దానం చేస్తుంటాడు. ఇప్పటికీ తన పాకెట్‌మనీ తండ్రి దగ్గరే వసూలు చేస్తాడు. కానీ తన దగ్గర మాత్రం ఉంచుకోడు' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: శరత్‌బాబుతో ప్రేమలో పడ్డా.. నేను చెడిపోయినా పర్వాలేదని లొంగిపోయాను
Comments
Please login to add a commentAdd a comment